కొత్త రేషన్ కార్డులు, చంద్రన్న సంక్రాంతి కానుకలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోందని...
అనంతపురం: కొత్త రేషన్ కార్డులు, చంద్రన్న సంక్రాంతి కానుకలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోందని, వీటి పంపిణీపై జిల్లాలో ఏమైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నంబర్ 18004256401కు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని అనంతపురం కలెక్టర్ కోన శశిధర్ ఒక ప్రకటనలో తెలిపారు.
జిల్లాలో కొత్త రేషన్ కార్డులు, చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీలో రేషన్ దుకాణం డీలర్లు ఏమైనా చేతివాటాన్ని ప్రదర్శిస్తే.. వారిపై సస్పెన్షన్ వేటు వేసి.. క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.