ఇంటికో ఉద్యోగం, లేకుంటే నిరుద్యోగ భృతి చెల్లిస్తామని ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలని ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం చంద్రబాబుకు ఆయన బహిరంగ లేఖ రాశారు. వైఎస్సార్ సీపీ నాయకులు అంబటి రాంబాబు, వాసిరెడ్డి పద్మ, కోన రఘుపతి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు.