‘డి ఫర్ దోపిడి’ పాటలు
తెలుగువాళ్లయిన రాజ్, కృష్ణ బాలీవుడ్‌లో సక్సెస్ అయ్యి, టాలీవుడ్‌కి వచ్చారు. ఇక, నాని మంచి కథలను సెలక్ట్ చేసుకుని, సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నాడు.
‘‘తెలుగువాళ్లయిన రాజ్, కృష్ణ బాలీవుడ్‌లో సక్సెస్ అయ్యి, టాలీవుడ్‌కి వచ్చారు. ఇక, నాని మంచి కథలను సెలక్ట్ చేసుకుని, సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్నాడు. తను ఈ సినిమాకి ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడంటే సినిమా బాగుంటుందనే నమ్మకం ఏర్పడింది’’ అన్నారు సి.అశ్వనీదత్. వరుణ్‌సందేశ్, సందీప్ కిషన్, నవీన్, రాకేష్, మెలనీ ముఖ్య తారలుగా సిరాజ్ కల్లాని దర్శకత్వంలో రాజ్ నిడుమోరు, కృష్ణ డీకే నిర్మించిన చిత్రం ‘డి ఫర్ దోపిడి’. ఈ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించడంతో పాటు వాయిస్ ఓవర్ కూడా చెప్పారు నాని.
మహేష్‌శంకర్, సచిన్-జిగర్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను అశ్వనీదత్ ఆవిష్కరించి ‘దిల్’ రాజుకి ఇచ్చారు. ప్రచార చిత్రాలను శ్రీకాంత్ విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ -‘‘మంచి పాటలు కుదిరాయి. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు’’ అన్నారు. ‘‘కామెడీ, క్రైమ్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. స్క్రీన్‌ప్తే ఆసక్తికరంగా ఉంటుంది’’ అని దర్శకుడు తెలిపారు. ఈ వేడుకలో ‘అల్లరి’ నరేష్, సుధీర్‌బాబు, ప్రిన్స్, తనీష్, ఆది, మెహర్ రమేష్, మారుతి, శోభారాజ్ తదితరులు పాల్గొని, పాటలు, సినిమా విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తపరిచారు.