..ప్చ్.. ఉపాధి లేదు! | unemployment in srikakulam district | Sakshi
Sakshi News home page

..ప్చ్.. ఉపాధి లేదు!

Published Fri, Jun 3 2016 10:35 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

unemployment in srikakulam district

► ఎన్నికల హామీలను విస్మరించిన సర్కార్
► నిరుద్యోగులను వంచించిన చంద్రబాబు
► కానరాని నిరుద్యోగ భృతి

 
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తెలుగుదేశం ప్రభుత్వం విస్మరించిందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. సంవత్సరానికి లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం..లేదా నిరుద్యోగ భృతి ఇస్తామని చేసిన వాగ్దానం ఏమైందని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు హామీలను నమ్మి మోసపోయూమని, రెండేళ్ల టీడీపీ పాలనలో ఎవరికీ ఉపాధి కల్పించలేదని, భృతి చెల్లించలేదని ఆవేదన చెందుతున్నారు. తమ ఓట్లతో గద్దెనెక్కిన సర్కార్‌కు తగిన సమయంలో గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.

వేలల్లో పేర్లు నమోదు
ఉద్యోగం ఇవ్వలేకపోతే జీవన భృతి కింద ఏటా రూ.2 వేలు చెల్లిస్తామని ఎన్నికల సమయంలో టీడీపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచారు. ఈ మాటలను నమ్మిన 42 వేల మంది డీఆర్‌డీఏలో పేర్లు నమోదు చేసుకున్నారు. వీరంతా ఇప్పుడు భృతి కోసం ఎదురు చూస్తున్నారు.
 -  ఉపాధి కల్పనా కార్యాలయంలో నమోదౌతున్న వారి సంఖ్య ఏటా 18 వేల వరకు ఉంది. రెండేళ్లలో 36 వేల మంది తమ పేర్లను నమోదు చేసుకున్నప్పటికీ ఒక్కరికి కూడా ఉపాధి లేదు. ఇదిలా ఉంటే జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయంలో మొత్తం 4.76 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగం, ఉపాధి కోసం ఎదురు చూస్తున్నారు. అలా నమోదైనవారికి ఇంతవరకు భృతి చెల్లించాలన్నా నెలకు రూ.95 కోట్లు అవసరం.
 
శ్రీకాకుళం టౌన్, పీఎన్. కాలనీ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాన్ని కూడా విస్మరించడం తగదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు రుణం, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని నమ్మించి.. వారిని మోసం చేసిన బాబు..అదే కోవలో తమను కూడా కలిపేశారని మండిపడుతున్నారు. ఇప్పటి వరకూ జిల్లాలో ఏ ఒక్కరికీ ఉపాధి కల్పించలేదని, నిరుద్యోగ భృతి ఇవ్వక పోవడం దారుణమని, టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేండేళ్లయిన సందర్భంగానవనిర్మాణం దీక్ష పేరుతో హామీలను పక్కదోవ పట్టించేందుకు మరో ప్రతిజ్ఞ చేస్తుండడం విడ్డూరంగా ఉందంటున్నారు. జాబు కావాలంటే బాబు రావాలన్నారని, అరుుతే అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు.
 
జిల్లాలో పరిస్థితి ఇలా..

జిల్లాలో వేలాది మంది నిరుద్యోగులు ఉన్నారు. వీరిలో డిగ్రీలు, పీజీలు, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఇతరత్రా కోర్సులు చేసిన వారు చాలామంది ఖాళీగా ఉన్నారు. వీరంతా ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మారు. ఉద్యోగం వస్తోందని, ఉద్యోగం, ఉపాధి లేకపోతే కనీసం నెలకు రెండు వేల రూపాయల చొప్పున భృతి అందుతోందని ఆశించారు. నిజమని భావించి ఓట్లు గుమ్మరించారు. అరుుతే అధికారంలోకి వచ్చిన తరువాత వాగ్దానానికి పాతరేశారు. దీంతో ఉపాధి లేక, భృతి అందక బతుకు తెరవు కోసం చాలామంది వలసబాట పడుతున్నారు. 18 ఏళ్ల వయసు రాగానే రాజ్యాంగ బద్ధంగా ఓటుహక్కును కల్పిస్తున్న ప్రభుత్వం ఉపాధి కల్పనపై మాత్రం శ్రద్ధ చూపడం లేదు. ఏటా ఉద్యోగాల ఖాళీల సంఖ్య పెరిగినా వాటిని భర్తీ చేయడం లేదు. బీటెక్, ఎంటెక్ పూర్తిచేసుకున్న సాంకేతిక విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారు.
 
జిల్లా నుంచి అధికారిక లెక్కల ప్రకారం ఆరువేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉపా ధి లేక నిరుద్యోగులుగా ఉన్నారు. రెండేళ్లలో అన్ని తరగతుల నుంచి డీఆర్‌డీఏ పరిధిలో పేర్లు నమోదు చేసుకున్న యువత మరో 42 వేల మం ది ఉన్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నారు. అయితే  1.16 లక్షల మంది నిరుద్యోగు లు ఉన్నట్టు అనధికార లెక్కల ప్రకారం తెలుస్తోంది. మరికొంత మంది బాబును నమ్మడం మానేసి ఉపాధినిచ్చే శిక్షణ  సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రాబ్యాంకుతోపాటు అనేక శిక్షణ సంస్థలు జిల్లాలో ఏటా 14 వేల మందికి మెళకువలు నేర్పి ఇతర రాష్ట్రాలకు పంపిస్తున్నారు.
 
ఇంజినీరింగ్ పట్టభద్రుల పరిస్థితి ఇలాఉంటే బీఎడ్, ఇతర కోర్సులు పూర్తిచేసుకున్న వారిసంఖ్య జిల్లాలో లక్షల్లో ఉన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాల నియూమకం విషయూనికి వస్తే... 2014 డీఎస్సీ నియామకాలే ఇప్పటికీ పూర్తి చేయలేదు. యూనియన్ పబ్లిక్ సర్వీసుకమిషన్ నోటిఫికేషన్ జారీలో అలసత్వం కొనసాగుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement