భవన నిర్మాణ కార్మికులు అడుగడుగునా దొపిడీకి గురవుతున్నారని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్ ఆరోపించారు.
- సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్
రామాయంపేట: భవన నిర్మాణ కార్మికులు అడుగడుగునా దొపిడీకి గురవుతున్నారని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్ ఆరోపించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వీరి దరి చేరడంలేదని ఆరోపించారు.
ప్రతి కార్మికునికి ప్రభుత్వ పరంగా గహాలు మంజూరు చేయడంతోపాటు అర్హులైనవారికి నెలకు రూ. మూడువేల పింఛన్ మంజూరు చేయాలన్నారు. ఎటువంటి షరతులు లేకుండా ప్రతి కార్మికునికి రూ. ఐదు లక్షల వరకు బ్యాంకు రుణాలు అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.