టాటా గ్రూపు చైర్మన్ చంద్రశేఖరన్ కో చైర్మన్‌గా పారిశ్రామికవేత్తలు, నిపుణులతో ఏర్పాటు
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని టాటా గ్రూపు చైర్మన్‌ను కోరిన సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: వికసిత్ ఏపీలో భాగంగా 2047 నాటికి రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ రూపకల్పన కోసం ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పలు రంగాల నిపుణులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. టాటా గ్రూపు చంద్రశేఖరన్ కో చైర్మన్‌గా ఈ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సచివాలయంలో శుక్రవారం టాటాగ్రూపు చైర్మన్.. సీఎంతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2047 నాటికి రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీన్లో భాగంగా పారిశ్రామికాభివృద్థికి చేపట్టాల్సిన చర్యలపై ఈ టాస్‌్కఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఐటీ, విమానయానం, సోలార్, టెలీకమ్యూనికేషన్స్, ఫుడ్‌ప్రాసెసింగ్ రంగాల్లో ఉన్న అపార అవకాశాలను వివరించిన సీఎం.. పెట్టుబడులు పెట్టాలని చంద్రశేఖరన్‌ను కోరారు.
విశాఖలో టీసీఎస్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో విస్తార, ఎయిర్ ఇండియా విమాన సరీ్వసుల సంఖ్యలను పెంచే అంశంపై చర్చించారు. అమరావతిలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్íÙప్‌లో టాటా గ్రూపు భాగస్వామ్యం కావాలన్న సీఎం కోరికను చంద్రశేఖరన్ స్వాగతించారు. అనంతరం చంద్రశేఖరన్ మంత్రి లోకేశ్‌తో సమావేశమయ్యారు.
సీఐఐ ప్రతినిధుల బృందంతో భేటీ
సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమైంది. అమరావతిలో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్íÙప్ ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో యువతకు నైపుణ్య శిక్షణ అవకాశాలపై ఆ బృందంతో చర్చించినట్లు చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.
అమరావతిలో అంతర్జాతీయ లా వర్సిటీ
అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ముందుకొచ్చింది. ఈ మేరకు బీసీఐ చైర్మన్, సీనియర్ న్యాయవాది మన్నన్ కుమార్‌మిశ్రా నేతృత్వంలోని బృందం శుక్రవారం సీఎంను కలిసింది.
సీఆర్‌డీఏ పరిధిలో ఈ యూనివర్సిటీ ఏర్పాటునకు అవసరమైన స్థలాన్ని ఎంపిక చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్‌ను సీఎం ఆదేశించారు. బీసీఐ బృందంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు, బీసీఐ ట్రస్ట్–పెరల్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆలూరు రామిరెడ్డి తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment