ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తావు బాబూ.. | District wide range meeting at ambethkar stadium in srikakulam | Sakshi
Sakshi News home page

ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తావు బాబూ..

Published Sat, Nov 29 2014 3:46 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

District wide range meeting at ambethkar stadium in srikakulam

అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ప్రకటించావు.. నిరుద్యోగులకు రూ.1500 నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు.. ఇంటికో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పావు.. బాబు వస్తే జాబు గ్యారంటీ అని ప్రచారం చేశావు..  బంగారు తల్లిని మహాలక్ష్మి పథకంగా మార్చి ఆదుకుంటానన్నావు... ఇప్పటికీ ఏ ఒక్కరికీ లబ్ధిచేకూర్చలేదు... కనీసం చిల్లిగవ్వ విదల్చలేదు.. ప్రకృతి విపత్తులతో రైతులు అల్లాడుతున్నా సర్వేలతోనే కాలక్షేపం చేస్తున్నావు.. ఇంకా ఎన్నాళ్లు మోసపూరిత పాలన సాగిస్తూ కాలం వె ళ్లదీస్తావంటూ సీఎం చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ సీపీ నేతలు ధ్వజమెత్తారు. శ్రీకాకుళం పట్టణంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నేతలు సీఎం చంద్రబాబు మోసపూరిత పాలన , నేతల ఏకపక్ష నిర్ణయాలపై మండిపడ్డారు. హామీలు అమలుకు ప్రజలతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.       - శ్రీకాకుళం అర్బన్
 
బాబు మేనిఫెస్టో అబద్ధాల పుట్ట
సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ప్రకటించిన మేనిఫెస్టో ఒక అబద్దాల పుట్ట. అధికారంలోకి వచ్చి 6 నెలలు గడచినా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. దీనికి నిరసనగానే డిసెంబర్ 5న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్‌ల వద్ద ధర్నా చేస్తాం. జిల్లాపై తుపాను విరుచుకుపడినా రైతులకు చిల్లి గవ్వ సాయం చేయలేదు. బాబుకు మొదటినుంచి వెన్నుపోటుదారునిగా పేరుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే తత్వం దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డిది. కప్పదాటు గెంతులు వేసే తత్వం చంద్రబాబుది. జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు అధికారాన్ని అడ్డంపెట్టుకుని దౌర్జన్యంతో రాజకీయాలు చేస్తున్నారు. కలిసి ప్రతిఘటిద్దాం.  
- ధర్మాన కృష్ణదాస్, వైస్సార్ సీపీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు
 
మహా ధర్నాను విజయవంతం చేద్దాం
హామీల అమలులో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ డిసెంబర్ 5న చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేద్దాం. చంద్రబాబు పాలన దుర్మార్గంగా ఉంటుందని ప్రజలకు ముందే తెలుసు. రుణమాఫీ జరుగుతుందనే ఒకేఒక్క ఆశతో ఓటేసి గెలిపించారు. అధికారం చేపట్టాక బాబు నైజం బయటపడింది. బాబుకు వ్యవసాయంపై ఎన్నడూ ఆసక్తి లేదు. ఇప్పుడూ రైతుపై అదే ధోరణి కనబరుస్తున్నారు.  టీడీపీ నేతలను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయి.
- ధర్మాన ప్రసాదరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
 
పార్టీని సంస్థాగతంగా నిర్మిద్దాం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేద్దాం. ఏ రాజకీయ పార్టీకైనా అనుబంధ సంఘాలే ప్రధానం. అవి పటిష్టంగా ఉంటే పార్టీ మరింత ఉత్సాహంగా పనిచేస్తుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి అర్హులైన లబ్ధిదారుల పింఛన్లు రద్దుచేశారు. ఆదర్శరైతులు, అంగన్‌వాడీలు, రేషన్‌డీలర్లు, ఉపాధిహామీఫీల్డ్ అసిస్టెంట్‌లను తొలగించారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగినా ఉద్యమిద్దాం. డిసెంబర్ 5న పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న మహాధర్నా చారిత్రాత్మకంగా నిలిచిపోయేలా చేద్దాం.
- తమ్మినేని సీతారాం, వైఎస్సార్ సీపీ హైపవర్ కమిటీ సభ్యుడు
 
టీడీపీ అరాచకాలను వివరిద్దాం
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఆచరణలోకి తేకపోవడం విచారకరం. రుణాల మాఫీ చేస్తామని చెప్పి కొర్రీలు వేస్తున్నారు. సర్వేలతో కాలక్షేపం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అరాచకాలను ప్రజలకు వివరిద్దాం.  కుల, మతాలకు అతీతంగా దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమపథకాలు అందజేస్తే... ఇప్పుడు కమిటీల పేరుతో జిల్లాలో అర్హులైన 28 వేల మంది పింఛన్‌దారులను తొలగించారు. ఇదెక్కడి ప్రభుత్వం. కొద్దికాలంలోనే ప్రభుత్వ పతనం ఖాయం.
- రెడ్డి శాంతి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
 
వ్యవసాయం దండగన్న చంద్రబాబు
రాష్ట్రంలో వ్యవసాయం దండగనే అభిప్రాయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు బలంగా ఉంది. అందువల్లే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం కల్పించడం లేదు. రైతాంగానికి పెద్దపీట వేస్తామని చెప్పి వారిని విస్మరిస్తున్నారు. విద్యార్థులకు, వికలాంగులకు, నిరుద్యోగులను మోసగిస్తున్నారు. ఎస్సీలను నట్టేట ముంచిన వ్యక్తిగా బాబు నిలిచారు. జిల్లా పోరాటాల గడ్డ, ఇక్కడినుంచే ప్రభుత్వంపై పోరుకు ఉద్యమిద్దాం.
- మేరుగ నాగార్జున, పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు
 
పోరాటంతోనే సమస్యల పరిష్కారం
పోరాటంతోనే ప్రజాసమస్యలు పరిష్కారమవుతా యి. రాష్ట్రంలో రాజ్యాంగం ద్వారా ఏర్పడిన ప్రభుత్వ పాలన లేదు. అధికార పార్టీ వేధింపులతోనే కాలయాపన చేస్తున్నారు. జిల్లాలో మంత్రి, విప్‌లు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కమిటీల్లో సభ్యులుగా రౌడీషీటర్లు, టీడీపీ తొత్తులను చేర్చారు.
- కలమట వెంకటరమణ, పాతపట్నం ఎమ్మెల్యే
 
ప్రజల పక్షాన పోరాడుదాం
తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ఇబ్బందులు పడుతున్న ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీగా పోరాడుదాం. ప్రతి కార్యకర్త ఒక సైనికునివలే పనిచే సి పార్టీ బలోపేతానికి కృషిచేద్దాం. చంద్రబాబు పాలన ఆలీబాబా-అరడజను దొంగలు మాదిరిగా ఉంది. అందులో మొదటి దొంగ జిల్లా మంత్రి అచ్చెన్నాయడు. దొంగల దగ్గరే దోచుకునే గజదొంగ. ప్రజల తరఫున నిలబడే వ్యక్తిని, ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిని తొక్కేయడమే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తోంది.  నీచుడు, నికృష్టుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబునాయుడే అని సాక్షాత్తు దివంగత ఎన్‌టీ రామారావే అన్నారు.                                    -చెవిరెడ్డి భాస్కరరెడ్డి,
- చంద్రగిరి ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్రస్థాయి వలంటీర్ల కమిటీ అధ్యక్షుడు
 
రైతులకు అన్యాయం
టీడీపీ పాలనలో రైతులకు ఎన్నడూ అన్యాయమే జరుగుతోంది. గత తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో రైతులకు ఎంత అన్యాయం జరిగిందో ఈ ఆరు నెలల పాలనలో అంత  జరిగింది.
- ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, రాష్ట్రస్థాయి రైతు కమిటీ అధ్యక్షుడు
 
ప్రజావ్యతిరేక ప్రభుత్వం
రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగుతోంది. జిల్లాలోని అధికారపార్టీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.  హుద్‌హుద్ తుపానుతో పాలకొండ నియోజకవర్గంలోని భామిని, సీతంపేట మండలాలు పూర్తిగా దెబ్బతిన్నా చిల్లిగవ్వ సాయం లేదు. గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.  నిజమైన పేదలకు న్యాయం చేయకపోతే ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.
- విశ్వసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే
 
దుష్టపాలన
తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి రాష్ట్రంలో దుష్టపాలన సాగుతోంది. గతంలో ఎన్నడూ ఇలాంటి పాలన చూడలేదు. కమిటీలు వేసి అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడుతున్నారు. తుపానుకు పంటలు, ఇళ్లు, సర్వం కోల్పోయిన వారిని విడిచిపెట్టి టీడీపీ లబ్ధిదారులకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. వీటన్నింటిపైనా తిరగబడాలి. పోరుబాట సాగించాలి.       
- కంబాల జోగులు, రాజాం ఎమ్మెల్యే
 
అండగా ఉంటాం
ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పార్టీ రాష్ట్ర లీగల్‌సెల్ తరఫున అం డగా ఉంటాం. మనోధైర్యం కోల్పోకుండా ప్రభుత్వం చేసే దుర్మార్గాలను ఎదిరిద్దాం. టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన అడ్డగోలు జీవోలపై పోరాడుదాం. ప్రతి కార్యకర్తకూ అన్యాయం జరగకుండా చూద్దాం. కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు పూర్తిస్థాయి భరోసా కల్పిద్దాం.
- పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు
 
దుష్టపాలన అంతం చే సేందుకు...
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ దుష్టపాలనను అంతం చేసేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు మాయ మాటలను నమ్మి టీడీపీకి ఓటువేశామని ప్రజలు బాధపడుతున్నారు. మేకవన్నె పులి చంద్రబాబునాయుడు.  ఎన్నికలకు ముందు హామీలు గుప్పించారు. అధికారం చేపట్టాక తన అసలు నైజం చూపుతున్నారు. రాష్ట్రంలోని కార్మికులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. బాబు వస్తే జాబు గ్యారెంటీ అని ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే దుస్థితికి దిగజారారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు 14లక్షల మంది ఉన్నారని, రజకులు 18లక్షల మంది ఉన్నారని, వీరందరికీ ఇళ్లు ఇస్తామని వాగ్దానం చేశారు. వాటి అమలు ఊసే లేదు. మూసివేసిన సుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెప్పారు. ఇపుడు ఉన్న ఫ్యాక్టరీలను మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులను ఎక్కడ రెగ్యులర్ చేయాల్సి వస్తుందోనని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.
- పి.గౌతంరెడ్డి, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడుబంగారు తల్లిని మహాలక్ష్మి పథకంగా మార్చి ఆదుకుంటానన్నావు... ఇప్పటికీ ఏ ఒక్కరికీ లబ్ధిచేకూర్చలేదు... కనీసం చిల్లిగవ్వ విదల్చలేదు.. ప్రకృతి విపత్తులతో రైతులు అల్లాడుతున్నా సర్వేలతోనే కాలక్షేపం చేస్తున్నావు.. ఇంకా ఎన్నాళ్లు మోసపూరిత పాలన సాగిస్తూ కాలం వె ళ్లదీస్తావంటూ సీఎం చంద్రబాబునాయుడుపై వైఎస్సార్ సీపీ నేతలు ధ్వజమెత్తారు. శ్రీకాకుళం పట్టణంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నేతలు సీఎం చంద్రబాబు మోసపూరిత పాలన , నేతల ఏకపక్ష నిర్ణయాలపై మండిపడ్డారు. హామీలు అమలుకు ప్రజలతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.    

- శ్రీకాకుళం అర్బన్
 
బాబు మేనిఫెస్టో అబద్ధాల పుట్ట

సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ప్రకటించిన మేనిఫెస్టో ఒక అబద్దాల పుట్ట. అధికారంలోకి వచ్చి 6 నెలలు గడచినా ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. దీనికి నిరసనగానే డిసెంబర్ 5న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్‌ల వద్ద ధర్నా చేస్తాం. జిల్లాపై తుపాను విరుచుకుపడినా రైతులకు చిల్లి గవ్వ సాయం చేయలేదు. బాబుకు మొదటినుంచి వెన్నుపోటుదారునిగా పేరుంది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే తత్వం దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డిది. కప్పదాటు గెంతులు వేసే తత్వం చంద్రబాబుది. జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు అధికారాన్ని అడ్డంపెట్టుకుని దౌర్జన్యంతో రాజకీయాలు చేస్తున్నారు. కలిసి ప్రతిఘటిద్దాం.  
- ధర్మాన కృష్ణదాస్, వైస్సార్ సీపీ బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు
 
మహా ధర్నాను విజయవంతం చేద్దాం
హామీల అమలులో విఫలమైన చంద్రబాబు ప్రభుత్వ తీరును నిరసిస్తూ డిసెంబర్ 5న చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేద్దాం. చంద్రబాబు పాలన దుర్మార్గంగా ఉంటుందని ప్రజలకు ముందే తెలుసు. రుణమాఫీ జరుగుతుందనే ఒకేఒక్క ఆశతో ఓటేసి గెలిపించారు. అధికారం చేపట్టాక బాబు నైజం బయటపడింది. బాబుకు వ్యవసాయంపై ఎన్నడూ ఆసక్తి లేదు. ఇప్పుడూ రైతుపై అదే ధోరణి కనబరుస్తున్నారు.  టీడీపీ నేతలను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయి.
- ధర్మాన ప్రసాదరావు, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
 
పార్టీని సంస్థాగతంగా నిర్మిద్దాం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేద్దాం. ఏ రాజకీయ పార్టీకైనా అనుబంధ సంఘాలే ప్రధానం. అవి పటిష్టంగా ఉంటే పార్టీ మరింత ఉత్సాహంగా పనిచేస్తుంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి అర్హులైన లబ్ధిదారుల పింఛన్లు రద్దుచేశారు. ఆదర్శరైతులు, అంగన్‌వాడీలు, రేషన్‌డీలర్లు, ఉపాధిహామీఫీల్డ్ అసిస్టెంట్‌లను తొలగించారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఎక్కడ ప్రజలకు అన్యాయం జరిగినా ఉద్యమిద్దాం. డిసెంబర్ 5న పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న మహాధర్నా చారిత్రాత్మకంగా నిలిచిపోయేలా చేద్దాం.
- తమ్మినేని సీతారాం, వైఎస్సార్ సీపీ హైపవర్ కమిటీ సభ్యుడు
 
టీడీపీ అరాచకాలను వివరిద్దాం

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఆచరణలోకి తేకపోవడం విచారకరం. రుణాల మాఫీ చేస్తామని చెప్పి కొర్రీలు వేస్తున్నారు. సర్వేలతో కాలక్షేపం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అరాచకాలను ప్రజలకు వివరిద్దాం.  కుల, మతాలకు అతీతంగా దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమపథకాలు అందజేస్తే... ఇప్పుడు కమిటీల పేరుతో జిల్లాలో అర్హులైన 28 వేల మంది పింఛన్‌దారులను తొలగించారు. ఇదెక్కడి ప్రభుత్వం. కొద్దికాలంలోనే ప్రభుత్వ పతనం ఖాయం.
- రెడ్డి శాంతి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు
 
వ్యవసాయం దండగన్న చంద్రబాబు
రాష్ట్రంలో వ్యవసాయం దండగనే అభిప్రాయం ముఖ్యమంత్రి చంద్రబాబుకు బలంగా ఉంది. అందువల్లే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం కల్పించడం లేదు. రైతాంగానికి పెద్దపీట వేస్తామని చెప్పి వారిని విస్మరిస్తున్నారు. విద్యార్థులకు, వికలాంగులకు, నిరుద్యోగులను మోసగిస్తున్నారు. ఎస్సీలను నట్టేట ముంచిన వ్యక్తిగా బాబు నిలిచారు. జిల్లా పోరాటాల గడ్డ, ఇక్కడినుంచే ప్రభుత్వంపై పోరుకు ఉద్యమిద్దాం.
- మేరుగ నాగార్జున, పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు
 
పోరాటంతోనే సమస్యల పరిష్కారం
పోరాటంతోనే ప్రజాసమస్యలు పరిష్కారమవుతా యి. రాష్ట్రంలో రాజ్యాంగం ద్వారా ఏర్పడిన ప్రభుత్వ పాలన లేదు. అధికార పార్టీ వేధింపులతోనే కాలయాపన చేస్తున్నారు. జిల్లాలో మంత్రి, విప్‌లు తమ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. కమిటీల్లో సభ్యులుగా రౌడీషీటర్లు, టీడీపీ తొత్తులను చేర్చారు.
- కలమట వెంకటరమణ, పాతపట్నం ఎమ్మెల్యే
 
ప్రజల పక్షాన పోరాడుదాం

తెలుగుదేశం ప్రభుత్వ పాలనలో ఇబ్బందులు పడుతున్న ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీగా పోరాడుదాం. ప్రతి కార్యకర్త ఒక సైనికునివలే పనిచే సి పార్టీ బలోపేతానికి కృషిచేద్దాం. చంద్రబాబు పాలన ఆలీబాబా-అరడజను దొంగలు మాదిరిగా ఉంది. అందులో మొదటి దొంగ జిల్లా మంత్రి అచ్చెన్నాయడు. దొంగల దగ్గరే దోచుకునే గజదొంగ. ప్రజల తరఫున నిలబడే వ్యక్తిని, ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిని తొక్కేయడమే లక్ష్యంగా టీడీపీ పనిచేస్తోంది.  నీచుడు, నికృష్టుడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబునాయుడే అని సాక్షాత్తు దివంగత ఎన్‌టీ రామారావే అన్నారు.                                    -చెవిరెడ్డి భాస్కరరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్రస్థాయి వలంటీర్ల కమిటీ అధ్యక్షుడు
 
రైతులకు అన్యాయం
టీడీపీ పాలనలో రైతులకు ఎన్నడూ అన్యాయమే జరుగుతోంది. గత తొమ్మిదేళ్ల టీడీపీ పాలనలో రైతులకు ఎంత అన్యాయం జరిగిందో ఈ ఆరు నెలల పాలనలో అంత  జరిగింది.
- ఎం.వి.ఎస్.నాగిరెడ్డి, రాష్ట్రస్థాయి రైతు కమిటీ అధ్యక్షుడు
 
ప్రజావ్యతిరేక ప్రభుత్వం
రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగుతోంది. జిల్లాలోని అధికారపార్టీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.  హుద్‌హుద్ తుపానుతో పాలకొండ నియోజకవర్గంలోని భామిని, సీతంపేట మండలాలు పూర్తిగా దెబ్బతిన్నా చిల్లిగవ్వ సాయం లేదు. గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.  నిజమైన పేదలకు న్యాయం చేయకపోతే ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.
- విశ్వసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే
 
దుష్టపాలన
తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి రాష్ట్రంలో దుష్టపాలన సాగుతోంది. గతంలో ఎన్నడూ ఇలాంటి పాలన చూడలేదు. కమిటీలు వేసి అన్యాయాలకు, అక్రమాలకు పాల్పడుతున్నారు. తుపానుకు పంటలు, ఇళ్లు, సర్వం కోల్పోయిన వారిని విడిచిపెట్టి టీడీపీ లబ్ధిదారులకే అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. వీటన్నింటిపైనా తిరగబడాలి. పోరుబాట సాగించాలి.       
- కంబాల జోగులు, రాజాం ఎమ్మెల్యే
 
అండగా ఉంటాం
ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పార్టీ రాష్ట్ర లీగల్‌సెల్ తరఫున అం డగా ఉంటాం. మనోధైర్యం కోల్పోకుండా ప్రభుత్వం చేసే దుర్మార్గాలను ఎదిరిద్దాం. టీడీపీ ప్రభుత్వం విడుదల చేసిన అడ్డగోలు జీవోలపై పోరాడుదాం. ప్రతి కార్యకర్తకూ అన్యాయం జరగకుండా చూద్దాం. కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు పూర్తిస్థాయి భరోసా కల్పిద్దాం.
- పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు
 
దుష్టపాలన అంతం చే సేందుకు...
రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ దుష్టపాలనను అంతం చేసేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు మాయ మాటలను నమ్మి టీడీపీకి ఓటువేశామని ప్రజలు బాధపడుతున్నారు. మేకవన్నె పులి చంద్రబాబునాయుడు.  ఎన్నికలకు ముందు హామీలు గుప్పించారు. అధికారం చేపట్టాక తన అసలు నైజం చూపుతున్నారు. రాష్ట్రంలోని కార్మికులకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. బాబు వస్తే జాబు గ్యారెంటీ అని ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే దుస్థితికి దిగజారారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు 14లక్షల మంది ఉన్నారని, రజకులు 18లక్షల మంది ఉన్నారని, వీరందరికీ ఇళ్లు ఇస్తామని వాగ్దానం చేశారు. వాటి అమలు ఊసే లేదు. మూసివేసిన సుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెప్పారు. ఇపుడు ఉన్న ఫ్యాక్టరీలను మూసివేసే దిశగా అడుగులు వేస్తున్నారు. కాంట్రాక్ట్ కార్మికులను ఎక్కడ రెగ్యులర్ చేయాల్సి వస్తుందోనని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు.
- పి.గౌతంరెడ్డి, పార్టీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement