మంత్రి అచ్చెన్నాయుడు నిరుద్యోగ భృతి ఇవ్వలేమని చెప్పారని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని మరిచిపోయారా అని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేబినెట్లోని మంత్రులు మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నారని ఎద్దేవా చేశారు.