
భృతికి మంగళం!
► నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం
► ఎన్నికల హామీపై మాట తప్పిన ప్రభుత్వం
► నిరుద్యోగ భృతిపై దోబూచులాట
► మంత్రి అచ్చెన్నాయుడు తీరుపై సర్వత్రా విమర్శలు
► జిల్లాలో 10 లక్షల మంది నిరుద్యోగులు
► నోటిఫికేషన్ల కోసం రెండేళ్లుగా ఎదురుచూపులు
⇒ ఎన్నికల హామీలకు అధికార పార్టీ తిలోదకాలిస్తోంది. రోజులు
⇒ ఎన్నికల హామీలకు అధికార పార్టీ తిలోదకాలిస్తోంది. రోజులుగడిచే కొద్దీ.. అలాంటి హామీలు ఏవీ తామివ్వలేదంటూ ⇒ ఎన్నికల హామీలకు అధికార పార్టీ తిలోదకాలిస్తోంది. రోజులుదాటవే స్తోంది. ఏరు దాటాక తెప్ప
⇒ ఎన్నికల హామీలకు అధికార పార్టీ తిలోదకాలిస్తోంది. రోజులు తగలేసిన చందంగా.. మంత్రులు ఒక్కో హామీ నుంచి తప్పుకోవడం
⇒ ఎన్నికల హామీలకు అధికార పార్టీ తిలోదకాలిస్తోంది. రోజులుచూస్తే ప్రజలను ఎంతగా మోసగించారో అర్థమవుతోంది.
మొన్న తాకట్టు బంగారం.. నిన్న నిరుద్యోగ భృతి.. నేడు మరే
⇒ ఎన్నికల హామీలకు అధికార పార్టీ తిలోదకాలిస్తోంది. రోజులుహామీకి మంగళం పాడతారోననే చర్చ జరుగుతోంది.
నమ్మిన జిల్లాలోని 8.50 లక్షల కుటుంబాలు, 10లక్షల మంది నిరుద్యోగులు తాము మోసపోయామని ఆవేదన చెందుతున్నారు. కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగులనూ బజారున పడేశారు. జిల్లాలో రోజురోజుకీ నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచింది. ఈ రెండేళ్లలోనే ఏకంగా 2 లక్షల మంది నిరుద్యోగులు అదనంగా తయారయ్యారు. వీరితో పాటు అప్పటికే ఉన్న నిరుద్యోగులను కలుపుకుంటే జిల్లాలో వీరి సంఖ్య ఏకంగా 10 లక్షల పైమాటే.
బాబు హామీ అమలుకు వీరందరూ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త నోటిఫికేషన్లను విడుదల చేయలేదు. కేవలం కొద్ది మంది అంగన్‌వాడీలను, బహుళసేవ వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించడం మినహా ఎలాంటి నోటిఫికేషన్లను జారీ చేయలేదు. వాస్తవానికి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో లక్షా 4 వేల మంది నిరుద్యోగులుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారు. అయితే, పేర్లను నమోదు చేసుకుని వారు ఇంతకు పది రెట్లు ఉన్నారు. ఈ లెక్కన జిల్లాలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల వేటలో రోడ్లపై తిరుగుతున్నారు. వీరంతా ఇప్పుడు తమకు ఉద్యోగాలైనా చూపించాలని.. లేనిపక్షంలో హామీ మేరకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రైవేటు ఉద్యోగాలూ లేవు
రాష్ట్ర విభజన తర్వాత పూర్తిగా ప్రభుత్వ దృష్టి అంతా గుంటూరు, కృష్ణా జిల్లాలకే పరిమితమయింది. జిల్లాలో ఏకంగా 30 వేల ఎకరాల్లో భారీ పారిశ్రామిక హబ్ వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇప్పటివరకు ఒక్క పరిశ్రమనూ తీసుకురాలేకపోయింది. కొత్తగా ఒక్క ఉద్యోగమూ రాలేదు. ఫలితంగా అటు ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్లు వెలువడక.. ఇటు ప్రైవేటు ఉద్యోగాలూ లేక నిరుద్యోగులు అల్లాడుతున్నారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామనలేదని, ప్రైవేటు ఉద్యోగాలు అని అసెంబ్లీ సాక్షిగా ప్రవచించిన ముఖ్యమంత్రి... ప్రైవేటు ఉద్యోగాలనూ కల్పించడంలో విఫలమయ్యారు.
ఉన్న ఉద్యోగమూ ఊడగొట్టారు
కొత్త ఉద్యోగాల మాట దేవుడెరుగు.. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉద్యోగాలను కూడా ఊడగొట్టారు. ఈ విధంగా జిల్లావ్యాప్తంగా మొత్తం 942 మంది ఉద్యోగాలు కోల్పోయారు. హౌసింగ్ శాఖలో అవుట్‌సోర్సింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్లు 278 మందిని, 141 మంది ఆరోగ్యమిత్రలు తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఫీల్డ్ అసిస్టెంట్లు సుమారు 400 మంది కాస్తా పని పోయి రోడ్డున పడ్డారు. ఇక మునిసిపాలిటీల్లో జిల్లావ్యాప్తంగా 10 మంది సీఎల్‌ఆర్‌లను (క్లస్టర్ లెవల్ రిసోర్స్ పర్సన్స్) కూడా ప్రభుత్వం తొలగించింది. ఇక ఆయుష్ విభాగంలో 113 మందిని ఇళ్లకు పంపించారు. వీరంతా ఇప్పుడు ఉద్యోగం కోల్పోయి.. కొత్త ఉద్యోగాల కోసం వెతుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది.