
సంతోషం లేని జీవితం
► రెండు కిడ్నీలు పాడై మంచం పట్టిన ఆటోడ్రైవర్ సంతోష్
► ఇప్పటికే రూ.2ల క్షల వరకు ఖర్చు
► ఒక కిడ్నీ మార్చేందుకు రూ.4లక్షల ఖర్చు
► వైద్యానికి డబ్బులు లేక ఇక్కట్లు
► ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు
► ప్రభుత్వం ఆదుకోవాలని తల్లి, భార్య వేడుకోలు
ఎంతో సంతోషంగా సాగిపోతున్న ఆ కుటుంబాన్ని ఒక్కసారిగా కిడ్నీ వ్యాధి కుంగదీసింది. వైద్యం చేరుుంచుకునేందుకు ఆర్థికస్థోమత లేక ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది. దాతలు పెద్ద మనుసు చేసుకుంటే ఆ కుటుంబం నిలబడుతుంది. చెన్నూర్ మండలంలోని దుగ్నెపల్లి పంచాయతీ పరిధి చెల్లాయిపేట గ్రామానికి చెందిన గోదరి సంతోష్ ఆటోనడుపుతూ జీవనం సాగిస్తున్నాడు.
ఇతనికి ఉన్నట్టుండి రెండు కిడ్నీలు పాడైపోవడంతో పూర్తిగా మంచానికే పరిమితమయ్యూడు. సంతోష్‌కు తల్లితోపాటు భార్య కవిత, 3 ఏళ్ల పాప మనస్విని ఉన్నారు. ప్రస్తుతం ఏ పనిచేయలేక తల్లి, భార్య కూలికి వెళ్తేగాని పూట గడవని దయనీయస్థితి ఆ ఆటోడ్రైవర్ కుటుంబానిది.- చెన్నూర్‌రూరల్
గోదరి అంకమ్మ-చంద్రయ్యకు ఏకైక సంతానం సంతోష్. కూలి పనులు చేసి కొడుకును పెద్ద చేశారు. వీరిది నిరుపేద కుటుంబం. ఉండేందుకు ఇల్లు కూడా లేదు. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి. తండ్రి చంద్రయ్య 2007లో చనిపోవడంతో కుటుంబ భారమంతా కొడుకుపైనే పడింది. సంతోష్ ఆటోనడుపుతూ కుటుంబాన్ని సాకుతున్నాడు.
కుటుంబాన్ని కుంగదీసిన కిడ్నీ వ్యాధి
రెండేళ్ల క్రితం సంతోష్‌కు అనుకోకుండా తలనొప్పి, వాంతులతోపాటు క ళ్లు తిరిగారుు. దీంతో చెన్నూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లగా అక్కడి వైద్యులు హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. సంతోష్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేరుుంచుకోగా కిడ్నీ సమస్య ఉందని వేరే ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు తెలిపారు. అక్కడే నిమ్స్ ఆసుపత్రికి వె ళ్లాడు. అక్కడి వైద్యులు అన్ని రకాల పరీక్షలతోపాటు బయాప్సీ చేసి కిడ్నీలు ఇన్‌ఫెక్షన్ అయ్యాయని, ఒక కిడ్నీ ఫెయిలైందని చెప్పారు. మందులు వాడితే నయమవుతుందని, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, మూడు నెలల కొకసారి వచ్చి వైద్య పరీక్షలు చేరుుంచుకోవాలని సూచించారు. సంతోష్ ప్రతీసారి హైదరాబాద్‌కు వెళ్లి పరీక్షలు చేయించుకొని మందులు తెచ్చుకొనేవాడు.
దీంతో ఆటో నడపడ ం కూడా మానే శాడు. తల్లి, భార్య కూలీ పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇప్పటి వరకు అందిన కాడల్లా సుమారు రూ.2లక్షల వరకు అప్పు చేసి మరీ వైద్యానికి పెట్టారు. అయినా ఆరోగ్యం కుదుటపడలేదు. దీంతో సంతోష్ 5 నెలల క్రితం మళ్లీ వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌కు వెళ్లగా రెండు కిడ్నీలు ఫెయిలయ్యూయని వైద్యులు చెప్పారు. ఒక కిడ్నీ అయినా మార్చాలని లేదంటే ప్రాణానికే ప్రమాద న్నారు. కిడ్నీ మార్చే వరకు రెండు రోజులకోకసారి డయాలసిస్ చేయించుకోవాలని చెప్పడంతో సంతోష్ రెండు రోజులకోసారి కరీంనగర్ వెళ్లి డయాలసిస్ చేయించుకొని వస్తున్నాడు. ఇందుకు వెళ్లినప్పుడల్లా సుమారు రూ.వెయ్యి వరకు ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు
తన కొడుకును బతికించుకోవాలనే తపనతో తల్లి అంకమ్మ ఒక కిడ్నీని కుమారునికి ఇచ్చేందుకు మందుకు వచ్చింది. కానీ దానిని అమర్చాలంటే సుమారు రూ.4లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలపడంతో వారు నిర్ఘాంతపోయారు. వైద్యానికి ఇప్పటికే అప్పు చేసి రూ.2లక్షల వ రకు ఖర్చు చేశామని ఇప్పుడు కిడ్నీ అమర్చేందుకు రూ.4లక్షలు ఎక్కడి నుంచి తీసుకువచ్చేదని తల్లి, భార్య కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం తన కుమారుని వైద్యం కోసం సహాయం అందించాలని, ఎవరైనా ఆపన్నహస్తం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సంతోష్‌ను ఆదుకోవాలనుకునే దాతలు సెల్ : 9640333592లో సంప్రదించవచ్చు