నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట) : ముంపు గ్రామ ప్రజలకు ఉద్యోగాల కోసం ఎదురుచూపులే మిగిలాయి. పునరావాస చట్టం అడుగడుగునా ఉల్లంఘనకు గురవుతోంది. కండలేరు జలాశయం నిర్మాణంకోసం 1985లో భూసేకరణ ప్రారంభించారు. రాపూరు మండలంలో 19 గ్రామాలను ముంపు గ్రామాలుగా గుర్తించారు. 1100 మంది నిరుద్యోగులను ఆయా ప్రాతిపదికన ఆధారంగా జాబితాను రూపొందించారు. ఇప్పటివరకు 191 మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. మిగిలిన 909 మంది ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. మొదటి విడతగా 2000 సంవత్సరంలో ఇంటర్వూ్యలు నిర్వహించారు. వారిలో సైతం ఇంకా ఉద్యోగాలకోసం పడిగాపులు కాస్తున్నారు. దీనికితోడు ఐదేళ్లుగా 700 మంది అర్జీలు పట్టుకుని తాము ఉద్యోగాలకు అర్హులమంటూ తమ పేర్లను జాబితాలో చేర్చాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
తాజాగా ఖాళీలు ప్రకటన
ముంపు గ్రామాల వారికి ఇరిగేషన్‌శాఖలోని కండలేరు, తెలుగుగంగ, సోమశిల ప్రాజెక్ట్‌లలో ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. తాజాగా ఈఎన్‌సీ (ఇంజనీర్ ఇన్ చీఫ్) ద్వారా నెల్లూరులో 19, ప్రకాశం జిల్లాలో 11, సోమశిల ప్రాజెక్ట్‌లో 18 ఖాళీలను ప్రకటించారు.
జోనల్ సిస్టం..కిరికిరి
జలవనరులశాఖలో నెల్లూరు, ప్రకాశం 3వ జోన్‌లో, కడప, చిత్తూరు 4వ జోన్‌లో ఉన్నాయి. పునరావాస చట్టం ద్వారా ఏ జోన్‌లో ఖాళీలను అదే జోన్‌లో భర్తీ చేయాల్సి ఉంది. అయితే గతంలో జరిగిన భర్తీలో రాజ కీయ ఒత్తిళ్లతో జోనల్ సిస్టం పక్కన పెట్టి జిల్లా వాసు లకు అన్యాయం చేశారు. అప్పట్లో జిల్లాకు చెందిన నిరుద్యోగులు ఆందోళన చేశారు. తాజాగా వెలువడిన ప్రక టనతో మళ్లీ జిల్లాకు అన్యాయం జరుగుతుందని నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇతర జిల్లాలకు ఉద్యోగాలు ఇప్పించడంలో ఇరిగేషన్ ఉన్నతాధికారు లు, రాజకీయ నాయకులు చూపుతున్న శ్రద్ధ జిల్లా వాసులపై లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో ఉన్న ఖాళీలను తెలుగుగంగ, కండలేరు, సోమశిలలోనే కాకుండా ఇతర డిపార్ట్‌మెంట్లలోనైనా ఉద్యోగాలు ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
నిరుద్యోగభృతి కల్పించాలి
ముంపు గ్రామాలవారికి ఇచ్చిన హామీలను, జీఓ లను పాలకులు ఉల్లం ఘించారు. అర్హులైన నిరుద్యోగులకు నెలకు రూ.10 వేలు నిరుద్యోగభృతి కల్పించాలి. కా లువల పర్యవేక్షణకు 150 లష్కర్లు,అదేస్థాయిలో సూపర్‌వైజర్ల పోస్టులు ఖాళీగాఉన్నాయి.వాటిని భర్తీ చేసినా ముంపు వాసులకు న్యాయం జరుగుతోంది. ఇతర జోన్ల వారికి ఉద్యోగాలు ఇస్తే ఉద్యమిస్తాం.
– మిడతల రమేష్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు
నిరీక్షణ
Published Tue, Feb 7 2017 12:39 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement
Advertisement