అందని భృతి.. అథోగతి! | earning preposterous! | Sakshi
Sakshi News home page

అందని భృతి.. అథోగతి!

Published Fri, Mar 11 2016 11:37 PM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM

అందని భృతి.. అథోగతి! - Sakshi

అందని భృతి.. అథోగతి!

ఎన్నికల హామీని తుంగలో తొక్కిన బాబు సర్కారు
నిరుద్యోగ భృతి పథకమే లేదని తేల్చేసిన కార్మికమంత్రి
జిల్లాలో ఒక్కరికీ దక్కని ఉద్యోగం
ఖాళీల భర్తీ జోలికెళ్లని రాష్ట్ర ప్రభుత్వం
ఏటా పెరుగుతున్న  నిరుద్యోగులు
బూటకపు  హామీలతో ముంచేశారని  ఆవే
దన
 
‘ఇంటికో ఉద్యోగం కావాలంటే బాబు రావాలి. ఉద్యోగం ఇవ్వలేక పోతే నెలకు రూ. 2 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే బాబు రావాలి.. తమ్ముళ్లూ మీ కలలు సాకారం చేయబోతున్నా’..   
 
విశాఖపట్నం: ‘నిరుద్యోగులను ముఖ్యమంత్రి చంద్రబాబు నిలువునా ముంచేశారు. ఉద్యోగమో.. నిరుద్యోగ భృతో వస్తుందన్న గంపెడాశతో ఓట్లేస్తే పీఠమెక్కాక దగా చేశారు’. ఇప్పుడు జిల్లాలోని ఏ ఇంట చూసినా, ఏ నలుగురు యువకులు కలిసినా ఇదే మాట. మాటిచ్చి రెండేళ్లవుతున్నా ఉద్యోగాల ఊసు లేదు.. నిరుద్యోగ భృతీ లేదంటూ నిట్టూరుస్తున్నారు. కొన్నాళ్ల నుంచి సీఎం వైఖరిలో వస్తున్న మార్పును చూసి నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వాలని, లేదంటే నిరుద్యోగ భృతైనా ఇవ్వాలని అసెంబ్లీలో పట్టుపడుతున్నా పట్టించుకోకపోగా ఆయనపై ఎదురుదాడి చేస్తుండడంతో వీరిలో రోజురోజుకూ ఆశలు సన్నగిల్లుతున్నాయి.

పది లక్షల కుటుంబాలకు నిరాశ..
సుమారు 44 లక్షల జనాభా కలిగిన విశాఖపట్నం జిల్లాలో 11 లక్షల కుటుంబాలున్నాయి. వీటిలో అర్బన్‌లో 5.20 లక్షలు, రూరల్‌లో 5.80 లక్షల కుటుంబాలు ఉన్నాయి.  జిల్లావ్యాప్తంగా 13.50 లక్షల మంది  రేషన్ కార్డుదారులున్నారు. వీరిలో 12.30 లక్షల వరకు తెల్లరేషన్‌కార్డులు కలిగి ఉన్నారు. వీరంతా పేద, మధ్య తరగతికి చెందినవారే. ఉద్యోగమో.. నిరుద్యోగ భృతికో అర్హులే. వీరిలో కనీసం పది లక్షల కుటుంబాలకైనా బాబు ఇచ్చిన వాగ్దానం ప్రకారం జాబు గానీ, నిరుద్యోగ భృతి గానీ ఇవ్వాల్సి ఉన్నట్టు అంచనా. ఇక జిల్లాలోని 35 ఇంజినీరింగ్ కళాశాలల్లో 25 వేల మంది. పాలిటెక్నిక్, ఐటీఐలు, డిగ్రీ కళాశాలల నుంచి 50 వేలు మంది, పీజీ, బీఈడీ, నర్సింగ్, ఫార్మశీ కళాశాలల నుంచి 25 వేల మంది వెరసి లక్ష మందికి పైగా ఏటా పట్టాలతో బయటకొస్తున్నారు. వీరిలో 20 శాతం మంది పై చదువులకు, ఇతర ఉద్యోగాలకు బయటకు వెళ్తున్నారు. మరో 30 శాతం మంది ఇతర ప్రాంతాలు, జిల్లాల వారుంటున్నారు. మిగిలిన 50 వేల మంది నిరుద్యోగుల జాబితాలో అదనంగా చేరుతున్నారు.

సర్వే లెక్క ప్రకారం.. 2.60 లక్షల మంది
గత ఏడాది నిర్వహించిన ‘జన్మభూమి-మా ఊరు’ సర్వే ప్రకారం జిల్లాలో ఇంజినీరింగ్, పీజీ, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్స్ విభాగాల్లో 1,05,995 మంది ఉన్నారు. వీరిలో మహిళలు 65.050 మంది, పురుషులు 40,945 మందిగా తేల్చారు. స్కిల్డ్ అప్‌గ్రేడేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు మరో 1,55,898 మంది ఉన్నారు. జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజీల్లో ఉద్యోగాల కోసం నమోదు చేయించుకున్న వారి సంఖ్య లక్షా 2 వేలు. వీరిలో నాన్ టెక్నికల్ 65 వేలు, టెక్నికల్ 37 వేల మంది ఉన్నారు. వీరంతా బాబు వస్తే జాబు వస్తుందని ఎంతో ఆశపడ్డారు. చివరకు డీఎస్సీ-2014లో జిల్లాకు ప్రకటించిన 1056 ఉపాధ్యాయ పోస్టులను నేటికీ భర్తీ చేయలేదు.  

ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి..
కొత్త జాబులు లేకపోగా చిరుద్యోగాల్లో ఉన్న వారిని తొలగించి వారి పొట్టకొట్టారు. చాలా విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని ఏవో సాకులు చెబుతూ బాబు ప్రభుత్వం రోడ్డున పడేసింది. రాష్ర్టంలో అన్ని ప్రభుత్వ శాఖల్లో 1.45 లక్షల పోస్టులు ఖాళీగా ఉంటే.. వీటిలో కనీసం పదో వంతైనా భర్తీ చేస్తారని నిరుద్యోగ యువత కళ్లలో వత్తులేసుకుని ఎదురుచూస్తోంది. కనీసం నిరుద్యోగ భృతి అయినా ఇస్తుందని జిల్లాలోని ప్రతి పేద, మధ్యతరగతి ఇల్లూ ఆశిస్తోంది.  సీఎం చంద్రబాబు హామీ మేరకు తెల్లరేషన్ కార్డులున్న ప్రతి నిరుద్యోగి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలి. లేదంటే ఒక్కో నిరుద్యోగికి నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలి. కానీ ఇప్పటిదాకా విశాఖ జిల్లాలో ఎంతమందికి ఉద్యోగాలొచ్చాయి? ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారు? అంటే ఒక్కరంటే ఒక్కరికీ అవి దక్కలేదనే సమాధానం వస్తుంది.  
 
నమ్మి మోసపోయాం
మాది శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం. గిరిజన సవర తెగకు చెందిన నేను ఎంఎస్సీ, బీఈడీ పూర్తి చేశాను. నా భార్య బీఎస్సీ, బీఈడీ చదివింది. ఇద్దరికీ ఉద్యోగం లేదు. అధికారంలోకి వస్తే ఉద్యోగం ఇస్తాను.. లేకపోతే ప్రతినెలా నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఆశగా ఎదురుచూస్తున్న మాకు నిరాశే మిగిలింది. సొంత ఊరులో బతుకు భారమై పోట్ట పోషణ కోసం భార్యాపిల్లలతో గత ఏడాది విశాఖపట్నం వచ్చి చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాం. ఉత్తుత్తి హామీలతో నమ్మించి మోసం చేశారు.
 -చిన్నారావు, విశాఖపట్నం
 
 
 
 
 
 2014 ఎన్నికల సమయంలో ఈ రకమైన ప్రచారంతో ఊదరగొట్టి జనం ఓట్లు పోగేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు రెండేళ్లు కావస్తున్నా ఇంత వరకు ఇంటికో ఉద్యోగం ఊసే లేదు. ఉద్యోగం ఇవ్వకపోయినా నెలకు రూ. 2 వేల భృతి అయినా ఇస్తారన్న నిరుద్యోగుల ఆశలు అటువంటి పథకమే లేదని అసెంబ్లీలో కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు చేసిన ప్రకటనతో కుప్పకూలిపోయాయి. చంద్రబాబు హామీలు నమ్మి మోసపోయామని జిల్లా ప్రజలు ఆవేదన
 చెందుతున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement