unemployment allowance
-
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుంచి అకౌంట్లోకి డబ్బులు
భారతదేశంలో ప్రతి ఏటా యూనివర్సిటీల నుంచి చదువు పూర్తి చేసుకుని బయటకు వస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే చదివిన అందరికి ఉద్యోగాలు లభించకపోవడంతో నిరుద్యోగ సమస్య తారా స్థాయికి చేరుకుంటోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని గతంలో ఛత్తీస్‌గఢ్ గవర్నమెంట్ ఎన్నికల సమయంలో ఉద్యోగం లేని యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చింది. అది ఇప్పుడు అమలు చేయడానికి శ్రీకారం చుట్టింది. వచ్చే నెల 01 నుంచి (ఏప్రిల్) నిరుద్యోగ యువతకు రూ. 2,500 నిరుద్యోగ భృతి ఆంచించనున్నారు. దీని కోసం ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఏకంగా రూ. 250 కోట్ల మేర బడ్జెట్ కేటాయించింది. ఇది మాత్రమే కాకుండా అంగన్వాడీ కార్యకర్తలు, హౌస్‌గార్డులు, గ్రామ కొత్వార్‌లు, ఇతర ఉద్యోగుల జీతాలు కూడా పెంచనున్నట్లు గతంలో సీఎం భూపేశ్ భఘేల్ తెలిపారు, ఇది కూడా అమలయ్యే అవకాశం ఉంది. నిరుద్యోగ భృతి తీసుకోవడానికి అర్హతలు: నిరుద్యోగ భృతి తీసుకోవడానికి తప్పకుండా ఛత్తీస్గడ్ నివాసితులై ఉండాలి. అంతే కాకుండా 18 నుంచి 35 సంవత్సరాలు ఉన్న యువకులు, ఇంటర్ మీడియట్ పూర్తి చేసుకున్న యువకులు దీనికి అర్హులు. అలాగే కుటుంబ వార్షిక ఆదాయం రూ. 2.50 లక్షల కంటే తక్కువ ఉండాలి. నిరుద్యోగ యువత ఛత్తీస్‌గడ్‌లోని సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ గైడెన్స్ సెంటర్, జిల్లా ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో నమోదు చేసుకుని ఉండాలి. ఏప్రిల్ 1 నాటికి ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ రెండేళ్లుగా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే నిరుద్యోగ భృతికి అర్హత పొందుతారు. (ఇదీ చదవండి: ప్రత్యర్థులు గుండెల్లో గుబులు.. బీఎండబ్ల్యూ నుంచి మరో కారు లాంచ్) నిరుద్యోగ భృతి ఎలా అందుతుంది? నిరుద్యోగ యువతకు పైన చెప్పిన అన్ని అర్హతలు, అదే సమయంలో ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకుని ఉన్నప్పుడే నెలకు రూ. 2,500 లభిస్తుంది. ఇది నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్‌కి జమ అవుతుంది. అంతే కాకుండా రాష్ట్రంలో నిరుద్యోగుల సంఖ్యను తగ్గించడానికి నైపుణ్య శిక్షణ కూడా అందించనున్నట్లు సంబంధింత అధికారులు చెబుతున్నారు. -
4, 5నెలల్లో.. నిరుద్యోగ భృతి
సాక్షి. హైదరాబాద్: నాలుగైదు నెలల్లో నిరుద్యోగభృతి పథకాన్ని అమల్లోకి తెస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన విధివిధానాల కూర్పుపై కసరత్తు జరుగుతోందని పేర్కొన్నారు. ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సోమవారం శాసనసభలో సీఎం సుదీర్ఘంగా ప్రసంగించారు. ‘మేం పక్క రాష్ట్రం లాగా.. చివరి వరకు పెండింగు పెట్టి ఆ తర్వాత హడావుడి చేయం. అసలు నిరుద్యోగులు అంటే ఎవరనే దానిపై స్పష్టత రావాలి. దానికి కటాఫ్ డేట్ అవసరం. వచ్చే నాలుగైదు నెలల్లో వీటిపై స్పష్టత తెచ్చి పథకాన్ని ప్రారంభిస్తాం’అని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల వేల నిరుద్యోగభృతిని రాజకీయం కోసం కాంగ్రెస్ వాడుకునే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. (మనసా, వాచా, కర్మేణా.. బంగారు తెలంగాణకు పునరంకితం ) భూ రికార్డుల ప్రక్షాళనకు సంబంధించి పెండింగులో ఉన్నవాటిని కూడా పూర్తి చేసేందుకు సర్వే ప్రారంభిస్తామన్నారు. ఈ విషయంలో కేంద్రం నుంచి కూడా కొంత సాయం తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు. అధునాతన పరిజ్ఞానాన్ని వినియోగించి భూముల కొలతలు. హద్దుల్లో తేడా లేకుండా తేల్చి ఏడాదిలో మరింత సరళీకృత పహానీలు సిద్ధం చేస్తామని చెప్పారు. ఆ కసరత్తు పూర్తి చేసి కంక్లూజివ్ టైటిల్స్ జారీ చేస్తామని, దీనికి కొంత సమయం పట్టనున్నా.. ఆరేడు నెలల్లో సంబంధిత వెబ్సైట్ ప్రారంభిస్తామని చెప్పారు. పోడు భూముల రక్షణకు సంబంధించి కూడా సమగ్ర చర్యలు చేపడతామని. అటవీ భూముల పరిరక్షణ, గిరిజనుల భూములపై హక్కు కల్పించేలా కటాఫ్ డేట్ ఖరారు చేసి నిర్ధారించబోతున్నామని. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత వచ్చే జూన్‌లో ఈ కసరత్తు చేపడతామని సీఎం ప్రకటించారు. బీడీ కార్మికుల పీఎఫ్‌కు సంబంధించి కొత్త కటాఫ్ డేట్ ప్రకటించి అమలు చేస్తామన్నారు. (చంద్రబాబు కూడా మోసం చేశారు: ఎర్రబెల్లి) నేనెందుకు భయపడాలి? పెద్ద సంఖ్యలో ఓట్లు గల్లంతుపై జరుగుతున్న వివాదంపై సీఎం మండిపడ్డారు. ‘ఏ ఎన్నిక జరిగినా ఆ సమయంలో ఓట్ల గల్లంతుపై వివాదం నెలకొంటోంది. అటు కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఐఏఎస్ అధికారులే పర్యవేక్షిస్తున్నారు. అలాంటప్పుడు ఓటర్ల జాబితాలో గందరగోళం ఎందుకు నెలకొంటోంది? నాకిప్పుడు 66 ఏళ్లు. ఈ దఫా పూర్తయ్యేసరికి 71 ఏళ్లొస్తాయి. ఈ వయసులో నేనెవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? నా దృష్టంతా జనరంజక పాలన మీదే. అందుకే ఇక పాలనలో పెను మార్పులు చూడబోతున్నారు. ఏ విషయంలోనైనా రాజీలేకుండా, నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాను. అన్ని విభాగాలను సంస్కరిస్తా. కొన్ని విషయాల్లో మొహమాటం లేకుండా కఠినంగా వ్యవహరిస్తా. మొన్నటి ఎన్నికల సమయంలో మాతోపాటు కాంగ్రెస్ కూడా ఎన్నో హామీలిచ్చింది. మాపై ఎన్నో ఆరోపణలుచేసింది. చివరకు ఏమైంది. కాంగ్రెస్‌నేతలు చెప్పింది తప్పు. మేం చెప్పింది నిజం అని తేలింది కదా’అని సీఎం అన్నారు. ‘పీఎం కిసాన్’అదనమే! దేశం మొత్తానికి మార్గదర్శకంగా మారిన రైతుబంధు అమలులో కచ్చితంగా వ్యవహరిస్తామని సీఎం పేర్కొన్నారు. కేంద్రం కొత్తగా ప్రారంభించిన ‘పీఎం కిసాన్’తో దీన్ని కలపబోమని వెల్లడించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధును ఎకరాకు రూ.10 వేలకు పెంచింది. ఇది పూర్తిగా రాష్ట్రప్రభుత్వమే అందిస్తుంది. ఇందులో కిసాన్ పీఎంను జోడించం. ఆ నిధులు రైతులకు అదనమే!’అని అన్నారు. నిమ్జ్ కోసం ఇప్పటికే 2,377 ఎకరాలు సేకరించినట్లు తెలిపిన సీఎం.. మిగిలిన భూ–సేకరణ కూడా జరుపుతామని, యూపీఏ చివరి దశలో కేటాయించిన ఐటీఐఆర్ విషయంలో కేంద్రంతో పోరాడుతున్నామన్నారు. దీని ప్రభావం లేకుండా ప్రత్యామ్నాయ చర్యలతో ఐటీ ఎగుమతులు భారీగా పెంచామని సీఎం పేర్కొన్నారు. బుద్వేల్, కోకాపేట, కొల్లూరుల్లో ఐటీ క్లస్టర్లు ఏర్పాటు చేశామని. ఇప్పుడు ఐటీ ఎగుమతులు లక్ష కోట్ల రూపాయలను దాటాయని వెల్లడించారు. ‘ఇమేజ్ టవర్’పేరుతో బ్రహ్మాండంగా గేమింగ్ సెంటర్ ఏర్పాటవుతోందని. ఏడాదిన్నరలో టీ–హబ్–2 వస్తుందని చెప్పారు. ఎయిమ్స్ కోసం 200 ఎకరాలు కేటాయించామని పేర్కొన్నారు. బీసీలపై వారికి కపటప్రేమ పంచాయితీరాజ్ చట్టం ఆర్డినెన్స్ విషయంపై కూడా సీఎం స్పష్టతనిచ్చారు. బీసీ రిజర్వేషన్లు 50%కు మించొద్దంటూ సర్వోన్నత న్యాయస్థానం చెప్పటం. గడువులోగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించటం.. నేపథ్యంలో ఆర్డినెన్స్ తెచ్చామని పేర్కొన్నారు. బీసీలకు రాజ్యాధికారం విషయంలో కాంగ్రెస్ కపటప్రేమ చూపిస్తోందని.. ఎన్టీఆర్ రిజర్వేషన్లు అమలుచేసిన తర్వాత వాటిని 50%కు చేర్చిన ఘనత తమ ప్రభుత్వానిదేనని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పడే నాటికి బీసీ గురుకులాలు 19 మాత్రమే ఉండేవని. ఇప్పుడవి 280కి చేరుకున్నాయని. త్వరలో మరో 119 ప్రారంభమవుతాయని చెప్పారు. ‘సీఎల్పీ నేత మాట్లాడుతుండటంతో ప్రభుత్వానికి మంచి సూచనలు అందుతాయని ఆశించాను. కానీ ఒక్కటంటే ఒక్క నిర్మాణాత్మక సూచన కూడా ఇవ్వకపోగా. సభను తప్పుదారి పట్టించేలా వ్యవహరించారు. బడ్జెట్ లెక్కలపై భట్టి విక్రమార్క చెప్పిన విషయాలు తప్పు. విద్య కోసం ప్రతిపాదించిన నిధులు 6% మాత్రమేనని.. ఆయన చెప్పటం సరికాదు. అది దాదాపుగా 11.2%గా ఉంది’అని సీఎం పేర్కొన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులు మళ్లిస్తున్నారన్నది కూడా అబద్ధమని. ప్రతిపాదించినదానికంటే ఎక్కువగా ఖర్చు చేస్తున్నట్టు సభ దృష్టికి తెచ్చారు. కాంగ్రెస్ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు కాగితాలకే పరిమితం కాగా. రికార్డు సమయంలోనే తమ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులు పూర్తి చేసే దిశగా దూసుకెళ్తోందన్నారు. మిషన్ కాకతీయ కింద 22 వేల చెరువులను బాగు చేసుకున్నామని. రూ.4 వేల కోట్లతో ఫీడర్ ఛానళ్లు. చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు. -
పథకాలు ‘డొల్ల’..
సాక్షి, అమరావతి: శిక్షణ ద్వారా యువతకు భారీఎత్తున ఉద్యోగాలు కల్పిస్తున్నామని.. లక్షల్లో యువతకు నిరుద్యోగ భృతి ఇస్తున్నామని ప్రభుత్వం ఎంతో ఘనంగా చేస్తున్న ప్రచారం అంతా ఉత్తి డొల్ల తప్ప అందులో ఏమాత్రం వాస్తవంలేదని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలోనే తేటతెల్లమైంది. అలాగే, రాష్ట్రంలో అన్ని జిల్లాలను బహిరంగ మల విసర్జన రహిత జిల్లాలుగా ప్రకటించేశామని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న మాటలన్నీ అవాస్తవాలేనని కూడా తేలింది. అంతేకాదు.. మహిళలపై నేరాలు ఏటేటా పెరిగిపోతున్నాయని సర్కారు గణాంకాలే వెల్లడిస్తున్నాయి. ముఖ్యమంత్రి అధ్యక్షతన శుక్రవారం కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. (నిరుద్యోగులకు రిక్తహస్తం) ఈ సందర్భంగా ప్రణాళికా శాఖ రూపొందించిన నివేదికలో 17 ప్రభుత్వ పథకాల అమలులో ప్రచార ఆర్భాటం తప్ప మరేంలేదని స్పష్టమైంది. యువతకు శిక్షణ పేరుతో కోట్ల రూపాయల కమీషన్లు ఇచ్చే ప్రైవేట్ సంస్థలకు కాంట్రాక్టు కట్టబెడుతున్నారని.. కానీ, అలా శిక్షణ పొందిన వారికి ఉద్యోగాల కల్పన అంతంతమాత్రంగానే ఉందని ప్రణాళిక శాఖ తన నివేదికలో వివరించింది. 1,21,280 మందికి శిక్షణ పేరుతో ఆయా సంస్థలకు రూ.145.53 కోట్లు చెల్లించేశారు. అయితే, ఇందులో ఉపాధి చూపించింది కేవలం 15,237 మంది కేనని, ఇది కేవలం 21.54 శాతమేనని నివేదికలో పేర్కొన్నారు. ఆదరణ పేరుతో హడావిడి చేసిన సీఎం చంద్రబాబు ఆచరణ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. డి–కేటగిరిలో 0 నుంచి 40 శాతం అమలు పథకాలను చేర్చారు. ఈ కేటగిరిలో 17 పథకాలున్నాయి. దీంతో పాటు యునిసెఫ్ నిర్వహించిన సర్వేలో 93 శాతం హౌస్ హోల్డ్స్కు వ్యక్తిగత మరుగుదొడ్లు లేవని తేలింది. వీరిందరూ బహిరంగ మలవిసర్జన చేస్తున్నారని ఆ సర్వే వెల్లడించింది. మరోవైపు.. బహిరంగ మల విసర్జన రహిత పంచాయతీలు 12,918కు గాను 1,505 పంచాయతీల్లో.. 110 మున్సిపాల్టీలకు గాను 15 మున్సిపాల్టీల్లో మాత్రమే లక్ష్యం సాధించినట్లు ప్రణాళిక శాఖ వెల్లడించింది. అంటే ఇన్ని రోజులు ఉపాధి హామీ నిధులతో వేల కోట్ల రూపాయలను వ్యయంచేస్తూ వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించేశామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకున్నదంతా బూటకమని తేలిపోయింది. అలాగే, అన్ని జిల్లాల్లోని గ్రామ పంచాయతీలను బహిరంగ మల విసర్జన రహిత పంచాయతీలుగా చేస్తున్నామని చేస్తున్న ప్రచారంలోనూ వాస్తవంలేదని ప్రణాళికా శాఖ నివేదిక కుండబద్దలు కొట్టింది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో మహిళలపై నేరాలు ఏ ఏటికాయేడు పెరుగుతున్నాయి తప్ప తగ్గడంలేదని కూడా ఆ నివేదిక తేల్చిచెప్పింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబరు వరకు 8,855 మంది మహిళలపై నేరాలు జరగ్గా ఈ ఏడాది అదే కాలంలో 9,221 మహిళలపై నేరాలు జరగడం గమనార్హం. అత్యధికంగా రాజధాని ప్రాంతమైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లోనే ఎక్కువ జరుగుతున్నాయి. ఆ తరువాత స్థానంలో తూర్పుగోదావరి జిల్లా ఉంది. (నీటి మీద రాతలు.. టీడీపీ హామీలు) ఇళ్లు, పింఛన్లు, రేషన్‌కార్డుల్లోనూ అంతే.. అర్హులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్లు, ఇంటి జాగాలు ఇచ్చేసినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలూ బూటకమేనని ప్రణాళికా శాఖ నివేదిక తేల్చిచెప్పింది. అర్హులందరికీ ఇవన్నీ ఇచ్చేస్తే దాదాపు కోటి మంది పేదలు ఇంకా దరఖాస్తులు ఎందుకు చేసుకున్నారో ప్రభుత్వ పెద్దలకే తెలియాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కేవలం పది శాఖలకు చెందిన పథకాల కోసం ఏకంగా 99,08,297 మంది పేదలు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడైంది. రేషన్ కార్డులుగానీ, పింఛన్లుగానీ అర్హులైన వారందరికీ ఇవ్వకుండా ఖాళీ అయిన చోటే కొత్తవారికి మంజూరు చేస్తున్నారు. దీంతో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందడంలేదు. ఇళ్తు, ఇంటి జాగా, పెన్షన్లు, రేషన్ కార్డులు, మంచినీటి సరఫరా, రహదారులు, వ్యవసాయ రుణాల మాఫీ కోసం ఏకంగా 99,08,297 మంది ప్రభుత్వానికి దరఖాస్తులు చేసుకోగా అందులో ఏకంగా 32,11,595 దరఖాస్తులను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. మరో 20.81 లక్షల మందికి మంజూరు చేయాలని తేల్చి వారి దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టారు. మరోవైపు.. ఆర్టీజీఎస్ పేరుతో రకరకాల ఆంక్షలు విధించి పేదలకు పథకాలు అందకుండా వారిపై అనర్హుల పేరుతో వేటువేస్తున్నారు. ప్రాసెస్ చేయలేదని, మ్యాప్ కావడం లేదంటూ మరికొన్ని లక్షల దరఖాస్తులను మూలన పడేస్తున్నారు. -
‘కేసీఆర్ నిజమైన తెలంగాణ వాడివని నిరూపించుకో’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అపద్ధర్మ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిజమైన తెలంగాణ వ్యక్తి కాదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ధైర్యముంటే నిజమైన తెలంగాణ వాడివని నిరూపించుకోవాల’ని కేసీఆర్‌కు సవాలు విసిరారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పనిచేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో 14 లక్షల మంది కౌలు రైతులుంటే.. వారికి రైతుబంధు లభించలేదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ డీలర్ల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాకుండా చేశారని మండిపడ్డారు. రెండు లక్షల మంది ప్రైవేటు కాలేజీల లెక్చరర్లు తమ సమస్యలు పరిష్కరించమంటే ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆరోపించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఐఆర్ లేక ప్రభుత్వ ఉద్యోగులు, సమస్యలు పరిష్కారంచలేదని ఆర్టీసీ ఉద్యోగులు ఆవేదనలో ఉన్నారని పొన్నాల తెలిపారు. గత ఎన్నికల్లో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని వడ్డీ తీర్చలేని కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతారా అని ప్రశ్నించారు. గడిచిన నాలుగేళ్లలో నిరుద్యోగ భృతి ఇవ్వని కేసీఆర్.. కాంగ్రెస్ ప్రకటించిన కొన్నిరోజులకు నిరుద్యోగ భృతి ప్రకటించారని గుర్తుచేశారు. జాగో బాగో చరిత్ర కాంగ్రెస్‌కు లేదని స్పష్టం చేశారు. తను ఈ సారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. కేసీఆర్ శేష జీవితం చర్లపల్లి జైలులోనే అని జోస్యం చెప్పారు. -
‘తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలు ఇస్తాం’
సాక్షి, హైదరాబాద్: మహాకూటమి అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలు ఇస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. 20వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. హామీలు ఇవ్వడంలో కూడా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నకిలీనేనని విమర్శించారు. తాము ప్రకటించిన నిరుద్యోగ భృతికి 16 రూపాయలు పెంచి ప్రకటించడానికి సిగ్గు, శరం ఉండాలని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాలుగేళ్లు అధికారంలో ఉండి నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తండ్రి, కొడుకులు(కేసీఆర్, కేటీఆర్) ఇద్దరు అబద్దాల కోరులని.. ఆంధ్ర పాలకుల కంటే కేసీఆర్ కుటుంబమే తెలంగాణను ఎక్కువగా దోచుకుందని ఆరోపించారు. డిసెంబర్ 12న రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడుతోందని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘కేసీఆర్‌కు దోచుకోవడం, దాచుకోవడమే పని. కేసీఆర్ కుటుంబసభ్యులు ఎంజాయ్ చేయడానికే సరిపోయింది. లక్ష స్క్వేర్ ఫీట్ల స్థలంలో కేసీఆర్ ఇళ్లు కట్టుకున్నారు. విమానాల్లో మనం టికెట్ కొని ప్రయణిస్తాం.. కానీ కేసీఆర్ ఏకంగా విమానాలే బుక్ చేసుకుంటున్నారు. కేటీఆర్ చదివింది ఆంధ్రలో, ఉద్యోగం చేసింది అమెరికాలో.. ఉద్యమంలో కానీ, ప్రభుత్వంలో కానీ ఆయన చేసింది ఏముంది?. మహాకూటమి అధికారంలోకి రాగానే ప్రైవేటు యూనివర్సిటీలు ఉండవు. కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీలను బలోపేతం చేస్తాం. ప్రతి నిరుద్యోగి, విద్యార్థి ఒక్కొక్కరు 100 ఓట్లు వేయిస్తా అని మాట ఇవ్వండి. టీఆర్ఎస్ డబ్బు, మద్యంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోంద’ని అన్నారు. -
‘తొలి ఏడాదే లక్ష ఉద్యోగాలు ఇస్తాం’
-
మళ్లీ రుణమాఫీ.. భారీగా నిరుద్యోగ భృతి!
రాష్ట్రంలో 45.50 లక్షల మంది రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నరు. వీరిలో రూ.లక్ష లోపు రుణాలున్న వారు 42 లక్షల మంది ఉన్నరు. అందుకే రూ.లక్ష రుణ మాఫీని మరోసారి అమలు చేయాలని నిర్ణయించాం. మహిళా సంఘాల బృందాల ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్‌రావు ముందస్తు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మరో అస్త్రం విసిరారు. పాక్షిక మేనిఫెస్టో పేరుతో ప్రత్యర్థి పార్టీల కంటే ముందుగానే మంగళవారం పలు కీలక హామీలను ప్రకటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి బాగా పేరు తెచ్చిన పథకాలను మరింత విస్తృతం చేయడంతోపాటు పలు కొత్త వాటిని చేర్చారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయంలో ప్రభావం చూపిన రైతు రుణ మాఫీని మళ్లీ చేర్చారు. రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. ఈసారి పకడ్బందీగా, రైతులకు ఇబ్బంది లేకుండా మాఫీ చేస్తామని చెప్పారు. ఎకరాకు రూ.8 వేలు ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని రూ.10 వేలకు పెంచుతామన్నారు. పంటలకు గిట్టుబాటు ధర వచ్చేందుకు ప్రతి రెండు నియోజకవర్గాలకు ఒకటి చొప్పున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామని అన్నారు. స్వయం సహాయక బృందాలకు 75% నుంచి 80% సబ్సిడీతో వీటిని నెలకొల్పుతామని చెప్పారు. ఈ బృందాల్లోని వారిని ఉద్యోగులుగా నియమించి వీటిని విజయవంతంగా అమలు చేస్తామని వివరించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.2 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆసరా పథకంలో మార్పులు చేస్తామని, ప్రస్తుతం 65 ఏళ్లకు ఇస్తున్న వృద్ధాప్య పింఛన్లను 57 ఏళ్లు పూర్తి కాగానే ఇస్తామన్నారు. ప్రస్తుతం రూ.వెయ్యి ఉన్న ఆసరా పింఛన్ల మొత్తాన్ని రూ.2,016కు, అలాగే వికలాంగుల పింఛన్‌ను రూ.1,500 నుంచి రూ.3,016కు పెంచుతామని చెప్పారు. నిరుద్యోగులకు ప్రతి నెల రూ.3,016 చొప్పున భృతి చెల్లిస్తామని తెలిపారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పథకంలో మార్పులు చేస్తున్నామన్నారు. ఇంటి స్థలం ఉన్న వారికి ఇళ్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామని, లేని వారికి నిర్మించి ఇస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రవేశపెతామన్నారు. ఈ పథకం విధివిధానాల రూపకల్పన కోసం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. అగ్రవర్ణాల్లోని పేదల అభ్యున్నతికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. చిరు ఉద్యోగులకు మరింత వేతనాలు పెంచుతామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్, పీఆర్సీ మెరుగ్గా ఉంటుందని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగుల ప్రెండ్లీగా ఉంటుందన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం మంగళవారం తెలంగాణ భవన్లో జరిగింది. కమిటీ చైర్మన్ కె.కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం పాక్షిక మేనిఫెస్టోను ఆయన ప్రకటించారు. వారికి ఎన్నికలు రాజకీయ క్రీడ... మాకు టాస్క్... ‘మా పార్టీ అభ్యర్థులు ప్రచారంలో ఉన్నారు. పలు అంశాలపై పార్టీ ఏం చెబుతుందని ప్రజలు వారిని అడుగుతున్నారు. మా అభ్యర్థులు ప్రజలకు చెప్పేందుకు వీలుగా పాక్షిక మేనిఫెస్టోను ప్రకటిస్తున్నాం. వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి క్రోడీకరించి ముఖ్యమైన అంశాల అమలు తీరులో మంచి చెడులు, పూర్వాపరాలు, అమలు తీరుపై చర్చించాం. ఉద్యోగుల నుంచి 20కిపైగా వినతులొచ్చాయి. చిన్న ఉద్యోగులు వేతనాలు పెంచాలని, రెగ్యులరైజ్ చేయాలని కోరారు. మేనిఫెస్టోలో ఈ అంశాలను పొందుపరుస్తాం. నాలుగేళ్లలో నన్ను, మా మంత్రులను, ఎమ్మెల్యేలను పలుసార్లు పలు సందర్భాల్లో కొందరు కొన్ని అడిగారు. రాజకీయాలు, ఓట్లు, ప్రలోభాల కోసం కాకుండా హేతుబద్ధీకరణ పద్ధతిలో పరిశీలించాం. టీఆర్ఎస్ తెలంగాణ సాధించిన పార్టీ. మిగిలిన పార్టీలకు ఎన్నికలు ఒక రాజకీయ క్రీడ. మాకు మాత్రం ఒక పని (టాస్క్). నిర్ధిష్ట లక్ష్యాలు, పటిష్ట ఆలోచనలను చెప్పి ముందుకు పోతాం. రాష్ట్రం ఏర్పడినప్పుడు అర్థిక అంచనాలు తెలియవు. కరెంట్, మంచినీరు, వలసలు అన్ని సమస్యల ప్రభావం ఉండె. ఒక పథకాన్ని ప్రారంభించాలంటే ఆందోళనలు ఉండేవి. అందుకే కళ్యాణలక్ష్మీ పథకాన్ని మొదట ఎస్సీ, ఎస్టీలకే.. అదీ రూ.51 వేలతోనే అమలు చేశాం. ఏటా ఎన్ని పెళ్లిల్లు అవుతాయనే సమాచారం లేదు. అన్నింటిపై స్పష్టత వచ్చాక బీసీలకు, ఆ తర్వాత అగ్రవర్ణాల్లోని పేదలకు అమలు చేస్తున్నాం. ఆర్థిక పురోగతిపై అంచనా వస్తున్న కొద్దీ ఇచ్చే మొత్తాన్ని పెంచాం. మూడో ఏడాదిలో రూ.75 వేలు, నాలుగో ఏడాదిలో రూ.1,0,116కు పెంచాం. ప్రజలకు ప్రలోభాలు పెట్టి తమాషాలు చేయొద్దు. అడ్డం పొడుగు మాట్లాడొద్దు. అర్థిక అంశాలపై పూర్తి అవగాహన ఉండాలి. వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యం... వచ్చే ఐదేళ్లలో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయనే అంచనా వచ్చింది. కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు సహకారం లేని పరిస్థితిలోనే అంచనా వేశాం. వచ్చే ఐదేళ్లలో రూ.10.30 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. అప్పుల తీర్చే కార్యక్రమం కింద రూ.2.30 లక్షల కోట్లు చెల్లించాలి. దీంతో మరో రూ.1.30 లక్ష కోట్లు సమీకరించే అవకాశం వస్తుంది. మొత్తంగా తొమ్మిది లక్షల కోట్ల నిధులు ఉంటాయి. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం ఉండి ఏటా రూ.20 వేల కోట్లు ఇస్తే పది లక్షల కోట్లకు చేరుతుంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ జీవన విధానం విధ్వంసమైంది. ప్రధానంగా రైతులు, రైతు కూలీలు ఆగమయ్యారు. ఉద్యమ సమయంలో హెలికాప్టర్లో వెళ్తూ జయశంకర్ సార్, నేను గ్రామాల పరిస్థితులను చూసి కన్నీళ్లు పెట్టుకునేవాళ్లం. తెలంగాణ జీవన విధానాన్ని పునరుద్ధరించుకునేందుకు వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. వచ్చే ఐదేళ్ల దీన్ని కొనసాగిస్తాం. రైతును రాజును చేయాలి. వారికి పూర్వ వైభవం రావాలి. మొదట ట్రాక్టర్లకు రవాణా పన్ను, నీటి తీరువా రద్దు చేశాం. పెట్టుబడి సాయం అద్భుత పథకం. రైతు బీమా గురించి ప్రపంచ వ్యాప్తంగా కథలుగా చెప్పుకుంటున్నరు. కోతలను పరిష్కరించి 24 గంటలపాటు సాగుకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నం. గోదాముల సామర్థ్యాన్ని 24 లక్షల టన్నులకు పెంచాం. రైతు సమన్వయ సమితులతో పంట కాలనీలు, మద్దతు ధర కల్పించే చర్యలు తీసుకుంటున్నం. ఇవన్నీ రైతాంగానికి ఎంతో ఊరటనిచ్చినయ్. 42 లక్షల మంది రైతులకు లబ్ధి... 2021 జూన్ వరకు రాష్ట్రంలో కచ్చితంగా కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తాం. కాళేశ్వరం, దేవాదుల, పాలమూరు, డిండి వంటి అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. రైతులు అప్పుల నుంచి బయటపడి, పెట్టుబడి ఖర్చులను వారే భరించే స్థితికి రావాలి. రాష్ట్రంలో 45.50 లక్షల మంది రైతులు బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారు. వీరిలో రూ.లక్ష లోపు రుణాలున్న వారు 42 లక్షల మంది ఉన్నారు. అందుకే రూ.లక్ష రుణ మాఫీని మరోసారి అమలు చేయాలని నిర్ణయించాం. మహిళా సంఘాల బృందాల ఆధ్వర్యంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది. ముంబైలోని లుసిడ్ పాపడ్ ఇదే తరహాలో మొదలైంది. ఇప్పుడు ఆ పాపడ్ దేశ వ్యాప్తంగా అన్ని హోటళ్లలో ఉంటుంది. ఏకంగా రూ.1,100 కోట్ల టర్నోవర్‌తో ఈ సంస్థ నడుస్తోంది. రైతు సమన్వయ సమితిలోని వారికి గౌరవ వేతనాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నం. రాష్ట్రంలో ప్రస్తుతం 40 లక్షల మంది ఆసరా పింఛన్లు పొందుతున్నరు. ఇకపై 57 ఏళ్లకే ఆసరా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించాం. దీంతో అదనంగా 8 లక్షల మందికి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే సంక్షేమ విభాగాల్లో చేసే ఖర్చు చాలా సంతృప్తినిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఆరంభం నుంచి వీటిని అమలు చేస్తాం. ప్రస్తుత బడ్జెట్లో వీటికి నిధులు కేటాయించలేదు. ముందే చెప్పిన ‘సాక్షి’ టీఆర్ఎస్ మేనిఫెస్టోలో రుణమాఫీ, పింఛన్ల పెంపు అంశాలు ఉన్నట్లు మంగళవారం(16న) ‘సాక్షి’లో ప్రచురించిన కథనం.. నిరుద్యోగుల ఎంపికకు మార్గదర్శకాలు... నిరుద్యోగ భృతి అమలులో ఎలాంటి పరిమితి లేదు. ఎన్ని లక్షల మంది ఉన్నా సరే ప్రతి ఒక్క అర్హుడికి అందజేస్తం. ఎవరెవరు నిరుద్యోగులో తేల్చేందుకు కొంత సమయం పడుతుంది. సమగ్ర కుటుంబ సర్వేలోనూ ఈ సమాచారం స్పష్టంగా లేదు. నిరుద్యోగుల ఎంపికకు మార్గదర్శకాలు, నిబంధనలు రూపొందిస్తం. అర్హులను తేల్చేందుకు మూడునాలుగు నెలలు పడుతుంది. ఆ తర్వాతే ఈ పథకం అమలు సాధ్యమవుతుంది. టీడీపీ, కాంగ్రెస్‌లు నిర్మించిన ఇళ్ల లెక్కలను చూస్తే జనాభా కంటే ఎక్కువ ఉన్నయ్. ఒక్క మంథని నియోజకవర్గంలోనే కుటుంబాల కంటే 40 శాతం ఎక్కువ ఇళ్లను నిర్మించినట్లు రికార్డులున్నయ్. లబ్ధిదారులుగా పేదలు ఉన్నరు. ఎవరిపై చర్యలు తీసుకోవాలి. టీడీపీ, కాంగ్రెస్ హయాంలో రుణాలపై ఇళ్లు నిర్మించుకున్న వారికి బ్యాంకుల్లో ఉన్న రూ.4,136 కోట్లను ప్రభుత్వమే చెల్లించింది. మేం వంద శాతం ఉచితంగా ఇళ్లు నిర్మించాలని నిర్ణయించాం. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 8.25 లక్షల ఇళ్ల నిర్మాణం అవసరమని అంచనా ఉంది. ఏటా 2 లక్షల చొప్పున నిర్మించాలని అనుకున్నం. స్థలం సమస్య వచ్చింది. అందుకే మార్పులు చేశాం. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్. చిత్రంలో ఈటల, కేశవరావు తదితరులు అగ్రవర్ణ పేదలూ అడుగుతున్నరు.. పేదరికానికి కులం లేదు. అగ్రవర్ణాల్లోని పేదలకు మాకు ఏదైనా చేయాలని అడుతున్నరు. కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని రెడ్లు, వైశ్యులు అడిగారు. అగ్రవర్ణాల వారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం. ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమం ఎలా ఉండాలనేది కడియం శ్రీహరి నేతృత్వంలోని కమిటీ నిర్ణయిస్తుంది. కొప్పుల ఈశ్వర్, నగేశ్ తదితరులు ఈ కమిటీలో ఉంటరు. ఉద్యోగుల సంక్షేమంలో మా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. అన్ని విభాగాల్లోని చిరుద్యోగుల వేతనాలు పెంచాం. వారు మళ్లీ ఆశీర్వదిస్తే మీ కడుపులు నింపుతం. ఎన్నికల కోడ్ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడు ఏమీ చెప్పలేను. ఐఆర్, పీఆర్సీ మెరుగ్గా ఉంటయ్. ఉద్యోగులకు బెంబేలు, బాధ వద్దు. కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పినవి చేయలేదు. 2009 ఎన్నికల్లో ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయలేదు. మాది విశ్వసనీయ ప్రభుత్వం. ఆపద్ధర్మ సీఎం అయినా నేను అన్ని వివరాలు తెలుసుకుంటున్నా. రైతుల రుణమాఫీలో గతసారి వచ్చినట్లు ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తం’ అని వివరించారు. తెలంగాణ భవన్ వద్ద సంబరాలు... టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాక్షిక మేనిఫెస్టోను ప్రకటించగానే ఆ పార్టీ నేతలు, శ్రేణులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ ఇంచార్జీ మన్నె గోవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలోని పార్టీ కార్యకర్తలు డప్పు చప్పులతో హడావుడి చేశారు. టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి ఈ సందర్భంగా కేసీఆర్‌కు పుష్పగుచ్చం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. -
నిరుద్యోగులకు రిక్తహస్తం
సాక్షి, అమరావతి/గుంటూరు: ఇంటికో ఉద్యోగం, ఒకవేళ ఉద్యోగం రాకపోతే నెలకు రూ.2,000 చొప్పున నిరుద్యోగ భృతి అందజేస్తామంటూ ఇచ్చిన హామీని అమలు చేయకుండా యువతను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల తరుణంలో మరో వంచనకు తెరతీశారు. నెలకు కేవలం రూ.1,000 చొప్పున రెండు మూడు నెలల పాటు తూతూమంత్రంగా భృతి ఇచ్చేసి, చేతులు దులుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 50 నెలలు పూర్తయ్యాయి. నెలకు రూ.2,000 చొప్పున ఒక్కో నిరుద్యోగికి రూ.లక్షకు పైగా భృతి అందాలి. కానీ, నాలుగున్నరేళ్లు గడిచిపోయినా ఇప్పటిదాకా పైసా కూడా ఇవ్వలేదు. మళ్లీ ఎన్నికలు తరుముకొస్తుండడంతో చంద్రబాబుకు హఠాత్తుగా నిరుద్యోగులు గుర్తొచ్చారు. రూ.2,000 సంగతిని పక్కనపెట్టి, భృతి కింద నెలకు కేవలం రూ.1,000 చొప్పున ఇస్తామంటూ మళ్లీ నిరుద్యోగులపై వల విసురుతున్నారు. అర్హుల సంఖ్యను భారీగా కుదించేందుకు ఇప్పటికే సవాలక్ష ఆంక్షలు విధించారు. పైగా దరఖాస్తు ప్రక్రియను అర్థం కాని బ్రహ్మపదార్థంగా మార్చేశారు. భృతి పొందడానికి అన్ని అర్హతలున్నా వారు కూడా దరఖాస్తు చేసుకోలేక లబోదిబోమంటున్నారు. ముఖ్యమంత్రి యువనేస్తం’ అని నామకరణం చేసిన ఈ పథకం నిజానికి ఎవరి నేస్తమో అర్థం కావడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యువత ఆశలపై ఆంక్షల కత్తి నిరుద్యోగ భృతిని వీలైనంత మేరకు కుదించేందుకు ప్రభుత్వం లెక్కలేనన్ని షరతులు విధించింది. భృతి పొందాలంటే డిగ్రీ పూర్తి చేసినవారు లేదా డిప్లొమా చేసిన వారు మాత్రమే అర్హులు. అంతేకాదు ప్రజా సాధికార సర్వేలో తప్పనిసరిగా నమోదై ఉండాలి. ఈకేవైసీ వెరిఫికేషన్ పూర్తికావాలి. ఈకేవైసీ వెరిఫికేషన్ అంటే.. కుటుంబ సభ్యులందరి వివరాలతో ఆ కుటుంబంలోని నిరుద్యోగి వివరాలు సరిపోవాలి. ఆధార్ కార్డు కోసం చెప్పిన వివరాలు, ప్రజా సాధికార సర్వేలో చెప్పిన వివరాలు వంద శాతం సరిపోవాలి. నిరుద్యోగి బ్యాంక్ ఖాతాకు అతడి ఆధార్ నెంబర్ అనుసంధానం(లింక్) కావాలి. గతంలో ప్రజా సాధికార సర్వే నిర్వహించినప్పుడు చాలామంది యువతీ యువకుల ఇళ్లల్లో లేరు. దాంతో సర్వేలో వారు పేర్లు, వివరాలు నమోదు కాలేదు. అలాంటి వారు ఇప్పుడు నిరుద్యోగ భృతి పొందే అవకాశం లేదు. ఏదైనా ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నా, గతంలో పనిచేసి మానేసినా భవిష్య నిధి(పీఎఫ్) ఖాతా, ఈఎస్ఐ అకౌంట్ ఉంటే నిరుద్యోగ భృతికి అనర్హులే. గతంలో ఉపకార వేతనాలు పొందిన నిరుద్యోగులు ఈ పథకానికి అర్హులు కారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీ రూపంలో రూ.50 వేలు తీసుకున్న వారు కూడా అనర్హులే. ప్రభుత్వం విధించిన మరికొన్ని ఆంక్షలు... - కుటుంబంలో ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు. - 22 నుంచి 35 ఏళ్లలోపు వయసు మాత్రమే ఉండాలి. - ప్రజా సాధికారత సర్వేలో నమోదై ఉండాలి. తెల్లరేషన్ కార్డు ఉండాలి. - ప్రైవేట్, ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగి అయి ఉండకూడదు. - కుటుంబంలో ఎవరు కారు కలిగి ఉండకూడదు. వయసు నిబంధన విడ్డూరం భృతి పొందాలంటే వయసు 22 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్యే ఉండాలన్న నిబంధన పట్ల నిరుద్యోగులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. చాలామంది 40 ఏళ్లు దాటినా నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారు. కాబట్టి వయో పరిమితిని పెంచాలని కోరుతున్నారు. ఆధార్ ఉంటేనే భృతి ఇస్తారట! సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఆధార్ సంఖ్య అవసరం లేదని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. కానీ, ఆధార్ సంఖ్య లేకపోతే నిరుద్యోగ భృతి రాదని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. యువనేస్తం వెబ్సైట్లో ఆధార్ నంబర్ నమోదు చేస్తే ఫోన్‌కు వన్‌టైం పాస్వర్డ్(ఓటీపీ) వస్తుందని, దాన్ని ఎంటర్ చేయగానే సదరు వ్యక్తి నిరుద్యోగ భృతికి అర్హుడా కాదా అనే విషయం తెలిసిపోతుందని ప్రభుత్వం ప్రకటించింది. అర్హులో కాదో వెబ్సైట్లో నిర్ధారణ అయినప్పుడు ప్రత్యేకంగా దరఖాస్తులు ఎందుకు కోరుతున్నారని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కొందరు ఓటీపీ కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. కొన్నిచోట్ల వెబ్సైట్ ఓపెన్ కావడం లేదు. మరికొన్నిచోట్ల సర్వర్ పనిచేయక అభ్యర్థులు అగచాట్లు పడుతున్నారు. చాలామంది నిరుద్యోగులు ఆధార్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇచ్చిన ఫోన్ నంబర్లను ప్రస్తుతం వాడడం లేదు. కొందరు ఫోన్లు పోగొట్టుకొని నంబర్ కూడా వదిలేసుకున్నారు. వారికి ఓటీపీ రాదు. అంటే దరఖాస్తు చేసుకునే అవకాశం లేనట్లే. ఇప్పటిదాకా 5.39 లక్షల దరఖాస్తులే.. నిరుద్యోగ భృతి కోసం శనివారం సాయంత్రం 7 గంటల వరకు 5,39,159 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం 1,62,451 మంది వివరాలను పరిశీలించింది. దరఖాస్తు చేసుకునేందుకు ఓటీపీ రాని వారు 14,658 మంది ఉన్నారు. తమ దరఖాస్తు తిరస్కరణకు గురైందని 32,591 మంది ఫిర్యాదు చేశారు. నిరుద్యోగ భృతికి ప్రభుత్వం విధించిన షరతులు, దరఖాస్తుల ప్రక్రియలో లోపాల వల్ల లక్షలాది మంది ఈ పథకం కింద ప్రయోజనానికి నోచుకోలేకపోతున్నారు. లింక్ కాకపోతే అంతే సంగతి ముఖ్యమంత్రి యువనేస్తం దరఖాస్తుల ప్రక్రియ సెప్టెంబర్ 14వ తేదీ నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవాలంటే పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. దరఖాస్తు ప్రక్రియలో ఎన్నో తప్పులున్నాయని నిరుద్యోగులు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం.. 2.5 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట పొలం కంటే ఎక్కువ ఉన్నా, అనంతపురం జిల్లాలో అయితే 5 ఎకరాల మాగాణి, 10 ఎకరాల మెట్ట కన్నా ఎక్కువ భూమి ఉన్నవారు ఈ పథకానికి అనర్హులు. 5 ఎకరాలు, అంతకంటే తక్కువ అసైన్డ్ భూమి ఉన్న అభ్యర్థులు మాగాణి కలిగి ఉన్నారంటూ వెబ్సైట్ వారి దరఖాస్తులను స్వీకరించడం లేదు. సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ నంబర్ యూనివర్సిటీతో లింక్ కాలేదనే కారణంతో పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు సైతం డిగ్రీ పూర్తి చేయలేదంటూ యువనేస్తం వెబ్సైట్ చూపుతోంది. లైసెన్స్ ఉంటే కారు ఉన్నట్టేనా? నాలుగు చక్రాల వాహనం ఉన్న అభ్యర్థులు భృతికి అనర్హులని ప్రభుత్వం తేల్చిచెప్పింది. యువనేస్తం వెబ్సైట్లో, యాప్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో కనీసం బైక్ కూడా లేని అభ్యర్థులకు కారు ఉందని చూపుతూ దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు. నాలుగు చక్రాల వాహనం నడిపేందుకు లైసెన్స్ ఉన్నవారికి ఈ సమస్య ఎదురవుతోంది. ఫిర్యాదు చేసినా ఫలితం సున్నా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఆన్లైన్లో ఏవైనా సమస్యలు తలెత్తితే డయల్ 1100, మెయిల్ ఐడీల ద్వారా ఫిర్యాదు చేయొచ్చని అధికారులు ప్రకటించారు. అయితే, ఈ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించడం లేదని నిరుద్యోగులు వాపోతున్నారు. అనుసంధాన గండం నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకుందామంటే ఆధార్ గండం పట్టి పీడిస్తోంది. గతంలో చాలామందికి పుట్టిన తేదీ పూర్తిగా నమోదు చేయకుండానే ఆధార్ కార్డులు ఇచ్చారు. కొందరు తమ ఆధార్ సంఖ్యకు మొబైల్ నంబర్‌ను అనుసంధానం చేసుకోలేదు. ప్రస్తుతం నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఆధార్ కార్డులో పుట్టిన తేదీ, నెల, సంవత్సరం పూర్తిగా ఉండాలి. అభ్యర్థుల ఆధార్ సంఖ్య వారి మొబైల్ నంబర్‌తో అనుసంధానం కావాలి. ఆధార్‌లో మార్పులు చేర్పులు, మొబైల్ నంబర్‌తో అనుసంధానం కోసం నిరుద్యోగులు ఆధార్ నమోదు కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బైక్ కూడా లేని నాకు కారు ఉందట! ‘‘నేను బీఈడీ పూర్తిచేసి డీఎస్సీకి సన్నద్ధమవుతున్నా. నాకు బైక్ కూడా లేదు. కానీ, నిరుద్యోగ భృతి కోసం యువనేస్తం వెబ్సైట్లో నా వివరాలను నమోదు చేస్తే నాకు కారు ఉందంటూ దరఖాస్తు తిరస్కరణకు గురైంది. 1100కు ఫిర్యాదు చేసినా నా సమస్యను పరిష్కరించలేదు. – అరుణ్, నిరుద్యోగ ఐక్య వేదిక కో–కన్వీనర్, గుంటూరు డిగ్రీ పూర్తి చేయలేదని చూపిస్తోంది ‘‘నేను 2009లో డిగ్రీ, 2017లో ఎమ్మెస్సీ పూర్తిచేశా. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నా. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకుంటే నేను డిగ్రీ కూడా చేయలేదని వెబ్సైట్లో చూపిస్తోంది. 1100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు’’ – బి.శ్రీలక్ష్మి, నిరుద్యోగి, గుంటూరు జిల్లా దరఖాస్తు ప్రక్రియ తప్పులతడక ‘‘మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్న పేరిట 5 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. నేను ఎంబీఏ చదివాను. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకుందామంటే మాకు 5 ఎకరాల మాగాణి ఉన్నట్టుగా వెబ్సైట్లో చూపుతోంది. నా దరఖాస్తును స్వీకరించడం లేదు. యువనేస్తం దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా తప్పులతడక. ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు’’ – కృష్ణ, నిరుద్యోగి, గుంటూరు జిల్లా ఆధార్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నా... ‘‘నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకోడానికి ప్రయత్నిస్తుంటే నా ఆధార్ నంబర్ మొబైల్ నంబర్‌కు అనుసంధానం కాలేదని చూపిస్తోంది. దీంతో అనుసంధానం చేయించుకోవడానికి రెండు వారాలుగా ఆధార్ సెంటర్ చుట్టూ తిరుగుతున్నా. సర్వర్ పనిచేయడం లేదని చెబుతున్నారు. ప్రతిరోజూ తిరగాల్సి వస్తోంది’’ – టి.రామాంజనేయులు, నిరుద్యోగి, లాల్పురం, గుంటూరు దరఖాస్తులకు కొర్రీలా? ‘‘నేను ఎంకాం పూర్తిచేశా. అయినా ఉద్యోగం రాలేదు. మాది నిరుపేద కుటుంబం. నాలుగున్నరేళ్లుగా నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తున్నా. ఇప్పుడు యువనేస్తం పథకానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు ప్రయత్నిస్తే నేను డిగ్రీలో ఉత్తీర్ణుడిని కాలేదని చూపుతోంది. బ్యాంక్ ఖాతా సంఖ్యను కూడా వెబ్సైట్ స్వీకరించడం లేదు. దరఖాస్తు చేయలేకపోయా. మా స్నేహితులు చాలామంది ఇలాంటి కొర్రీల వల్ల దరఖాస్తు చేసుకోలేకపోయారు’’ – పప్పల రంగనాయుడు, నిరుద్యోగి, చిన్నరావుపల్లి, ఎచ్చెర్ల మండలం, శ్రీకాకుళం జిల్లా ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు ‘‘ప్రభుత్వం ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్లుగా యువనేస్తం పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. అర్హుల సంఖ్యలో కోత విధించేందుకు అంక్షలు పెట్టింది. ఈ పథకం అమల్లో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. – హేమంత్ కుమార్, నిరుద్యోగి, చిత్తూరు జిల్లా నిరాశతో వెనుతిరిగా... ‘‘నేను డిగ్రీ పూర్తి చేశా. నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తే నా ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ అనుసంధానం కాలేదని దరఖాస్తు తిరస్కరణకు గురైంది. మొబైల్ నంబర్‌కు ఆధార్‌ను అనుసంధానం చేసుకోవడానికి మీ–సేవ కేంద్రాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోయింది. అనుసంధానం వెంటనే జరగదని, 15 రోజులకు పైగా సమయం పడుతుందని చెప్పడంతో నిరాశతో వెనుదిరిగా’’ – సి.శ్రీకాంత్, బ్రాహ్మణపల్లి, కూడేరు మండలం, అనంతపురం జిల్లా దరఖాస్తును తిరస్కరించడం దారుణం ‘‘2006లో డిగ్రీ పూర్తి చేశా. ఎస్కేయూలో పీజీ చదివా. నిరుద్యోగ భృతి కోసం మీ–సేవ కేంద్రంలో వివరాలు నమోదు చేసుకున్నా. మా కుటుంబానికి 2.60 ఎకరాల భూమి ఉన్నట్లు ఆన్లైన్లో చూపడంతో దరఖాస్తును తిరస్కరించారు. కానీ, అనంతపురం జిల్లాలో భృతి పొందాలంటే నిరుద్యోగులకు 10 ఎకరాల దాకా భూమి ఉండొచ్చని ప్రభుత్వం చెప్పింది. అయినా నా దరఖాస్తును తిరస్కరించడం దారుణం’’ – శ్రీనాథ్ నవీన్, శింగనమల, అనంతపురం జిలా విద్యార్హతలు ఆన్లైన్లో కనిపించడం లేదు ‘‘నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేద్దామంటే అన్లైన్లో విద్యార్హతలను చూపించడం లేదు. నేను 2016లో డిగ్రీ పూర్తిచేసి ప్రస్తుతం పీజీ ద్వితీయ సంవత్సర పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నా. ప్రభుత్వం ప్రకటించిన యువనేస్తం వెబ్సైట్ నా వివరాలను తీసుకోవడం లేదు. ఇప్పటిదాకా దరఖాస్తు చేయలేకపోయా’’ – సీహెచ్ సుధీర్‌కుమార్, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా ఓటీపీ సమస్యగా మారింది ‘‘ఆధార్ కార్డు పొందినప్పుడు మనం ఇచ్చిన ఫోన్ నంబర్‌కు మాత్రమే ఓటీపీ వెళుతుంది. అయితే, ఇప్పుడు ఆ నంబర్లను చాలామంది ఉపయోగించడం లేదు. దీంతో ఓటీపీ రాక, యువనేస్తం పథకానికి దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది’’ – ఖాన్, నిరుద్యోగి, విశాఖ జిల్లా -
వంచనపై వైఎస్సార్ సీపీ ‘యువ’గర్జన
హైదరాబాద్: ప్రతీ ఇంటికీ ఉద్యోగం, నిరుద్యోగ భృతి పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మోసపూరిత వైఖరిని నిరసిస్తూ మంగళవారం పలు జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీలు చేపట్టారు. అనంతపురంలో వైఎస్సార్ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకూ వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ యాదవ్ నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు నిరుద్యోగ భృతి పెంచాలని డిమాండ్ చేసిన హరీష్ యాదవ్.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ యువతను ఆదుకోవాలన్నారు. మరొకవైపు నిరుద్యోగ భృతిపై చంద్రబాబు మోసం చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ వెన్నపూసగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. ఉద్యోగాల భర్తీలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందన్న వెన్నపూస గోపాల్ రెడ్డి... నిరుద్యోగ భృతిని వెయ్యి రూపాయలకు పరిమితం చేయడం అన్యాయమన్నారు. నెల్లూరు జిల్లా; ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగులను వంచించారని ఆరోపిస్తూ నెల్లూరులో వైఎస్సార్ సీపీ యువజన విభాగం, విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. బాబు వస్తే జాబు వస్తుందన్న హామీ ఏమైందంటూ డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం డీఆర్ఓకు వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుతం ఉద్యోగాల్ని ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాల్ని తొలగిస్తున్నారంటూ విద్యార్థి విభాగం అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ విమర్శించారు. అదే సమయంలో నిరుద్యోగ భృతి విషయంలో చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. వైఎస్సార్ జిల్లా; వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వరకు వైఎస్సార్ కాంగ్రెస్ యువజన, విద్యార్థి విభాగం నేతల నిరుద్యోగ వంచన ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యువజన, విద్యార్థి విభాగం కదం తొక్కింది. తక్షణమే నిరుద్యోగులకు రూ. 2000 భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. చిత్తూరు ; చిత్తూరు కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ర్యాలీలో వందలాది మంది విద్యార్థులతో పాటు ఎమ్మెల్యేలు సునీల్ కుమార్, డాక్టర్ నారాయణస్వామి, చిత్తూరు పార్లమెంట్ ఇంఛార్జి జంగాలపల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు. కృష్ణా : వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వంచనపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. విజయవాడలోని లెనిన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు వంగవీటి రాధా, వెల్లంపల్లి, మల్లాది విష్ణు, విద్యార్థి విభాగం నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. నిరుద్యోగులకు చంద్రబాబు నాయుడు నిలువునా ముంచారని మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయనే హడావిడిగా నిరుద్యోగ భృతి ప్రకటించారని వ్యాఖ్యనించారు. చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు రొడ్డున పడ్డారని విమర్శించారు. విశాఖపట్నం : నిరుద్యోగులపై సీఎం చంద్రబాబు తీరుకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరుద్యోగ వంచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ఐసీ అంబెద్కర్ సర్కిల్ నుంచి జీవీఎమ్సీ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. డీఆర్వో చంద్రశేఖర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. పశ్చిమ గోదావరి : సీఎం చంద్రబాబు నిరుద్యోగులను మోసం చేశారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరుద్యోగ వంచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరులోని వైఎస్సారసీపీ జిల్లా కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ యేరకు అధికారులకు వినతిపత్రం అందించారు. చింతలపుడి వైఎస్సార్సీపీ కన్వీనర్ ఎలిజా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. చింతలపుడి నుంచి ఏలూరు కలెక్టరేట్ వరకు నిరుద్యొగులు భారీ బైక్ ర్యాలీని చేపట్టారు. తూర్పు గోదావరి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యవజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరుద్యొగ వంచన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ రాజోలు కోఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు : నిరుద్యోగులపై చంద్రబాబు తీరును నిరశిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరుద్యోగ వంచన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు పాల్గొని మద్దతు తెలిపారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగులను చంద్రబాబు మోసం చేశారని వైఎస్సార్సీపీ నేత ఆరోపించారు. విజయనగరం : ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలో 300 బైక్‌లతో వైఎస్సార్సీపీ నేతలు నిరసన ర్యాలీని చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ ర్యాలీని ప్రారంభించారు. కర్నూలు జిల్లా: వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘నిరుద్యోగ వంచన’ కార్యక్రమం నిర్వహించారు. రాజ్‌విహార్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ తీశారు. ఎమ్మెల్యే గౌరు చరిత, సమన్వయకర్త హఫీజ్‌ఖాన్, వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫయాజ్ అహ్మద్ విద్యార్థులతో కలిసి మానవహారం, రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఈ నెల 11న యువగర్జన నిరసన ర్యాలీ
సాక్షి, విజయనగరం : నిరుద్యోగ భృతిపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా ఈ నెల 11న విజయనగరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువగర్జన నిరసన ర్యాలీ చేపట్టనున్నట్టు ఆ పార్టీ నాయకులు కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ ప్రజలను మభ్యపెట్టడానికి నాటకాలు ఆడుతుందని మండిపడ్డారు. 2014 ఎన్నికల్లో 600కి పైగా హామీలు ఇచ్చిన సీఎం చంద్రబాబు అవేమీ నెరవేర్చలేదని విమర్శించారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశం నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లిందని ఆరోపించారు. యువత ఉద్యోగాల కోసం, నిరుద్యోగ భృతి కోసం ఇంతకాలం వేచిచూస్తే.. మంత్రి వర్గం 1000 రూపాయలు ఇవ్వాలని, వయోపరిమితి విధించాలని నిర్ణయం తీసుకోవడం సిగ్గుచేటన్నారు. ఈ నిర్ణయాన్ని తమ పార్టీ ఖండిస్తుందని తెలిపారు. నిరుద్యోగ భృతి 2000 రూపాయలు ఇవ్వడంతో పాటు.. హామీ ఇచ్చిన నాటి నుంచే వర్తించేలా నిర్ణయం తీసకోవాలని డిమాండ్ చేశారు. 40 సంవత్సరాల వరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమం కూడా టీడీపీ కార్యకర్తలకు మాత్రమే వర్తించేలా కుట్రలు జరుగుతున్నాయనే అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. మారిపోయారని నమ్మి ఓట్లేసిన ప్రజలను, ఉద్యోగులను తిరిగి మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని విమర్శించారు. ప్రత్యేక హోదా తేవాల్సిన టీడీపీ నాలుగేళ్లు బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని.. ఇప్పుడు ఎన్నికల సమయం రావడంతో ధర్మ పోరాటం అనడం దారుణమన్నారు. -
యువనేస్తం.. అడుగడుగునా మోసం..
సాక్షి, కర్నూలు : ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పేరుతో నిరుద్యోగ యువతను సీఎం చంద్రబాబు నాయుడు దారుణంగా మోసం చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శిల్పాచక్రపాణి రెడ్డి, బీవై రామయ్య, ఎమ్మెల్యే ఐజయ్య, కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్లు దుయ్యబట్టారు. శుక్రవారం జిల్లాలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. వాస్తవానికి పది శాతం మంది నిరుద్యోగులకు కూడా భృతి అందడం లేదని చెప్పారు. గతంలో సుమారు రెండు కోట్ల మందికి రూ. 2 వేల చొప్పున నిరుద్యోగ భృతిని కల్పిస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు, నాలుగేళ్ల తర్వాత కేవలం 12 లక్షల మందికి రూ. వెయ్యి చొప్పున భృతి కల్పిస్తామని యూటర్న్ తీసుకున్నారని వివరించారు. నయవంచనకు, మోసానికి, వెన్నుపోటుకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబని అన్నారు. ముఖ్యమంత్రి యువనేస్తంతో ప్రభుత్వం చేసిన ప్రకటన కోట్లాది మంది నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లిందని చెప్పారు. చంద్రబాబు నమ్మించి మోసం చేశారని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ విషయంలోనూ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని విమర్శించారు. వివిధ శాఖల్లో 1.80 లక్షల ఖాళీలు ఉంటే కేవలం 20 వేల పోస్టులు భర్తీ చేయడమేంటని నిలదీశారు. పదవి కోసం బూటకపు హామీలు ఇచ్చిన బాబు పప్పులు ఇక ఉడకవని పేర్కొన్నారు. కాపులు మొదలుకుని మైనార్టీల దాకా అందరినీ బాబు మోసం చేశారని ఆరోపించారు. కాపులకు రిజర్వేషన్ల పేరిట వేసిన కమిటీ ఇచ్చిన రిపోర్టులను వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ పాదయాత్రకు కాపు సోదరులు ఇస్తున్న మద్దతు చూసి చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని వ్యాఖ్యానించారు. ఏ సామాజికవర్గ హక్కులకు, డిమాండ్లకు వైఎస్సార్ సీపీ వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. కాపు కార్పొరేషన్‌కు రూ. 10 వేల కోట్లు ప్రకటించడం వైఎస్ జగన్ దూరదృష్టికి నిదర్శనం అని అన్నారు. గోబెల్స్ ప్రచారంతో చంద్రబాబు వైఎస్ జగన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని తెలిపారు. చైతన్యవంతులైన ప్రజలు ఈ విషయాలను నిశితంగా గమనిస్తున్నారని చెప్పారు. ప్రతి వైఎస్సార్ సీపీ కార్యకర్త టీడీపీ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని పిలుపు ఇచ్చారు. -
నీటి మీద రాతలు.. టీడీపీ హామీలు
సాక్షి, అమరావతి: ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికల మేనిఫెస్టో బైబిల్ లాంటిది. తాము అధికారంలోకి వస్తే ఏ పథకాలు, కార్యక్రమాలు ప్రవేశపెడతామో తెలిపే ప్రణాళిక అది. దాన్ని చూసి ఆ పార్టీ విధానాలు, హామీలను బేరీజు వేసుకుని ప్రజలు ఓట్లేస్తారు. అలాంటి మేనిఫెస్టోను అమలు చేయడానికి ఏ పార్టీ అయినా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ తాను రూపొందించిన మేనిఫెస్టోకే తూట్లు పొడిచింది. 2014 ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలో ఇచ్చిన 600కి పైగా హామీల్లో ఏ ఒక్కదాన్నీ సరిగా అమలు చేయలేకపోయింది. మేనిఫెస్టోలంటేనే ప్రజలకు నమ్మకం పోయేలా వారిని నిట్టనిలువునా ముంచింది. ఏదీ స్వర్ణాంధ్ర! స్వర్ణాంధ్ర నిర్మాణంలో భాగంగా కొత్త ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తామని, ఇంటికో ఉద్యోగం సృష్టిస్తామని చెప్పిన మాటలు నీటి మీద రాతలుగానే మిగిలిపోయాయి. కొత్త ఆర్థిక వ్యవస్థ ఏమోగానీ ఉన్న ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసి రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రగా మార్చేసింది. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మిస్తామని చెప్పి రాజధాని ప్రయోజనాలన్నింటినీ ఒకే ప్రాంతానికి పరిమితం చేసింది. నాలుగేళ్లుగా గ్రాఫిక్స్ చిత్రాలతో హడావుడే తప్ప ఒక్క పూర్తిస్థాయి నిర్మాణాన్నీ ఇప్పటివరకూ చేపట్టలేదు. వెలగపూడిలో తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ నిర్మించి అందుకు కోట్ల రూపాయలను దుబారా చేసింది. రాజధాని కోసమంటూ కృష్ణానదీ తీరంలో మూడు పంటలు పండే 33 వేల ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా సేకరించింది. అక్కడ రాజధాని వస్తుందని అస్మదీయులకు ముందే లీకులిచ్చి ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడడం ద్వారా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది. నట్టేట వ్యవసాయం, సాగునీటి రంగాలు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని చెప్పి పూర్తి స్థాయిలో అమలు చేయకుండా రైతులను నట్టేట ముంచింది. వ్యవసాయ సమస్యల పరిష్కారానికి ఇంటర్నేషనల్ అగ్రి సొల్యూషన్స్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు, వేరుశనగ పంటకు ప్రత్యేక డైరెక్టరేట్, డాక్టర్ స్వామినాథన్ సిఫారసుల అమలు, పంటలకు కనీస మద్దతు ధరలు, రూ.1000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.5 వేల కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు వంటి ఎన్నో హామీలిచ్చినా అవేమీ అమలుకు నోచుకోలేదు. పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వెలిగొండ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని నాలుగేళ్ల క్రితం చెప్పిన మాటలనే ఇప్పటికీ చెబుతుండడాన్ని బట్టి ప్రభుత్వం ఏమీ చేయలేదనే విషయం తేటతెల్లమవుతోంది. కానరాని మహిళా సాధికారత మద్యం బెల్టు షాపులను రద్దు చేస్తామని ప్రకటించినా ఇప్పటికీ ప్రతి పల్లెలో, వాడలో బెల్టు షాపులు రాజ్యమేలుతున్నాయి. డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తామని నమ్మించి పీఠమెక్కాక వారికి కేవలం రూ.పది వేల మూల నిధిని మాత్రమే విడతల వారీగా ఇచ్చింది. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.30 వేలు డిపాజిట్ చేసే మహాలక్ష్మి పథకం, పేద మహిళలకు స్మార్ట్ సెల్ఫోన్లు, బాలికా పాఠశాలల్లో మహిళా ఉపాధ్యాయుల నియామకం, అన్ని ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థినులకు హాస్టల్ వసతి, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ‘కుటీర లక్ష్మి’ పథకం వంటివన్నీ ఉత్తి మాటలుగానే మిగిలిపోయాయి. ఇంటికో ఉద్యోగం ఎక్కడ? ఇంటికో ఉద్యోగాన్ని ఇస్తామని చెప్పి వారి ఆశలను నీరుగార్చారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించారు. ప్రతి కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ప్రతి జిల్లా కేంద్రంలో పోటీ పరీక్షల్లో శిక్షణ ఇప్పించేందుకు ఎన్టీఆర్ స్టడీ సర్కిల్ ఏర్పాటు హామీలు అబద్ధాలుగానే మిగిలిపోయాయి. ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేసి ఏటా రిక్రూట్మెంట్ క్యాలెండర్ ప్రకటించి నియామకాలు జరుపుతామని చెప్పి అరకొర నోటిఫికేషన్లతో సరిపెట్టారు. ఉద్యోగాలు రాని వారికి నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి దాని గురించే పట్టించుకోలేదు. చివరికి నిరుద్యోగుల నుంచి తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఏర్పడడంతో కేవలం పది లక్షల మందికి రూ.1000 భృతి ఇస్తామని ఇటీవలే ప్రకటించింది. జిల్లాకో పోర్టు ఎక్కడ? ప్రతి జిల్లాకు ఒక పోర్టు, పోర్టులను అనుసంధానిస్తూ కలకత్తా–చెన్నై జాతీయ రహదారికి సమాంతరంగా మరో రహదారి నిర్మాణం, అన్ని జిల్లా కేంద్రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, మెగా ఫుడ్ పార్క్‌లు, పత్తి పండించే ప్రాంతాల్లో టెక్స్టైల్ పరిశ్రమలు, కడప–కర్నూలు–అనంతపురం జిల్లాల్లో సిమెంట్, స్టీల్ పరిశ్రమలు అభివృద్ధి, ఆటో మొబైల్ హబ్‌గా కృష్ణా, ఆక్వా కల్చర్ హబ్‌గా పశ్చిమగోదావరి, మాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌లుగా నెల్లూరు, చిత్తూరు జిల్లాలను అభివృద్ధి చేస్తామని చెప్పిన మాటలన్నీ నీటిమీద రాతలుగానే మిగిలిపోయాయి. ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు జిల్లాల్లో కొత్త విమానాశ్రయాలు, వివిధ జిల్లాలను అనుసంధానం చేస్తూ బుల్లెట్ రైళ్లు వంటి హామీలిచ్చినా ఒక్కదాన్నీ పట్టించుకున్న పాపానపోలేదు. అన్ని కులాలకు మిగిలింది వంచనే.. ఎస్సీలకు వార్షికాదాయ పరిమితి లేకుండా స్కాలర్షిప్, ప్రత్యేక కార్పొరేషన్, ఆరు నెలల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, పరిశ్రమల స్థాపనకు రూ.5 కోట్ల వరకూ వడ్డీ లేని రాయితీ ఇస్తామని చెప్పిన మాటలన్నీ బుట్టదాఖలయ్యాయి. జిల్లా యూనిట్‌గా విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో ఎస్టీలకు రిజర్వేషన్ల అమలు, 50 ఏళ్లున్న గిరిజనులకు రూ.వెయ్యి పింఛను, ఇల్లు లేని గిరిజనులకు 1.50 లక్షలతో ఇల్లు, భూమిలేని ప్రతి గిరిజన కుటుంబానికి రెండెకరాల భూమి కొనుగోలు చేసి ఇస్తామన్న హామీలు అమలు కాలేదు. ముస్లింలకు రూ.5 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు, ముస్లిం విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీల ఏర్పాటు, ఉర్దూ టీచర్ పోస్టుల భర్తీకి ప్రత్యేక డీఎస్సీ, ఆదాయం లేని మసీదుల్లో ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనాలిస్తామని నమ్మించి వంచించారు. కాపులను బీసీల్లో చేరుస్తామని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకున్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుచేసి దానికి తగినన్ని నిధులు ఇవ్వలేదు. పేద బ్రాహ్మణులకు ఉచితంగా ఇళ్లు, దేవాలయ పూజారులకు పదవీ విరమణ ఉండదని హామీలిచ్చి అమలు చేయలేదు. ఇచ్చిన హామీకి విరుద్ధంగా టీటీడీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులను తొలగించారు. సంక్షేమానికి సంకెళ్లు.. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు లెక్కలేనన్ని హామీలిచ్చినా అవేమీ అమలుకాలేదు. బీసీలకు వంద సీట్లు ఇస్తామని చెప్పి ఎన్నికల్లోనే వారిని దగా చేసింది. నామినేడెడ్ పోస్టుల్లో బీసీలకు మూడో వంతు రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగాల్లో 33.5 శాతం రిజర్వేషన్లు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు, ఆధార్‌తో సంబంధం లేకుండా ఫీజురీయింబర్స్‌మెంట్ వంటి అనేక హామీలు గాలిలో కలిసిపోయాయి. చేతి వృత్తుల వారికి విద్యుత్‌లో రాయితీ అమలు కాలేదు. చేనేత కార్మికులకు రూ.వెయ్యి కోట్ల ప్రత్యేక నిధి, ఏటా రూ.1000 కోట్ల బడ్జెట్, జిల్లాకు ఒక చేనేత పార్కు, చేనేతలకు ఉచితంగా ఇల్లు, మగ్గం షెడ్డు ఏర్పాటు, చేనేతల పిల్లల చదువుకు ప్రత్యేక ప్యాకేజీ, ఉచిత వైద్యం హామీలు అమలు కాలేదు. గీత కార్మికుల చెట్టు పన్ను ప్రభుత్వమే చెల్లించడం, ఎక్సైజ్ శాఖ పరిధి నుంచి కల్లు వృత్తిని తప్పిస్తామని చెప్పిన మాటలు అలాగే మిగిలిపోయాయి. మత్స్యకారులకు సముద్ర ప్రాంతాల్లోని భూముల కేటాయింపు, పంచాయతీరాజ్, మైనర్ ఇరిగేషన్ చెరువులను మత్స్యకార సొసైటీలకు అప్పగించే విషయాన్ని పట్టించుకోలేదు. గొర్రెల కాపరులు, నాయీ బ్రాహ్మణులకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేదు. గుడిసెలు లేని రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతామని చెప్పి నాలుగేళ్లలో నామమాత్రంగానైనా ఇళ్లు నిర్మించిన పాపానపోలేదు. అర్హులైన వారందరికీ ఇళ్లు నిర్మిస్తామని చెప్పి ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. మధ్యతరగతి వర్గాల గృహ నిర్మాణం కోసం ప్రత్యేక పథకం, శాటిలైట్ నగరాల నిర్మాణం, తక్కువ ధరల్లో అపార్ట్మెంట్ల నిర్మాణం, అనుకూల స్థలాల్లో కాలనీల ఏర్పాటు వంటివన్నీ మాటలుగానే మిగిలిపోయాయి. ఎన్టీఆర్ సుజల పథకం ద్వారా ప్రతి ఇంటికి రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాన్ సరఫరా హామీ నాలుగేళ్లయినా అమలు కాలేదు. మేనిఫెస్టో అమలులో విఫలం టీడీపీ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైంది. ప్రజలను ఆకర్షించేందుకు చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు అన్నీ చేసేస్తామని చెప్పి నాలుగేళ్లుగా ప్రచారంతో పబ్బం గడుపుకున్నారు. ప్రధానంగా ఇచ్చిన హామీలన్నింటినీ గాలికి వదిలేశారు. రైతులకు సంబంధించి చేస్తామని చెప్పిన అంశాల్లో ఒక్కదాన్నీ అమలు చేయలేదు. ధరల స్థిరీకరణ చేస్తామని, దానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామన్నారు. ఏమైంది? రాజధాని నిర్మాణం కూడా చేయలేదు. రైతు రుణమాఫీ కూడా సరిగా అమలు చేయలేకపోయారు. –కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఏ హామీనీ అమలు చేయలేదు టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో దేన్నీ అమలు చేయలేదు. అధికారంలోకి రావడం కోసం లెక్కలేనన్ని హామీలు గుప్పించి వచ్చాక పక్కనపెట్టేశారు. టీడీపీ వెబ్సైట్లోనే పార్టీ మేనిఫెస్టోను తొలగించారు. ఎందుకు తొలగించారు? దీన్నిబట్టే అందులో చెప్పినవన్నీ అబద్ధాలని తేలింది. రంగాల వారీగా, కులాల వారీగా హామీలిచ్చి ఎవరికీ న్యాయం చేయలేదు. –ఎన్.రఘువీరారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు విద్య, వైద్యం మిథ్యే నివాస ప్రాంతాల్లో ప్రతి కిలోమీటరుకు ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి మూడు కిలోమీటర్లకు ఒక ప్రాథమికోన్నత, ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక ఉన్నత పాఠశాల ఏర్పాటుచేస్తామని చెప్పి ఆ పని చేయకపోగా ఉన్న పాఠశాలలనే మూసివేసింది. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని చెప్పి ఒకే ఒకసారి డీఎస్సీ నిర్వహించి చేతులు దులుపుకుంది. ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తామని చెప్పి దాన్ని నీరుగార్చింది. మేనిఫెస్టోలో ఆరోగ్యశ్రీ జాబితాలో మరిన్ని వ్యాధులను చేరుస్తామని చెప్పి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. జాతీయ రహదారుల పక్కన అత్యవసర చికిత్స కోసం ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటు, జిల్లా కేంద్రాల్లో నిమ్స్ స్థాయిగల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటు కూడా సాకారం కాలేదు. -
నిరుద్యోగ భృతిపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రభుత్వం నిరుద్యోగ భృతిపై కీలక నిర్ణయం తీసుకుంది. నెలకు రూ. వెయ్యి చొప్పున నిరుద్యోగ భృతిని అందించనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ఈ మేరకు మంత్రి వర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది నిరుద్యోగులకు భృతిని అందించనున్నట్లు వెల్లడించారు. ఒక కుటుంబంలో ఇద్దరికి భృతిని అందజేస్తామని చెప్పారు. భృతిని అందుకోవడానికి కనీస విద్యార్హత డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలని తెలిపారు. ఏపీలో నిరుద్యోగులు ఉండకూడదని ఆశిస్తున్నట్లు లోకేశ్ అన్నారు. 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ(టీడీపీ) మ్యానిఫెస్టోలో నిరుద్యోగులకు రూ. 2 వేలు భృతి ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా, భృతి చెల్లింపు కోసం 7 దేశాల్లో నిరుద్యోగ భృతి పథకం ఎలా అమలవుతుందో పరిశీలించినట్లు లోకేశ్ వెల్లడించారు. పేదరిక రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే భృతి పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. పథకం విధివిధానాలపై చర్చల అనంతరం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రజల్లో చర్చ జరిగిన అనంతరం ఏవైనా మార్పులు ఉంటే చేస్తామని చెప్పారు. పథకం ఎప్పటి నుంచి అమలు చేస్తామనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. -
షరతులతో ‘మమ’
‘ఇంటికో ఉద్యోగం’ ఇస్తామని, లేదంటే ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.2వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. 1.70 కోట్ల కుటుంబాలు ఉద్యోగాల కోసం, నిరుద్యోగ భృతి కోసం ఎదురుచూస్తున్నాయి. ఇంత వరకు ఒక్క కొత్త ఉద్యోగమూ రాలేదు. ఒక్కరికి నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. నాలుగేళ్లు గడచిపోయాయి. నెలకు రూ.2వేల చొప్పున 48 నెలల్లో ఒక్కో నిరుద్యోగికీ రూ.96వేలు బకాయి పడ్డారు. అయితే రుణమాఫీ లానే ఈ హామీనీ సవాలక్ష ఆంక్షలతో నీరుగార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు మంత్రివర్గ ఉపసంఘం కొన్ని సిఫార్సులు చేసినట్లు తెలిసింది. నిరుద్యోగ భృతిని అనేక ఆంక్షలతో అమలు చేయాలని ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది. సాక్షి, అమరావతి: నాలుగేళ్లుగా అటకెక్కించిన ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి హామీని పూర్తిగా నీరుగార్చడానికి చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నట్లు ప్రచారం భారీస్థాయిలో జరుగుతున్నా వాస్తవానికి రైతు రుణమాఫీలానే దీనిని కూడా మమ అనిపించేయడానికి అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయని తెలుస్తోంది. నిరుద్యోగ భృతి ఇవ్వడానికి అనేక ఆంక్షలను ప్రతిపాదిస్తూ మంత్రి వర్గ ఉపసంఘం ముసాయిదా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్యోగం ఇచ్చే వరకు నెలకు రూ.2వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. రాష్ట్రంలో 1.70 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. కొత్తగా ఒక్క ఉద్యోగమూ కల్పించలేకపోయారు కాబట్టి ఇచ్చిన హామీ ప్రకారం భృతి ఇవ్వడానికి తగినంత బడ్జెట్ కేటాయించాలి. కానీ ఇప్పటి వరకూ ఏ బడెŠజ్ట్లోనూ ఈ నిధుల కేటాయింపు లేదు. గతేడాది బడ్జెట్లో నామ్కేవాస్తే లాగా రూ. 500 కోట్లు నిరుద్యోగ భృతికి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. కానీ ఆ నిధుల్లో ఒక్క రూపాయి కూడా ఖర్చుచేయలేదు. మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదించిన ఆంక్షలివీ.. ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో నిరుద్యోగ యువతకు సాయం పేరుతో రూ. 1,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. పూర్తిస్థాయిలో నిరుద్యోగ భృతి అందించేందుకు ఇది ఏమూలకూ చాలదు. దీంతో విధివిధానాల పేరుతో నిరుద్యోగుల సంఖ్యను వీలైనంత మేరకు కుదించేందుకు కసరత్తు చేస్తోంది. నిరుద్యోగ భృతికి సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం సవాలక్ష షరతులు ప్రతిపాదించింది. అందులో కొన్ని ఇలా ఉన్నాయి.... – నిరుద్యోగ భృతికి 22 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపువారే అర్హులు. – పదో తరగతి, ఇంటర్మీడియెట్ చదివినవారు భృతికి అనర్హులు. డిగ్రీ చదివిన వారికే భృతిని వర్తింపచేయాలని నిర్ణయం – ఐటీఐ, పాలిటెక్నిక్ చేసిన విద్యార్థులకు భృతి వర్తింపచేయరాదని, శిక్షణ మాత్రమే ఇవ్వాలని నిర్ణయం. – భృతి పొందాలంటే రేషన్ కార్డు, ఓటర్ ఐడీ తప్పనిసరి. స్థానికుడై ఉండాలనే నిబంధన – నాలుగు చక్రాల వాహనముంటే అనర్హులు – 2.50 ఎకరాల్లోపు మాగాణి, 5 ఎకరాల్లోపు మెట్ట విస్తీర్ణం కలిగిన దారిద్య్రరేఖకు దిగువనున్న నిరుద్యోగులు మాత్రమే భృతికి అర్హులు – దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాల్లో ఒక్కో కుటుంబంలో ఒక్కరికే నిరుద్యోగ భృతి – కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రాయోజిత పథకాల కింద స్వయం ఉపాధికోసం ఆర్థిక సాయం లేదా రుణం పొందిన వారు భృతికి అనర్హులు. – పబ్లిక్, ప్రైవేట్ రంగాలు, క్వాసీ గవర్నమెంట్ లేదా స్వయం ఉపాధి రంగాల్లో పనిచేస్తున్నవారూ భృతికి అనర్హులే. – ప్రభుత్వ సర్వీసు నుంచి డిస్మిస్ అయినవారు, అలాగే క్రిమినల్ కేసుల్లో శిక్షపడినవారు కూడా అనర్హులు పోర్టల్ నిర్వహించే బాధ్యత ప్రయివేటు ఏజెన్సీకి... నిరుద్యోగ భృతికి సంబంధించి ప్రత్యేకంగా వెబ్‌పోర్టల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. రియల్ టైమ్ గవర్నెన్స్ తరహాలో పోర్టల్‌ను నిర్వహించే బాధ్యతను ఓ ప్రయివేటు ఏజెన్సీకి అప్పగిస్తారు. భృతికోసం అభ్యర్థులు ఆ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్థానికత, విద్యార్హతలు, వయసు, కుటుంబం వార్షిక ఆదాయంతో కూడిన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. వ్యక్తిగతంగా ఆన్లైన్లో చేసుకున్న దరఖాస్తులను కార్మిక ఇఎస్ఐ, ఈపీఎఫ్ డేటాతో తనిఖీలు నిర్వహిస్తారు. దరఖాస్తుదారు నైపుణ్య శిక్షణకు వెళ్తామని లిఖితపూర్వకంగా రాసివ్వాలి. ఆ మేరకు రెగ్యులర్‌గా నైపుణ్య శిక్షణకు వెళ్లాలి. అలా వెళ్లనివారికి భృతిని నిలిపేస్తారు. అలాగే భృతికోసం దరఖాస్తు చేసుకునేవారు సామాజికంగా స్వచ్ఛ భారత్, వనం–మనం, మైనర్ ఇరిగేషన్, పబ్లిక్ హెల్త్ రంగాల్లో పనిచేస్తామని స్పష్టం చేయాలి. రాష్ట్ర స్థాయిలో సీఎం అధ్యక్షతన గల కమిటీ, జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ఈ పథకాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. అయితే ఇవన్నీ ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. -
నిరుద్యోగుల లెక్కెంతో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ భృతి ఇస్తామంటున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి నిరుద్యోగుల సంఖ్య ఎంతో తెలుసా అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు ప్రశ్నించారు. వరంగల్‌కు చెందిన కాంగ్రెస్ నేత, కుడా మాజీ చైర్మన్ చెరుకుపల్లి శ్రీనివాస్‌రెడ్డి బుధవారం టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ ఈయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇస్తారో లెక్క చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ వస్తే చీకట్లు తప్ప కరెంటు ఉండదని, తినడాని కి బువ్వ ఉండదని, పరిపాలన చేసే తెలివి లేదని అన్నవాళ్లే ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధిని పొగుడుతున్నారని చెప్పారు. ఎండాకాలం వస్తే కరెంటు లేక పంటలు ఎండిపోయేవని, పరిశ్రమలకు వారానికి 2 రోజులు కరెంటు ఇవ్వకుండా వేధించేవారని గుర్తుచేశారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగా ణ ఒక్కటేనన్నారు. నాడు ఎరువుల కోసం చెప్పులు లైన్లలో పెట్టి ఎండలో వెళ్లి తెచ్చుకునే పరిస్థితి అని, విత్తనాలను పోలీసుస్టేషన్లలో ఇచ్చేవారని ఎద్దేవా చేశారు. దేశాని కి అన్నం పెడుతున్న రైతన్నలకు 17 వేల కోట్ల రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. రాబందు.. రైతుబంధు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని చూసి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆశ్చర్యపోయారని, పెట్టుబడి కింద ఇచ్చే డబ్బులను రైతులు తిరిగి చెల్లించాలా అని అడిగారని చెప్పారు. గతంలో రాబందు ప్రభుత్వాలు ఉండేవని, ఇప్పుడు ఉన్నది రైతు బంధు ప్రభుత్వమని పేర్కొన్నారు. రైతు సమన్వయ కమిటీలతో రైతులకు ఇబ్బందులు లేకుం డా చేస్తున్నామని తెలిపారు. 1956కు ముందు నల్లగొండలో ఫ్లోరోసిస్ లేదని, పాలించిన నాయకుల అసమర్థత వల్లే అది వచ్చిందన్నారు. ఇంటింటికీ తాగు నీళ్లు ఇస్తామని, ఇవ్వలేకుంటే ఓట్లు అడగబోమని ప్రకటించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులకు పూర్వవైభవం తెస్తున్నామన్నారు. వరంగల్‌కి రూ.300 కోట్లు బడ్జెట్లో కేటాయించామని, అన్ని ప్రాంతాలకు నిధులు ఇస్తున్నామని చెప్పారు. గల్లీ ప్రజలే టీఆర్ఎస్కు బాసులు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సహనం నశించి, భవిష్యత్తు లేదనే భయంతో కాంగ్రెస్ నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల సమయంలో కొట్లాడుదామని, మిగిలిన సమయంలో అభివృద్ధి చేసుకుందామని సూచించారు. గడ్డం పెంచిన వారంతా గబ్బర్‌సింగ్‌లు అవుతారా అని ఉత్తమ్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. ఢిల్లీ చెప్పుచేతల్లో ఉంటూ రాష్ట్రాన్ని పట్టించుకోని కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదని హితవుపలికారు. ఢిల్లీలో టీఆర్ఎస్కు అధిష్టానం లేదని, గల్లీలో ఉన్న ప్రజలే టీఆర్ఎస్కు బాసులని వ్యాఖ్యానించారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో రూ.2 లక్షల రుణమాఫీ అని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని, దీని గురించి గతంలో రాహుల్ గాంధీతో చెప్పించినా ప్రజలు నమ్మలేదన్నారు. కాంగ్రెస్‌లో అన్ని కేసులున్న వారూ ఉన్నారని, వారిని ప్రజలు ఎలా సహిస్తారని ప్రశ్నించారు. దేశంలో అందరినీ మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. ఎన్నో త్యాగాలు చేసి, పోరాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసేదాకా కేసీఆర్ నాయకత్వంలోనే నడవాలన్నారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ అధ్యక్షత వహించారు. ఎంపీ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నైపుణ్య శిక్షణ పొందుతున్న యువతకే భృతి
సీఎం చంద్రబాబు వెల్లడి సాక్షి, అమరావతి: ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. అయితే అది నిరుద్యోగులందరికీ కాదని, కేవలం నైపుణ్య శిక్షణ పొందుతున్న వారికే అని ఆయన వివరించారు. ఏపీలో గ్రామీణ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టామన్నారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో న్యూఢిల్లీకి చెందిన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం ఐదు కోట్లతో రాష్ట్రంలోని యువతకు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇప్పించనున్నట్లు కార్పొరేషన్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఆ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ఏపీలో చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి చర్చించారు. గత ఏడాది రూ.178 కోట్లతో రాష్ట్రంలోని 8,300 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మించామన్నారు. గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందించి వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నది తమ సంస్థ లక్ష్యమని, ఇందుకోసం ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్సీ)తో కలిసి పనిచేయబోతున్నామని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డి.రవి తెలిపారు. ఇందుకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సమక్షంలో రెండు సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. -
నిరుద్యోగ భృతిపై బాబును నిలదీస్తాం
- ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి బనగానపల్లె: నిరుద్యోగ భృతిపై సీఎం చంద్రబాబును నిలదీస్తామని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి అన్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బనగానపల్లె నియోజకవర్గం నుంచి 75శాతం వైఎస్ఆర్సీపీకే ఓట్లు లభించడంతో అందుకు సహకారం అందించిన వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే కాటసానిరామిరెడ్డిని ఆయన స్వగృహంలో బుధవారం కలిశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వెన్నపూస గోపాల్ రెడ్డి మాట్లాడారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీని టీడీపీ అధినేత మరిచారన్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేలా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లభిస్తే 13 జిల్లాల్లో లక్షమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. వెనుబడిన రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్పీపీ అభ్యర్థి వెన్నపూస గోపాల్‌రెడ్డి మంచి మెజార్టీతో విజయం సాధించారన్నారు. వైఎస్సార్సీపీని ఆదరించిన పట్టభద్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
త్వరలో స్పోర్ట్స్ పాలసీ: కొల్లు రవీంద్ర
అమరావతి: యువతను ముందుకు తీసుకుని వెళ్లే గురుతర బాధ్యత మాపై ఉందని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం యువతకు పెద్ద ఏత్తున ప్రాధాన్యత ఇస్తుందన్నారు. బడ్జెట్లో నిరుద్యోగ భృతి కోసం రూ.500 కోట్లు కేటాయించామన్నారు. నిరుద్యోగ భృతి ఏవిధంగా యువతకు చేరితే మంచిదో ఆలోచిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి యువతతో మాట్లాడి నిరుద్యోగ భృతి ఎలా వారికి చేరాలో నిర్ణయిస్తామన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రతి నియోజకవర్గంలో ఒక స్టేడియం నిర్మిస్తామన్నారు. త్వరలో స్పోర్ట్స్ పాలసీ తీసుకువస్తామన్నారు -
మాట తప్పిన చంద్రబాబు
► మోసకారి అని మరోసారి నిరూపించుకున్నారు ► రూ.35 వేల కోట్లకు ఐదొందల కోట్లు కేటాయిస్తారా? ► వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య ధ్వజం ఏఎన్‌యూ : నిరుద్యోగ భృతి విషయంలో మాటతప్పి చంద్రబాబు మరోసారి మోసకారిగా నిరూపించుకున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆరోపించారు. నిరుద్యోగ భృతికి రాష్ట్ర బడ్జెట్లో తక్కువ నిధులను కేటాయించటాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో శనివారం యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబుకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ రాష్ట్రంలో 1.75 కోట్ల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించేందుకు 35వేల కోట్ల రూపాయలు అవసరమైతే బడ్జెట్లో కంటితుడుపుగా 500 కోట్ల రూపాయలు భిక్షంలా కేటాయించారని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం లేకపోతే 2వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చిన తరువాత దానిని విస్మరించారని మండిపడ్డారు. నిరుద్యోగులకు ఏమాత్రం ఉపయోగపడని నిధులు కేటాయించి ప్రభుత్వం చేతులు దులుపుకుంటే దానికి టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకోవటం సిగ్గుచేటన్నారు. టీఎన్ఎస్ఎఫ్ నాయకులకు నిరుద్యోగుల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి ఇంటిముందు ధర్నా చేయాలన్నారు. నిరుద్యోగులను మోసం చేస్తున్న చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో విద్యార్థులు, యువకులు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నిరుద్యోగ భృతి విషయంలో హామీలను నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా యువకులు సిద్ధమవుతున్నారన్నారు. వైఎస్సార్ సీపీ యువజన విభాగం గుంటూరు నగర అధ్యక్షుడు ఎలుకా శ్రీకాంత్ యాదవ్, విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శులు విఠల్, వినోద్, ఎస్సీసెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాజి, విద్యార్థి విభాగం ఏఎన్‌యూ నాయకుడు ఆదినారాయణ, గుంటూరు నగర నాయకులు నిర్మల్, మస్తాన్‌వలి, విమల్, వినయ్, తేజ, అనిల్, రాజశేఖర్ పాల్గొన్నారు. -
టీడీపీ పొలిట్‌బ్యూరోలో జగన్ లేఖ ప్రకంపనలు
-
మాఫీలాగే మమ!
నిరుద్యోగ భృతిపై అధికార పార్టీ ఎత్తుగడ... టీడీపీ పొలిట్‌బ్యూరోలో జగన్ లేఖ ప్రకంపనలు ⇒ ఏదో ఒకటి ప్రకటించకపోతే జనంలో తిరగలేం.. ⇒ వ్యతిరేకత పెరుగుతుండడంపై నేతల్లో భయం ⇒ అసెంబ్లీలో ప్రతిపక్షానికి సమాధానం చెప్పలేమని నేతల ఆందోళన ⇒ ఇస్తున్నట్లు ప్రకటించి రుణమాఫీలా మమ అనిపించేద్దామని నిర్ణయం ⇒ ప్రతిపక్షానికి మైలేజీ దక్కకుండా ప్రచారం చేయాలని అధినేత నిర్దేశం సాక్షి, అమరావతి : ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నిస్తూ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాసిన బహిరంగ లేఖతో అటు ప్రభుత్వంలోనూ, ఇటు పార్టీలోనూ కలకలం రేగింది. ఆదివారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసంలో జరిగిన తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో దీనిపై విస్తృత చర్చ జరిగినట్లు సమాచారం. జగన్ లేఖ నేపథ్యంలో ఉపాథి కల్పన, నిరుద్యోగ భృతి అంశాలపై జనంలో తీవ్ర చర్చ జరుగుతోందని సమావేశంలో పలువురు మంత్రులు, నేతలు చంద్రబాబుకు వివరించినట్లు సమాచారం. దీనిపై వెంటనే ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే జనంలో తిరగలేమని పలువురు నేతలు భయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘జాబు కావాలంటే బాబు రావాలి’, ‘ఇంటికో ఉద్యోగం ఇస్తాం’, ‘ఉద్యోగం కల్పించేవరకు నెలనెలా రూ.2,000 నిరుద్యోగ భృతి ఇస్తాం’ అంటూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేయడం పట్ల ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమౌతోందని మెజారిటీ సభ్యులు వివరించారు. ఉద్యోగాలు కల్పించకపోగా... ఉద్యోగాల కల్పనకు పెద్ద ఎత్తున దోహదపడే ప్రత్యేకహోదా సాధన విషయంలోనూ మనం విఫలంకావడంపై నిరుద్యోగ యువత రగిలిపోతోందని వారు వివరించినట్లు సమాచారం. ఎన్నికల్లో ఊరూరా తిరిగి వాగ్దానాలు చేసి, మేనిఫెస్టోలోనూ ప్రస్తావించి ఇపుడు మమ్మల్ని మోసం చేస్తారా అని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని నేతలు వివరించారని తెలిసింది. ఈ అంశంపై ఏదో ఒక ఊరడింపు చర్య తీసుకోవాలని, లేకపోతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో దీనిపై ప్రతిపక్షానికి సమాధానం చెప్పలేని పరిస్థితి ఏర్పడి సభ జరగడం దాదాపు కష్టమౌతుందని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడినట్లు సమాచారం. ఎన్నికల ముందు ప్రత్యేక హోదా పదేళ్లు సరిపోదు, పదిహేనేళ్లు కావాలని మనమే డిమాండ్ చేయడం, ఇపుడు మనమే ప్రత్యేక హోదా సంజీవని కాదని వ్యాఖ్యానిస్తుండడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయని, ప్యాకేజీ గురించి ఎన్ని చెప్పినా జనం నమ్మడం లేదని పలువురు నేతలు వివరించినట్లు తెలుస్తోంది. ఇద్దాం.. మమ అనిపించేద్దాం.. పొలిట్‌బ్యూరో సభ్యుల సూచనలపై స్పందించిన చంద్రబాబు.. అందరికీ ఇవ్వలేకపోయినా రుణమాఫీలా కొంతమందికైనా ఇచ్చి మమ అనిపిద్దామని చెప్పినట్లు తెలిసింది. కానీ జగన్ లేఖ రాసిన తర్వాతే నిరుద్యోగ భృతి వచ్చిందనే అభిప్రాయం యువతలో కలగకుండా దానిని జాగ్రత్తగా అమలు చేయాల్సి వుందని చెప్పినట్లు సమాచారం. నిరుద్యోగ భృతి ఇచ్చినట్లు కనిపిస్తూనే దానిని మమ అనిపించేయడానికి రుణమాఫీ విషయంలో వేసిన ఎత్తుగడలనే అమలుచేద్దామని వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఇంటికో ఉద్యోగమిస్తామని హామీ ఇచ్చినందున రాష్ట్రంలో 1.75 కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సి ఉందని, అన్ని కోట్లమంది నిరుద్యోగులకు గత 32 నెలలుగా నిరుద్యోగ భృతి బకాయిలు కూడా చెల్లించాల్సి ఉందని జగన్ డిమాండ్ చేస్తున్న విషయాన్ని కూడా పలువురు నేతలు అధినేత దృష్టికి తీసుకువచ్చారని సమాచారం. యువభేరి సదస్సులకు హాజరౌతున్న నిరుద్యోగులు తమకు రావలసిన 32 నెలల నిరుద్యోగ భృతి రూ.74 వేల గురించి ఎవరిని అడగాలని ప్రశ్నిస్తున్న విషయాన్ని ఓ సీనియర్ మంత్రి సమావేశంలో ప్రస్తావించినట్లు తెలిసింది. అయితే రుణమాఫీ విషయంలో ఎలాంటి ఎత్తుగడలు వేశామో అలాంటివే ఈ నిరుద్యోగ భృతి విషయంలోనూ అమలు చేయవచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఎంతమందికి భృతి ఇచ్చామన్నది ముఖ్యం కాదని, నిరుద్యోగ భృతి ఇచ్చినట్లు కనిపించడం, మనం చేసిందే నిజమని నమ్మించడం ముఖ్యమని చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోపే దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే బాగుంటుందని పలువురు నేతలు సూచించగా అందుకు చంద్రబాబు అంగీకరించినట్లు తెలిసింది. వెంటనే దీనిపై చర్యలు తీసుకోకపోతే ప్రతిపక్షం ఇదే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని చేయడానికి సిద్ధమవుతుందని పలువురు తెలిపారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని నిర్ణయించినట్లు సమావేశం ముగిసిన తర్వాత పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు. ఇళ్ల నిర్మాణంపైనా ప్రతిపక్షం ఇబ్బందిపెట్టే అవకాశం ఉందని పలువురు నేతలు ప్రస్తావించగా దానికి సంబంధించి రూపొందించిన ప్రణాళికలను వివరించాలని సూచించారు. ఇళ్ల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం చేయించిన సర్వే సరిగా లేదని, రాష్ట్రానికి ఐదు లక్షల ఇళ్లు, ఉత్తరప్రదేశ్‌కు 50 లక్షల ఇళ్లను కేటాయించవచ్చని సర్వే నివేదిక ఇవ్వడం ఏమిటనే దానిపై చర్చించారు. ఈ కేటాయింపులపై మళ్లీ సర్వే చేయించాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని సమావేశంలో నిర్ణయించారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో మూడంచెల విధానంపై కేంద్రానికి లేఖ.. అమెరికాలో తెలుగు ఇంజనీర్ కూచిభొట్ల శ్రీనివాస్ హత్యపై చర్చించిన నేతలు తెలుగు వారి రక్షణ కోసం అవసరమైతే ప్రధానికి లేఖ రాస్తానని చంద్రబాబు తెలిపారు. ప్రత్యేక విత్తన చట్టాన్ని రూపొందించాలని, అనాధలు, వీధిబాలలకు ఆశ్రయం కల్పించేందుకు ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు చంద్రబాబు నేతలకు తెలిపారు. ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు ప్రత్యేక అథారిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో మూడంచెల విధానాన్ని పునరుద్ధరించాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని నిర్ణయించారు. సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యులు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, కాలువ శ్రీనివాసులు, ప్రతిభా భారతి, తెలంగాణ నుంచి మోత్కుపల్లి నరసింహులు, రేవంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చాలా కాలం తరువాత నందమూరి హరికృష్ణ పొలిట్‌బ్యూరో సమావేశంలో పాల్గొనడం గమనార్హం. -
చంద్రబాబుకు వైఎస్ జగన్ బహిరంగ లేఖ
హైదరాబాద్: ఇంటికో ఉద్యోగం, లేకుంటే నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం చంద్రబాబుకు ఆయన బహిరంగ లేఖ రాశారు. వైఎస్సార్ సీపీ నాయకులు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, కోన రఘుపతి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు. అధికారంలోకి వచ్చి 33 నెలలు గడిచినా చంద్రబాబు మాట నిలబెట్టుకోలేదని లేఖలో వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఈ 33 నెలల్లో రూ. 2 వేల చొప్పున ఒక్కో కుటుంబానికి రూ. 66 వేలు చెల్లించాల్సివుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 1 కోటీ 75 లక్షల కుటుంబాలకు ఒక లక్షా 15 వేల కోట్ల రూపాయలు బకాయి పడ్డారని వివరించారు. నిరుద్యోగులకు బకాయిలతో పాటు భృతి మొత్తాన్ని చెల్లించేందుకు 2017-18 బడ్జెట్ లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకుంటే తమ కార్యాచరణను ప్రకటిస్తామననారు. (లేఖ పూర్తి సారాంశం కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
చంద్రబాబుకు వైఎస్ జగన్ బహిరంగ లేఖ.
-
నిరీక్షణ
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : ముంపు గ్రామ ప్రజలకు ఉద్యోగాల కోసం ఎదురుచూపులే మిగిలాయి. పునరావాస చట్టం అడుగడుగునా ఉల్లంఘనకు గురవుతోంది. కండలేరు జలాశయం నిర్మాణంకోసం 1985లో భూసేకరణ ప్రారంభించారు. రాపూరు మండలంలో 19 గ్రామాలను ముంపు గ్రామాలుగా గుర్తించారు. 1100 మంది నిరుద్యోగులను ఆయా ప్రాతిపదికన ఆధారంగా జాబితాను రూపొందించారు. ఇప్పటివరకు 191 మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. మిగిలిన 909 మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. మొదటి విడతగా 2000 సంవత్సరంలో ఇంటర్వూ్యలు నిర్వహించారు. వారిలో సైతం ఇంకా ఉద్యోగాలకోసం పడిగాపులు కాస్తున్నారు. దీనికితోడు ఐదేళ్లుగా 700 మంది అర్జీలు పట్టుకుని తాము ఉద్యోగాలకు అర్హులమంటూ తమ పేర్లను జాబితాలో చేర్చాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తాజాగా ఖాళీలు ప్రకటన ముంపు గ్రామాల వారికి ఇరిగేషన్‌శాఖలోని కండలేరు, తెలుగుగంగ, సోమశిల ప్రాజెక్ట్‌లలో ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. తాజాగా ఈఎన్సీ (ఇంజనీర్ ఇన్ చీఫ్) ద్వారా నెల్లూరులో 19, ప్రకాశం జిల్లాలో 11, సోమశిల ప్రాజెక్ట్‌లో 18 ఖాళీలను ప్రకటించారు. జోనల్ సిస్టం..కిరికిరి జలవనరులశాఖలో నెల్లూరు, ప్రకాశం 3వ జోన్లో, కడప, చిత్తూరు 4వ జోన్లో ఉన్నాయి. పునరావాస చట్టం ద్వారా ఏ జోన్లో ఖాళీలను అదే జోన్లో భర్తీ చేయాల్సి ఉంది. అయితే గతంలో జరిగిన భర్తీలో రాజ కీయ ఒత్తిళ్లతో జోనల్ సిస్టం పక్కన పెట్టి జిల్లా వాసు లకు అన్యాయం చేశారు. అప్పట్లో జిల్లాకు చెందిన నిరుద్యోగులు ఆందోళన చేశారు. తాజాగా వెలువడిన ప్రక టనతో మళ్లీ జిల్లాకు అన్యాయం జరుగుతుందని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇతర జిల్లాలకు ఉద్యోగాలు ఇప్పించడంలో ఇరిగేషన్ ఉన్నతాధికారు లు, రాజకీయ నాయకులు చూపుతున్న శ్రద్ధ జిల్లా వాసులపై లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఉన్న ఖాళీలను తెలుగుగంగ, కండలేరు, సోమశిలలోనే కాకుండా ఇతర డిపార్ట్మెంట్లలోనైనా ఉద్యోగాలు ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. నిరుద్యోగభృతి కల్పించాలి ముంపు గ్రామాలవారికి ఇచ్చిన హామీలను, జీఓ లను పాలకులు ఉల్లం ఘించారు. అర్హులైన నిరుద్యోగులకు నెలకు రూ.10 వేలు నిరుద్యోగభృతి కల్పించాలి. కా లువల పర్యవేక్షణకు 150 లష్కర్లు,అదేస్థాయిలో సూపర్వైజర్ల పోస్టులు ఖాళీగాఉన్నాయి.వాటిని భర్తీ చేసినా ముంపు వాసులకు న్యాయం జరుగుతోంది. ఇతర జోన్ల వారికి ఉద్యోగాలు ఇస్తే ఉద్యమిస్తాం. – మిడతల రమేష్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు -
ఫిన్లాండ్ బాటలో భారత్
హెల్సింకీ: ఉత్తర ఐరోపా దేశమైన ఫిన్లాండ్లో నిరుద్యోగ భృతిని విజయవంతంగా అమలు చేస్తున్నారు. అంతర్జాతీయ ప్రాథమిక ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని నిరుద్యోగ భృతిని నెలకు 585 డాలర్లుగా నిర్ణయించారు. 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఈ నిరుద్యోగ భృతి ఇప్పటికీ విజయవంతంగా కొనసాగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రపంచంలోనే అంతర్జాతీయ ప్రాథమిక ఆదాయాన్ని జాతీయ ఆదాయ ప్రమాణంగా తీసుకున్న ఏకైక దేశం ఫిన్లాండ్ మాత్రమే. ఇప్పుడు ఇదే బాటలో అంతర్జాతీయ ప్రాథమిక ఆదాయాన్ని ప్రమాణంగా తీసుకోవాలని భారత్‌తోపాటు కెన్యా, నెదర్లాండ్ దేశాలు ఆలోచిస్తున్నాయి. నిరుద్యోగ భృతిని ఇవ్వడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగాలు వెతుక్కోరంటూ వచ్చిన వాదనలో నిజం లేదని, ఉద్యోగం వెతుక్కునే దిశగా నిరుద్యోగులను ఈ స్కీమ్ ప్రోత్సహిస్తోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పార్ట్‌టైమ్ జాబ్‌లు చేసే వారికి నిరుద్యోగ భృతిని మినహాయించడం లేదుగనుక ఎక్కువ మంది నిరుద్యోగులు పార్ట్‌టైమ్ ఉద్యోగాలవైపు మళ్లుతున్నారని ఆ వర్గాలు తెలిపాయి. అయితే నిరుద్యోగ భృతిని పొందుతున్న నిరుద్యోగులు పెద్ద ఉద్యోగాలనే కోరుకుంటున్నారని, చిన్న ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడడం లేదని సామాజిక శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. నిరుద్యోగ భృతికి ఎలాంటి పన్నులు విధించడం లేనందున, చిన్న ఉద్యోగాలు చేయడం వల్ల వచ్చే జీతంలో పన్నులు పోతే నిరుద్యోగ భృతికన్నా తక్కువ వస్తుందన్నది వారి ఆందోళన వారు విశ్లేషిస్తున్నారు. -
అభివృద్ధి జాడేది బాబూ..?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే మాటలకు .. చేసే పనులకు ఏమాత్రం పొంతన లేదంటే ఇదే. జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పిన ఆయన రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ధి మేడిపండు చందంగానే ఉంది. ఈ నేపథ్యంలో తమకు నియోజకవర్గ నిధులు కేటారుుంచాలన్న విపక్ష ఎమ్మెల్యేల వినతిని ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. పైగా ఇప్పటికే భారీ స్థారుులో అభివృద్ధి చేశామని బదులిచ్చారు. ఈనేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏడు నియోజకవర్గాల్లో పరిస్థితిపై కథనం.. ‘ చిత్తూరు నా సొంతజిల్లా.. మాపార్టీకి అధికారం ఇస్తే.. ప్రత్యేక ప్రణాళికతో జిల్లాను అభివృద్ధి చేస్తా.. ఇక్కడి ప్రజలందరికీ పెద్దబిడ్డగా ఉంటా.. యువతకి, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తా.. కొత్త పరిశ్రమలు తీసుకొస్తా.. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తా, ఆరు నూరైనా.. హంద్రీనీవాను పూర్తి చేస్తా.. పడమటి మండలాల్లో వలసలను అడ్డుకుంటా..’’ ఇదీ తిరుపతి వెంకన్న సాక్షిగా జిల్లా ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాల చిట్టా. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపు.. ప్రస్తుతం పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లరుునా.. అభివృద్ధికి మాత్రం బీజం పడలేదు. జిల్లాకు ప్రాణవాయువుగా చెప్పుకునే హంద్రీనీవా నత్తను తలపిస్తోంది. ఇక హార్టికల్చర్ హబ్, రైతులకు కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం, గాలేరు నగరి ప్రాజెక్టు ఊసే వినిపించడం లేదు. పక్కాఇళ్లు, నిరుద్యోగ భృతిపై కనీసం స్పందించడం కూడా లేదు. పింఛన్ల బాధకు అంతేలేకుండా పోతోంది. ముఖ్యంగా విపక్ష ఎమ్మెల్యేలున్న 7 నియోజకవర్గాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడేఅన్న చందంగా మారింది. ప్రజల కష్టాలను చూసి చలించిపోరుున ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలసి తమ నియోజకవర్గాలకు నిధులు కేటారుుంచాలని కోరారు. కానీ ముఖ్యమంత్రి వారికి వింత సమాధానం ఇచ్చారు. తమ ప్రభుత్వం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తోందని, విపక్ష ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లోనూ భారీగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తేల్చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో పరిస్థితిపై ప్రత్యేక కథనం.. ‘నియోజకవర్గ అభివృద్ధికి నిధులివ్వండి.. సమస్యలు పరిష్కరించండి’.. అని జిల్లాలోని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అడిగితే.. సమస్యలు ఎక్కడున్నాయ్.. అన్నీ పరిష్కరించాం కదా.. అనే సమాధానం రావడంతో.. అవాక్కవడం ప్రతిపక్ష ఎమ్మెల్యేల వంతైంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు మాత్రమే ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేస్తుండటంపై ఇప్పుడిప్పుడే చర్చ మొదలవుతోంది. రాజకీయ పక్షపాతం చేసే పనుల వల్ల చివరికి తమకు అన్యాయం జరుగుతోందని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జంపింగ్ జపాంగ్కే.. తాంబూలాలు.. జిల్లాలో ఏకైక జంపింగ్ ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి ప్రాతిని థ్యం వహిస్తున్న పలమనేరుకు రూ.11 కోట్లు మంజూరు చేశారు. ఆ నియోజకవర్గంలో పింఛన్లు కూడా కొత్తగా 3 వేలకుపైగా మంజూరు చేయడం చర్చనీయాంశమైంది. సొంత ఎమ్మెల్యే అధికారంలో ఉంటేనే అభివృద్ధి నిధులు మంజూరు చేస్తారా..? అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
నిరుద్యోగ భృతంతా లోకేశ్కేనా?!
-
నేను అలా అనలేదు: అచ్చెన్నాయుడు
విజయవాడ : నిరుద్యోగ భృతిపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని మంత్రి కార్మిక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగ భృతి ఇవ్వకూడదని నిర్ణయం తీసుకోలేదని, దానిపై అధ్యయనం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారో సమాచారం లేదని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. చంద్రన్న పథకం ద్వారా 2 కోట్లమందికి బీమా కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. కాగా నిన్న వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రి తన పేషీని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు భృతి ఇవ్వాలనే ఎన్నికల హామీ ఏమైందని విలేకరులు ప్రశ్నించగా నిరుద్యోగ భృతి ఇవ్వలేమని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
నిరుద్యోగ భృతి ఇవ్వలేం
- కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి - తాత్కాలిక సచివాలయంలో పేషీ ప్రారంభం సాక్షి, అమరావతి: నిరుద్యోగ భృతి ఇవ్వలేమని కార్మిక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు కుండబద్దలు కొట్టేశారు. ఆదివారం ఉదయం వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంత్రి తన పేషీని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు భృతి ఇవ్వాలనే ఎన్నికల హామీ ఏమైందని విలేకరులు ప్రశ్నించగా మంత్రి పై విధంగా వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాల్లో నిరుద్యోగులకు ఇచ్చే భృతిపై అధ్యయనం చేశామని, చాలా తక్కువగా ఇస్తున్నారన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అంశాలపైనే ఎక్కువ దృష్టిపెట్టామన్నారు. ఇందుకోసం యూత్పాలసీని తీసుకు రావాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఎస్సీ సబ్‌ప్లాన్ మాదిరి యూత్ సబ్‌ప్లాన్ కూడా తీసుకు రావాలని సీఎం వద్ద ప్రతిపాదన పెడుతున్నట్లు చెప్పారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనపై కొత్త సచివాలయంలోని తన కార్యాలయంలో మొదటి సంతకం చేశారు. యువతకు ఉపాధి కోసం నైపుణ్య శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. శిక్షణ పూర్తి చేసిన వారికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. కాగా ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా వెలగపూడిలో తన కార్యాలయాన్ని ప్రారంభించారు. -
నిరుద్యోగ భృతి ఇవ్వలేం:అచ్చెన్నాయుడు
-
..ప్చ్.. ఉపాధి లేదు!
► ఎన్నికల హామీలను విస్మరించిన సర్కార్ ► నిరుద్యోగులను వంచించిన చంద్రబాబు ► కానరాని నిరుద్యోగ భృతి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తెలుగుదేశం ప్రభుత్వం విస్మరించిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. సంవత్సరానికి లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం..లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని చేసిన వాగ్దానం ఏమైందని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు హామీలను నమ్మి మోసపోయూమని, రెండేళ్ల టీడీపీ పాలనలో ఎవరికీ ఉపాధి కల్పించలేదని, భృతి చెల్లించలేదని ఆవేదన చెందుతున్నారు. తమ ఓట్లతో గద్దెనెక్కిన సర్కార్‌కు తగిన సమయంలో గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. వేలల్లో పేర్లు నమోదు ఉద్యోగం ఇవ్వలేకపోతే జీవన భృతి కింద ఏటా రూ.2 వేలు చెల్లిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచారు. ఈ మాటలను నమ్మిన 42 వేల మంది డీఆర్డీఏలో పేర్లు నమోదు చేసుకున్నారు. వీరంతా ఇప్పుడు భృతి కోసం ఎదురు చూస్తున్నారు. - ఉపాధి కల్పనా కార్యాలయంలో నమోదౌతున్న వారి సంఖ్య ఏటా 18 వేల వరకు ఉంది. రెండేళ్లలో 36 వేల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నప్పటికీ ఒక్కరికి కూడా ఉపాధి లేదు. ఇదిలా ఉంటే జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో మొత్తం 4.76 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగం, ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. అలా నమోదైనవారికి ఇంతవరకు భృతి చెల్లించాలన్నా నెలకు రూ.95 కోట్లు అవసరం. శ్రీకాకుళం టౌన్, పీఎన్. కాలనీ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాన్ని కూడా విస్మరించడం తగదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు రుణం, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని నమ్మించి.. వారిని మోసం చేసిన బాబు..అదే కోవలో తమను కూడా కలిపేశారని మండిపడుతున్నారు. ఇప్పటి వరకూ జిల్లాలో ఏ ఒక్కరికీ ఉపాధి కల్పించలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వక పోవడం దారుణమని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేండేళ్లయిన సందర్భంగానవనిర్మాణం దీక్ష పేరుతో హామీలను పక్కదోవ పట్టించేందుకు మరో ప్రతిజ్ఞ చేస్తుండడం విడ్డూరంగా ఉందంటున్నారు. జాబు కావాలంటే బాబు రావాలన్నారని, అరుుతే అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో పరిస్థితి ఇలా.. జిల్లాలో వేలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. వీరిలో డిగ్రీలు, పీజీలు, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఇతరత్రా కోర్సులు చేసిన వారు చాలామంది ఖాళీగా ఉన్నారు. వీరంతా ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మారు. ఉద్యోగం వస్తోందని, ఉద్యోగం, ఉపాధి లేకపోతే కనీసం నెలకు రెండు వేల రూపాయల చొప్పున భృతి అందుతోందని ఆశించారు. నిజమని భావించి ఓట్లు గుమ్మరించారు. అరుుతే అధికారంలోకి వచ్చిన తరువాత వాగ్దానానికి పాతరేశారు. దీంతో ఉపాధి లేక, భృతి అందక బతుకు తెరవు కోసం చాలామంది వలసబాట పడుతున్నారు. 18 ఏళ్ల వయసు రాగానే రాజ్యాంగ బద్ధంగా ఓటుహక్కును కల్పిస్తున్న ప్రభుత్వం ఉపాధి కల్పనపై మాత్రం శ్రద్ధ చూపడం లేదు. ఏటా ఉద్యోగాల ఖాళీల సంఖ్య పెరిగినా వాటిని భర్తీ చేయడం లేదు. బీటెక్, ఎంటెక్ పూర్తిచేసుకున్న సాంకేతిక విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారు. జిల్లా నుంచి అధికారిక లెక్కల ప్రకారం ఆరువేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉపా ధి లేక నిరుద్యోగులుగా ఉన్నారు. రెండేళ్లలో అన్ని తరగతుల నుంచి డీఆర్డీఏ పరిధిలో పేర్లు నమోదు చేసుకున్న యువత మరో 42 వేల మం ది ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నారు. అయితే 1.16 లక్షల మంది నిరుద్యోగు లు ఉన్నట్టు అనధికార లెక్కల ప్రకారం తెలుస్తోంది. మరికొంత మంది బాబును నమ్మడం మానేసి ఉపాధినిచ్చే శిక్షణ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రాబ్యాంకుతోపాటు అనేక శిక్షణ సంస్థలు జిల్లాలో ఏటా 14 వేల మందికి మెళకువలు నేర్పి ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారు. ఇంజినీరింగ్ పట్టభద్రుల పరిస్థితి ఇలాఉంటే బీఎడ్, ఇతర కోర్సులు పూర్తిచేసుకున్న వారిసంఖ్య జిల్లాలో లక్షల్లో ఉన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాల నియూమకం విషయూనికి వస్తే... 2014 డీఎస్సీ నియామకాలే ఇప్పటికీ పూర్తి చేయలేదు. యూనియన్ పబ్లిక్ సర్వీసుకమిషన్ నోటిఫికేషన్ జారీలో అలసత్వం కొనసాగుతోంది. -
పట్టభద్రులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి
తెలంగాణ పట్టభద్రుల సంఘం డిమాండ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని తెలంగాణ పట్టభద్రుల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారం జరిగిన రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో పట్టభద్రుల సమస్యలకు సంబంధించి పలు తీర్మానాలు చేసినట్లు సంఘం అధ్యక్షుడు కె.లక్ష్మయ్య తెలిపారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ విభాగాల్లో పదేళ్లుగా పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా రాజకీయ నాయకులకు కూడా పదవీ విరమణ వయో పరిమితిని విధించాలని పేర్కొన్నారు. ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులకు పదో తరగతి కనీస విద్యార్హతగా నిర్ణయించాలని కోరారు. చట్ట సభలకు ఎన్నికైన వ్యక్తి రాజీనామా చేస్తే తిరిగి ఎన్నికలకు బదులు తర్వాత అధికంగా ఓట్లు పొందిన వ్యక్తి ఎన్నికైనట్లుగా ప్రకటించాలని సంఘం ఏకగ్రీవంగా తీర్మానించినట్లు ఆయన తెలిపారు. -
భవితకు భంగపాటు
సీఆర్డీఏలో శిక్షణ పొందిన 113 మంది విద్యార్థులు ఉద్యోగాలు ఇవ్వకపోడమేగాక తాత్కాలిక రాజధాని నిర్మాణంలోనూ వీరికి మొండిచెయ్యే.. విద్యార్థులకు అండగా ఉంటామన్న ఎమ్మెల్యే ఆర్కే అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం..ఉద్యోగం రాని నిరుద్యోగులకు ప్రతి నెలా రూ. 2 వేలు నిరుద్యోగ భృతి ఇదీ ఎన్నికలకు ముందు గ్రామ గ్రామాన టీడీల నాయకులు వేసి హామీల గాలం..రాజధాని ప్రాంతంలో వారికైతే అమరావతి నిర్మాణంలో భాగస్వాములను చేయడంతోపాటు ఉద్యోగమిచ్చి ఉపాధి పట్టం కడతాం..ఇదీ నిరుద్యోగుల భవితపై ఆశలు రేపుతూ నాయకులు పలికిన చిలక పలుకులు..తీరా చూస్తే ఉద్యోగాలూ లేవు..రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యమూ లేదు..కేవలం దక్కింది మాత్రం ముద్ద అన్నం పెట్టని తూతూమంత్రం శిక్షణ ఒక్కటే.. మంగళగిరి: సీఆర్డీఏ అధకారుల ప్రచారాన్ని ఏపీఎస్ఎస్డీసీ(ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) అధికారుల హామీలను నమ్మిన 113 మంది బీటెక్, ఎంసీఏ విద్యార్థులు 2015లో ఆరు నెలల శిక్షణకు హాజరయ్యారు. శిక్షణ కోర్సుల వారీ(సివిల్, మెకానిక్, ఐటీ, సీఎస్)గా ఉంటుందని అంతర్జాతీయ కంపెనీలతో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. శిక్షణ పూర్తవగానే సీఆర్డీఏలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగంపై ఆశతో అప్పటికే చేస్తున్న ఉద్యోగాలు సైతం వదులుకుని శిక్షణలో చేరారు. తొలుత నాగార్జున యూనివర్సిటీ శిక్షణ ఇచ్చిన అధికారులు రిషితేశ్వరి ఘటనతో శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలోని గురుకులంలోకి మార్చారు. నెలలు గుడుస్తున్నా ఆశించిన కంపెనీలు కోర్సులు వారీగా శిక్షణ ఇవ్వ లేదు. మరో వైపు శిక్షణ పూర్తి చేసుకున్న యువకులకు ఉద్యోగ అవకాశాలు రాకపోవడంతో ఆగ్రహం చెంది తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. దీంతో కంగుతిన్న అధికారులు తాము సీఆర్డీఏలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదని, ఏపీఎస్ఎస్డీసీ ప్రకటనలో తప్పు దొర్లిందని తాపీగా సెలవిచ్చారు. దీంతో హతాశులైన నిరుద్యోగులు అధికారుల తీరుపై మండిపడ్డారు. శిక్షణ పొందిన కాలానికి స్టైఫండ్ ఇవ్వలేదని, ఏడాది కాలన్ని కోల్పోయామని విన్నవించినా వీరి రోదన ఆలకించే వారే కరువయ్యూరు. కనీసం వివిధ విభాగాల్లో శిక్షణ పొందిన తమకు తాత్కాలిక రాజధాని నిర్మాణంలోనైనా అవకాశం కల్పించాలంటున్న వారి అభ్యర్థననూ పక్కన పెట్టారు. ఇదేనా రాజ ధాని విద్యార్థులపై ప్రభుత్వాన్నికున్న ప్రేమంటూ మండిపడుతున్నారు. ప్రైవేటు ఉద్యోగం వదిలేసి వచ్చా బీటెక్ పూర్తరుుంది. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ సీఆర్డీఏ ప్రకటనతో ఇక్కడ శిక్షణకు వచ్చా. కోరుకున్న కోర్సులో శిక్షణ ఇస్తామని చెప్పిన అధికారులు ఎలక్ట్రికల్ వైరింగ్‌లో శిక్షణ ఇచ్చారు. రాజధాని నిర్మాణంలో ఎలక్ట్రికల్ విభాగంలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే అనుభవం అడిగారు. ప్రభుత్వం నిరుద్యోగులకు మోసం చేశాయి. - ముదిగొండ మధుప్రసాద్ శిక్షణ పూర్తరుునా పట్టించుకోలేదు బీటెక్ ఈసీ పూర్తి చేసి, సీఆర్డీఏ శిక్షణలో ఐటీఐ సివిల్‌లో శిక్షణ తీసుకున్నా. ఏడాది కాలం శిక్షణలో స్టైఫండ్ ఇవ్వడంతోపాటు శిక్షణ పూర్తయిన వెంటనే ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పారు. రాజధానిలో ప్రభుత్వం చెప్పేది ఏది చేయడం లేదు. అనేక మంది శిక్షణ తీసుకుని ఖాళీగా ఉంటున్నాం. - సురేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోంది రాజధానిలో రైతులనేగాక ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం మోసం చేస్తోంది. శిక్షణ పేరుతో యువకుల భవిష్యత్తును నాశనం చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న యువకులకు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. శిక్షణ ఇచ్చిన ప్రభుత్వమే తాత్కాలిక రాజధాని నిర్మాణంలో అనుభవం అడ గడమేమిటి. యువకులకు అండగా నిలిచి వారికి న్యాయం జరిగే వరకూ పోరాడతాం. - ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), ఎమ్మెల్యే -
భృతికి మంగళం!
► నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ► ఎన్నికల హామీపై మాట తప్పిన ప్రభుత్వం ► నిరుద్యోగ భృతిపై దోబూచులాట ► మంత్రి అచ్చెన్నాయుడు తీరుపై సర్వత్రా విమర్శలు ► జిల్లాలో 10 లక్షల మంది నిరుద్యోగులు ► నోటిఫికేషన్ల కోసం రెండేళ్లుగా ఎదురుచూపులు ⇒ ఎన్నికల హామీలకు అధికార పార్టీ తిలోదకాలిస్తోంది. రోజులు ⇒ ఎన్నికల హామీలకు అధికార పార్టీ తిలోదకాలిస్తోంది. రోజులుగడిచే కొద్దీ.. అలాంటి హామీలు ఏవీ తామివ్వలేదంటూ ⇒ ఎన్నికల హామీలకు అధికార పార్టీ తిలోదకాలిస్తోంది. రోజులుదాటవే స్తోంది. ఏరు దాటాక తెప్ప ⇒ ఎన్నికల హామీలకు అధికార పార్టీ తిలోదకాలిస్తోంది. రోజులు తగలేసిన చందంగా.. మంత్రులు ఒక్కో హామీ నుంచి తప్పుకోవడం ⇒ ఎన్నికల హామీలకు అధికార పార్టీ తిలోదకాలిస్తోంది. రోజులుచూస్తే ప్రజలను ఎంతగా మోసగించారో అర్థమవుతోంది. మొన్న తాకట్టు బంగారం.. నిన్న నిరుద్యోగ భృతి.. నేడు మరే ⇒ ఎన్నికల హామీలకు అధికార పార్టీ తిలోదకాలిస్తోంది. రోజులుహామీకి మంగళం పాడతారోననే చర్చ జరుగుతోంది. నమ్మిన జిల్లాలోని 8.50 లక్షల కుటుంబాలు, 10లక్షల మంది నిరుద్యోగులు తాము మోసపోయామని ఆవేదన చెందుతున్నారు. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగులనూ బజారున పడేశారు. జిల్లాలో రోజురోజుకీ నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచింది. ఈ రెండేళ్లలోనే ఏకంగా 2 లక్షల మంది నిరుద్యోగులు అదనంగా తయారయ్యారు. వీరితో పాటు అప్పటికే ఉన్న నిరుద్యోగులను కలుపుకుంటే జిల్లాలో వీరి సంఖ్య ఏకంగా 10 లక్షల పైమాటే. బాబు హామీ అమలుకు వీరందరూ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త నోటిఫికేషన్లను విడుదల చేయలేదు. కేవలం కొద్ది మంది అంగన్వాడీలను, బహుళసేవ వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించడం మినహా ఎలాంటి నోటిఫికేషన్లను జారీ చేయలేదు. వాస్తవానికి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో లక్షా 4 వేల మంది నిరుద్యోగులుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే, పేర్లను నమోదు చేసుకుని వారు ఇంతకు పది రెట్లు ఉన్నారు. ఈ లెక్కన జిల్లాలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల వేటలో రోడ్లపై తిరుగుతున్నారు. వీరంతా ఇప్పుడు తమకు ఉద్యోగాలైనా చూపించాలని.. లేనిపక్షంలో హామీ మేరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రైవేటు ఉద్యోగాలూ లేవు రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా ప్రభుత్వ దృష్టి అంతా గుంటూరు, కృష్ణా జిల్లాలకే పరిమితమయింది. జిల్లాలో ఏకంగా 30 వేల ఎకరాల్లో భారీ పారిశ్రామిక హబ్ వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇప్పటివరకు ఒక్క పరిశ్రమనూ తీసుకురాలేకపోయింది. కొత్తగా ఒక్క ఉద్యోగమూ రాలేదు. ఫలితంగా అటు ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు వెలువడక.. ఇటు ప్రైవేటు ఉద్యోగాలూ లేక నిరుద్యోగులు అల్లాడుతున్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామనలేదని, ప్రైవేటు ఉద్యోగాలు అని అసెంబ్లీ సాక్షిగా ప్రవచించిన ముఖ్యమంత్రి... ప్రైవేటు ఉద్యోగాలనూ కల్పించడంలో విఫలమయ్యారు. ఉన్న ఉద్యోగమూ ఊడగొట్టారు కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలను కూడా ఊడగొట్టారు. ఈ విధంగా జిల్లావ్యాప్తంగా మొత్తం 942 మంది ఉద్యోగాలు కోల్పోయారు. హౌసింగ్ శాఖలో అవుట్సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లు 278 మందిని, 141 మంది ఆరోగ్యమిత్రలు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లు సుమారు 400 మంది కాస్తా పని పోయి రోడ్డున పడ్డారు. ఇక మునిసిపాలిటీల్లో జిల్లావ్యాప్తంగా 10 మంది సీఎల్ఆర్లను (క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్స్) కూడా ప్రభుత్వం తొలగించింది. ఇక ఆయుష్ విభాగంలో 113 మందిని ఇళ్లకు పంపించారు. వీరంతా ఇప్పుడు ఉద్యోగం కోల్పోయి.. కొత్త ఉద్యోగాల కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది. -
ఉద్యోగ ఉరి
♦ అసెంబ్లీ సాక్షిగా ఇన్ని అబద్ధాలా...! ♦ నిరుగ్యోగ భృతి ఇస్తామని చెప్పి ఇప్పుడు తప్పించుకోవడమా ♦ అసలు ఆ పథకమే లేదనడం సిగ్గుమాలిన వ్యవహారం ♦ బాబు వచ్చినా జాబు రాలేదు ... నిరుద్యోగ భృతి ఊసేలేదు... మరోసారి బాబు దగా ‘ఇంటికో ఉద్యోగం రావాలంటే బాబు రావాలి ... ఉద్యోగం ఇవ్వలేకపోతే మీరు ఏమీ చదువుకోకపోయినా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి రావాలంటే బాబు రావాలి... తమ్ముళ్లూ మీ కలలు సాకారం చేయబోతున్నా’ 2014 ఎన్నికల సమయంలో ఈ రకమైన ప్రచారంతో ఊదరగొట్టి జనం ఓట్లు పోగేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఏలుబడి రెండేళ్లు కావస్తున్నా ఇంత వరకు ఇంటికో ఉద్యోగం ఊసే లేదు. ఉద్యోగం ఇవ్వకపోయినా నెలకు రూ.2 వేలు భృతైనా అందుతుందని ఆశపడిన నిరుద్యోగులకు నిరాశ తప్పడం లేదు. చంద్రబాబు ఎన్నికల హామీలు నమ్మిన జిల్లాలోని సుమారు 72 వేల నిరుద్యోగులు అధికారికంగా ఉపాధికల్పన కార్యాల యంలో ఇప్పటి వరకూ నమోదు చేసుకుని మోసపోయామని ఆవేదన చెందుతున్నారు. వైఎస్సార్ సీపీ గళంతో బయటపడిన బండారం నిండు శాసన సభ ... వైఎస్సార్ సీపీ జగన్మోహన్ రెడ్డి అనర్గళ ప్రసంగం ... రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యపై ప్రశ్నల పరంపర ... ‘నేను అధికారంలోకి వస్తేనే మీకు ఉద్యోగాలు వస్తాయి... మీ కలల కు భరోసా నేనంటూ’ చంద్రబాబు ఇచ్చిన దగాకోరు హామీని గుర్తు చేస్తున్న వేళ... పచ్చి అబద్ధపు పదజాలం తో ‘పచ్చ’ సమూహం ఎదురు దాడి. ప్రశ్నోత్తరాల సమయం లో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు అడిగిన మరో ప్రశ్నకు కార్మిక, ఉపాధి శాఖల మంత్రి అచ్చెన్నాయుడు లేచి ‘నిరుద్యోగ భృతి పథకం’ మా పరిశీలనలోనే లేదంటూ నిస్సిగ్గుగా బుకారుుంపులకు దిగారు. పూర్తి రుణమాఫీ హామీ ఇవ్వలేదంటూ చంద్రబాబు రెండు నెలల కిందట మాట మార్చిన తీరు మరిచిపోక ముందే మరోసారి మడం తిప్పడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాబు మాటలు ఒట్టి బూటకం : ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. నిరుద్యోగులకు హామీ ఇచ్చిన విధంగా బాబు వస్తే జాబు వస్తుందని ఆశించి మోసపోయాం. బీటెక్ పూర్తి చేసి 3 సంవత్సరాలైంది. ఇప్పటి వరకు ఉద్యోగం రాలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగభృతి రూ.2 వేలు ఇస్తామని ప్రకటించారు. అది కూడా బూటకమే. - షేక్ హబీబున్నీసా, బీటెక్ విద్యార్థిని, వైపాలెం అబద్దాల్లో చంద్రబాబు గిన్నిస్ రికార్డ్ ఎన్నికలకు ముందు ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానంటూ ప్రకటించిన చంద్రబాబు నేడు అసెంబ్లీలో నిరుద్యోగ భృతి పథకం లేదని ప్రకటించడం దారుణం. నిత్యం అబద్దాలు చెబుతూ చంద్రబాబు ప్రపంచ రికార్డు బద్దలు కొట్టేందుకు యత్నిస్తున్నారు. వెంటనే నిరుద్యోగులకు రూ.2వేలు భృతి ప్రకటించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. - మారెడ్డి రామకృష్ణారెడ్డి, నిరుద్యోగి, ఒంగోలు సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జాబు రావాలంటే బాబు రావాలని ఎన్నికల ముందు పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ చేసిన హడావిడి చూసి నిరుద్యోగులు బాబుకు ఓట్లు వేసి మోసపోయారు. చంద్రబాబు వచ్చిన తర్వాత కొత్త ఉద్యోగాలు రావడం సంగతి ఎలా ఉన్నా వేల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయి. అధికారంలోకి వచ్చి సుమారు రెండేళ్లు కావస్తున్నా కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా రాకపోగా ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి వచ్చింది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తమ ఉద్యోగాలను కాపాడుకునేందుకు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది. బాబు మారాడని నమ్మి ఓట్లు వేసిన ఉద్యోగులు, నిరుద్యోగులు కూడా మోసపోయారు. ⇔ కాంట్రాక్టు ఉద్యోగాలు చేస్తున్నవారు తమ ఉద్యోగాలు పర్మినెంట్ అవుతాయని ఆశలు పెట్టుకుంటే ఉన్న ఉద్యోగాలు పోయాయి. ఇంటికో ఉద్యోగం అంటూ ప్రచారం చేసినా అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో మూడు నుంచి నాలుగువేల మంది ఉద్యోగులను రోడ్డున పడేశారు. ఉపాధి హామీ పథకంలో ఫీల్ట్ అసిస్టెంట్లను తొలగించారు. ⇔ స్కూల్క్ రేషనలైజేషన్ చేయడం రాజీవ్ విద్యామిషన్ ద్వారా బీఈడీ అర్హతతో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్‌ను తొలిగించి వారి స్థానంలో ఉన్న టీచర్లను నియమించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ⇔2011లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించిన గ్రూప్- 1, గ్రూప్- 2, గ్రూప్ -4 నోటిఫికే షన్, 2014 డీఎస్సీ నోటిఫికేషన్ తప్ప ఎటువంటి నియమకాలు చేపట్టలేదు. సుమారు మూడేళ్లుగా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు చాలా మందికి వయోఃపరిమితి దాటిపోతుంది. ⇔ దాదాపు నాలుగు సంవత్సరాల నుంచి పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, కానిస్టేబుళ్లు, గ్రూప్-4, గ్రూప్-2 వంటి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు రావడం లేదు. ⇔ఎప్పటి నుంచో వాయిదా పడి మొత్తానికి నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఫలితాలు వచ్చినా, ఇంతవరకూ నియామకాలు జరగలేదు. సర్టిఫికేట్ల వెర్ఫికేషన్కే పరిమితమయ్యారు. ⇔నిరుద్యోగులకు నెలనెలా జీవనభృతి ఇస్తామని నోటి మాట కాకుండా మ్యానిఫెస్టోలో ఐదో వాగ్దానంగా పొందుపరిచారు.అధికారికంగా నమోదు చేసుకున్న వారికి నిరుద్యోగ భృతి ఇవ్వాల్సి వచ్చినా రెండేళ్లలో రూ.288 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకూ నిరుద్యోగ భృతి ఊసే చంద్రబాబు ఎత్తడం లేదు. రెండురోజుల క్రితం ప్రకటించిన బడ్జెట్లో కూడా దీని ఊసు లేదు. ⇔ రేషన్డీలర్లను కూడా రాజకీయ కారణాలతో తొలగించారు. బాబు వచ్చిన తర్వాత రోడ్డున పడ్డ ఉద్యోగులు ప్రత్యామ్నాయ ఉద్యోగాలు దొరకక చిన్నా, చితక పనులు, కూలీపనులు చేసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి. ⇔ఐకేపీ కింద సేంద్రీయ వ్యవసాయం చేసే క్లస్టర్ యాక్టివిస్ట్, విలేజ్ యాక్టిస్‌లుగా ఉన్న వారు ఉద్యోగాలు కోల్పోయారు. హౌసింగ్ కార్పొరేషన్లో ఇప్పట్లో గృహనిర్మాణాలు ఏమీ లేవంటూ మిమ్మల్ని భరించలేమంటూ అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్న వర్క్ ఇన్స్పెక్టర్లను, సర్వేయర్లు, డేటా ఎంట్రీ అపరేటర్లను తొలగించారు. వీళ్లకు ప్రభుత్వం జీతం ఇవ్వకపోయినా లబ్ధిదారుల రుణాల నుంచి రూ.5వేలు కట్ చేసి జీతం ఇస్తారు. అలాంటి వీరిని కూడా తొలగించారు. -
నిరుద్యోగుల కు నిలువెత్తు మోసం
► అధికారంలోకి వస్తే ఇంటికో జాబు ఇస్తామని చంద్రబాబు ప్రకటన ► ఉద్యోగం వచ్చే దాకా నెలకు రూ.2వేలు భృతి ఇస్తామని హామీ ► గత 22 నెలల్లో ఒక్క ఉద్యోగమూ ఇవ్వకపోగా...2,705 మందిని తీసేసిన వైనం ► నిరుద్యోగ భృతిపై ఈ బడ్జెట్లోనూ ఎలాంటి ప్రకటనా లేదు ► ఆటోడ్రైవర్లు, కూలీలుగా జీవనం సాగిస్తున్న నిరుద్యోగులు ► ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపాటు (సాక్షిప్రతినిధి, అనంతపురం) ‘ఇంటికో ఉద్యోగం రావాలంటే బాబు రావాలి. ఉద్యోగం ఇవ్వలేకపోతే మీరు ఏమీ చదవక పోయినా నెలకు రూ. 2 వేల నిరుద్యోగ భృతి రావాలంటే బాబు రావాలి..’ ‘‘ తమ్ముళ్లూ మీ కలలు సాకారం చేయబోతున్నా ’’ .... 2014 ఎన్నికల సమయంలో ఈ రకమైన ప్రచారంతో ఊదరగొట్టి జనం ఓట్లు పోగేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఏలుబడి రెండేళ్లు కావస్తున్నా ఇంత వరకు ఇంటికో ఉద్యోగం ఊసే లేదు. ఉద్యోగం ఇవ్వక పోయినా నెలకు రూ.2 వేల భృతి అయినా అందుతుందని ఆశపడిన నిరుద్యోగులకు నిరాశ తప్పడం లేదు. చంద్రబాబు ఎన్నికల హామీలను నమ్మిన జిల్లాలోని 9.53లక్షల కుటుంబాలు.. 56వేల మంది నిరుద్యోగులు తాము మోసపోయామని ఆవేదన చెందుతున్నారు. నిరుద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై ప్రభుత్వానికి ఏ మేరకు చిత్తశుద్ధి ఉందో.. వారి జీవితాల పట్ల ఎంత బాధ్యతగా వ్యవహరిస్తోందో ఈ అసెంబ్లీ సమావేశాలు స్పష్టం చేస్తున్నాయి. టీడీపీ అధికారంలోకి వస్తే కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని, ఉద్యోగం ఇచ్చేదాకా నెలకు రూ.2వే ల భృతి ఇస్తామని ప్రకటించారు. దీంతో ఈ వర్గాలు టీడీ పీకి అనుకూలంగా ఓటేశాయి. ఈ వర్గాల అండతోనే చంద్రబాబు సీఎం అయ్యారు. ఇదే వారి పాలిట శాపమైంది. కొత్త ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి ఇవ్వడంలో విఫలం కావడంతో పాటు పదేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న వారిని సైతం తొలగించారు. అటకెక్కిన నిరుద్యోగ భృతి హామీ చంద్రబాబు అధికారంలోకి రావడంతో నిరుద్యోగులకు నెలకు రూ.2 వేల భృతి వస్తుందని ఆశించారు. జిల్లాలో 56 వేల మంది నిరుద్యోగులు ఉపాధి కల్పన కార్యాలయంలో రిజిష్టర్ చేయించుకున్నారు. మరో 27 వేల మంది రిజిస్ట్రేషన్ రెన్యూవల్ చేయించుకోని వారున్నారు. వీరు కాకుండా మరో ఆరు లక్షలమంది దాకా ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకోని వారు ఉంటారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. మొదటి బడ్జెట్లోనే భృతిపై ప్రకటన చేస్తారని భావించారు. అయితే.. ఆ ఊసే లేదు. కనీసం 2016 బడ్జెట్లోనైనా ప్రకటన చేస్తారని అనుకున్నారు. ఈ బడ్జెట్లోనూ నిరుద్యోగులను విస్మరించారు. దీంతో విపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఎన్నికల్లో హామీలిచ్చి ఇప్పుడు మాట తప్పడం ఏంటి? ఓ వైపు ఉద్యోగాలు తొలగిస్తున్నారు. మరో వైపు నిరుద్యోగులకు భృతి ఇవ్వడం లేదు’ అంటూ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. దీనిపై మంత్రి అచ్చెంనాయుడు స్పందిస్తూ... ఏమాత్రం బాధ్యత లేకుండా చులకనగా మాట్లాడారు. ఐదేళ్లు అధికారంలో ఉంటామని, మొదటి సంవత్సరం ఇస్తామో లేక చివరి ఏడాది ఇస్తామోననే భావం వచ్చేలా మాట్లాడారు. ముఖ్యమంత్రి కూడా నిరుద్యోగభృతిపై మాట్లాడలేదు. మొత్తమ్మీద అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వతీరును చూస్తే... నిరుద్యోగులకు భృతి ఇచ్చే ఆలోచన చేయడం లేదని స్పష్టమవుతోంది. ఈక్రమంలో నిరుద్యోగులంతా ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు. భృతి ఇచ్చేదాకా విశ్రమించేది లేదంటూ పోరాటానికి సిద్ధమవుతున్నారు. -
పోయాం... మోసం...
* నిరుద్యోగ భృతిపై మాటమార్చిన సర్కారుపై మండిపాటు * నమ్మి నిలువునా మోసపోయామంటున్న యువత * ఉపాధి లేదు సరికదా... భృతికూడా లేదనడం దారుణం... ఉద్యోగం రాకున్నా... భృతిపై ఆశపడ్డా... బాడంగికి చెందిన ఈమె పేరు అనకాపల్లి ఇందిర. గుంటూరులో ఈమె బీపీఈడీని 2015లో పూర్తి చేశారు. దురదృష్టం పీఈటీల నియామకాన్ని ఈ సర్కారు నిలిపేసింది. ఇక చేసేది లేక కానిస్టేబుల్ ఉద్యోగంకోసం యత్నిస్తున్నారు. ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీ నిజమే అనుకున్నారు. అసలు విషయం తెలుసుకుని ఇప్పుడు బాధపడుతున్నారు. ఆమె సాక్షితో మాట్లాడుతూ ఉద్యోగం రాకపోయినా కనీసం నెలకు 2వేలు భృతి వస్తుందని నమ్మాననీ, దానితోనైనా ఏవైనా ప్రయత్నాలు చేసుకోవచ్చని భావించాననీ... ఇప్పటికీ ప్రతీదానికీ తల్లితండ్రులపైనే అధారపడాల్సి వస్తోందనీ వాపోయారు. ‘ఇంటికో ఉద్యోగం రావాలంటే బాబు రావాలి. ఉద్యోగం ఇవ్వలేక పోయినా... మీరు ఏమీ చదువుకోక పోయినా... నెలకు రూ. 2 వేలు నిరుద్యోగ భృతి కావాలంటే బాబు రావాలి.’ - ఎన్నికల్లో వాడవాడలా టీడీపీ నేతలు చేసిన ప్రచారం. ‘నిరుద్యోగ భృతి పథకమే లేదు... మరి అలాంటపుడు ఎంత భృతి చెల్లించామన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు.’ - నిండు సభలో మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టీకరణ. పరస్పర విరుద్ధమైన ఈ రెండు ప్రకటనలూ జిల్లాలో కలకలం సృష్టించాయి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ... నెరవేర్చకపోగా... అలాంటిదేమీ లేదని మంత్రి చెప్పడాన్ని అంతా తప్పుపడుతున్నారు. నిలువునా మోసపోయామని వాపోతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: సర్కారు మోసం మరోసారి బట్టబయలైంది. నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేసిన వైనం తేటతెల్లమైపోయింది. ఇంటికో ఉద్యోగం ఇస్తామనీ... నిరుద్యోగ భృతి కల్పిస్తామని చేసిన వాగ్దానాలు నమ్మిన జిల్లాలోని 5లక్షల85వేల కుటుంబాలు, 3లక్షల మంది నిరుద్యోగులు మోసపోయామంటూ ఆవేదన చెందుతున్నారు. కొత్త ఉద్యోగాలిస్తానని నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉద్యోగాలు ఆవ్వలేదు సరికదా ఉన్న ఉద్యోగుల్ని ఊడపీకారు. రైతులకు ఎంతో సేవలందించిన ఆదర్శరైతులను అర్ధంతరంగా తొలగించారు. ఉపాధి వేతనదారులకు పని చూపించిన క్షేత్ర సహాయకులను అకారణంగా తీసేశారు. ఇంజినీర్లతో కలిసి పనిచేసిన వర్క్ ఇన్స్పెక్టర్లను రోడ్డున పడేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులనైతే ఉన్నపళంగా ఆపేశారు. వారంతా ఇప్పుడు కూలీలుగా, ఆటో డ్రైవర్లుగా, సెక్యూరిటీ గార్డులుగా మారి దయనీయంగా బతుకుతున్నారు. నిరుద్యోగ భృతిపై మాటమార్చిన సర్కారు ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని నమ్మించారు. ఒక్కొక్కరికీ రూ. 2వేలు చొప్పున నెలకు భృతి అందిస్తామని ఆశ చూపారు. ప్రజలను భ్రమల్లోకి తీసుకెళ్లి ఓట్లేయించుకున్నారు. ఏరు దాటాక బోడి మల్లన్న అన్నట్టుగా పీఠమెక్కాక ఉద్యోగం లేదు. నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదు. ఇదేమంటే అసలు ఆ పథకమే లేదని మంత్రి అడ్డంగా బొంకేశారు. ప్రస్తుతం జిల్లాలో 5లక్షల 85వేల కుటుంబాలు ఉండగా అందులో 2లక్షల మంది వరకు నిరుద్యోగులున్నారు. వారంతా ఉద్యోగాల్లేక నానా అవస్థలు పడుతున్నారు. రోడ్డున పడ్డ 55వేల మంది కార్మికులు కొత్త ఉద్యోగాలు ఇవ్వడం లేదు. కనీసం వివిధ కంపెనీల్లో పనిచేస్తున్న కార్మికుల బతుకులకూ భరోసానివ్వడంలేదు. ప్రభుత్వ విధానాలతో జిల్లాలోని పరిశ్రమలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 10జూట్‌మిల్లులు ఇప్పటికే మూతపడటంతో 20వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. పిల్లల్ని పోషించలేక, చదివించుకోలేక కొందరు కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మరికొందరు ఆందోళనకు గురై హఠాన్మరణం చెందుతున్నారు. ఇక, ఫెర్రో పరిశ్రమలు పరిస్థితి మరింత దయనీయంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 12పరిశ్రమలు మూతపడ్డాయి. 25వేల మంది పనిలేక అలమటిస్తున్నారు. చిన్న చితకా పరిశ్రమలు మరో 20వరకు మూతపడ్డాయి. వీటిలో పనిచేసిన 10వేల మంది పనిలేక అవస్థలు పడుతున్నారు.దయనీయంగా బతుకుతున్నారు. మోసపోయిన నిరుద్యోగులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి కల్పిస్తారన్న ఆశతో గతంలో ఎన్నడూ లేని విధంగా గతేడాది ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నవారు గణనీయంగా పెరిగారు. దాదాపు 54వేల మంది జిల్లాలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో ఉన్నారు. కొత్త రిక్రూట్మెంట్ల కోసం వారంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ, ప్రభుత్వం ఒక్క ఉద్యోగం తీయలేదు. నిరుద్యోగ భృతికి సంబంధించి కనీసం మాట్లాటలేదు. ఎందుకింత మోసమని నిరుద్యోగులంతా మండిపడు తున్నారు. -
నిరుద్యోగులకు చంద్రబాబు టోపీ
నిరుద్యోగులకు చంద్రబాబు టోపీ ఎన్నికలపుడు బాబొస్తే జాబొస్తుందన్నారు ఉద్యోగం రాకపోతే రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు బడ్జెట్లో భృతి ఊసు కరువు ఉద్యోగాలివ్వక.. ఉన్నవీ తీసేశారు ‘ఇంటికో ఉద్యోగం రావాలంటే బాబు రావాలి. ఉద్యోగం ఇవ్వలేకపోతే మీరు ఏమీ చదవక పోయినా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తా.. తమ్ముళ్లూ మీ కలలు సాకారం చేయబోతున్నా’ 2014 ఎన్నికల సమయంలో ఈ రకమైన ప్రచారం ఊదరగొట్టి జనం ఓట్లు పోగేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటుచేసి రెండేళ్లు కావస్తున్నా ఇంత వరకు ఇంటికో ఉద్యోగం ఊసెత్తలేదు. ఉద్యోగం ఇవ్వక పోయినా నెలకు రూ.2 వేలు భృతి అయినా అందుతుందని ఆశపడిన నిరుద్యోగులకు నిరాశ తప్పడం లేదు. చంద్రబాబు ఎన్నికల హామీలు నమ్మిన జిల్లాలోని10,39,953 కుటుంబాలకు చెందిన నిరుద్యోగులు తాము మోసపోయామని ఆవేదన చెందుతున్నారు.. తిరుపతి: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట దేవుడెరుగు. ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారిని తొలగించి..వారి కుటుంబాలు వీధినపడేలా చేశారు’ అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది మంది యువకులు బాబు చేతిలో దగాపడ్డామని మథన పడుతున్నారు. ఉద్యోగం లేకపోయినా రూ.2000ల నిరుద్యోగ భృతి వస్తుందని ఆశపడి ఓట్లు వేశామని, ప్రస్తుతం ఆయన నట్టేట ముంచాడని మండిపడుతున్నారు. ఈ విషయమై బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. జిల్లాలో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వాపోతున్నారు. ఏటా జిల్లాలో దాదాపు లక్షమంది యువకులు వివిధ కోర్సులు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఏటేటా నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అందుకు ప్రత్యామ్నాయంగా ఉద్యోగాల భర్తీ మాత్రం జరగడం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే కొత్త పరిశ్రమలు ఏర్పాటై , ఉద్యోగ అవకాశాలు వచ్చేవని యువకులు పేర్కొంటున్నారు. ఆ దిశగా ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమైందని యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధిన పడ్డ కుటుంబాలు జిల్లాలో గత కొన్నేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది ఉద్యోగులను తొలగించి వారి కుటుంబాలు వీధిన పడేలా చేశారు. జిల్లాలో 2100 మంది ఆదర్శరైతులను ఇంటికి పంపారు. గృహనిర్మాణ శాఖలో 178 మంది ఉద్యోగులను తొలగించారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే 350 మంది ఫీల్డ్ అసిస్టెంట్లపై వేటు వేశారు. 200 మంది ఆరోగ్యమిత్రలను రోడ్డున పడేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని మోసం చేశారు. ఇలా ఉద్యోగాలు చేస్తున్నవారిని ఉన్న ఫళంగా తొలగించడంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నిరుద్యోగులను నట్టేట ముంచేశాడు చంద్రబాబు చదువుకున్న నిరుద్యోగులను నట్టేట్లో ముంచేశాడు. ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం చదువుకున్న అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక మమ్మల్ని పూర్తిగా ముంచేశాడు. ఎంతో ఆశతో ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూశాం. ఇప్పటికి మేం మోసపోయాం అని తెలుసుకుని జాబ్ సెర్చింగ్‌లో ఉన్నాం. - రాజారెడ్డి, బీటెక్, కమ్మినాయనిపల్లె, పెద్దపంజాణి మండలం. వాగ్దానం మరచిన సీఎం చంద్రబాబు ఉద్యోగం కాదు కదా కనీసం నిరుద్యోగ భృతి పొందలేని పరిస్థితి. ఎన్నికల వాగ్దానాలను అట్టహాసంగా చేసిన చంద్రబాబు ఆ తరువాత విస్మరించారు. ఎంఎస్సీ మైక్రో బయూలజీ, బీఈడీ పూర్తి చేసిన నాకు ఉద్యోగాశం రావడం గగనంగా ఉంది. ఉద్దరిస్తారని చదివించిన తల్లిదండ్రులకు ఏ సహకారవుూ అందించలేకుండా ఉన్నావునే ఆవేదన మిగిలింది. - అనూష నాగలాపురం మాట తప్పడం అన్యాయం నిరుద్యోగులకు రూ.2వేలు భృతి ఇస్తామంటూ చంద్రబాబు మాట తప్పడం అన్యా యం. టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసిన చాలా మంది అభ్యర్థులు గత డీఎస్సీలో ఉద్యోగాలు రాక నిరుత్సాహంతో ఉన్నారు. గతంలో జరిగిన డీఎస్సీ ఎంపికలలో రోస్టర్ పాయింట్లు అంటూ చాలా మంది అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకోలేదు. రోస్టర్ పద్ధతితో కాకుండా అర్హత సాధించిన వారికి ఉద్యోగం కల్పించాలి. - మహేష్, డీఎస్సీ అభ్యర్థి, చిత్తూరు నిరుద్యోగులుగానే ఉండిపోవాలేమో! ఎమ్మెస్సీ పూర్తి చేశాను. నా అర్హతకు తగ్గట్టుగా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించడం లేదు. నాలాగ ఎంతోమంది నిరుద్యోగులు జిల్లాలో ఖాళీగా ఉండాల్సిన దుస్థితి కలుగుతోంది. పేద కుటుంబంలో జన్మించి, వేలకు వేలు ఖర్చుపెట్టి చదివి, ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదు. -ఎన్.ఎస్.మోహన్, చిత్తూరు బాబు మాట నమ్మి మోసపోయాం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నమ్మి మోసపోయాం. ఎంఎస్సీ పూర్తిచేసి నాలుగేళ్లయింది. అప్పటినుంచి ఉద్యోగాల కో సం ఎదురుచూస్తున్నాం. చంద్రబాబు సీఎం అయ్యాక హమీ నెరవేరుస్తారని, ఉద్యోగాలు పొందగలమని ఆశించి భంగపడ్డాం.’’ - టీ.సురేంద్ర, నిరుద్యోగి, బి.కొత్తకోట యుువతను మోసగించారు ఎన్నికల సవుయుంలో ఇంటికో ఉద్యోగం ఇస్తావుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి రూ.2 వేలు ఇస్తావుని చెప్పారు. రెండేళ్లయినా ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదు. ఈ ఏడాది బడ్జెట్లో నిరుద్యోగ భృతి ఊసేలేదు. కార్మిక శాఖా వుంత్రి అచ్చెన్నాయుుడు ఆ పథకమే లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. యుువతను సైతం మోసం చేశారు. తగిన సంయంలో బుద్ధి చెబుతాం. - కొల్లేటి సురేష్, బీఎస్సీ, బీఈడీ, శ్రీకాళహస్తి -
నారా వంచన
బడ్జెట్లో ప్రస్తావనే లేదు ఎన్నికల హామీని గాలికొదిలేశారు అసెంబ్లీ సాక్షిగా.. అబద్ధాలు వల్లె వేశారు పాలక పార్టీ తీరుతో హతాశులైన నిరుద్యోగులు ‘ఇంటికో ఉద్యోగం రావాలంటే బాబు రావాలి. ఉద్యోగం ఇవ్వలేకపోతే మీరు ఏమీ చదవకపోయినా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి రావాలంటే బాబు రావాలి..’, ‘తమ్ముళ్లూ.. మీ కలలు సాకారం చేయబోతున్నా’ 2014 ఎన్నికల సమయంలో ఈ రకమైన ప్రచారంతో ఊదరగొట్టి జనం ఓట్లు పోగేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఏలుబడి రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకు ఇంటికో ఉద్యోగం ఊసే లేదు. ఉద్యోగం ఇవ్వక పోయినా నెలకు రూ.2 వేలు భృతి అయినా అందుతుందని ఆశపడిన నిరుద్యోగులకు నిరాశ తప్పడం లేదు. చంద్రబాబు ఎన్నికల హామీలను నమ్మిన జిల్లాలోని దాదాపు నాలుగు లక్షల మంది నిరుద్యోగులు తాము మోసపోయామని ఆవేదన చెందుతున్నారు. విజయవాడ : ‘నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తాం.. ఇవ్వని పక్షంలో నెలకు రూ.2 వేలు చొప్పున నిరుద్యోగ భృతిగా అందజేస్తాం..’ గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన మాటలివి. అంతేకాదు.. ఊరూరా తిరిగి ప్రతి సభలోనూ ఈ అంశాన్ని ప్రచారం చేశారు. ‘జాబు రావాలంటే.. బాబు రావాల్సిందే..’ అంటూ టీడీపీ నాయకులు, శ్రేణులు విస్తృత ప్రచారం నిర్వహించారు. సీఎం చంద్రబాబునాయుడు అప్పటి ఎన్నికల ప్రచారంలో ‘వివిధ ప్రాంతాల్లో పర్యటించిన సమయంలో పాదయాత్రలో నేను నిరుద్యోగుల కష్టాలు కళ్లారా చూశా. వారిని ఆదుకుంటా’ అని హామీ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు గడిచినా ఉద్యోగాలు భర్తీ చేయలేదు. నిరుద్యోగ భృతి అంశాన్నీ పక్కన పెట్టేశారు. అసెంబ్లీలో నిస్సిగ్గుగా... గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో నిరుద్యోగ భృతి అంశాన్ని కనీసం ప్రస్తావించలేదు. దీనిపై ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ నిలదీయగా, అసలు అలాంటి పథకమే లేదని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగావకాశాలు కల్పిస్తారని, లేదంటే నిరుద్యోగ భృతి అయినా ఇస్తారని ఎన్నో ఆశలతో ఎదురుచూసిన నిరుద్యోగులు టీడీపీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు హామీలు నమ్మి ఓట్లేశామని, అధికారంలోకొచ్చాక మాటమార్చేస్తున్నారని మండిపడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండటం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. వయోపరిమితి పెంచారు.. నోటిఫికేషన్ మరిచారు.. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 42 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటి భర్తీ చేసే నిమిత్తం నిరుద్యోగుల వయోపరిమితిని 38 నుంచి 40 సంవత్సరాలకు పెంచుతున్నట్లు ప్రభుత్వం 2014 సెప్టెంబరు 23న జీవో నంబరు 295ను జారీ చేసింది. ఈ ఉత్తర్వులు 2016 సెప్టెంబరు 30 వరకు అమలులో ఉంటాయని పేర్కొంది. ఈ జీవో ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలను క్రమపద్ధతిలో భర్తీ చేస్తారని ప్రకటించింది. ఈ జీవో విడుదలైనప్పటి నుంచి నేటి వరకు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక్క నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం జారీ చేయకపోవటం గమనార్హం. మరో ఆరు నెలల వ్యవధిలో ఈ జీవోకు కాలం చెల్లనుందని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు అంటున్నారు. గ్రూప్-1 నుంచి క్లాస్-4 ఉద్యోగాల వరకు భర్తీ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుందని నిరుద్యోగులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఒక్క నోటిఫికేషనూ విడుదల చేయకపోవటంతో తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. లక్షలాది మంది నిరుద్యోగులు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో 71,729 మంది తమ పేర్లను నిరుద్యోగులుగా నమోదు చేసుకున్నారు. వీరిలో పదో తరగతి చదివినవారు 12,227 మంది, ఇంటర్మీడియెట్ చదివినవారు 12,962 మంది, డిగ్రీ చదివినవారు 15,274 మంది, ఐటీఐ, డిప్లమో కోర్సులు చదివినవారు 30,103 మంది ఉన్నారు. ఉపాధి కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోని నిరుద్యోగులు మూడు లక్షల మంది ఉంటారని అంచనా. ఇంజనీరింగ్ డిగ్రీతో పాటు ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ వంటి పీజీ కోర్సులు చదివినవారు సైతం ఉపాధి అవకాశాలు లేక రోడ్ల వెంట తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇవేమీ పట్టించుకోని ప్రభుత్వం నిరుద్యోగులను గాలికొదిలేసి తమ పబ్బం గడుపుకుంటోందనే విమర్శలు వస్తున్నాయి. పీజీ కోర్సులు చదివినవారు విశాఖపట్నంలోని ఉపాధి కల్పన కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. కొంతకాలంగా ఈ ప్రక్రియ కూడా నిలిపివేశారు. -
సర్కార్ దగా !
‘ఇంటికో ఉద్యోగం రావాలంటే బాబు రావాలి. ఉద్యోగం ఇవ్వలేక పోయినా.. మీరు ఏమీ చదువుకోపోయినా నెలకు రూ. రెండు వేలు నిరుద్యోగ భృతి రావాలంటే బాబు రావాలి’. తమ్ముళ్లూ మీ కలలు సాకారం చేయబోతున్నా’..ఇదీ 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు పలికిన చిలక పలుకులు. జాబు రావాలంటే బాబు రావాలి అంటూ ఎక్కడ చూసినా ప్రకటనలు.. టీవీల్లో ఒకటే హోరు.. గోడలపై రాతలు.. ఈ రకమైన ప్రచారంతో ఊదరగొట్టి జనం ఓట్లు పోగేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఏలుబడి రెండేళ్లు కావస్తున్నా ఇంత వరకు ఇంటికో ఉద్యోగం ఊసే లేదు. ఉద్యోగం ఇవ్వక పోయినా నెలకు రూ.రెండు వేలు భృతి అయినా అందుతుందని ఆశపడిన నిరుద్యోగులకు బాబు తనదైన శైలిలో ఝలక్ ఇచ్చారు. రాష్ర్టంలో నిరుద్యోగ భృతి అనే పథకమే లేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పించారు. దీంతో నిరుద్యోగులకు నిరాశ తప్పడం లేదు. ఉద్యోగం లేదు..కనీసం భృతి అయినా ఇస్తారేమోనని కుటుంబసభ్యులు ఆశపడ్డారు. ఆ ఆశని సర్కార్ వమ్ము చేసింది. చంద్రబాబు ఎన్నికల హామీలు నమ్మిన జిల్లా నిరుద్యోగులు తక్షణమే ఆయన గద్దె దిగాలంటూ డిమాండ్ చేస్తున్నారు. * నిరుద్యోగులకు నెలకు రూ.2 వేలు భృతి అంటూ హామీ * ఎన్నికల సమయంలో వాగ్దానం * అసెంబ్లీ సాక్షిగా మాటమార్చిన మంత్రి * పోరాటం తప్పదని హెచ్చరిక * జిల్లాలో 1.50 లక్షల నిరుద్యోగులు * మండిపడుతున్న నిరుద్యోగులు * నిరుద్యోగ భృతిపై మోసపూరిత ప్రకటన సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : నిరుద్యోగ భృతిపై మాటమార్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై నిరుద్యోగులు మండిపడుతున్నారు. ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా నయవంచనకు పాల్పడడం ఎంతవరకూ సమంజసమని నిలదీస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తగిన గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నారు. జిల్లాలో లక్షన్నర మందికిపైగా నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారు. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్లు విడుదలవుతాయేమోనని కళ్లల్లో ఒత్తులు వేసుకుని నిరీక్షిస్తున్నారు. తమ పిల్లలకు ఉద్యోగాలొస్తే బతుకులు బాగుపడుతాయని సుమారు మూడు లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. కనీసం భృతి కల్పిస్తే కొంతయినా ఆదుకున్నట్టు ఉంటుందని నిరుద్యోగుల తల్లిదండ్రులంటున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో గురువారం సాక్ష్యాత్తూ జిల్లా మంత్రే నిరుద్యోగ భృతిపై మాట మార్చడంపై తాము పూర్తిగా మోసపోయామని నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఇవిగో ఉదాహారణ జిల్లా ఉపాధి కల్పన, శిక్షణ కార్యాలయంలో ఉన్న గణాంకాలు చూస్తుంటే నివ్వెరపోక తప్పదు. ఎంప్లాయీమెంట్ ఎక్స్ఛేంజీలో సర్టిఫికెట్లు రిజిస్టర్ చేసుకున్న వారి సంఖ్య గత ఫిబ్రవరి నాటికి 51,946 మంది ఉన్నారు. ఇందులో ఎస్సీలు 9,200 మంది కాగా బీసీలు 36,738, మహిళలు 13,609మంది. 38 వేల మందికి పైగా పురుష నిరుద్యోగులున్నారు. మూడేళ్ల తరువాత రెన్యూవల్ చేయించుకోకపోతే వారి వివరాలు మరికనిపించవు. అలాంటివారు వేలల్లో ఉన్నారు. పీజీ పూర్తిచేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారి వివరాలు ఇక్కడ లభ్యం కావు. విశాఖలోని ఏయూలో ఎంప్లాయీమెంట్ గెడైన్స్ బ్యూరోలో పొందుపర్చారు. ఇక్కడ కేవలం డిగ్రీ, డిప్లమో, ఐటీఐ, బీఈడీ, డీఈడీ సహా ఇతర టెక్నికల్ అభ్యర్థుల వివరాలే నమోదయ్యాయి. 2014లో 13,252 మంది, 2015లో 9,011 మంది, 2016లో ఇప్పటివరకు 2048 మంది పేర్లు నమోదు చేయించుకున్నారు. ఏటికేడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నవాళ్ల సంఖ్య పెరుగుతోందని అధికారులే చెబుతున్నారు. ఇవి కాకుండా జిల్లా కలెక్టరేట్ కేంద్రంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో మరెన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో లెక్కే లేదు. జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వలస పోతున్నవారి సంఖ్య ఏటా లక్షమంది అని సాక్ష్యాత్తూ జిల్లా యంత్రాంగమే ప్రకటించింది. ఉద్యోగం లేకపోవడంతో గుజరాత్ తీర ప్రాంతానికి బోట్లలో పనిచేసేందుకు ఎంతోమంది వెళ్లిపోతున్నారు. పదోతరగతి తరువాత.. జిల్లాలో పదోతరగతి పూర్తిచేసి ఉపాధికల్పనాశాఖ కార్యాలయంలో నమోదు చేసుకున్న వారి సంఖ్యే 13,323 మంది ఉన్నారు. ఇంటర్ 11,916, డిగ్రీ 7,361, స్టెనోగ్రాఫర్లు 341, టైపిస్టు 1474, బీఈడీ 2,722, డీఈడీ 678, అన్ని వర్గాల డిప్లమో పూర్తిచేసిన వాళ్లు 1679, ఏఎన్ఎం, స్టాఫ్‌నర్స్‌లు 1060, ఐటీఐ 5,713, ఎంఎల్జే తరహా 1145, అన్‌స్కిల్డ్ (పదోతరగతి లోపు) 4537 మంది అభ్యర్థులు తాము ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నామని, ఏదైనా అవకాశం వస్తే తెలియజేయాలని రిజిస్ట్రేషన్ ద్వారా విన్నవించుకున్నారు. వీరంతా ఏళ్ల తరబడి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నా ఇటు ఉద్యోగమూ లేక, అటు నిరుద్యోగ భృతీ అందక అల్లాడిపోతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మాట మార్చడంపై ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. అవగాహనా లేదు జిల్లాకు చెందిన మంత్రి అచ్చెన్నాయుడే ఉపాధి కల్పన, కార్మికశాఖ మంత్రిగా ఉన్నారు. రెండేళ్లవుతున్నా నిరుద్యోగులకు ఆయన ఒక్క హామీ ఇవ్వలేకపోయారు. జిల్లా పరిస్థితులపై అవగాహన ఉండి పోరాడాల్సిన వ్యక్తే అసెంబ్లీలో అబద్ధాలు చెప్పడంపై ప్రజలు మండిపడుతున్నారు. జిల్లాలో తాము చదువు పూర్తిచేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నామని పదేళ్ల నుంచీ రిజిస్టర్ చేయించుకున్నవాళ్లు ఎంతో మంది ఉన్నారు. వీరి గూర్చి ఆలోచించలేకపోయిన మంత్రి మోసపూరిత ప్రకటన చేయకపోవడంపై నిరుద్యోగులు ధ్వజమెత్తుతున్నారు. బాబు గద్దె దిగాలి నిరుద్యోగుల ఓట్లతో అధికారం తెచ్చుకున్న చంద్రబాబు తక్షణమే గద్దె దిగాలి. ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేనివాళ్లకు నెలకు రూ.2వేల భృతి అంటూ ఎన్నికల సమయంలో వాగ్ధానాలిచ్చి ఇప్పుడు ఆ పథకమే లేదంటారా? అసెంబ్లీలో ఆర్థికమంత్రి యనమల ప్రకటించిన బడ్జెట్లో కూడా నిరుద్యోగులకు భరోసా కల్పించలేకపోయారు. జిల్లాలో లక్షలకు పైగా నిరుద్యోగులున్నారు.టీడీపీ సర్కార్ గద్దె దిగేవరకు పోరాటం చేస్తాం. - తలసముద్రం సూర్యం, ఏపీ నిరుద్యోగ పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు. చంద్రబాబు దయతో రోడ్డునపడి తిరుగుతున్నాం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగభృతి ఇస్తాడని ఆశతో గెలిపిం చాం. ఉద్యోగం లేదు. నిరుద్యోగ భృతి లేదు. నేను డిగ్రీ పూర్తి చేసి ఏడేళ్లయింది అప్పటి నుంచి కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలకు ప్రిపేరవుతున్నా. కరెక్టుగా అన్ని విభాగాల్లోను సరైన శిక్షణ పొందానన్న సమయంలో చంద్రబాబు అధికారం చేపట్టడంతో ఉద్యోగాలు తీయక రోడ్డున పడి ఉపాధి కోసం తిరగాల్సి వస్తోంది. - ఎం.శ్రీనివాసరావు, నిరుద్యోగి, గుజరాతీపేట నూతన పరిశ్రమల జాడే లేదు రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు పెద్దపీట వేస్తున్నామని చంద్రబాబు బూట కపు మాటలు చెబుతున్నారే తప్పా ఎక్కడా పరిశ్రమలు రాలేదు. దీంతో ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. బీటెక్ పట్టాలు పెట్టెలకే పరిమితమవుతున్నాయి. ఇప్పటికైనా బాబు కళ్లు తెరిచి ఉద్యోగాలు ఇవ్వడానికి చొరవ చూపిస్తే బాగుంటుంది. - ఆర్.శివ, బిటెక్ విద్యార్థి, శ్రీకాకుళం. బాబు వైఖరి తెలియనిది కాదు చంద్రబాబు ద్వంద్వవైఖరి తెలియనిది కాదు. తొమ్మిదేళ్లు పా లించి ప్రజలను హింసపెట్టా రు. ఇటీవల ఎన్నికల ముందు పూర్తిగా మారిపోయానని, ప్రజా సంక్షేమమే ధ్యేయమని నమ్మబలి కారు. గద్దెనెక్కాక మళ్లీ అదే బాటలో నడుస్తున్నారు. - కర్నేన గౌరినాయుడు, నిరుద్యోగి, రాజాం -
అందని భృతి.. అథోగతి!
⇒ ఎన్నికల హామీని తుంగలో తొక్కిన బాబు సర్కారు ⇒ నిరుద్యోగ భృతి పథకమే లేదని తేల్చేసిన కార్మికమంత్రి ⇒ జిల్లాలో ఒక్కరికీ దక్కని ఉద్యోగం ⇒ ఖాళీల భర్తీ జోలికెళ్లని రాష్ట్ర ప్రభుత్వం ⇒ ఏటా పెరుగుతున్న నిరుద్యోగులు ⇒ బూటకపు హామీలతో ముంచేశారని ఆవేదన ‘ఇంటికో ఉద్యోగం కావాలంటే బాబు రావాలి. ఉద్యోగం ఇవ్వలేక పోతే నెలకు రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే బాబు రావాలి.. తమ్ముళ్లూ మీ కలలు సాకారం చేయబోతున్నా’.. విశాఖపట్నం: ‘నిరుద్యోగులను ముఖ్యమంత్రి చంద్రబాబు నిలువునా ముంచేశారు. ఉద్యోగమో.. నిరుద్యోగ భృతో వస్తుందన్న గంపెడాశతో ఓట్లేస్తే పీఠమెక్కాక దగా చేశారు’. ఇప్పుడు జిల్లాలోని ఏ ఇంట చూసినా, ఏ నలుగురు యువకులు కలిసినా ఇదే మాట. మాటిచ్చి రెండేళ్లవుతున్నా ఉద్యోగాల ఊసు లేదు.. నిరుద్యోగ భృతీ లేదంటూ నిట్టూరుస్తున్నారు. కొన్నాళ్ల నుంచి సీఎం వైఖరిలో వస్తున్న మార్పును చూసి నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వాలని, లేదంటే నిరుద్యోగ భృతైనా ఇవ్వాలని అసెంబ్లీలో పట్టుపడుతున్నా పట్టించుకోకపోగా ఆయనపై ఎదురుదాడి చేస్తుండడంతో వీరిలో రోజురోజుకూ ఆశలు సన్నగిల్లుతున్నాయి. పది లక్షల కుటుంబాలకు నిరాశ.. సుమారు 44 లక్షల జనాభా కలిగిన విశాఖపట్నం జిల్లాలో 11 లక్షల కుటుంబాలున్నాయి. వీటిలో అర్బన్‌లో 5.20 లక్షలు, రూరల్‌లో 5.80 లక్షల కుటుంబాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 13.50 లక్షల మంది రేషన్ కార్డుదారులున్నారు. వీరిలో 12.30 లక్షల వరకు తెల్లరేషన్‌కార్డులు కలిగి ఉన్నారు. వీరంతా పేద, మధ్య తరగతికి చెందినవారే. ఉద్యోగమో.. నిరుద్యోగ భృతికో అర్హులే. వీరిలో కనీసం పది లక్షల కుటుంబాలకైనా బాబు ఇచ్చిన వాగ్దానం ప్రకారం జాబు గానీ, నిరుద్యోగ భృతి గానీ ఇవ్వాల్సి ఉన్నట్టు అంచనా. ఇక జిల్లాలోని 35 ఇంజినీరింగ్ కళాశాలల్లో 25 వేల మంది. పాలిటెక్నిక్, ఐటీఐలు, డిగ్రీ కళాశాలల నుంచి 50 వేలు మంది, పీజీ, బీఈడీ, నర్సింగ్, ఫార్మశీ కళాశాలల నుంచి 25 వేల మంది వెరసి లక్ష మందికి పైగా ఏటా పట్టాలతో బయటకొస్తున్నారు. వీరిలో 20 శాతం మంది పై చదువులకు, ఇతర ఉద్యోగాలకు బయటకు వెళ్తున్నారు. మరో 30 శాతం మంది ఇతర ప్రాంతాలు, జిల్లాల వారుంటున్నారు. మిగిలిన 50 వేల మంది నిరుద్యోగుల జాబితాలో అదనంగా చేరుతున్నారు. సర్వే లెక్క ప్రకారం.. 2.60 లక్షల మంది గత ఏడాది నిర్వహించిన ‘జన్మభూమి-మా ఊరు’ సర్వే ప్రకారం జిల్లాలో ఇంజినీరింగ్, పీజీ, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్స్ విభాగాల్లో 1,05,995 మంది ఉన్నారు. వీరిలో మహిళలు 65.050 మంది, పురుషులు 40,945 మందిగా తేల్చారు. స్కిల్డ్ అప్‌గ్రేడేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు మరో 1,55,898 మంది ఉన్నారు. జిల్లా ఎంప్లాయ్మెంట్ ఎక్స్ఛేంజీల్లో ఉద్యోగాల కోసం నమోదు చేయించుకున్న వారి సంఖ్య లక్షా 2 వేలు. వీరిలో నాన్ టెక్నికల్ 65 వేలు, టెక్నికల్ 37 వేల మంది ఉన్నారు. వీరంతా బాబు వస్తే జాబు వస్తుందని ఎంతో ఆశపడ్డారు. చివరకు డీఎస్సీ-2014లో జిల్లాకు ప్రకటించిన 1056 ఉపాధ్యాయ పోస్టులను నేటికీ భర్తీ చేయలేదు. ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి.. కొత్త జాబులు లేకపోగా చిరుద్యోగాల్లో ఉన్న వారిని తొలగించి వారి పొట్టకొట్టారు. చాలా విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని ఏవో సాకులు చెబుతూ బాబు ప్రభుత్వం రోడ్డున పడేసింది. రాష్ర్టంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో 1.45 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే.. వీటిలో కనీసం పదో వంతైనా భర్తీ చేస్తారని నిరుద్యోగ యువత కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూస్తోంది. కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇస్తుందని జిల్లాలోని ప్రతి పేద, మధ్యతరగతి ఇల్లూ ఆశిస్తోంది. సీఎం చంద్రబాబు హామీ మేరకు తెల్లరేషన్ కార్డులున్న ప్రతి నిరుద్యోగి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. లేదంటే ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలి. కానీ ఇప్పటిదాకా విశాఖ జిల్లాలో ఎంతమందికి ఉద్యోగాలొచ్చాయి? ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు? అంటే ఒక్కరంటే ఒక్కరికీ అవి దక్కలేదనే సమాధానం వస్తుంది. నమ్మి మోసపోయాం మాది శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం. గిరిజన సవర తెగకు చెందిన నేను ఎంఎస్సీ, బీఈడీ పూర్తి చేశాను. నా భార్య బీఎస్సీ, బీఈడీ చదివింది. ఇద్దరికీ ఉద్యోగం లేదు. అధికారంలోకి వస్తే ఉద్యోగం ఇస్తాను.. లేకపోతే ప్రతినెలా నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఆశగా ఎదురుచూస్తున్న మాకు నిరాశే మిగిలింది. సొంత ఊరులో బతుకు భారమై పోట్ట పోషణ కోసం భార్యాపిల్లలతో గత ఏడాది విశాఖపట్నం వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాం. ఉత్తుత్తి హామీలతో నమ్మించి మోసం చేశారు. -చిన్నారావు, విశాఖపట్నం 2014 ఎన్నికల సమయంలో ఈ రకమైన ప్రచారంతో ఊదరగొట్టి జనం ఓట్లు పోగేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు రెండేళ్లు కావస్తున్నా ఇంత వరకు ఇంటికో ఉద్యోగం ఊసే లేదు. ఉద్యోగం ఇవ్వకపోయినా నెలకు రూ. 2 వేల భృతి అయినా ఇస్తారన్న నిరుద్యోగుల ఆశలు అటువంటి పథకమే లేదని అసెంబ్లీలో కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ప్రకటనతో కుప్పకూలిపోయాయి. చంద్రబాబు హామీలు నమ్మి మోసపోయామని జిల్లా ప్రజలు ఆవేదన చెందుతున్నారు. -
బాబు వచ్చాడు... జాబు ఊడింది
* 1.75 కోట్ల ఇళ్లలో ఉద్యోగం, భృతి కోసం ఎదురుచూస్తున్నారు * మీరేమో నిరుద్యోగ భృతి అనే పథకమే లేదంటున్నారు * ఎన్నికల వేళ ఇల్లిల్లూ తిరిగి ఉద్యోగాలిస్తామని అబద్ధాలాడి ఇప్పుడు మోసం చేస్తారా? * ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి * ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి నిరసనగా సభనుంచి వాకౌట్ సాక్షి, హైదరాబాద్: ‘‘జాబు కావాలంటే బాబు రావాలి. తమ్ముళ్లూ మీ కలలు సాకారం చేయబోతున్నా. ఇంటికొక ఉద్యోగం ఇస్తా. ఉద్యోగం లేక పోతే ఉపాధి కల్పిస్తా. మీరేమీ చదువుకోకపోయినా నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.2వేలు చెల్లిస్తా... 2014 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు సంతకంతో కూడిన పత్రాలు పంచి గద్దెనెక్కిన మీరు... లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్లపై బికారుల్లా తిరుగుతూంటే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తారా?’’ అంటూ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విరుచుకుపడ్డారు. గురువారం సభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయంలో నిరుద్యోగ భృతిపై సభలో రగడ మొదలైంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ నిర్వాకంపై మండిపడ్డారు. ‘‘రాష్ర్టంలో 1.75 కోట్ల కుటుంబాలున్నాయి. ఈ కుటుంబాల నుంచి చదువుకున్న యువతీ యువకులు ఉద్యోగాలొస్తాయని ఎదురు చూశారు. రెండేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఉపాధి కల్పిస్తామని, అదీ ఇవ్వలేదు. ఎలాంటి చదువు లేకపోయినా నిరుద్యోగ భృతి నెలకు రూ.2వేలు అన్నారు. నిరుద్యోగ భృతి ఒక్కరికీ ఇవ్వలేదు. డీఎస్సీ అభ్యర్థులు పరీక్ష రాసి 18 నెలలు దాటినా మెరిట్ లిస్టు ఇవ్వలేదు. ఉద్యోగాలు లేకపోగా క్లస్టర్లు పెట్టి హాస్టళ్లనూ మూసేస్తున్నారు. మరోవైపు ఏడువేల మందిని సర్ప్లస్ ఉద్యోగులుగా చూపిస్తున్నారు. ఇదేనా మీ నిర్వాకం?’’ అంటూ దుయ్యబట్టారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. ‘‘నేడు రెండు లక్షల మంది ఉద్యోగుల మెడపై కత్తి వేలాడుతోంది. ఏ క్షణంలో ఉద్యోగం ఊడగొడతారో అని భయపడుతున్నారు. క్రమబద్ధీకరణ గురించి ఎప్పుడు ప్రశ్నించినా పరిశీలిస్తున్నామంటున్నారు. ఆరోగ్యమిత్రలను తొలగించారు, ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. గోపాలమిత్రలను తొలగించారు. ఆశావర్కర్లకు ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ధర్నాలు చేస్తే అరెస్టులు చేస్తున్నారు. అంగన్వాడీలు ధర్నా చేస్తే నిర్దాక్షిణ్యంగా పోలీసులతో కొట్టించి అరెస్టులు చేశారు. కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకొచ్చాక విస్మరించడం మీ మోసకారితనానికి నిదర్శనం’’ అని నిప్పులు చెరిగారు. అసలు నిరుద్యోగ భృతి అనే పథకమే లేదని చెప్పడం ఈ ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రభుత్వ బాధ్యతా రాహిత్యానికి నిరసనగా వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించి తమ సభ్యులతో సభనుంచి బయటకు వెళ్లిపోయారు. ఒక్క ఉద్యోగమూ లేదు: చింతల ప్రభుత్వంలోకొచ్చే వరకూ ఎన్ని అబద్ధాలు కావాలో అన్నీ ఆడారు. ఇప్పుడేమో ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేకపోయారు. గ్రూప్-1 నోటిఫికేషన్ లేదు, గ్రూప్-2 లేదు, చివరకు గ్రూప్-4 నోటిఫికేషన్లు లేవు. బీఈడీ, డీఎడ్ చదివిన లక్షలాదిమంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. మీరేమో ఉద్యోగమూ ఇవ్వలేదు, నిరుద్యోగ భృతీ లేదంటున్నారు. నిరుద్యోగ భృతి అనే పథకమే లేదు: మంత్రి అచ్చెన్నాయుడు రాష్ట్రంలో నిరుద్యోగ భృతి అనే పథకమే లేదని కార్మిక, ఉపాధి శాఖల మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానమివ్వడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. మంత్రి సమాధానమిస్తూ ‘అలాంటి పథకం ఏదీ లేదు, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు’ అంటూ సమాధానమిచ్చారు. దీంతో సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు. భృతి అనేది కాకుండా అందరికీ స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇచ్చి, ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. బాబొస్తే జాబొస్తున్నందన్న నినాదంతో ముందుకెళ్లామని, కానీ దాన్ని వమ్ము చేయమని తెలిపారు. పథకమే లేదని హేయంగా మాట్లాడారు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల వేళ హామీలిచ్చి ఇప్పుడు అసలా పథకమే లేదని మంత్రి అచ్చెన్నా యుడు హేయంగా మాట్లాడారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. -
యువత చూపు వైఎస్సార్సీపీ వైపు
సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ విద్యార్థి విభాగంలో విద్యార్థుల చేరిక నెల్లూరు, సిటీ : టీడీపీ ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో యువత వైఎస్సార్సీపీ వైపు చూస్తోం దని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. నగరంలోని రాజన్నభవన్లో గురువారం వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు గొల్లపూడి శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో విభాగంలో పెద్దఎత్తున విద్యార్థులు చేరారు. వీరికి ఎమ్మెల్యే విద్యార్థి విభాగం జెండాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చేం దుకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని ఇలా ఎన్నోహామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు.దీంతో వారికి సీఎం, టీడీపీపై నమ్మకం పో యిందన్నారు. యువత వైఎస్.జగన్మోహన్రెడ్డిని నమ్ముతున్నారని అందువల్లే వైఎస్సార్సీపీలో చేరేందుకు వస్తున్నారన్నారు. శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ అల్హుదా పాలిటెక్నిక్‌కు చెందిన విద్యార్థులు విద్యార్థి విభాగంలో చేరడం హర్షణీయమన్నారు. యువత, విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైం దన్నారు. ఈ కార్యక్రమంలో విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.అఖిల్, జిల్లా ప్రధానకార్యదర్శులు బి సత్యకృష్ణ, కె.హరికృష్ణాయాదవ్, నగర ప్రధాన కార్యదర్శులు గ్రంధి చరణ్‌తేజ, పీ వినీల్, పీ నిఖిల్, నగర కార్యదర్శులు పీ ఆగ్నేష్, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, శశాంక్ పాల్గొన్నారు. -
హామీలను విస్మరించిన సీఎం
కర్నూలు(అర్బన్) : తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలను విస్మరించారని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ కైలాస్‌నాయక్ అన్నారు. స్థానిక సంక్షేమభవన్‌లో గురువారం నిర్వహించిన గిరిజన యువతీ, యువకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్‌హెచ్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు కెతావత్ లక్ష్మానాయక్, వెహైచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఎరుకలి రాజు, నాయకులు ఈశ్వర్ నాయక్, నేనావత్ రాము నాయక్, ఇంద్రానాయక్ పాల్గొన్నారు. -
నిరుద్యోగులకు ‘పచ్చ’ని కుచ్చుటోపీ
♦ నిరుద్యోగ భృతికి మంగళం.. ♦ దానికి బదులుగా ఆర్థిక మద్దతు అందిస్తామంటూ కొత్త పల్లవి ♦ యువజన విధానం తేనున్నామన్న ఆర్థిక మంత్రి యనమల సాక్షి, హైదరాబాద్: మేం అధికారంలోకి రాగానే నిరుద్యోగులందరికీ ఉద్యోగాలిస్తాం.. ఒకవేళ ఉద్యోగాలివ్వలేకపోతే.. ఉద్యోగం ఇచ్చేవరకూ నెలకు రూ.రెండు వేల చొప్పున నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇస్తాం... గత ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఇదే విషయాన్ని ప్రధానంగా చెప్పింది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చి 22 నెలలవుతున్నా ఒక్కరికీ ఉద్యోగమివ్వలేదు.. అలాగని నిరుద్యోగ భృతి ఇస్తున్నదా? అంటే అది కూడా ఇవ్వట్లేదు. ఇప్పుడు ఏకంగా నిరుద్యోగ భృతి హామీకే పూర్తిగా మంగళం పలికేస్తోంది. దానిస్థానంలో ఆర్థిక మద్దతు అంటూ కొత్త పల్లవిని ఎత్తుకుంది. ఇదే విషయం సాక్షాత్తూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నోటినుంచే వెలువడింది. వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌కు సంబంధించి పలు శాఖల మంత్రులు, అధికారులతో ఆయన శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. నిరుద్యోగ భృతి హామీకి బదులు ఆర్థిక మద్దతు అందచేస్తామని వెల్లడించారు. ఎన్నికల ప్రణాళికలో చేసిన హామీలన్నింటినీ చాలావరకూ అమలు చేశామని, నిరుద్యోగ భృతి, యువత ఆర్థికాభివృద్ధి హామీల్నే నెరవేర్చాల్సి ఉందని చెప్పారు. నిరుద్యోగ భృతి హామీని ఆర్థిక మద్దతుగా మార్చుతామని చెబుతూ.. ఇందుకోసం త్వరలోనే యువజన విధానం తీసుకువస్తామన్నారు. యువజన విధానం అమలుకోసం గతం కన్నా ఎక్కువ నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఖాళీగా పోస్టులన్నీ భర్తీ చేయం.. ఇదిలా ఉండగా ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై నిరుద్యోగులు పెట్టుకున్న ఆశలపైనా ఆర్థిక మంత్రి నీళ్లు చల్లారు. ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయబోమని కుండబద్దలు కొట్టారు. జనాభాలో 35 శాతం మంది యువత ఉన్నారని, వారికి ఉపాధి కల్పించేందుకు కొంతవరకు మాత్రమే ప్రభుత్వ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఆ ప్రకారం.. అవసరమైన మేరకే గ్రూప్-1, 2తోపాటు డాక్టర్, టీచర్, పోలీసు పోస్టులను మాత్రమే భర్తీ చేస్తామని తెలిపారు. క్రమబద్ధీకరణపై 29న కేబినెట్ సబ్‌కమిటీలో చర్చిస్తాం.. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు బడ్జెట్లో ఎక్కువ నిధుల్ని కేటాయిస్తామని యనమల చెప్పారు. అలాగే ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలను చేసుకున్నామని, అవన్నీ ప్రారంభమవుతాయని ఆశిస్తున్నామని, తద్వారా ప్రైవేట్ రంగంలో యువతకు ఉద్యోగాలు వస్తాయని ఆయన తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు క్రమబద్ధీకరణపై ఈ నెల 29వ తేదీన మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తుందని యనమల చెప్పారు. బడ్జెట్ పుస్తకాలకోసం బ్యాగ్‌ల పరిశీలన.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్ పుస్తకాలను సభ్యులకు పంపిణీ చేసేందుకు బ్యాగ్‌లను ఆర్థిక మంత్రి యనమల పరిశీలించారు. ఈ సందర్భంగా పది రకాల బ్యాగ్‌లను అధికారులు తీసుకొచ్చారు. అయితే ఒక్కో బ్యాగ్ ధర రూ.9 వేల నుంచి రూ.11 వేల వరకు ఉండటంతో యనమల ఇంత ఖరీదైన బ్యాగులవసరమా? గతేడాది గన్నీ బ్యాగుల్లో పుస్తకాలిచ్చాం.. ఈసారీ అవేఇస్తే సరిపోదా అని వ్యాఖ్యానించారు. ఆర్థిక మద్దతు అంటే.. : గత ఎన్నికల్లో ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని ఇంతవరకూ నెరవేర్చకపోవడంతో రాష్ట్రంలోని యువత నుంచి ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ హామీకి పూర్తిగా మంగళం పలుకుతున్న ప్రభుత్వం ఇందుకు బదులుగా ఆర్థిక మద్దతు అందిస్తామని పేర్కొనడం ద్వారా నిరుద్యోగ యువతను సంతృప్తి పరచాలని చూస్తోంది. అయితే ఆర్థిక మద్దతు అంటే.. నిరుద్యోగ యువత స్వయం ఉపాధికోసం దరఖాస్తు చేసుకుంటే సబ్సిడీపై రుణాల్ని ఇప్పించాలనేది ప్రభుత్వ అభిప్రాయమని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దీనివల్ల నిరుద్యోగులకు ఒనగూరే ప్రయోజనం అంతంతేననే భావన వ్యక్తమవుతోంది. -
సర్కారీ కొలువులకు కత్తెర
సాక్షి, హైదరాబాద్ : అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని, లేదంటే నెలకు రూ.రెండువేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికలముందు ఊరూరా ఊదర గొట్టిన తెలుగుదేశంపార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులను నిలువునా ముంచేందుకు పావులు కదుపుతోంది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరయినా ఇప్పటివరకూ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకపోగా పరిపాలన సంస్కరణల ముసుగులో సర్కారీ కొలువులకు కత్తెర వేయాలని నిర్ణయించింది. అందుబాటులోని అత్యాధునిక కార్యాలయాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్ పేరుతో కొత్త నియామకాలకు తిలోదకాలిచ్చే నిర్ణయాలు తీసుకుంటోంది. అందుకనుగుణంగా పరిపాలన సంస్కరణల పేరుతో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నేతృత్వంలో ఆరుగురితో కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ సభ్యులుగా ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్, ఏపీ ఎన్జీవోల అసోసియేషన్ అధ్యక్షుడు పి. అశోక్‌బాబు, ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. వెంకటేశ్వర్లు, ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడు యు.మురళీకృష్ణ, సభ్య కన్వీనర్‌గా ఆర్థిక శాఖ కార్యదర్శి ఎం. రవిచంద్రను నియమించారు. -
చంద్రబాబు తీరుపై నిరుద్యోగుల కన్నెర్ర
పశ్చిమగోదావరి(ఏలూరు): అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని.. నిరుద్యోగభృతి కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు తమను నట్టేట ముంచారని నిరుద్యోగులు ధ్వజమెత్తారు. యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ యువకులు సోమవారం ఏలూరు నగరంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. హామీలు నెరవేర్చలేకపోతే చంద్రబాబు గద్దె దిగాలంటూ వారు పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఎన్నికల ముందు లక్ష ఉద్యోగాలిస్తామని చెప్పిన చంద్రబాబు కంటితుడుపు చర్యగా డీఎస్సీ నిర్వహించి చేతులు దులిపేసుకున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. -
ఇంటికో మిద్యోగం
‘ఇంటికో ఉద్యోగం’ హామీతో బాబు మోసం అధికారానికొచ్చాక ఉద్యోగాల నుంచి ఊస్టింగ్ ఏ శాఖలోనూ ఒక్క పోస్టయినా భర్తీ కాలేదు నిరుద్యోగ భృతి ఊసెత్తని ప్రభుత్వం అధికారం కావాలంటే ఓట్లు కురవాలి. ఉత్తుత్తి హామీలతో ఊదరగొట్టాలి. చంద్రబాబు అదే చేశారు. ఊరూవాడా తిరిగారు. ఇంటికో ఉద్యోగం.. రూ.2 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నిరుద్యోగుల్ని, యువకుల్ని బుట్టలో వేసుకున్నారు. ఇంకేముంది.. ఓట్ల వాన కురిసింది. అధికార దండం అందింది. మర్నాటి నుంచే ఉద్యోగాలు ఊడటం మొదలైంది. ప్రభుత్వోద్యోగాల భర్తీ హామీ బుట్టదాఖలైంది. ఖాళీలు పెరుగుతున్నా నియామకాల మాటే మరిచిపోయింది. వేలాదిమంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందికి ఎనిమిది నెలలుగా జీతాలివ్వడం మానేసింది. బాబు హామీల చిట్టా పల్లెల్లో ఇప్పటికీ గోడలపై దర్శనమిస్తుంది. ఓట్లేసి దారుణంగా మోసపోయిన అమాయక యువతను వెక్కిరిస్తోంది. బురిడీ బాబు మాయాజాలానికి బలైపోయామని నిరుద్యోగ యువత రోదిస్తోంది. నిరుద్యోగ భృతి అయినా వస్తుందని ఆశించిన పేద యువత ఆశ అడియాశలైంది. అయిదేళ్ల వరకూ ఎవరేమీ చేయలేరన్న దీమాతో చంద్రబాబు అండ్ పార్టీ అధికారాన్ని ఆనందంగా అనుభవిస్తోంది. సాక్షి, విశాఖపట్నం : ‘రేవు దాటే వరకు ఓడ మల్లన్న..రేవు దాటాక బోడి మల్లన్న’ అన్న చందంగా ఉంది అధికార టీడీపీ నేతలు తీరు. గడిచిన ఎన్నికల్లో తామిచ్చిన శుష్కవాగ్దానాలకు ఓట్లు కుమ్మరించిన వర్గాలను నేడు విస్మరించారు. గద్దెనెక్కి ఏడాది గడిచినా ఆ హామీల ఊసెత్తడం లేదు. బురిడీ ‘బాబు’ మాయమాటలకు బలైపోయామంటూ నిరుద్యోగులు,యువత ఇప్పుడు లబో దిబో మంటున్నారు. వారి పొట్ట కొట్టారు. జిల్లాలో వ్యవసాయశాఖలో 1750 మంది ఆదర్శ రైతులను, హౌసింగ్ శాఖలో 97 మంది వర్కుఇన్‌స్పెక్టర్లు, ఉపాధి హామీలో సామాజిక తనిఖీల పేరుతో ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్స్, కమ్యూనిటీ ఆర్గనైజర్స్ కలిపి సుమారు 296 మందిని తొలగించారు. దేవాదాయశాఖ ఆధ్వర్యంలో వివిధ ఆలయాల్లో పనిచేసే పదిమంది పూజారులను కూడా సాగనంపారు. ఇక జిల్లాలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న సుమారు 12 వేల మంది అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల్లో సుమారు ఐదారువేల మందికి ఆర్థిక లోటు సాకుతో ఎనిమిది నెలలుగా జీతాలివ్వకపోడంతో వారంతా పస్తులతో అలమటిస్తున్నారు. నిరుద్యోగులు ఐదు లక్షలపై మాటే.. జిల్లాలో ఉన్న 35 ఇంజినీరింగ్ కళాశాలల్లో 25వేల మంది ఇంజినీరింగ్ పట్టాలతో బయట కొస్తున్నారు. ఇక పాలిటెక్నిక్, ఐటీఐల నుంచి మరో 30వేల మంది, డిగ్రీ కళాశాలల నుంచి 25వేల మంది, పీజీ కళాశాలల నుంచి 10వేల మంది, బీఈడీలు 10వేలమంది, నర్సింగ్, ఫార్మసీ కళాశాల ద్వారా 10వేల మంది చొప్పున ఇలా ప్రతి ఏటా పట్టాలతో బయటకొస్తున్న వారి సంఖ్య జిల్లాలో అక్షరాల లక్షన్నర పైమాటే. వీరిలో చదువుతున్న సమయంలో, బయట కొచ్చిన వెంటనే వివిధ కార్పొరేట్, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు పొందే వారి సంఖ్య 20 శాతం లోపే. అంటే కనీసంగా జిల్లాలో 1.30 లక్షల మంది ప్రతి ఏటా నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ లెక్కన గత ఐదేళ్లు గణాంకాలు చూసినా ఐదారు లక్షల పైమాటే. సర్వేలో లెక్కతేలింది... 2.60లక్షల మంది గతేడాది జన్మభూమి మావూరులో నిర్వహించిన సర్వే ప్రకారం జిల్లాలో ఇంజినీరింగ్, పీజీ, ఐటీఐ, డిప్లమో,గ్రాడ్యుయేట్స్ విభాగాల్లో 1,05,995 మంది ఉన్నారు. వీరిలో మహిళలు 65.050 మంది, పురుషులు 40,945 మంది ఉన్నారు. ఇక స్కిల్డ్ అప్‌గ్రడేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు మరో 1,55,898 మంది ఉన్నారు. కాగా జిల్లా ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్‌లో ఉద్యోగాల కోసం నమోదు చేయించుకున్న వారి సంఖ్య అక్షరాల లక్షా 2వేల మంది. వీరిలో నాన్ టెక్నికల్ 65వేల మందికాగా, టెక్నికల్ 37వేల మంది ఉన్నారు. ఈ గణాంకాలు చాలు జిల్లాలో నిరుద్యోగుల సంఖ్య ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు. వీరంతా బాబు వస్తే జాబు వస్తుందని ఎంతో ఆశపడ్డారు. కానీ అధికారం చేపట్టి ఏడాది ఇక నిరుద్యోగ భృతి ఊసే ఎత్తడం లేదు.. ఆదర్శ రైతుల నోట మట్టి కొట్టారు ఆదర్శ రైతులను వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడు నియామకం చేపట్టారు. అప్పటి నుంచి సుమారు ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్నాం. టీడీపీ అధికారంలోకి రాగానే ఆదర్శరైతుల వ్యవస్థ రద్దు చేశారు. ఎటువంటి సమాచారం లేకుండా రద్దు చేయడం వల్ల ఇబ్బందుల పడుతున్నాం. నాలుగు నెలల జీతాలు పెండింగ్‌లో ఉన్నాయి. కనీసం అవి కూడా చెల్లించకుండా మోసం చేశారు. -అనిశెట్టి వెంకట సూరి, మాజీ ఆదర్శరైతు, పాల్తేరు, పాయకరావుపేట మండలం నిరుద్యోగులకు ఆశలు కల్పించారు.. నేను డిగ్రీ చదువుకుని నిరుద్యోగిగా ఉన్నాను. ఎన్నికల ముందు నిరుద్యోగులు ఉద్దరిస్తామంటూ ప్రకటనలు చేసిన చంద్ర బాబు మా ఊసే పట్టించుకోలేదు. రూ.రెండు వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. ఆ విషయమూ పట్టించుకోవడం లేదు. -గోనెల సత్తిబాబు, పాల్తేరు, పాయకరావుపేట మండలం. నిరుద్యోగ భృతి ఏది! ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. ఎంతో సంతోషపడ్డాం. గెలిచాక హామీని తుంగలోకి తొక్కి నిరుద్యోగులను పట్టించుకోనేలేదు. భృతిగా రూ.2 వేలు ఇస్తామన్నారు. ఇపుడేమో ఆ వూసేలేదు. సరికదా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారు. ఆంతా చంద్ర మాయ. -పైల నాని, నిరుద్యోగి, కె.వెంకటాపురం, కోటవురట్ల బాబు వచ్చారు జాబు గోవిందా బాబు వస్తే జాబు వస్తుందంటూ ప్రచారం ఊదరగొట్టారు. నిరుద్యోగులతో పాటు మేము నమ్మాం. మా ఆదర్శరైతులను ఆదుకుంటారనుకున్నాం. కానీ అన్యాయంగా మా ఉద్యోగాలు లాగేసుకుని మమ్మల్ని రో డ్డున పడేశారు. మాలాంటి వాళ్లు ఎందరో చంద్రబాబు మాయలో మోసపోయాం. - సోమేశ్వర్రావు, ఆదర్శరైతు,రాజుపేట, కోటవురట్ల బూటకపు హామీలతో మోసం చేశారు బూటకపు హామీలతో నిరుద్యోగులను మోసం చేశారు. అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చి సుమారు రెండేళ్లు కావస్తున్నా నిరుద్యోగుల ఊసే లేదు. కనీసం నిరుద్యోగుల కోసం చంద్రబాబు ప్రభుత్వం చేసిందేమీ లేదు. అంతా మాసమే. - పోతల సత్తిబాబు, వైస్ సర్పంచ్, ఆక్సాహేబుపేట, కోటవురట్ల నిరాశ మిగిల్చారు.. వైఎస్ ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్‌లో 2004 లో ఆదర్శరైతుగా తీసుకున్నారు. ఏదో రోజు జీతాలు పెరుగుతాయని, ఇచ్చిన వేయి రూపాయిలకే రైతులుకు సేవలందిమంచాను. బాబు ప్రభుత్వం వచ్చిన వెంటనే మమ్మల్ని తొలగించారు. ప్రస్తుతం వ్యవసాయ కూలీగా పని చేయక తప్పలేదు. -కె. సత్యనారాయణ, ఆదర్శ రైతు, గరుకుబిల్లి, కె. కోటపాడు మండలం నిరాశ మిగిల్చారు.. వైఎస్ ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్‌లో 2004 లో ఆదర్శరైతుగా తీసుకున్నారు. ఏదో రోజు జీతాలు పెరుగుతాయని, ఇచ్చిన వేయి రూపాయిలకే రైతులుకు సేవలందిమంచాను. బాబు ప్రభుత్వం వచ్చిన వెంటనే మమ్మల్ని తొలగించారు. ప్రస్తుతం వ్యవసాయ కూలీగా పని చేయక తప్పలేదు. -కె. సత్యనారాయణ, ఆదర్శ రైతు, గరుకుబిల్లి, కె. కోటపాడు మండలం ఉద్యోగాలేవీ... మాది రావికమతం మండలం కొత్తకోట గ్రామం. నేను ఎంకాం, బీఈడీ చదివాను. నాలుగేళ్లుగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాను. గత ఎన్నికల్లో జాబుకావాలంటే బాబు రావాలని నినాదం చేయడంతో ఎంతో ఆశపడ్డాను. కానీ బాబు వచ్చి ఏడాది అయినా ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదు. -గట్టా సత్తిబాబు, ఎం.కాం,బీఈడీ,కొత్తకోట ఉన్న ఉపాధినీ ఊడగొట్టారు.. ఎన్నికల ముందు బాబువస్తే జాబు వస్తాదని చెప్పి, అధికారం రాగానే ఉన్న ఉద్యోగాలు తొలగించడం దారుణం. కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించకపోగా ఉన్న చిన్నపాటి ఉపాధినీ తొలగించడం అన్యాయం. పార్ట్‌టైం పని చేసుకుంటూ కుటుంబ పోషణ చేసుకునే ఉద్యోగులకే రక్షణ కల్పించలేకపోతే ప్రభుత్వం ఎవరికి మేలు చేస్తుంది. - పి.శ్రీనివాసరావు, ఆదర్శరైతు, కొరుప్రోలు (ఎస్.రాయవరం మండలం) నమ్మి మోసపోయాం ఆదర్శ రైతులుగా పని చేసినంత కాలం రెండు వేల రూపాయల గౌరవ వేతనం తీసుకునేవాడిని. రోజులో కొంత సమయం కేటాయించి రైతులకు సూచనలు సలహాలు ఇచ్చేవాడిని. బాబు వస్తే జాబు వస్తాదని చేసిన ప్రచారం మా లాంటి వారిపై ఎక్కువ ప్రభావం చూపింది. నమ్మి ఓటు వేశాం. కానీ బాబు మా ఆశలకు గండి కొట్టారు. - కె.రమణ, ఆదర్శరైతు, చినఉప్పలం (ఎస్.రాయవరం మండలం) -
బాబు ఆయా.. జాబు గయా
విజయవాడ స్పోర్ట్స్ : బాబు వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తామని, జాబు కావాలంటే బాబు రావాలని, ఉద్యోగాలు లేని నిరుద్యోగులకు జీవన భృతి కింద రూ.2 వేలు చొప్పున అందజేస్తామని గత ఎన్నికల్లో అనేక వాగ్దానాలతో మభ్యపెట్టిన తెలుగుదేశం పార్టీ నేతలు, ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీరా అధికారంలోకి వచ్చాక ఆ ఊసే మరిచారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలనూ ఊడబెరికారు. ఇప్పటి వరకు నిరుద్యోగ భృతి ఊసే లేదు. నిరుద్యోగ భృతి వాగ్దానాన్ని మేనిఫెస్టోలో ఐదో ప్రాధాన్యత అంశంగా పొందుపరచడం గమనార్హం. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఫొటో పక్కన పెట్టుకొని మరీ పత్రికల్లో ప్రకటన కూడా ఇవ్వడం కొసమెరుపు. ఇదీ నిరుద్యోగుల లెక్క.. జిల్లాలో నేటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 67,844 మంది నిరుద్యోగులున్నారు. ఇందులో గ్రామీణ ప్రాంతంలో పురుషులు 28,832, స్త్రీలు 11,397, పట్టణ ప్రాంతంలో పురుషులు 17,623, స్త్రీలు 9,992 మంది ఉపాధి కల్పన కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఓసీ కేటగిరీలో 17,963, ఎస్సీ కేటగిరీలో 20,196, ఎస్టీ కేటగిరీలో 3,462, బీసీ-ఏలో 6,951, బీసీ-బీలో 8,578, బీసీ-సీలో 1,660, బీసీ- డీలో 7,325, బీసీ-ఈలో 1,709 మంది ఉన్నారు. సాధారణ నిరుద్యోగులు 60,344 మంది కాగా, వికలాంగులు దాదాపు 7,500 మంది. ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో నిరాక్షరాస్యులు ఏడుగురు, తొమ్మిదో తరగతి వరకు చదివినవారు 4,453 మంది, పదో తరగతి చదివినవారు 29,727, 10+2 చదివినవారు 16,303, గ్రాడ్యుయేట్లు 16,303, పోస్టుగ్రాడ్యుయేట్లు 10 మంది ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి జిల్లా ఉపాధి కార్యాలయాల్లో పేర్లు నమోదు చేసుకున్నవారి కంటే కనీసం రెండు రెట్లు అధికంగానే నిరుద్యోగులు ఉంటారంటే అతిశయోక్తి కాదు. గతంలో టెన్త్ పూర్తిచేసిన ప్రతి విద్యార్థి, విద్యార్థిని విధిగా జిల్లా ఉపాధి కార్యాలయాల్లో తమ పేర్లు నమోదుచేసుకునేవారు. 1991 తర్వాత ఉపాధి కల్పన కార్యాలయాలు నామమాత్రంగా మిగిలి పోవడంతో రాజీవ్ యువ కిరణాలు, చంద్ర కిరణాలు వంటి ప్రచార ఉపాధి కల్పన కార్యక్రమాలకు మినహా ఉపాధి కల్పన కార్యాలయాలు ప్రాధాన్యతలకు అనుగుణంగా పిలిచి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. అధికారిక లెక్కలు వేలల్లో ఉంటే వాస్తవంగా జిల్లాలో లక్షల్లో నిరుద్యోగులుంటారు. అధికారిక లెక్కల ప్రకారం చూసుకున్నా... చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం నిరుద్యోగులకు ఇవ్వాల్సిన జీవనభృతి ఒక్కొక్కరికి రూ.2 వేలు చొప్పున జిల్లాలో నెలకు మొత్తం రూ.13 కోట్ల 56 లక్షల 88 వేలు ఇవ్వాల్సి ఉంది. చంద్రబాబు పాలన ఏడాది పూర్తయిన నేపథ్యంలో గత ఏడాది కాలంలో నిరుద్యోగులకు చెల్లించాల్సిన మొత్తం బకాయి రూ.162 కోట్ల 82 లక్షల 56 వేలు. మరో 4,500 మందికి ఎసరు విజయవాడ నగరపాలక సంస్థలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న డ్వాక్వా, సీఎంఈవై కార్మికులను కూడా తొలగించి పారిశుధ్య పనులను కాంట్రాక్టర్‌కు కట్టబెట్టాలని ప్రభుత్వం జీవో జారీచేసింది. ఏఐటీయూసీ, సీఐటీయూతో పాటు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యాన తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తంచేయడంతో కౌన్సిల్లో అధికార పక్షం వెనక్కి తగ్గింది. ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని, పాత పద్ధతినే కొనసాగించాలని తీర్మానించి ప్రభుత్వానికి పంపింది. దీంతో తాత్కాలికంగా కార్మికులకు ఉపశమనం కలిగినా.. నమ్మకంగా వేటు వేయగల నైపుణ్యం గల చంద్రబాబు పాలనలో సుమారు 4,500 మంది పారిశుధ్య కార్మికుల ఉపాధికి భరోసా మాత్రం కరువైంది. చంద్రబాబు తాను మారలేదని మరోసారి నిరూపించుకుంటున్నారు. పర్మినెంట్ ఉద్యోగ విధానాలకు తిలోదకాలిస్తూ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు విధానాన్ని ప్రవేశపెట్టిన ఆయనే ఒక్క ఎస్ఎంఎస్ పోటుతో చిరుద్యోగులను తొలగిస్తున్నారు. దానికి ఉదాహరణలు ఇవీ... ►వృద్ధాప్య పింఛన్లు ఇచ్చే దాదాపు రెండువేల మంది సీపీఎస్‌లను ‘మీ సేవలు ఇక చాల’ంటూ ఒక్క ఎస్ఎంఎస్ పోటుతో తొలగించారు. ►కాంగ్రెస్ వాళ్లంటూ 750 మంది ఆదర్శ రైతులను నిర్దాక్షిణ్యంగా తీసేశారు. ►ఐకేపీ కింద సేంద్రియ వ్యవసాయం చేసే క్లస్టర్ యాక్టివిస్ట్, విలేజ్ యాక్టివిస్ట్లుగా ఉన్న దాదాపు 300 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ►హౌసింగ్ కార్పొరేషన్లో ఇప్పట్లో గృహనిర్మాణాలు ఏమీ లేవని, మిమ్మల్ని భరించలేమని పేర్కొంటూ వర్క్ ఇన్స్పెక్టర్లను, సర్వేయర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను 98 మందిని ఊడబీకారు. వీళ్లకు ప్రభుత్వం జీతం ఇవ్వకపోయినా లబ్ధిదారుల రుణాల నుంచి రూ.5 వేలు కట్ చేసి వేతనంగా ఇస్తారు. అయినా వారిని తొలగించారు. ►వైద్యవిధాన పరిషత్‌లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులను కూడా భరించలేమని పేర్కొన్నారు. దీనిపై యూనియన్ నేతలు వ్యతిరేకత వ్యక్తం చేయడంతో ప్రభుత్వం మూడేసి నెలలు గడువు పెంచుకుంటూ పోతోంది. ఒకేసారి తీసేస్తే వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో చిన్నచిన్న కారణాలతో దాదాపు జిల్లాలో 10 మందిని ఇప్పటికే తొలగించినట్లు సమాచారం. ►ఇంటికో ఉద్యోగం అంటూ ఆశలు కల్పించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ విధంగా జిల్లాలో దాదాపు 3,200 మందిని తొలగించారు. ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడేలా చేశారు. ►హాస్టళ్లలో అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న వంట మనుషులు, ఇతర సిబ్బందిని కూడా తొలగించడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. పాఠశాలల రేషనలైజేషన్‌లో భాగంగా రాజీవ్ విద్యామిషన్ ద్వారా బీఈడీ అర్హతతో పనిచేస్తున్న క్లస్టర్ రిసోర్స్ పర్సన్లను తొలగించి వారి స్థానంలో ఉన్న టీచర్లనే నియమించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. నిరుద్యోగ భృతి ఊసేదీ... టీడీపీ అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి నెలకు రూ.2 వేలు ఇస్తామని ఆశ చూపారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆ సంగతే మరిచారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కల్పన లేనే లేదు. వాగ్దానాలు చేయటమే తప్ప అమలు చేయటం లేదు. డిగ్రీ, ఆపైన చదివిన వారు ఉద్యోగాలు లేక ఇక్కట్ల పాలవుతున్నారు. ప్రభుత్వం నుంచి నిరుద్యోగ భృతి వస్తుందని ఆశించినా ఫలితం లేకుండాపోయింది. - ఎం.జాన్‌వెస్లీ, మచిలీపట్నం ఉపాధి చూపలేదు నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పటమే తప్ప ఇంతవరకు ఆ దిశగా ప్రయత్నాలు కూడా ప్రభుత్వం చేయలేదు. నవ్యాంధ్రప్రదేశ్‌లో అందరికీ ఉద్యోగాలు లభిస్తాయనే ఆశతో నిరుద్యోగులు ఉన్నారు. ప్రభుత్వం మాత్రం కొత్త ఉద్యోగాల మాట ఎలా ఉన్నా కాంట్రాక్టు పద్ధతిపై పనిచేసే చిరుద్యోగులను తొలగించేసింది. దీంతో వారు రోడ్డున పడాల్సి వచ్చింది. - కె.రవితేజ, మచిలీపట్నం -
నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు ద్రోహం
తిరుపతి రూరల్: నిరుద్యోగ భృతి అంటూ మాయమాటలతో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ద్రోహం చేశారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీలో నిరుద్యోగ భృతి, ఉపాధి కల్పనపై చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ప్రభుత్వాన్ని చెవిరెడ్డి నిలదీశారు. ఎ ్నకల్లో నిరుద్యోగ భృతి అంటూ ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోఎంతమందికి భృతి ఇచ్చారో చె ప్పమని ప్రశ్నించారు. రాష్ట్రంలో వీఆర్వో, ఇంజనీరింగ్, గ్రూప్-2 పోస్టులు దాదాపు రెండున్నర లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని ప్రశ్నించారు. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారాలు చేసిన టీడీపీ ఇప్పుడు ఉన్న జాబ్‌ల నుంచి చిరుద్యోగులను తరమివేస్తోందని ఆరోపించారు. ఔట్సోర్సింగ్, కాం ట్రాక్టు ఉద్యోగులు తమను పర్మినెంట్ చేస్తారని ఆశిస్తున్నారని కానీ వారి ఆశలను చంద్రబాబు అడియాశలు చేశారన్నారు. నిరుద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సిం గ్లో పనిచేస్తున్న కార్మికులు ప్రభుత్వంపై తిరగబడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిరుద్యోగ భృతిని, ఉద్యోగాల భర్తీని పూర్తి చేయాలని లేకుంటే ప్రజా ఉద్యమాలు తప్పవని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
ఉద్యోగులు ఔట్
అధికారంలోకి వచ్చి ఉద్యోగాలు ఊడగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం చిత్తూరు: ‘ఏరు దాటేదాకా ఏటి మల్లన్న.. ఏరుదాటాక బోడిమల్లన్న’ అన్న చందంగా ఉంది ముఖ్యమంత్రి చంద్రబాబు తీరు. ‘బాబు వస్తే ఇంటికో ఉద్యోగం’ అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగులను ఇంటికి సాగనంపే పనిలోపడ్డారు. ఒక్క నిరుద్యోగికి కూడా ఉద్యోగం ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీ పోస్టులను భర్తీచేసిన పాపాన పోలేదు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే ఆదర్శ రైతులు, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు, గృహనిర్మాణశాఖ వర్క్ఇన్స్పెక్టర్లతోపాటు పలుశాఖల పరిధిలో వందలాది మంది తాత్కాలిక సిబ్బంది ఉద్యోగాలు ఊడబెరికి ఇంటికి పంపారు. మిగిలిన వారిని సైతం డిసెంబర్ 31 నాటికి రోడ్డుపైకి నెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల్లో చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వడం ఆలస్యమైతే నిరుద్యోగ భృతి కింద ఒక్కొక్కరికీ నెలకు రూ.2 వేలు అందజేస్తామని హామీ ఇచ్చారు. అధికారం వచ్చాక ఎన్నికల హామీలను తుంగలో తొక్కారు. కొత్త ఉద్యోగాలు కల్పించడం సంగతి దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలను ఊడబెరకడం మొదలు పెట్టారు. ఖాళీలను భర్తీ చేయని ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలాదిగా ఉన్న ఖాళీలను సైతం భర్తీ చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ముందుకు రావడం లేదు. ముఖ్యంగా రెవె న్యూ, వైద్య ఆరోగ్యశాఖ, తాగునీటి సరఫరాల శాఖ, పంచాయతీరాజ్ తదితర ముఖ్య శాఖల్లోనూ అధిక సంఖ్యలో ఖాళీలు ఉండడంతో పనులు ముందుకు సాగడం లేదు. జిల్లాలో 2006 నుంచి 1,793 మంది ఆదర్శరైతులు పనిచేస్తున్నారు. గత ప్రభుత్వం నియమించిందన్న సాకుతో ప్రస్తుత ప్రభుత్వం వారిని తొలగించింది. గృహ నిర్మాణశాఖలో 112 మందిని తాత్కాలిక ఉద్యోగులను సైతం ఇంటికి పంపింది. మిగిలిన వారిని పంపేందుకు సిద్ధమైంది.మరోవైపు జిల్లాలో పనిచేస్తున్న 853 మంది ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లలో 300 మందిని తొలగించగా, మిగిలిన వారిని ఇంటికి పంపేందుకు రెడీ అయ్యింది.260 మంది వెలుగు ఉద్యోగులను సైతం ఇంటికి పంపేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వీరితోపాటు అన్నిప్రభుత్వ శాఖల పరిధిలో జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులందరినీ వదిలించుకునేందుకు సిద్ధమైంది. ఇందుకు ఈ నెల 31 డెడ్‌లైన్‌గా పెట్టినట్లు తెలుస్తోంది. జిల్లా రెవెన్యూ శాఖలో ఖాళీలు: సీనియర్అసిస్టెంట్లు -76, జూనియర్ అసిస్టెంట్లు -34, వీఆర్వోలు -186, వైద్యఆరోగ్యశాఖలో ఖాళీలు: వైద్యాధికారులు-24, ఏఎన్ఎంలు-155, రెండవ ఏఎన్ఎంలు-75, ఎంపీహెచ్ మేల్-134, ల్యాబ్ టెక్నీషియన్లు- 43, ఫార్మసిస్టు-36, ఫోర్త్ క్లాస్ ఉద్యోగులు -86 సంక్షేమశాఖలో ఖాళీలు మొత్తం వసతి గృహాలు-68, సహాయ బీసీ సంక్షేమ శాఖాధికారుల పోస్టులు-4, ఖాళీ వార్డెన్ పోస్టులు-20, వర్కర్స్ -85, నీటి పారుదల శాఖలో ఖాళీలు: జూనియర్ అసిస్టెంట్లు-2, టైపిస్టులు- 8, అటెండర్లు-34, జూనియర్ టెక్నీషియన్స్ - 13, టెక్నికల్ అసిస్టెంట్-1, డీఈ-3, ఏఈ-10, ఉద్యానశాఖలో ఖాళీలు సీనియర్ అసిస్టెంటు-1, అటెండర్ -1 డ్వామాలో ఖాళీలు ఏపీవోలు -2, టెక్నికల్ కన్సల్టెంట్ -18, కంప్యూటర్ ఆపరేటర్లు -15 పశుసంవర్థక శాఖలో ఖాళీలు వెటర్నరీ అసిస్టెంట్లు-21, ప్యారావెట్స్- 136, అటెండర్లు-86 వ్యవసాయశాఖలో ఖాళీలు వ్యవసాయాధికారులు-4, అదనపు వ్యవసాయాధికారుల పోస్టులు- 33 చిత్తూరు కార్పొరేషన్లో ఖాళీ పోస్టులు - అసిస్టెంట్ కమిషనర్ -1, రెవెన్యూ అధికారి -1, మేనేజర్ -1, అకౌంటెంట్ -1, పర్యావరణ ఇంజనీర్ -1, సిటీ ప్లానర్ -1, ఏఈ-2, శానిటరీ ఇన్స్పెక్టర్ -3, హెల్త్ ఇన్స్పెక్టర్ -1, మహిళ వైద్యాధికారి -1, వెటర్నరీ అసిస్టెంట్ -5, ఆయాలు -3, సీనియర్ అసిస్టెంట్ -16, ఆఫీసర్ సూపరింటెండెంట్ -7, యూడీఆర్‌ఐ -1, పబ్లిక్ అండ్ హెల్త్ - 4, స్వీపర్లు -19 తాగునీటి సరఫరా విభాగం ఖాళీలు ఎస్ఈ -1, ఈఈ-1, డీఈ-1, ఏఈ-24, జూనియర్ అసిస్టెంట్లు -2, అటెండర్లు -18, టైపిస్టులు -4, జేటీఓలు -13, టెక్నికల్ అసిస్టెంట్ - 1 జిల్లాపరిషత్‌లో ఖాళీలు జూనియర్ అసిస్టెంట్లు -12, అటెండర్లు -8 అరకొర పోస్టులతో డీఎస్సీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అరకొర పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఇచ్చింది. దీంతో ఒ క్కొక్క పోస్టుకు వెయ్యిమంది నిరుద్యోగులు పోటీ పడుతున్నారు. క్షేత్రస్థాయిలో అనేక శాఖల్లో ఖాళీలు ఉన్నా భర్తీకి మాత్రం నోచుకోలేదు. దాదాపు మూడేళ్ల తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లో బయాలజీకి ఒక్కపోస్టు కూడా చూపకపోవడం దారుణం. - చరణ్‌రాజ్,డీఎస్సీ అభ్యర్థి, ఐరాల ప్రతిఏటా డీఎస్సీ నిర్వహించాలి ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ప్రతియేటా డీఎస్సీని నిర్వహించి ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలి. ఉన్నత విద్యలను పూర్తిచేస్తే ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో వైఫల్యం చెందుతోంది. నిరుద్యోగ సమస్య అధికమవుతోంది. -కుమార్, బీఈడీ నిరుద్యోగి,చిత్తూరు 10లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 10లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాయ మాటలు చెప్పారు. అధికారం చేపట్టాక నిరుద్యోగుల గురించి యోచనైనా చేయలేదు. కందిస్థాయి ఉద్యోగాలే కాకుండా ఇంజనీర్లు,ఎంఈవోలు,డీవైఈవోలు అధికసంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. వాటిని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలి. - షేరు, వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నాయకులు రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇవ్వాలి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నెలకు రూ.2వేలు నిరుద్యోగభృతి ఇచ్చి ముఖ్యమంత్రి మాట నిలబెట్టుకోవాలి. రాష్ట్రంలో అధికసంఖ్యలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీచేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. - ఇమ్రాన్,చిత్తూరు జాబ్ జాడ ఎక్కడ బాబు చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక ఒక డీఎస్సీ మినహా ఏ ఉద్యోగ ప్రకటన ఇవ్వలేదు. అది కూడా అరకొర పోస్టులతోనే నోటిఫికేషన్ ఇచ్చారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగా నిరుద్యోగ భృతి ప్రస్తావన తేవడం లేదు. పెపైచ్చు రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగవిరమణ వయస్సును 58 నుంచి 60కి పెంచారు. అలాగే యూనివర్సిటీ అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సును 60 నుంచి 62 వరకు పెంచారు. ఫలితంగా నిరుద్యోగులు మరో రెండేళ్ళు ఉద్యోగాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వుంది. -వి.హరిప్రసాద్‌రెడ్డి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు -
లక్షన్నర ఖాళీలు!
* రాష్ట్రంలో ఖాళీగా 1.39 లక్షల ఉద్యోగాలు.. భర్తీపై తాపీగా కదులుతున్న ప్రభుత్వం * నిరుద్యోగుల్లో అంతకంతకూ పెరుగుతున్న ఆందోళన * ఎన్నికల హామీ మేరకు బాబు ఉద్యోగాలిస్తారని నిరుద్యోగుల ఎదురుచూపు * అవసరం లేని పోస్టుల పేరుతో భర్తీ ప్రక్రియనే నిలిపేయడం తగదంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు లక్షన్నర ఉద్యోగాల భర్తీలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. ఖాళీ పోస్టు ల భర్తీ విషయంలో ప్రభుత్వం చాలా నిదానంగా కదులుతుండటంతో లక్షలాది నిరుద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1.39 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో ఖాళీలు ఉండటంతో నిరుద్యోగులూ ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. పైగా, అధికారంలోకి రాగానే ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్యోగం ఇవ్వకపోతే రూ.2.000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. అయితే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగా నే ఇందుకు విరుద్ధమైన నిర్ణయం తీసుకుంది. ఎటువంటి భర్తీలు చేయరాదంటూ ఏపీపీఎస్సీకి ముఖ్యమంత్రి కార్యాలయం లేఖ రాసింది. దీంతో నిరుద్యోగులు కంగుతిన్నారు. అయితే, గత ప్రభుత్వం పోస్టులు భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగుల వయస్సు మీరిపోయిందనే కారణంతో చంద్రబాబు సర్కారు గరిష్ట వయో పరిమితిని 34 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాలకు పెంచింది. ఈ నిర్ణయం నిరుద్యోగుల్లో మళ్లీ ఆశలు రేకెత్తించింది. వయస్సయితే పెంచా రు కానీ, ఆ తర్వాత ఉద్యోగాల భర్తీకి వేగవంతమైన చర్యలు చేపట్టలేదు. మరోపక్క.. ఈ పోస్టు ల్లో ప్రస్తుత అవసరాలకు పనికి రానివెన్నో తేల్చడానికి సర్కారు ఓ కమిటీని నియమించింది. ఆ కమిటీకి మూడు నెలలు గడువిచ్చింది. దీంతో అప్పటివరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఉండకపోవచ్చునన్న ఆందోళన నిరుద్యోగుల్లో నెలకొం ది. రాష్ట్ర విభజనతో సంబంధం పోస్టుల పంపిణీ ఇంకా జరగలేదు. వాటిలో ఖాళీలెన్నో పంపిణీ పూర్తయ్యే వరకు తెలియదు. రాష్ట్ర విభజనతో సంబంధం లేని జిల్లా, జోనల్, మల్టీ జోనల్లో ఖాళీగా ఉన్న పోస్టులనైనా భర్తీ చేస్తారేమోనని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఈ మూడు విభాగాల్లో ఏకంగా 1,39,507 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మల్టీ జోనల్ పోస్టులు 1,944, జోనల్ పోస్టులు 22,462, జిల్లా స్థాయివి 1,15,101 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో మల్టీ జోనల్ పోస్టుల్లో అతి తక్కువ పోస్టులు మాత్రం విభజన ప్రక్రియలో భాగంగా పంపిణీ జరుగుతాయి. ఈ పోస్టులను మినహాయించి, మిగతా వాటిని భర్తీ చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. వెంట నే ఈ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని నిరుద్యోగులు కోరుతున్నారు. లేదంటే వయోపరిమితిని పెంచిన ఫలితం ఉండదని అభిప్రాయపడుతున్నారు. గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం విషయంలోనూ ఇదే జరిగిందని వివరిస్తున్నారు. కిరణ్ సర్కారు గరిష్ట వయోపరిమితిని 34 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాలకు పెంచినప్పటికీ, ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఈలోగా లక్షలాది నిరుద్యోగుల వయస్సు మీరిపోయింది. ఈసారి అలా కాకుండా వెంటనే పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టాలని కోరుతున్నారు. మరోపక్క.. ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై ఎటువంటి కసరత్తు చేయని రాష్ట్ర ప్రభుత్వం.. మారిన అవసరాలకు తగినట్లుగా లేని పోస్టులను గుర్తించాలని నిర్ణయించింది. భవిష్యత్‌లో వాటిని రద్దు చేసేం దుకు తగిన సిఫార్సులు చేసేందుకు 10 ప్రధాన శాఖల ఉన్నతాధికారులతో ఒక కమిటీని నియమిస్తూ ఈ నెల 3వ తేదీన జీవో (నంబర్ 3917) జారీ చేసింది. ఈ కమిటీ పలు ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఉన్న పోస్టులను అధ్యయనం చేసి, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా లేని పోస్టుల రద్దుకు సిఫార్సులు చేస్తుంది. ఇందుకు ప్రభుత్వం కమిటీకి మూడు నెలలు గడువిచ్చింది. అంటే మార్చి వరకు పోస్టుల భర్తీ ఉండదేమోనని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మూడు నెలల తర్వాత భర్తీ ప్రక్రియ చేపడితే చాలా సమయం వృథా అవడంతోపాటు వేలాది మంది అనర్హులయ్యే అవకాశముంటుందని అధికారులు కూడా చెబుతున్నారు. పైగా, రద్దు చేయడానికి అవకాశమున్న పోస్టుల పేరుతో భర్తీ ప్రక్రియనే ఆపడం భావ్యం కాదని కూడా అంటున్నారు. అందువల్ల వెంటనే ఖాళీ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపడితే రాష్ట్రంలోని యువతకు ప్రయోజనం కలుగుతుందని అధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. -
ప్రభుత్వ వ్యవస్థ విఫలం
ఆరు నెలల్లో ప్రభుత్వం చేసింది శూన్యం జీవీఎంసీ ఎన్నికల దృష్ట్యా విశాఖకు వస్తున్న సీఎం {పజలను వంచించడం తప్పా.. ఒక్క హామీ నెరవేర్చలేదు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విశాఖ రూరల్: ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలల కాలంలో కష్టాల్లో ఉన్న విశాఖ ప్రజలను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా ఫెయిలైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. మంగళవారం హోటల్ టైకూన్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుపాను కారణంగా నష్టపోయిన ప్రజలకు ఏమీ చేయకుండానే అన్నీ చేశామన్న భావన కలిగించి ప్రజలను వంచించారని దుయ్యబట్టారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు రైతు, డ్వాక్రా రుణ మాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి, అన్న క్యాంటీన్లు, ధరల స్థరీకరణ నిధి ఇలా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ఈ నెల 5న ధర్నా చేపట్టిన ముందు రోజు హడావుడా చంద్రబాబు 50 వేలలోపు రైతు రుణాలు మాఫీ చేస్తున్నామని ప్రకటించి, ఇప్పటి వరకు చేయలేదని, ఇప్పుడు బాండ్లు ఇస్తారన్న వార్తలు వినిపిస్తున్నాయని, ఏ ఒక్క దానిపై స్పష్టత లేకుండా ఇవ్వకుండా ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. ఆంధ్రాయూనివర్శిటీ, ఎయిర్‌పోర్టు, జూ తీవ్రంగా దెబ్బతిన్నాయని, అన్ని శాఖల పునర్నిర్మాణాలకు నామినేషన్ పద్ధతిన పనులకు అనుమతులిచ్చినప్పటికీ జూకు సంబంధించి ఎటువంటి నిధులు మంజూరు చేయలేదని పేర్కొన్నారు. జీవీఎంసీ ఎన్నికలు ఉన్నాయనే.. జీవీఎంసీ ఎన్నికలు త్వరలో జరగనున్న దృష్ట్యా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతీ నెలా విశాఖకు వస్తున్నారన్నారు. ఆయన పర్యటనల వల్ల జిల్లాకు ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఎడ్యుకేషన్ హబ్‌గాను, ఐటీ, టూరిజం, ఆర్థిక రాజధానులుగా చేస్తామని ఒక్కో మంత్రి మాటల గారడీలు చేస్తున్నారని, ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేపట్టలేదని ఎద్దేవా చేశారు. ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దాలంటే రిజర్వు బ్యాంకు, స్టాక్ ఎక్ఛేంజ్‌లు ఏర్పాటు చేయాలని, అందుకు సంబంధించి ప్రభుత్వం ఒక్కసారి కూ డా కేంద్రానికి విన్నవించిన దాఖలాలు లేవన్నారు. డిస్నీ ల్యాండ్ తెస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిన వెంటనే తాము అటువంటి ప్రతిపాదనలు చేయలేదని ఆ సంస్థ వెబ్సైట్లో ప్రకటించిందని తెలిపారు. సీఎం, మంత్రుల మధ్య సఖ్యత లేదని, వారి మాటాలకు పొంతన లేకుండా ఉందని, ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అబద్దాలు చెబుతూ, హడావుడి చేస్తూ ప్రజలను మ భ్యపెడుతున్నారని, దీనికి మూల్యం చెల్లించుకుంటారన్నారు. సీఎం ప్రత్యేక విమనం ఖర్చెంత?: సీఎం చంద్రబాబు ఎక్కడకు వెళ్లినా ప్రత్యేక విమానంలోనే వెళుతున్నారని, ఆ ఖర్చు వివరాలు ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. చరిత్ర ఏ ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో విదేశాలకు వెళ్లిన సందర్భం లేదన్నారు. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ సంక్షేమ పథకాల్లో కోత విధిస్తూ ప్రత్యేక విమానాల్లో తిరుగుతుండడం ధారుణమన్నారు. ప్రతీ వారం గంటాకు మూడు ప్రశ్నలు : ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్‌ను జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు మహాధర్నాకు ముందు రోజున చదివి వినిపించారని ఎద్దేవా చేశారు. వెంటనే తాను గంటాకు 26 ప్రశ్నలు సంధించినా ఏ ఒక్కదానికి సమాధానాలు లేవన్నారు. ఇక నుంచి వారినికి మూడు ప్రశ్నలు గంటాకు సంధిస్తానని, దమ్ముంటే సమాధానం చెప్పాలని సవాలు విసిరారు. ‘ఉపాధ్యాయుల బది లీల్లో గంటా కుటుంబ సభ్యులు, వ్యక్తిగత కార్యదర్శులు డబ్బులు వసూలు చేసిన విషయంలో వాస్తవం లేదా? గంటా నారాయణమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో అనేక సంస్థలు, కాలేజీల నుంచి డబ్బులు వసూలు చేయలేదా? తుపానుకు దెబ్బతిన్న ప్రాతినిథ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గంలో ఎన్నిసార్లు పర్యటించించారు? ఎంతమందిని పరామర్శించి ఆదుకున్నారు?’ అంటూ మూడు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని సూచించారు. మరో మంత్రి జెండాలు ఎగురవేయడం తప్పా ఎటువంటి అజెండా లేదని విమర్శించారు. ఈ సమావేశంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు తిప్పల గురుమూర్తి రెడ్డి, జాన్ వెస్లీ, ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త తైనాల విజయ్‌కుమార్, దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త కోలాగురువులు, గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పలనాగిరెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.హెచ్.ఫరూక్, సీనియర్ నాయకుడు సత్తి రామకృష్ణారెడ్డి, ప్రచార కమిటీ అధ్యక్షుడు జి.రవిరెడ్డి, నగర మహిళా కన్వీనర్ పసుపులేటి ఉషాకిరణ్, రాష్ట్ర యువజన కమిటీ సభ్యుడు విల్లూరి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తావు బాబూ..
అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించావు.. నిరుద్యోగులకు రూ.1500 నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు.. ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పావు.. బాబు వస్తే జాబు గ్యారంటీ అని ప్రచారం చేశావు.. బంగారు తల్లిని మహాలక్ష్మి పథకంగా మార్చి ఆదుకుంటానన్నావు... ఇప్పటికీ ఏ ఒక్కరికీ లబ్ధిచేకూర్చలేదు... కనీసం చిల్లిగవ్వ విదల్చలేదు.. ప్రకృతి విపత్తులతో రైతులు అల్లాడుతున్నా సర్వేలతోనే కాలక్షేపం చేస్తున్నావు.. ఇంకా ఎన్నాళ్లు మోసపూరిత పాలన సాగిస్తూ కాలం వె ళ్లదీస్తావంటూ సీఎం చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ సీపీ నేతలు ధ్వజమెత్తారు. శ్రీకాకుళం పట్టణంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నేతలు సీఎం చంద్రబాబు మోసపూరిత పాలన , నేతల ఏకపక్ష నిర్ణయాలపై మండిపడ్డారు. హామీలు అమలుకు ప్రజలతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. - శ్రీకాకుళం అర్బన్ బాబు మేనిఫెస్టో అబద్ధాల పుట్ట సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ప్రకటించిన మేనిఫెస్టో ఒక అబద్దాల పుట్ట. అధికారంలోకి వచ్చి 6 నెలలు గడచినా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. దీనికి నిరసనగానే డిసెంబర్ 5న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తాం. జిల్లాపై తుపాను విరుచుకుపడినా రైతులకు చిల్లి గవ్వ సాయం చేయలేదు. బాబుకు మొదటినుంచి వెన్నుపోటుదారునిగా పేరుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే తత్వం దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డిది. కప్పదాటు గెంతులు వేసే తత్వం చంద్రబాబుది. జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు అధికారాన్ని అడ్డంపెట్టుకుని దౌర్జన్యంతో రాజకీయాలు చేస్తున్నారు. కలిసి ప్రతిఘటిద్దాం. - ధర్మాన కృష్ణదాస్, వైస్సార్ సీపీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు మహా ధర్నాను విజయవంతం చేద్దాం హామీల అమలులో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ డిసెంబర్ 5న చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేద్దాం. చంద్రబాబు పాలన దుర్మార్గంగా ఉంటుందని ప్రజలకు ముందే తెలుసు. రుణమాఫీ జరుగుతుందనే ఒకేఒక్క ఆశతో ఓటేసి గెలిపించారు. అధికారం చేపట్టాక బాబు నైజం బయటపడింది. బాబుకు వ్యవసాయంపై ఎన్నడూ ఆసక్తి లేదు. ఇప్పుడూ రైతుపై అదే ధోరణి కనబరుస్తున్నారు. టీడీపీ నేతలను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయి. - ధర్మాన ప్రసాదరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్టీని సంస్థాగతంగా నిర్మిద్దాం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేద్దాం. ఏ రాజకీయ పార్టీకైనా అనుబంధ సంఘాలే ప్రధానం. అవి పటిష్టంగా ఉంటే పార్టీ మరింత ఉత్సాహంగా పనిచేస్తుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి అర్హులైన లబ్ధిదారుల పింఛన్లు రద్దుచేశారు. ఆదర్శరైతులు, అంగన్వాడీలు, రేషన్‌డీలర్లు, ఉపాధిహామీఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగినా ఉద్యమిద్దాం. డిసెంబర్ 5న పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న మహాధర్నా చారిత్రాత్మకంగా నిలిచిపోయేలా చేద్దాం. - తమ్మినేని సీతారాం, వైఎస్సార్ సీపీ హైపవర్ కమిటీ సభ్యుడు టీడీపీ అరాచకాలను వివరిద్దాం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఆచరణలోకి తేకపోవడం విచారకరం. రుణాల మాఫీ చేస్తామని చెప్పి కొర్రీలు వేస్తున్నారు. సర్వేలతో కాలక్షేపం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అరాచకాలను ప్రజలకు వివరిద్దాం. కుల, మతాలకు అతీతంగా దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమపథకాలు అందజేస్తే... ఇప్పుడు కమిటీల పేరుతో జిల్లాలో అర్హులైన 28 వేల మంది పింఛన్‌దారులను తొలగించారు. ఇదెక్కడి ప్రభుత్వం. కొద్దికాలంలోనే ప్రభుత్వ పతనం ఖాయం. - రెడ్డి శాంతి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు వ్యవసాయం దండగన్న చంద్రబాబు రాష్ట్రంలో వ్యవసాయం దండగనే అభిప్రాయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు బలంగా ఉంది. అందువల్లే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం కల్పించడం లేదు. రైతాంగానికి పెద్దపీట వేస్తామని చెప్పి వారిని విస్మరిస్తున్నారు. విద్యార్థులకు, వికలాంగులకు, నిరుద్యోగులను మోసగిస్తున్నారు. ఎస్సీలను నట్టేట ముంచిన వ్యక్తిగా బాబు నిలిచారు. జిల్లా పోరాటాల గడ్డ, ఇక్కడినుంచే ప్రభుత్వంపై పోరుకు ఉద్యమిద్దాం. - మేరుగ నాగార్జున, పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు పోరాటంతోనే సమస్యల పరిష్కారం పోరాటంతోనే ప్రజాసమస్యలు పరిష్కారమవుతా యి. రాష్ట్రంలో రాజ్యాంగం ద్వారా ఏర్పడిన ప్రభుత్వ పాలన లేదు. అధికార పార్టీ వేధింపులతోనే కాలయాపన చేస్తున్నారు. జిల్లాలో మంత్రి, విప్‌లు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కమిటీల్లో సభ్యులుగా రౌడీషీటర్లు, టీడీపీ తొత్తులను చేర్చారు. - కలమట వెంకటరమణ, పాతపట్నం ఎమ్మెల్యే ప్రజల పక్షాన పోరాడుదాం తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ఇబ్బందులు పడుతున్న ప్రజల పక్షాన వైఎస్సార్సీపీగా పోరాడుదాం. ప్రతి కార్యకర్త ఒక సైనికునివలే పనిచే సి పార్టీ బలోపేతానికి కృషిచేద్దాం. చంద్రబాబు పాలన ఆలీబాబా-అరడజను దొంగలు మాదిరిగా ఉంది. అందులో మొదటి దొంగ జిల్లా మంత్రి అచ్చెన్నాయడు. దొంగల దగ్గరే దోచుకునే గజదొంగ. ప్రజల తరఫున నిలబడే వ్యక్తిని, ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిని తొక్కేయడమే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తోంది. నీచుడు, నికృష్టుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబునాయుడే అని సాక్షాత్తు దివంగత ఎన్టీ రామారావే అన్నారు. -చెవిరెడ్డి భాస్కరరెడ్డి, - చంద్రగిరి ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్రస్థాయి వలంటీర్ల కమిటీ అధ్యక్షుడు రైతులకు అన్యాయం టీడీపీ పాలనలో రైతులకు ఎన్నడూ అన్యాయమే జరుగుతోంది. గత తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో రైతులకు ఎంత అన్యాయం జరిగిందో ఈ ఆరు నెలల పాలనలో అంత జరిగింది. - ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, రాష్ట్రస్థాయి రైతు కమిటీ అధ్యక్షుడు ప్రజావ్యతిరేక ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగుతోంది. జిల్లాలోని అధికారపార్టీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. హుద్‌హుద్ తుపానుతో పాలకొండ నియోజకవర్గంలోని భామిని, సీతంపేట మండలాలు పూర్తిగా దెబ్బతిన్నా చిల్లిగవ్వ సాయం లేదు. గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. నిజమైన పేదలకు న్యాయం చేయకపోతే ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. - విశ్వసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే దుష్టపాలన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి రాష్ట్రంలో దుష్టపాలన సాగుతోంది. గతంలో ఎన్నడూ ఇలాంటి పాలన చూడలేదు. కమిటీలు వేసి అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడుతున్నారు. తుపానుకు పంటలు, ఇళ్లు, సర్వం కోల్పోయిన వారిని విడిచిపెట్టి టీడీపీ లబ్ధిదారులకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. వీటన్నింటిపైనా తిరగబడాలి. పోరుబాట సాగించాలి. - కంబాల జోగులు, రాజాం ఎమ్మెల్యే అండగా ఉంటాం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పార్టీ రాష్ట్ర లీగల్‌సెల్ తరఫున అం డగా ఉంటాం. మనోధైర్యం కోల్పోకుండా ప్రభుత్వం చేసే దుర్మార్గాలను ఎదిరిద్దాం. టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన అడ్డగోలు జీవోలపై పోరాడుదాం. ప్రతి కార్యకర్తకూ అన్యాయం జరగకుండా చూద్దాం. కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు పూర్తిస్థాయి భరోసా కల్పిద్దాం. - పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు దుష్టపాలన అంతం చే సేందుకు... రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ దుష్టపాలనను అంతం చేసేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు మాయ మాటలను నమ్మి టీడీపీకి ఓటువేశామని ప్రజలు బాధపడుతున్నారు. మేకవన్నె పులి చంద్రబాబునాయుడు. ఎన్నికలకు ముందు హామీలు గుప్పించారు. అధికారం చేపట్టాక తన అసలు నైజం చూపుతున్నారు. రాష్ట్రంలోని కార్మికులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. బాబు వస్తే జాబు గ్యారెంటీ అని ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే దుస్థితికి దిగజారారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు 14లక్షల మంది ఉన్నారని, రజకులు 18లక్షల మంది ఉన్నారని, వీరందరికీ ఇళ్లు ఇస్తామని వాగ్దానం చేశారు. వాటి అమలు ఊసే లేదు. మూసివేసిన సుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెప్పారు. ఇపుడు ఉన్న ఫ్యాక్టరీలను మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులను ఎక్కడ రెగ్యులర్ చేయాల్సి వస్తుందోనని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. - పి.గౌతంరెడ్డి, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడుబంగారు తల్లిని మహాలక్ష్మి పథకంగా మార్చి ఆదుకుంటానన్నావు... ఇప్పటికీ ఏ ఒక్కరికీ లబ్ధిచేకూర్చలేదు... కనీసం చిల్లిగవ్వ విదల్చలేదు.. ప్రకృతి విపత్తులతో రైతులు అల్లాడుతున్నా సర్వేలతోనే కాలక్షేపం చేస్తున్నావు.. ఇంకా ఎన్నాళ్లు మోసపూరిత పాలన సాగిస్తూ కాలం వె ళ్లదీస్తావంటూ సీఎం చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ సీపీ నేతలు ధ్వజమెత్తారు. శ్రీకాకుళం పట్టణంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నేతలు సీఎం చంద్రబాబు మోసపూరిత పాలన , నేతల ఏకపక్ష నిర్ణయాలపై మండిపడ్డారు. హామీలు అమలుకు ప్రజలతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. - శ్రీకాకుళం అర్బన్ బాబు మేనిఫెస్టో అబద్ధాల పుట్ట సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ప్రకటించిన మేనిఫెస్టో ఒక అబద్దాల పుట్ట. అధికారంలోకి వచ్చి 6 నెలలు గడచినా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. దీనికి నిరసనగానే డిసెంబర్ 5న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నా చేస్తాం. జిల్లాపై తుపాను విరుచుకుపడినా రైతులకు చిల్లి గవ్వ సాయం చేయలేదు. బాబుకు మొదటినుంచి వెన్నుపోటుదారునిగా పేరుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే తత్వం దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డిది. కప్పదాటు గెంతులు వేసే తత్వం చంద్రబాబుది. జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు అధికారాన్ని అడ్డంపెట్టుకుని దౌర్జన్యంతో రాజకీయాలు చేస్తున్నారు. కలిసి ప్రతిఘటిద్దాం. - ధర్మాన కృష్ణదాస్, వైస్సార్ సీపీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు మహా ధర్నాను విజయవంతం చేద్దాం హామీల అమలులో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ డిసెంబర్ 5న చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేద్దాం. చంద్రబాబు పాలన దుర్మార్గంగా ఉంటుందని ప్రజలకు ముందే తెలుసు. రుణమాఫీ జరుగుతుందనే ఒకేఒక్క ఆశతో ఓటేసి గెలిపించారు. అధికారం చేపట్టాక బాబు నైజం బయటపడింది. బాబుకు వ్యవసాయంపై ఎన్నడూ ఆసక్తి లేదు. ఇప్పుడూ రైతుపై అదే ధోరణి కనబరుస్తున్నారు. టీడీపీ నేతలను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయి. - ధర్మాన ప్రసాదరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పార్టీని సంస్థాగతంగా నిర్మిద్దాం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేద్దాం. ఏ రాజకీయ పార్టీకైనా అనుబంధ సంఘాలే ప్రధానం. అవి పటిష్టంగా ఉంటే పార్టీ మరింత ఉత్సాహంగా పనిచేస్తుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి అర్హులైన లబ్ధిదారుల పింఛన్లు రద్దుచేశారు. ఆదర్శరైతులు, అంగన్వాడీలు, రేషన్‌డీలర్లు, ఉపాధిహామీఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగినా ఉద్యమిద్దాం. డిసెంబర్ 5న పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న మహాధర్నా చారిత్రాత్మకంగా నిలిచిపోయేలా చేద్దాం. - తమ్మినేని సీతారాం, వైఎస్సార్ సీపీ హైపవర్ కమిటీ సభ్యుడు టీడీపీ అరాచకాలను వివరిద్దాం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఆచరణలోకి తేకపోవడం విచారకరం. రుణాల మాఫీ చేస్తామని చెప్పి కొర్రీలు వేస్తున్నారు. సర్వేలతో కాలక్షేపం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అరాచకాలను ప్రజలకు వివరిద్దాం. కుల, మతాలకు అతీతంగా దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమపథకాలు అందజేస్తే... ఇప్పుడు కమిటీల పేరుతో జిల్లాలో అర్హులైన 28 వేల మంది పింఛన్‌దారులను తొలగించారు. ఇదెక్కడి ప్రభుత్వం. కొద్దికాలంలోనే ప్రభుత్వ పతనం ఖాయం. - రెడ్డి శాంతి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు వ్యవసాయం దండగన్న చంద్రబాబు రాష్ట్రంలో వ్యవసాయం దండగనే అభిప్రాయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు బలంగా ఉంది. అందువల్లే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం కల్పించడం లేదు. రైతాంగానికి పెద్దపీట వేస్తామని చెప్పి వారిని విస్మరిస్తున్నారు. విద్యార్థులకు, వికలాంగులకు, నిరుద్యోగులను మోసగిస్తున్నారు. ఎస్సీలను నట్టేట ముంచిన వ్యక్తిగా బాబు నిలిచారు. జిల్లా పోరాటాల గడ్డ, ఇక్కడినుంచే ప్రభుత్వంపై పోరుకు ఉద్యమిద్దాం. - మేరుగ నాగార్జున, పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు పోరాటంతోనే సమస్యల పరిష్కారం పోరాటంతోనే ప్రజాసమస్యలు పరిష్కారమవుతా యి. రాష్ట్రంలో రాజ్యాంగం ద్వారా ఏర్పడిన ప్రభుత్వ పాలన లేదు. అధికార పార్టీ వేధింపులతోనే కాలయాపన చేస్తున్నారు. జిల్లాలో మంత్రి, విప్‌లు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కమిటీల్లో సభ్యులుగా రౌడీషీటర్లు, టీడీపీ తొత్తులను చేర్చారు. - కలమట వెంకటరమణ, పాతపట్నం ఎమ్మెల్యే ప్రజల పక్షాన పోరాడుదాం తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ఇబ్బందులు పడుతున్న ప్రజల పక్షాన వైఎస్సార్సీపీగా పోరాడుదాం. ప్రతి కార్యకర్త ఒక సైనికునివలే పనిచే సి పార్టీ బలోపేతానికి కృషిచేద్దాం. చంద్రబాబు పాలన ఆలీబాబా-అరడజను దొంగలు మాదిరిగా ఉంది. అందులో మొదటి దొంగ జిల్లా మంత్రి అచ్చెన్నాయడు. దొంగల దగ్గరే దోచుకునే గజదొంగ. ప్రజల తరఫున నిలబడే వ్యక్తిని, ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిని తొక్కేయడమే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తోంది. నీచుడు, నికృష్టుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబునాయుడే అని సాక్షాత్తు దివంగత ఎన్టీ రామారావే అన్నారు. -చెవిరెడ్డి భాస్కరరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్రస్థాయి వలంటీర్ల కమిటీ అధ్యక్షుడు రైతులకు అన్యాయం టీడీపీ పాలనలో రైతులకు ఎన్నడూ అన్యాయమే జరుగుతోంది. గత తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో రైతులకు ఎంత అన్యాయం జరిగిందో ఈ ఆరు నెలల పాలనలో అంత జరిగింది. - ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, రాష్ట్రస్థాయి రైతు కమిటీ అధ్యక్షుడు ప్రజావ్యతిరేక ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగుతోంది. జిల్లాలోని అధికారపార్టీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. హుద్‌హుద్ తుపానుతో పాలకొండ నియోజకవర్గంలోని భామిని, సీతంపేట మండలాలు పూర్తిగా దెబ్బతిన్నా చిల్లిగవ్వ సాయం లేదు. గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. నిజమైన పేదలకు న్యాయం చేయకపోతే ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. - విశ్వసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే దుష్టపాలన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి రాష్ట్రంలో దుష్టపాలన సాగుతోంది. గతంలో ఎన్నడూ ఇలాంటి పాలన చూడలేదు. కమిటీలు వేసి అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడుతున్నారు. తుపానుకు పంటలు, ఇళ్లు, సర్వం కోల్పోయిన వారిని విడిచిపెట్టి టీడీపీ లబ్ధిదారులకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. వీటన్నింటిపైనా తిరగబడాలి. పోరుబాట సాగించాలి. - కంబాల జోగులు, రాజాం ఎమ్మెల్యే అండగా ఉంటాం ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పార్టీ రాష్ట్ర లీగల్‌సెల్ తరఫున అం డగా ఉంటాం. మనోధైర్యం కోల్పోకుండా ప్రభుత్వం చేసే దుర్మార్గాలను ఎదిరిద్దాం. టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన అడ్డగోలు జీవోలపై పోరాడుదాం. ప్రతి కార్యకర్తకూ అన్యాయం జరగకుండా చూద్దాం. కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు పూర్తిస్థాయి భరోసా కల్పిద్దాం. - పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు దుష్టపాలన అంతం చే సేందుకు... రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ దుష్టపాలనను అంతం చేసేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు మాయ మాటలను నమ్మి టీడీపీకి ఓటువేశామని ప్రజలు బాధపడుతున్నారు. మేకవన్నె పులి చంద్రబాబునాయుడు. ఎన్నికలకు ముందు హామీలు గుప్పించారు. అధికారం చేపట్టాక తన అసలు నైజం చూపుతున్నారు. రాష్ట్రంలోని కార్మికులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. బాబు వస్తే జాబు గ్యారెంటీ అని ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే దుస్థితికి దిగజారారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు 14లక్షల మంది ఉన్నారని, రజకులు 18లక్షల మంది ఉన్నారని, వీరందరికీ ఇళ్లు ఇస్తామని వాగ్దానం చేశారు. వాటి అమలు ఊసే లేదు. మూసివేసిన సుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెప్పారు. ఇపుడు ఉన్న ఫ్యాక్టరీలను మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులను ఎక్కడ రెగ్యులర్ చేయాల్సి వస్తుందోనని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. - పి.గౌతంరెడ్డి, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు