
యువత చూపు వైఎస్సార్‌సీపీ వైపు
సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ విద్యార్థి విభాగంలో విద్యార్థుల చేరిక
నెల్లూరు, సిటీ : టీడీపీ ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో యువత వైఎస్సార్‌సీపీ వైపు చూస్తోం దని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. నగరంలోని రాజన్నభవన్‌లో గురువారం వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు గొల్లపూడి శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో విభాగంలో పెద్దఎత్తున విద్యార్థులు చేరారు. వీరికి ఎమ్మెల్యే విద్యార్థి విభాగం జెండాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చేం దుకు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, నిరుద్యోగ భృతి ఇస్తామని ఇలా ఎన్నోహామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు.దీంతో వారికి సీఎం, టీడీపీపై నమ్మకం పో యిందన్నారు.
యువత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని నమ్ముతున్నారని అందువల్లే వైఎస్సార్‌సీపీలో చేరేందుకు వస్తున్నారన్నారు. శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ అల్‌హుదా పాలిటెక్నిక్‌కు చెందిన విద్యార్థులు విద్యార్థి విభాగంలో చేరడం హర్షణీయమన్నారు. యువత, విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైం దన్నారు. ఈ కార్యక్రమంలో విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.అఖిల్, జిల్లా ప్రధానకార్యదర్శులు బి సత్యకృష్ణ, కె.హరికృష్ణాయాదవ్, నగర ప్రధాన కార్యదర్శులు గ్రంధి చరణ్‌తేజ, పీ వినీల్, పీ నిఖిల్, నగర కార్యదర్శులు పీ ఆగ్నేష్, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, శశాంక్ పాల్గొన్నారు.