అభివృద్ధి జాడేది బాబూ..?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే మాటలకు .. చేసే పనులకు ఏమాత్రం పొంతన లేదంటే ఇదే. జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పిన ఆయన రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ధి మేడిపండు చందంగానే ఉంది. ఈ నేపథ్యంలో తమకు నియోజకవర్గ నిధులు కేటారుుంచాలన్న విపక్ష ఎమ్మెల్యేల వినతిని ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. పైగా ఇప్పటికే భారీ స్థారుులో అభివృద్ధి చేశామని బదులిచ్చారు. ఈనేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న ఏడు నియోజకవర్గాల్లో పరిస్థితిపై కథనం..
‘ చిత్తూరు నా సొంతజిల్లా.. మాపార్టీకి అధికారం ఇస్తే.. ప్రత్యేక ప్రణాళికతో జిల్లాను అభివృద్ధి చేస్తా.. ఇక్కడి ప్రజలందరికీ పెద్దబిడ్డగా ఉంటా.. యువతకి, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తా.. కొత్త పరిశ్రమలు తీసుకొస్తా.. ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ భృతి ఇస్తా, ఆరు నూరైనా.. హంద్రీనీవాను పూర్తి చేస్తా.. పడమటి మండలాల్లో వలసలను అడ్డుకుంటా..’’ ఇదీ తిరుపతి వెంకన్న సాక్షిగా జిల్లా ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాల చిట్టా. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపు.. ప్రస్తుతం పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లరుునా.. అభివృద్ధికి మాత్రం బీజం పడలేదు. జిల్లాకు ప్రాణవాయువుగా చెప్పుకునే హంద్రీనీవా నత్తను తలపిస్తోంది. ఇక హార్టికల్చర్ హబ్, రైతులకు కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం, గాలేరు నగరి ప్రాజెక్టు ఊసే వినిపించడం లేదు. పక్కాఇళ్లు, నిరుద్యోగ భృతిపై కనీసం స్పందించడం కూడా లేదు. పింఛన్ల బాధకు అంతేలేకుండా పోతోంది. ముఖ్యంగా విపక్ష ఎమ్మెల్యేలున్న 7 నియోజకవర్గాల్లో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడేఅన్న చందంగా మారింది. ప్రజల కష్టాలను చూసి చలించిపోరుున ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలసి తమ నియోజకవర్గాలకు నిధులు కేటారుుంచాలని కోరారు. కానీ ముఖ్యమంత్రి వారికి వింత సమాధానం ఇచ్చారు. తమ ప్రభుత్వం అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తోందని, విపక్ష ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లోనూ భారీగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని తేల్చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో పరిస్థితిపై ప్రత్యేక కథనం..
‘నియోజకవర్గ అభివృద్ధికి నిధులివ్వండి.. సమస్యలు పరిష్కరించండి’.. అని జిల్లాలోని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని అడిగితే.. సమస్యలు ఎక్కడున్నాయ్.. అన్నీ పరిష్కరించాం కదా.. అనే సమాధానం రావడంతో.. అవాక్కవడం ప్రతిపక్ష ఎమ్మెల్యేల వంతైంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు మాత్రమే ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేస్తుండటంపై ఇప్పుడిప్పుడే చర్చ మొదలవుతోంది. రాజకీయ పక్షపాతం చేసే పనుల వల్ల చివరికి తమకు అన్యాయం జరుగుతోందని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జంపింగ్ జపాంగ్‌కే.. తాంబూలాలు..
జిల్లాలో ఏకైక జంపింగ్ ఎమ్మెల్యే అమరనాథ్‌రెడ్డి ప్రాతిని థ్యం వహిస్తున్న పలమనేరుకు రూ.11 కోట్లు మంజూరు చేశారు. ఆ నియోజకవర్గంలో పింఛన్లు కూడా కొత్తగా 3 వేలకుపైగా మంజూరు చేయడం చర్చనీయాంశమైంది. సొంత ఎమ్మెల్యే అధికారంలో ఉంటేనే అభివృద్ధి నిధులు మంజూరు చేస్తారా..? అని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.