నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు ద్రోహం | The prayer hall, verandah, demolition, | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు సీఎం చంద్రబాబు ద్రోహం

Published Thu, Mar 12 2015 4:14 AM | Last Updated on Tue, May 29 2018 11:47 AM

The prayer hall, verandah, demolition,

తిరుపతి రూరల్: నిరుద్యోగ భృతి అంటూ మాయమాటలతో నిరుద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ద్రోహం చేశారని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీలో నిరుద్యోగ భృతి, ఉపాధి కల్పనపై చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై ప్రభుత్వాన్ని చెవిరెడ్డి నిలదీశారు. ఎ ్నకల్లో నిరుద్యోగ భృతి అంటూ ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోఎంతమందికి భృతి ఇచ్చారో చె ప్పమని ప్రశ్నించారు. రాష్ట్రంలో వీఆర్‌వో, ఇంజనీరింగ్, గ్రూప్-2 పోస్టులు దాదాపు రెండున్నర లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు.

వాటిని భర్తీ చేయడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని ప్రశ్నించారు. బాబు వస్తే జాబు వస్తుందని ప్రచారాలు చేసిన టీడీపీ ఇప్పుడు ఉన్న జాబ్‌ల నుంచి చిరుద్యోగులను తరమివేస్తోందని ఆరోపించారు. ఔట్‌సోర్సింగ్, కాం ట్రాక్టు ఉద్యోగులు తమను పర్మినెంట్ చేస్తారని ఆశిస్తున్నారని కానీ వారి ఆశలను చంద్రబాబు అడియాశలు చేశారన్నారు. నిరుద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సిం గ్‌లో పనిచేస్తున్న కార్మికులు ప్రభుత్వంపై తిరగబడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిరుద్యోగ భృతిని, ఉద్యోగాల భర్తీని పూర్తి చేయాలని లేకుంటే ప్రజా ఉద్యమాలు తప్పవని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement