నిరుద్యోగులకు చంద్రబాబు టోపీ
ఎన్నికలపుడు బాబొస్తే జాబొస్తుందన్నారు
ఉద్యోగం రాకపోతే రూ.2వేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు
బడ్జెట్‌లో భృతి ఊసు కరువు
ఉద్యోగాలివ్వక.. ఉన్నవీ తీసేశారు
‘ఇంటికో ఉద్యోగం రావాలంటే బాబు రావాలి. ఉద్యోగం ఇవ్వలేకపోతే మీరు ఏమీ చదవక పోయినా నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తా.. తమ్ముళ్లూ మీ కలలు సాకారం చేయబోతున్నా’ 2014 ఎన్నికల సమయంలో ఈ రకమైన ప్రచారం ఊదరగొట్టి జనం ఓట్లు పోగేసిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటుచేసి రెండేళ్లు కావస్తున్నా ఇంత వరకు ఇంటికో ఉద్యోగం ఊసెత్తలేదు. ఉద్యోగం ఇవ్వక పోయినా నెలకు రూ.2 వేలు భృతి అయినా అందుతుందని ఆశపడిన నిరుద్యోగులకు నిరాశ తప్పడం లేదు. చంద్రబాబు ఎన్నికల హామీలు నమ్మిన జిల్లాలోని10,39,953 కుటుంబాలకు చెందిన నిరుద్యోగులు తాము మోసపోయామని ఆవేదన చెందుతున్నారు..
తిరుపతి: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట దేవుడెరుగు. ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారిని తొలగించి..వారి కుటుంబాలు వీధినపడేలా చేశారు’ అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది మంది యువకులు బాబు చేతిలో దగాపడ్డామని మథన పడుతున్నారు. ఉద్యోగం లేకపోయినా రూ.2000ల నిరుద్యోగ భృతి వస్తుందని ఆశపడి ఓట్లు వేశామని, ప్రస్తుతం ఆయన నట్టేట ముంచాడని మండిపడుతున్నారు. ఈ విషయమై బడ్జెట్‌లో ప్రస్తావన లేకపోవడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. జిల్లాలో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వాపోతున్నారు. ఏటా జిల్లాలో దాదాపు లక్షమంది యువకులు వివిధ కోర్సులు పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు. ఏటేటా నిరుద్యోగుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అందుకు ప్రత్యామ్నాయంగా ఉద్యోగాల భర్తీ మాత్రం జరగడం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే కొత్త పరిశ్రమలు ఏర్పాటై , ఉద్యోగ అవకాశాలు వచ్చేవని యువకులు పేర్కొంటున్నారు. ఆ దిశగా ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవడంలో విఫలమైందని యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వీధిన పడ్డ కుటుంబాలు
జిల్లాలో గత కొన్నేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న వేలాది మంది ఉద్యోగులను తొలగించి వారి కుటుంబాలు వీధిన పడేలా చేశారు. జిల్లాలో 2100 మంది ఆదర్శరైతులను ఇంటికి పంపారు. గృహనిర్మాణ శాఖలో 178 మంది ఉద్యోగులను తొలగించారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే 350 మంది ఫీల్డ్ అసిస్టెంట్లపై వేటు వేశారు. 200 మంది ఆరోగ్యమిత్రలను రోడ్డున పడేశారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని మోసం చేశారు. ఇలా ఉద్యోగాలు చేస్తున్నవారిని ఉన్న ఫళంగా తొలగించడంతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
నిరుద్యోగులను నట్టేట ముంచేశాడు
చంద్రబాబు చదువుకున్న నిరుద్యోగులను నట్టేట్లో ముంచేశాడు. ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం చదువుకున్న అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక మమ్మల్ని పూర్తిగా ముంచేశాడు. ఎంతో ఆశతో ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూశాం. ఇప్పటికి మేం మోసపోయాం అని తెలుసుకుని జాబ్ సెర్చింగ్‌లో ఉన్నాం.
- రాజారెడ్డి, బీటెక్, కమ్మినాయనిపల్లె, పెద్దపంజాణి మండలం.
వాగ్దానం మరచిన సీఎం చంద్రబాబు
ఉద్యోగం కాదు కదా కనీసం నిరుద్యోగ భృతి పొందలేని పరిస్థితి. ఎన్నికల వాగ్దానాలను అట్టహాసంగా చేసిన చంద్రబాబు ఆ తరువాత విస్మరించారు. ఎంఎస్‌సీ మైక్రో బయూలజీ, బీఈడీ పూర్తి చేసిన నాకు ఉద్యోగాశం రావడం గగనంగా ఉంది. ఉద్దరిస్తారని చదివించిన తల్లిదండ్రులకు ఏ సహకారవుూ అందించలేకుండా ఉన్నావునే ఆవేదన మిగిలింది. - అనూష నాగలాపురం
మాట తప్పడం అన్యాయం
నిరుద్యోగులకు రూ.2వేలు భృతి ఇస్తామంటూ చంద్రబాబు మాట తప్పడం అన్యా యం. టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసిన చాలా మంది అభ్యర్థులు గత డీఎస్సీలో ఉద్యోగాలు రాక నిరుత్సాహంతో ఉన్నారు. గతంలో జరిగిన డీఎస్సీ ఎంపికలలో రోస్టర్ పాయింట్లు అంటూ చాలా మంది అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసుకోలేదు. రోస్టర్ పద్ధతితో కాకుండా అర్హత సాధించిన వారికి ఉద్యోగం కల్పించాలి.
- మహేష్, డీఎస్సీ అభ్యర్థి, చిత్తూరు
నిరుద్యోగులుగానే ఉండిపోవాలేమో!
ఎమ్మెస్సీ పూర్తి చేశాను. నా అర్హతకు తగ్గట్టుగా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించడం లేదు. నాలాగ ఎంతోమంది నిరుద్యోగులు జిల్లాలో ఖాళీగా ఉండాల్సిన దుస్థితి కలుగుతోంది. పేద కుటుంబంలో జన్మించి, వేలకు వేలు ఖర్చుపెట్టి చదివి, ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదు. -ఎన్.ఎస్.మోహన్, చిత్తూరు
బాబు మాట నమ్మి మోసపోయాం
నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని నమ్మి మోసపోయాం. ఎంఎస్సీ పూర్తిచేసి నాలుగేళ్లయింది. అప్పటినుంచి ఉద్యోగాల కో సం ఎదురుచూస్తున్నాం. చంద్రబాబు సీఎం అయ్యాక హమీ నెరవేరుస్తారని, ఉద్యోగాలు పొందగలమని ఆశించి భంగపడ్డాం.’’ - టీ.సురేంద్ర, నిరుద్యోగి, బి.కొత్తకోట
యుువతను మోసగించారు
ఎన్నికల సవుయుంలో ఇంటికో ఉద్యోగం ఇస్తావుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి రూ.2 వేలు ఇస్తావుని చెప్పారు. రెండేళ్లయినా ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదు. ఈ ఏడాది బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి ఊసేలేదు. కార్మిక శాఖా వుంత్రి అచ్చెన్నాయుుడు ఆ పథకమే లేదని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. యుువతను సైతం మోసం చేశారు. తగిన సంయంలో బుద్ధి చెబుతాం. - కొల్లేటి సురేష్, బీఎస్సీ, బీఈడీ, శ్రీకాళహస్తి
నిరుద్యోగులకు చంద్రబాబు టోపీ
Published Sat, Mar 12 2016 1:57 AM | Last Updated on Sat, Jul 28 2018 3:23 PM
Advertisement