వంచనపై వైఎస్సార్‌ సీపీ ‘యువ’గర్జన | YSRCP Yuva Garjana in Andhra Pradesh against TDP government | Sakshi
Sakshi News home page

వంచనపై వైఎస్సార్‌ సీపీ ‘యువ’గర్జన

Published Tue, Aug 7 2018 12:22 PM | Last Updated on Mon, Aug 20 2018 6:07 PM

YSRCP Yuva Garjana in Andhra Pradesh against TDP  government - Sakshi

హైదరాబాద్‌: ప్రతీ ఇంటికీ ఉద్యోగం, నిరుద్యోగ భృతి పేరుతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మోసపూరిత వైఖరిని నిరసిస్తూ మంగళవారం పలు జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్‌ సీపీ యువజన, విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీలు చేపట్టారు. అనంతపురంలో వైఎస్సార్‌ విగ్రహం నుంచి కలెక్టరేట్‌ వరకూ వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ యాదవ్ నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ మేరకు నిరుద్యోగ భృతి పెంచాలని డిమాండ్‌ చేసిన  హరీష్ యాదవ్.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ యువతను ఆదుకోవాలన్నారు. మరొకవైపు నిరుద్యోగ భృతిపై చంద్రబాబు మోసం చేశారని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీ వెన్నపూసగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు. ఉద్యోగాల భర్తీలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందన్న వెన్నపూస గోపాల్‌ రెడ్డి... నిరుద్యోగ భృతిని వెయ్యి రూపాయలకు పరిమితం చేయడం అన్యాయమన్నారు.

నెల్లూరు జిల్లా; ముఖ్యమంత్రి చంద్రబాబు నిరుద్యోగులను వంచించారని ఆరోపిస్తూ నెల్లూరులో వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం, విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. బాబు వస్తే జాబు వస్తుందన్న హామీ ఏమైందంటూ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించిన అనంతరం  డీఆర్‌ఓకు వినతి పత్రం సమర్పించారు. ప్రస్తుతం ఉద్యోగాల్ని ఇవ్వకపోగా, ఉన్న ఉద్యోగాల్ని తొలగిస్తున్నారంటూ విద్యార్థి విభాగం అధ్యక్షుడు శ్రావణ్ కుమార్ విమర్శించారు. అదే సమయంలో నిరుద్యోగ భృతి విషయంలో చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు.

వైఎస్సార్ జిల్లా;  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నుండి కలెక్టర్ కార్యాలయం వరకు వైఎస్సార్ కాంగ్రెస్ యువజన, విద్యార్థి విభాగం నేతల నిరుద్యోగ వంచన ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ యువజన, విద్యార్థి  విభాగం కదం తొక్కింది. తక్షణమే నిరుద్యోగులకు రూ. 2000 భృతి చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు.

చిత్తూరు ; చిత్తూరు కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.  ఈ ర్యాలీలో వందలాది మంది విద్యార్థులతో పాటు ఎమ్మెల్యేలు సునీల్‌ కుమార్‌, డాక్టర్ నారాయణస్వామి, చిత్తూరు పార్లమెంట్ ఇంఛార్జి జంగాలపల్లి శ్రీనివాసులు పాల్గొన్నారు.

కృష్ణా : వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వంచనపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు వంగవీటి రాధా, వెల్లంపల్లి, మల్లాది విష్ణు, విద్యార్థి విభాగం నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. నిరుద్యోగులకు చంద్రబాబు నాయుడు నిలువునా ముంచారని మండిపడ్డారు. ఎన్నికలు వస్తున్నాయనే హడావిడిగా నిరుద్యోగ భృతి ప్రకటించారని వ్యాఖ్యనించారు. చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది నిరుద్యోగులు రొడ్డున పడ్డారని విమర్శించారు.

విశాఖపట్నం : నిరుద్యోగులపై సీఎం చంద్రబాబు తీరుకు వ్యతిరేకంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరుద్యోగ వంచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌ఐసీ అంబెద్కర్‌ సర్కిల్‌ నుంచి జీవీఎమ్‌సీ గాంధీ విగ్రహం వరకు భారీ ర్యాలీని నిర్వహించారు. డీఆర్వో చంద్రశేఖర్‌ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.

పశ్చిమ గోదావరి : సీఎం చంద్రబాబు నిరుద్యోగులను మోసం చేశారంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరుద్యోగ వంచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరులోని వైఎస్సార​సీపీ జిల్లా కార్యాలయం నుంచి కలెక్టరేట్‌ వరకు నిరసన ర్యాలీని చేపట్టారు. ఈ యేరకు అధికారులకు వినతిపత్రం అందించారు. చింతలపుడి వైఎస్సార్‌సీపీ కన్వీనర్‌ ఎలిజా ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. చింతలపుడి నుంచి ఏలూరు కలెక్టరేట్‌ వరకు నిరుద్యొగులు భారీ బైక్‌ ర్యాలీని చేపట్టారు.

తూర్పు గోదావరి : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యవజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరుద్యొగ వంచన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  వైఎస్సార్‌సీపీ రాజోలు కోఆర్డినేటర్‌ బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

గుంటూరు : నిరుద్యోగులపై చంద్రబాబు తీరును నిరశిస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరుద్యోగ వంచన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు పాల్గొని మద్దతు తెలిపారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా కలెక్టరేట్‌ వద్ద వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగులను చంద్రబాబు మోసం చేశారని వైఎస్సార్‌సీపీ నేత ఆరోపించారు.

విజయనగరం : ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలో 300 బైక్‌లతో వైఎస్సార్‌సీపీ నేతలు నిరసన ర్యాలీని చేపట్టారు.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌ ర్యాలీని ప్రారంభించారు.

కర్నూలు జిల్లా: వైఎస్సార్‌సీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘నిరుద్యోగ వంచన’ కార్యక్రమం నిర్వహించారు. రాజ్‌విహార్‌ సెంటర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు భారీ ర్యాలీ తీశారు. ఎమ్మెల్యే గౌరు చరిత, సమన్వయకర్త హఫీజ్‌ఖాన్‌, వైఎస్సార్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫయాజ్‌ అహ్మద్‌ విద్యార్థులతో కలిసి మానవహారం, రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement