Chandrasekaran
-
ఈ ఏడాది డిమాండ్ ఉండే ఏఐ మోడళ్లు
భవిష్యత్తులో చిన్న, డొమైన్ ఫోకస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) మోడళ్లకు డిమాండ్ ఏర్పడుతుందని టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ భావిస్తున్నట్లు తెలిపారు. చిన్న మోడళ్లు తక్కువ వనరులను వినియోగిస్తాయని, దాంతోపాటు సమర్థంగా పనిచేస్తాయని, వేగంగా ఫలితాలు అందిస్తాయని చెప్పారు. ఇంధన వ్యయాలను తగ్గించుకోవాలని, చిన్న మాడ్యులర్ రియాక్టర్లు(ఎస్ఎంఆర్) వంటి ఎనర్జీ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన నొక్కి చెప్పారు.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)-తిరుచ్చి పూర్వ విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘2023లో లార్జ్ లాంగ్వేజీ మోడల్స్‌కు(ఎల్ఎల్ఎం) మంచి అవకాశం వచ్చింది. కానీ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. దాంతో 2024లో మల్టీమోడల్ ఏఐలకు అపారమైన అవకాశాలు వచ్చాయి. 2025లో ఇందుకు భిన్నంగా స్మాల్ ల్యాంగ్వేజీ మోడళ్లకు భారీగా డిమాండ్ రానుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: యాపిల్ స్పైగా ‘సిరి’..? రూ.814 కోట్లకు దావాగ్లోబల్ గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ సవాళ్లను ప్రస్తావిస్తూ పారిశ్రామిక వృద్ధిని పునరుద్ధరించే ప్రయత్నాలు చేయాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ల వినియోగం పెరగడం వల్ల ప్రపంచ ఇంధన అవసరాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధి పెరగాలంటే ఇంధన వ్యయాలు తగ్గించుకోవాలన్నారు. -
పారిశ్రామికాభివృద్ధికి టాస్క్‌ఫోర్స్
సాక్షి, అమరావతి: వికసిత్ ఏపీలో భాగంగా 2047 నాటికి రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ రూపకల్పన కోసం ప్రముఖ పారిశ్రామికవేత్తలు, పలు రంగాల నిపుణులతో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. టాటా గ్రూపు చంద్రశేఖరన్ కో చైర్మన్‌గా ఈ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సచివాలయంలో శుక్రవారం టాటాగ్రూపు చైర్మన్.. సీఎంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2047 నాటికి రాష్ట్రాన్ని నంబర్ వన్‌గా నిలబెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీన్లో భాగంగా పారిశ్రామికాభివృద్థికి చేపట్టాల్సిన చర్యలపై ఈ టాస్‌్కఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఐటీ, విమానయానం, సోలార్, టెలీకమ్యూనికేషన్స్, ఫుడ్‌ప్రాసెసింగ్ రంగాల్లో ఉన్న అపార అవకాశాలను వివరించిన సీఎం.. పెట్టుబడులు పెట్టాలని చంద్రశేఖరన్‌ను కోరారు. విశాఖలో టీసీఎస్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో విస్తార, ఎయిర్ ఇండియా విమాన సరీ్వసుల సంఖ్యలను పెంచే అంశంపై చర్చించారు. అమరావతిలో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తున్న స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్íÙప్లో టాటా గ్రూపు భాగస్వామ్యం కావాలన్న సీఎం కోరికను చంద్రశేఖరన్ స్వాగతించారు. అనంతరం చంద్రశేఖరన్ మంత్రి లోకేశ్‌తో సమావేశమయ్యారు. సీఐఐ ప్రతినిధుల బృందంతో భేటీ సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమైంది. అమరావతిలో స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్íÙప్ ఏర్పాటుతో పాటు రాష్ట్రంలో యువతకు నైపుణ్య శిక్షణ అవకాశాలపై ఆ బృందంతో చర్చించినట్లు చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా తెలిపారు.అమరావతిలో అంతర్జాతీయ లా వర్సిటీ అమరావతిలో అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ముందుకొచ్చింది. ఈ మేరకు బీసీఐ చైర్మన్, సీనియర్ న్యాయవాది మన్నన్ కుమార్‌మిశ్రా నేతృత్వంలోని బృందం శుక్రవారం సీఎంను కలిసింది. సీఆర్డీఏ పరిధిలో ఈ యూనివర్సిటీ ఏర్పాటునకు అవసరమైన స్థలాన్ని ఎంపిక చేయాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్‌ను సీఎం ఆదేశించారు. బీసీఐ బృందంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడు, బీసీఐ ట్రస్ట్–పెరల్ ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ ఆలూరు రామిరెడ్డి తదితరులున్నారు. -
'టాటా న్యూ' యాప్ లాంచ్, రతన్ టాటా మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!
ప్రముఖ టాటా గ్రూప్ దిగ్గజం ఐటీ, ఆటోమొబైల్, ఎవియేషన్ ఇలా అన్నీ రంగాల్లో సత్తా చాటుతోంది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ప్రత్యర్ధులకు చెక్ పెడుతోంది. తాజాగా అమెజాన్, టెలికాం దిగ్గజం జియోలకు పోటీగా గురువారం 'టాటా న్యూ'పేరుతో యాప్‌ను విడుదల చేసింది. అయితే ఈ యాప్ విడుదలలో టాటా గ్రూప్ అధినేత 'రతన్ టాటా' మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల 69ఏళ్ల సుధీర్ఘ విరామం తర్వాత నష్టాల ఊబిలో ఉన్న ఎయిరిండియాను టాటా గ్రూప్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్ 8న టాటా గ్రూప్ అనుబంధ సంస్థ ట్యాలెస్ ప్రైవేట్ లిమిటెడ్ బిడ్డింగ్ వేసి రూ.18వేలకోట్లకు బిడ్డింగ్ ఎయిరిండియాను దక్కించుకుంది. ఇప్పుడీ సంస్థ మళ్లీ లాభాల పట్టేలా రతన్ టాటా మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. అదే 'టాటా న్యూ' యాప్. టాటా సన్స్ ఛైర్మన్ ఆసక్తిర వ్యాఖ్యలు టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..ఎయిరిండియాను ఆర్ధికంగా, టెక్నాలజీ పరంగా ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెడతామని అన్నారు. అదే సమయంలో టాటా న్యూ యాప్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ప్రతీ ఒక్క ప్రాంతానికి ఎయిరిండియా సర్వీస్‌లను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఎయిరిండియా సేవల్ని డిజిటల్ మార్గాల ద్వారా వినియోగదారులకు అందించేందుకు టాటా న్యూ'ను విడుదల చేస్తున్నట్లు, ఈ యాప్‌తో పాటు సోషల్ మీడియా, వెబ్సైట్లను రూపొందిస్తున్నట్లు చెప్పారు. చెప్పినట్లుగానే టాటా గ్రూప్ ఈ యాప్‌ను ఇవాళ ప్రజలకు పరిచయం చేసింది. ఈ యాప్ ద్వారా త్వరలో ఎయిరిండియా సేవలు ప్రారంభం కానున్నాయి. ఇక ఈ యాప్ స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ యాప్ టాటా గ్రూప్ ఉద్యోగుల కోసం మాత్రమే అందుబాటులో ఉండగా నేటి నుంచి అందరికీ అందుబాటులో తెచ్చింది. విమానయాన సంస్థలు, హోటళ్లు, మెడిసిన్, కిరాణా సామాగ్రిని ఇలా అన్నీ సర్వీసులు ఒకే వేదికపై వినియోగించుకోవచ్చు. ►అప్లికేషన్ వినియోగదారులకు అనేక రకాల టాటా సేవలను యాక్సెస్ చేయడానికి అనుమతిస్తుంది. తాజ్‌తో హోటల్లను బుకింగ్, విమానాల కోసం ఎయిర్ ఏసియా, ఎలక్ట్రానిక్స్ కొనుగోలు కోసం క్రోమా, బ్యూటీ, లగ్జరీ ఉత్పత్తుల కోసం, శాటిలైట్ టీవీని వీక్షించేందుకు టాటా స్కైను ఈ యాప్‌లో పేమెంట్స్ చేయోచ్చు. ►నీయూ యాప్‌లో బిగ్ బాస్కెట్, 1ఎంజీ (మెడిసిన్ ) వంటి సేవలు ఉన్నాయి. ►యాప్ వినియోగదారులను వారి బిల్లులను చెల్లించడానికి అనుమతిస్తుంది. వ్యక్తిగత రుణాలు, ఇన్స్యూరెన్స్ పాలసీలను కూడా అందిస్తుంది. ►అమెజాన్,స్విగ్గీ,నైకా వంటి యాప్‌లతో పోలిస్తే డిజైన్ అద్భుతంగా ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ►యాప్ వినియోగదారులు ఎంపిక చేసిన బ్రాండ్ల నుండి రివార్డ్ పాయింట్లను పొందవచ్చు. చదవండి: మొత్తం మీరే చేశారు! టాటా చేతికి ఎయిర్ ఇండియా, లోక్ సభలో ఆసక్తికర చర్చ! -
టాటా గ్రూప్ ‘దశావతారం’!
న్యూఢిల్లీ: టాటా గ్రూపునకు నూతన జవసత్వాలు తీసుకొచ్చే దిశగా కసరత్తు జరుగుతోంది. గ్రూపు పరిధిలో 100 వరకు కంపెనీలుండగా, వీటిల్లో 30 మాత్రమే లిస్టయి ఉన్నాయి. వీటికి అదనంగా 1,000 వరకు సబ్సిడరీ కంపెనీలు కూడా ఉన్నాయి. భారీ సంఖ్యలో కంపెనీలు ఉండటంతో ఏవో కొన్ని మినహాయిస్తే మిగిలినవి అంతగా రాణించడం లేదు. దీంతో చైర్మన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో గ్రూపు కంపెనీలను 10 వెర్టికల్స్‌గా వర్గీకరించే ప్రయత్నం జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది. ఒకే తరహా వ్యాపారాల్లో ఉన్న వాటిని ఓ విభాగం కిందకు తీసుకురావాలని, తద్వారా వాటి మధ్య మంచి సమన్వయం కల్పించడం ద్వారా ఖర్చులను ఆదా చేసుకోవడంతో పాటు సమర్థతను పెంచొచ్చని యాజమాన్యం భావిస్తోంది. హోల్డింగ్ కంపెనీల ప్రతినిధులు ఆయా వెర్టికల్స్‌గా అధిపతిగా వ్యవహరిస్తారు. తద్వారా కంపెనీల మధ్య సమన్వయం పెరిగేలా, కార్యకలాపాలు సాఫీగా నడిచేలా చూస్తారు. టాటా మోటార్స్ ఇటీవలే జాగ్వార్ ల్యాండ్ రోవర్‌కు సంబంధించి రూ.3.1 బిలియన్ డాలర్లను నష్టం కింద ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చర్యను చురుకైన, శక్తిమంతమైన ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేసి, వేగవంతమైన వృద్ధిని అందుకునేందుకు చేపట్టినదిగా చంద్రశేఖరన్ ఆ సందర్భంలో పేర్కొన్నారు. ప్రతీ వెర్టికల్‌కు హెడ్‌గా వ్యవహరించే వ్యక్తి ఆ విభాగంలోని కంపెనీల మధ్య సమన్వయ కర్త పాత్రను పోషించనున్నారు. ఈ వ్యక్తి టాటా సన్స్ బోర్డు సభ్యుడై ఉండనక్కర్లేదని ఓ సీనియర్ ఎగ్జిక్యూటివ్ తెలిపారు. ఫలితమిచ్చేనా..? ‘‘వెర్టికల్‌గా వర్గీకరించడం అనేది సమర్థతలను తీసుకొస్తుంది. ఒకే తరహా వ్యాపారాల మధ్య సహకారం, సమన్వయానికి వీలు కల్పిస్తుంది. దీంతో నిర్వహణ మెరుగవుతుంది. అయితే, ఈ స్థిరీకరణ అనేది విడిగా కంపెనీలకున్న నిర్వహణ పరమైన స్వేచ్ఛకు భంగం కలిగించేదిగా ఉండకూడదు’’ అని బిర్లా సన్‌లైఫ్ అస్సెట్ మేనేజ్మెంట్ సీఈవో ఎ.బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. ఈ పునర్నిర్మాణ పై కసరత్తు జరుగుతున్నట్లు టాటా గ్రూపు ఎగ్జిక్యూటివ్ ఒకరు ధ్రువీకరించారు. ఈ అంశాలు వేగంగా పరిష్కారమయ్యేవి కావని, కొన్నింటి పరిష్కారానికి కొన్ని నెలలు లేదా ఏడాది పట్టొచ్చన్నారు. ‘‘కొన్ని వ్యాపార సులభతరం కోసం దృష్టి పెట్టినవి. మరికొన్ని వాటి పరిధి విస్తరణ కోసం. 2018లో రుణ భారం తగ్గించుకునేందుకు, టాటా కంపెనీల పునర్నిర్మాణానికి, ఒక కంపెనీల్లో మరో కంపెనీకి ఉన్న వాటాల స్థిరీకరణకు, కీలక ఆస్తుల కొనుగోలుకు రూ.70,000 కోట్లు ఖర్చు చేశాం’’ అని టాటా గ్రూపు ఎగ్జిక్యూటివ్ వెల్లడించారు. నూతన నిర్మాణం కీలక వ్యాపారాలను మరింత మెరుగ్గా నిర్వహించేందుకు సాయపడుతుందన్నారు. -
టాటా మోటార్స్ నష్టాలు రూ.26,961 కోట్లు
న్యూఢిల్లీ: వాహన దిగ్గజం టాటా మోటార్స్‌కు ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో భారీగా నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ3లో రూ.1,215 కోట్ల నికర లాభం రాగా, ఈ క్యూ3లో రూ.26,961 కోట్ల నికర నష్టాలు(కన్సాలిడేటెడ్) వచ్చాయని టాటా మోటార్స్ తెలిపింది. ఒక్క త్రైమాసికంలో ఈ స్థాయి నష్టాలు రావడం కంపెనీ చరిత్రలో ఇదే మొదటిసారి. వరుసగా మూడో క్వార్టర్లోనూ కంపెనీ నష్టాలనే ప్రకటించింది. విలాస కార్ల విభాగం, జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్(జేఎల్ఆర్) వన్‌టైమ్ అసెట్ ఇంపెయిర్మెంట్(రూ.27,838 కోట్లు) కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని వివరించింది. జేఎల్ఆర్ మూలధన పెట్టుబడులకు సంబంధించిన పుస్తక విలువను తగ్గించడానికి ఈ అసాధారణమైన వ్యయాన్ని ప్రకటించామని జేఎల్ఆర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాల్ఫ్ స్పెత్ తెలిపారు. చైనాలో అమ్మకాలు తగ్గడం, తరుగుదల అధికంగా ఉండటం, పెట్టుబడి వ్యయాల అమోర్టైజేషన్ కారణంగా ఈ స్థాయి నికర నష్టాలు వచ్చాయని వివరించారు. వాహన పరిశ్రమ మార్కెట్, సాంకేతిక, విధాన సంబంధిత సమస్యలను ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. అంతే కాకుండా కొత్త మోడళ్లు, విద్యుదీకరణ, ఇతర టెక్నాలజీల కోసం పెట్టుబడులు భారీగా పెట్టాల్సి వస్తోందని వివరించారు. 4 శాతం ఎగసిన ఆదాయం.... గత క్యూ3లో రూ.74,338 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ3లో 4 శాతం వృద్ధితో రూ.77,583 కోట్లకు పెరిగిందని టాటా మోటార్స్ తెలిపింది. స్టాండెలోన్ పరంగా చూస్తే, గత క్యూ3లో రూ.212 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.618 కోట్లకు పెరిగింది. మొత్తం ఆదాయం రూ.16,186 కోట్ల నుంచి రూ.16,477 కోట్లకు ఎగసింది. జేఎల్ఆర్ ఆదాయం 1 శాతం తగ్గి 620 కోట్ల పౌండ్లకు చేరింది. వడ్డీ వ్యయాలు రూ.321 కోట్లు పెరిగి రూ.1,568 కోట్లకు ఎగిశాయి. జేఎల్ఆర్ రిటైల్ అమ్మకాలు 6% తగ్గి 1,44,602కు, హోల్‌సేల్ అమ్మకాలు 11 శాతం తగ్గి 1,41,552కు చేరాయి. దేశీయంగా అమ్మకాలు 0.5% తగ్గి 1,71,354కు చేరాయి. జేఎల్ఆర్ అంతర్జాతీయ అమ్మకాలు జనవరిలో 11 శాతం తగ్గి 43,733కు పడిపోయాయి. జాగ్వార్ బ్రాండ్ అమ్మకాలు 9 శాతం, ల్యాండ్ రోవర్ అమ్మకాలు 12 శాతం చొప్పున తగ్గాయి. మార్కెట్ వాటా పెరుగుతోంది...: దేశీయ వ్యాపారం జోరు కొనసాగుతోందని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తెలిపారు. తమ మార్కెట్ వాటా పెరుగుతోందని, లాభదాయకత వృద్ది కూడా పెరుగుతోందని పేర్కొన్నారు. టర్న్ అరౌండ్ 2.0 వ్యూహం మంచి ఫలితాలనిస్తోందని సంతృప్తి వ్యక్తం చేశారు. జేఎల్ఆర్ సమస్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు. అయితే వ్యాపారం భవిష్యత్తులో బాగుండేలా నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కాగా, బ్రెగ్జిట్ విషయమై ఎలాంటి ఒప్పందం కుదరలేనందున ఇంగ్లండ్‌లో జేఎల్ఆర్ ప్లాంట్లను 2–3 వారాల పాటు మూసివేయాల్సి వస్తుందని టాటా మోటార్స్ తెలిపింది. బ్రెగ్జిట్తో ఉత్పత్తి సంబంధిత సమస్యలు తలెత్తి దీర్ఘకాలంలో జేఎల్ఆర్ లాభదాయకత దెబ్బతింటుందని పేర్కొంది. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. కంపెనీ షేర్ గురువారం బీఎస్ఈలో 2.6 శాతం లాభపడి రూ.183 వద్ద ముగిసింది. అమెరికాలో ఏడీఆర్ గురువారం ఒకానొకదశలో 10 శాతం క్షీణించి 11.35 డాలర్లను తాకింది. -
5 రోజుల్లోనే డీల్ పూర్తి, అదెలా?
వ్యాపారాల్లో మార్పులు ఎంత వేగవంతంగా జరుగుతాయో మరోసారి భారతీ గ్రూప్, టాటా టెలిసర్వీసు విషయంలో రుజువైంది. కేవలం ఐదే ఐదు రోజుల్లో టాటా టెలిసర్వీసెస్, ఎయిర్టెల్ గూటికి చేరింది. అంతా అయిపోయిందనుకున్న క్షణంలో టాటా టెలిసర్వీసెస్‌కు కొత్త ఊపిరి పోసినట్టైంది. నిజానికి టాటాలకు, భారతీ కంపెనీలకు మధ్య ఈ విషయంపై గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆగస్టులో వీరి చర్చలు సమసిపోయాయి. ఇక ఎలాంటి డీల్‌ను కుదుర్చుకునేది లేదని తేల్చేసుకున్నాయి. సెప్టెంబర్ చివరి వరకు ఎలాంటి డీల్ కానీ, దానిపై ఇసుమంతైనా ప్రస్తావన లేదు. రిలయన్స్ జియో, ఇతర టెల్కోలతో టాటా గ్రూప్ చర్చలు జరిపినప్పటికీ, అవి కూడా విజయవంతం కాలేదు. చివరికి టాటా టెలిసర్వీసెస్‌ను మూసివేయాలనే టాటా గ్రూప్ నిర్ణయించింది. ఈ విషయంపై టాటా గ్రూప్‌కు చెందిన టాప్ అధికారులు న్యూఢిల్లీలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం అధికారులను కలిశారు. తమ టెలికాం వ్యాపారాలను మూసివేస్తున్నట్టు గత శుక్రవారం ప్రభుత్వానికి చెప్పేశారు. కానీ టాటా సన్స్‌కు కొత్త చైర్మన్‌గా వచ్చిన ఎన్ చంద్రశేఖరన్(చంద్ర) టాటా టెలిసర్వీసెస్‌ను మూసివేయడానికి అసలు ఇష్టపడలేదు. ప్రధానమంత్రి కార్యాలయంలోని అధికారులతో పాటు పలు ప్రభుత్వ సీనియర్ అధికారులతో భేటీ అయిన చంద్రశేఖరన్, ఈ విషయంపై పలు దఫాల చర్చించారు. ఇప్పటికే టెలికాం పరిశ్రమ ఒత్తిడిలో ఉందని, ఈ సమయంలో ఎలాంటి కంపెనీ మూత పడటానికి ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఇష్టపడలేదు. గత వీకెండ్ నుంచి పరిస్థితుల్లో మెల్లమెల్లగా మార్పులు రావడం ప్రారంభమైంది. భారతీ చైర్మన్ సునిల్ మిట్టల్, చంద్రతో సమావేశమయ్యారు. కేవలం ఐదు రోజుల్లోనే ఈ డీల్‌పై ఓ క్లారిటీకి వచ్చేశారు. తమ టెలికాం వ్యాపారాలను విలీనం చేసుకునేందుకు రెండు కంపెనీలు ఆమోదించడం అన్నీ చకాచకా జరిగిపోయాయి. టాటాలు కూడా తమ 149 ఏళ్ల చరిత్రలో ఏ కంపెనీని మూసివేసిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో టాటా టెలిసర్వీసెస్‌ను, ఎయిర్‌టెల్‌లో కలిపేశారు. -
దేశీ వ్యాపారాన్ని లాభాల్లోకి తెస్తాం
♦ వాణిజ్య వాహనాల విభాగంపై ప్రత్యేక దృష్టి ♦ టాటా మోటార్స్ చీఫ్ చంద్రశేఖరన్ ఆశాభావం ముంబై: టాటా మోటార్స్ దేశీ వ్యాపారాన్ని మళ్లీ లాభాల్లోకి మళ్లించడంపై దృష్టి పెడుతున్నట్లు టాటా గ్రూపు చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ చెప్పారు. ముఖ్యంగా సమస్యాత్మక పరిస్థితులతో ప్రతికూల ప్రభావాలెదుర్కొన్న వాణిజ్య వాహనాల విభాగంపై మరింతగా కసరత్తు చేయనున్నట్లు తెలియజేశారు. టాటా మోటార్స్‌కు కూడా చైర్మన్‌గా వ్యవహరిస్తున్న చంద్రశేఖరన్... చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా టాటా మోటార్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... 2016–17లో టాటా మోటార్స్ స్టాండెలోన్ ప్రాతిపదికన స్థూల ఆదాయం 3.6 శాతం వృద్ధితో రూ. 49,100 కోట్లకు చేరగా.. పన్నుల అనంతరం నష్టం రూ. 62 కోట్ల నుంచి రూ. 2,480 కోట్లకు పెరిగిందని తెలియజేశారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలుతో పాటు బీఎస్ 3 నుంచి బీఎస్ 4 ప్రమాణాలకు మారాల్సిందేనన్న సుప్రీం కోర్టు ఆదేశాలు మొదలైన వాటి రూపంలో వాణిజ్య వాహనాల వ్యాపారం పలు సవాళ్లు, అనిశ్చితి పరిస్థితిని ఎదుర్కొనాల్సి రావడమే ఇందుకు కారణమని చెప్పారు. మరోవైపు, మార్కెట్‌ను అందుకోలేకపోవడం సైతం కంపెనీకి ప్రతికూలంగా మారిందన్నారు. అయిదేళ్ల క్రితం 60 శాతంగా ఉన్న మార్కెట్ వాటా ఈ ఏడాది మార్చి నాటికి 44.4 శాతానికి పడిపోయిందని చెప్పారు. గడచిన మూడేళ్లుగా వాణిజ్య వాహనాల పరిమాణం 3,20,000 యూనిట్లకు దరిదాపుల్లోనే కొనసాగుతూనే ఉన్నప్పటికీ.. నిర్వహణ వ్యయాలు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. కంపెనీ పనితీరుపై ఇవన్నీ ప్రభావం చూపాయని చంద్రశేఖరన్ వివరించారు. నెక్సాన్‌పై ఆశలు.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టబోయే నెక్సాన్ కారు అమ్మకాలు ఆశావహంగా ఉండగలవని భావిస్తున్నట్లు చంద్రశేఖరన్ చెప్పారు. ఎటువంటి జాప్యాలు లేకుండా కొత్త ఉత్పత్తులను గడువులోగా ప్రవేశపెట్టడం, మళ్లీ మార్కెట్ వాటాను మెరుగుపర్చుకోవడం, వ్యయాలను నియంత్రించుకోవడం వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. ప్యాసింజర్ వాహనాల విభాగంలో దేశీయంగా మార్కెట్ వాటాను మెరుగుపర్చుకోగలిగినప్పటికీ.. ప్రస్తుత, భవిష్యత్ ఉత్పత్తులపై పెట్టుబడుల కారణంగా వ్యయాలు సైతం పెరిగాయన్నారు. నానో ఆపేయాలన్నది ఏకగ్రీవ నిర్ణయం: మిస్త్రీ నష్టాల్లోని నానో కారు ప్రాజెక్టును లాభాల్లోకి మళ్లించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ వృధా కావడంతో.. కార్ల తయారీ నిలిపివేయాలని టాటా మోటార్స్ ఏడాది క్రితమే ఏకగ్రీవ నిర్ణయం తీసుకుందని టాటా సన్స్ మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ తెలిపారు. నానో కారు, చిన్న వాణిజ్య వాహనాల విభాగంలో (ఎస్సీవీ) రిస్కులను తగిన స్థాయిలో మదింపు చేయకుండా రుణాలివ్వడం వల్ల కంపెనీకి, టాటా మోటార్ ఫైనాన్స్‌కి దాదాపు రూ. 4,000 కోట్ల మేర మొండిబాకీల రూపంలో నష్టం వాటిల్లిందని ఆయన పేర్కొన్నారు. 2016–17 వార్షిక నివేదికలో కొత్త చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ మిస్త్రీ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. -
టీసీఎస్ లో బాహుబలి టైటిల్ ఎవరికి?
ముంబై : బాహుబలి సినిమా అంతర్జాతీయ స్థాయిలో రికార్డుల మోత మోగించిన సంగతి తెలిసిందే. దీంతో ఎక్కడ చూసినా బాహుబలి సినిమా ప్రస్తావనే. టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో కూడా బాహుబలి, కట్టప్పలకు తగ్గ పాత్రలు ఉన్నాయట. టాటా గ్రూప్ చైర్మన్ గా ఎన్ చంద్రశేఖరన్ పదవిలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరిగిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వార్షిక సాధారణ సమావేశంలో ఈ ప్రాతలు ప్రస్తావనకు వచ్చాయి. టీసీఎస్ బోర్డు సభ్యులైన రతన్ టాటా కంపెనీకి బాహుబలి కాగ, ఆయన సన్నిహితుడు ఇషాత్ హుస్సేస్ కట్టప్పగా ఇన్వెస్టర్లు అభివర్ణించారు. సినిమాలో చూపించిన మాదిరిగా రాజుకు, సేవకుడుకు మధ్యనున్న నమ్మకమైన సంబంధం, రతన్ టాటాకు, హుస్సేన్ కు ఉంటుందని కొనియాడారు. భారత కార్పొరేట్ చరిత్రలోనే తొలిసారి టాటా గ్రూప్ లో హఠాత్తు పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సైరస్ మిస్త్రీని అర్థాంతరంగా బోర్డు సభ్యులు బయటికి పంపేయడం, ఆ తర్వాత కొత్త చైర్మన్ గా ఎన్ చంద్రశేఖరన్ ను బోర్డు సభ్యులు ఎన్నుకోవడం జరిగింది. కొన్ని నెలల పాటు జరిగిన ఈ వివాదంతో టాటా గ్రూప్ పరువు వీధిన పడింది. అయితే తర్వాత తర్వాత పరిస్థితులు కాస్త సద్దుమణిగాయి. దీర్ఘకాలిక ఇన్నింగ్ కు తాము చంద్రను ఆహ్వానిస్తున్నామని, బొంబై హౌజ్ చెన్నై హౌజ్ గా మారిందంటూ షేర్ హోల్డర్ అరుణ్ కుమార్ చెప్పారు. ఇషాత్ హుస్సేన్ మీరు కట్టప్ప, రతన్ టాటా బాహుబలి, 2016లో టాటా సన్స్ అధికార ప్రతినిధిగా మీ పాత్రను మీరు ఎంతో బాధ్యతాయుతంగా చేపట్టారని పేర్కొన్నారు. చంద్రశేఖరన్ కు ఎక్కువగా చంద్ర అని గుర్తింపు ఉంది. చంద్రను నియమించి, రతన్ టాటా తన మిషన్ విజయవంతంగా పూర్తిచేసినట్టు మరో ప్రముఖ ఇన్వెస్టర్ ఆశాలత మహేశ్వరి చెప్పారు. కాగ, నిన్న జరిగిన ఈ వార్షిక సాధారణ సమావేశంలో పలు విషయాలపై చంద్రశేఖరన్ ఇన్వెస్టర్లతో మాట్లాడారు. ఈ సమావేశంలోనే ట్రంప్ విధానాలు ప్రభావం తమపై ఉండదని ఇన్వెస్టర్లకు ధైర్యం చెప్పారు. ట్రంప్ తో ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని పేర్కొన్నారు. -
మాపై ట్రంప్ ప్రభావం లేదు
టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖరన్ ముంబై: పాశ్చాత్య దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక విధానాల వల్ల టీసీఎస్‌పై ఎలాంటి ప్రభావం పడలేదని టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖరన్ చెప్పారు. ట్రంప్ విధానాలు, వీసా నిబంధనల వల్ల తమపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేదని, వివిధ మార్కెట్లలో విజయవంతంగానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి దేశంలోనూ ఉద్యోగ నియామకాలు కొనసాగిస్తున్నామని టాటా సన్స్‌కు చైర్మన్ కూడా అయిన చంద్ర చెప్పారు. టీసీఎస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రతి దేశంలోనూ, ఆ దేశపు నియమనిబంధనలను తు.చ. తప్పక పాటిస్తున్నామని పేర్కొన్నారు. టీసీఎస్ తన ప్రయాణంలో ఇప్పటిదాకా ఎన్నో ఒడిదుడుకులను తట్టుకొని విజయవంతంగా నిలిచిందని పేర్కొన్నారు. ఇక్కడ జరిగిన టీసీఎస్ సాధారణ వార్షిక సమావేశం (ఏజీఎమ్)లో ఆయన మాట్లాడారు. కాగా ఈ ఏజీఎమ్‌కు రతన్ టాటా ఉద్దేశపూర్వకంగానే హాజరు కాలేదని సంబంధిత వర్గాలంటున్నాయి. డేటా కీలకం.. ప్రపంచ వ్యాపార సంస్థలు డిజిటల్ దిశగా మారుతున్నాయని, ఈ మార్పు చాలా వేగంగా జరుగుతోందని చంద్రశేఖరన్ వివరించారు. ఐటీతో పాటు అన్ని రంగాలకు భవిష్యత్తులో డేటా ఎక్స్‌లెన్స్ కీలకం కానున్నదని ఆయన అభిప్రాయపడ్డారు. డిజిటల్ టెక్నాలజీస్‌పై రెండు లక్షల మంది ఉద్యోగులకు టీసీఎస్ ఇప్పటికే తగిన శిక్షణనిచ్చిందని వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ డిజిటల్ ఆదాయం 28 శాతం వృద్ధితో 300 కోట్ల డాలర్లకు పెరిగాయని వివరించారు. టెక్నాలజీ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండనున్నదని, మనకు అపారమైన అవకాశాలున్నాయని వివరించారు. 79 వేల ఉద్యోగాలిచ్చాం... గత ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 79 వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకున్నామని కంపెనీ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాజేశ్ గోపీనాథన్ చెప్పారు. వీరిలో విదేశాల్లో ఉద్యోగాలిచ్చిన వారి సంఖ్య 11,500గా ఉందని వివరించారు. -
చంద్రశేఖరన్‌తో కొత్త శిఖరాలకు..!
టాటా గ్రూప్‌నకు మరింత వృద్ధి సాధ్యమన్న రతన్ టాటా జంషెడ్పూర్: టాటా గ్రూప్ ఇప్పుడు సురక్షిత హస్తాల్లో ఉందని ఆ గ్రూప్ చైర్మన్‌ను ఉద్దేశించి టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా పేర్కొన్నారు. చంద్రశేఖరన్‌తో కలిసి ఆయన శుక్రవారం ఇక్కడ టాటా గ్రూప్ వ్యవస్థాపకులు– జెంషెడ్జీ టాటా 179వ జయంత్యుత్సవాల్లో పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రతన్ ఏమన్నారంటే... ‘‘చంద్రశేఖరన్ టాటా గ్రూప్‌ను వృద్ధి బాటలో కొత్త శిఖరాలకు తీసుకెళ్తారు. ఈ నగరం (జంషెడ్పూర్)కూడా మరింత అభివృద్ధి చెందుతుంది. పనితీరులో అత్యున్నత ప్రమాణాలు, ఎటువంటి లోపాలూ లేని రికార్డు ఉన్న చంద్రశేఖరన్ మన గ్రూప్‌లో ఒక భాగంగా ఉండటం ఎంతో గర్వించతగిన అంశం. ఆయన నియంత్రణలో టీసీఎస్ ఎంతో పురోగమించింది. చంద్రశేఖరన్ ఏమన్నారంటే... గత 36 గంటలుగా నేను ఈ స్టీల్‌సిటీలో ఉన్నాను. మానవ జీవితాలపై ఈ నగరం ప్రభావం ఎంతనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటుంటాను. ప్రతిష్టాత్మకమైన టాటా స్టీల్నూ– జంషెడ్పూర్నూ వేరుచేసి చూడలేము. ఒక బ్రాండ్‌కు ఒక నగరంతో ఉన్న ఈ పటిష్ట అనుబంధాన్ని ప్రపంచంలో ఎక్కడా చూడలేము. ఉద్యోగులకు రతన్ లేఖ... జెంషెడ్జీ 178వ జయంతి సందర్భంగా రతన్‌టాటా గ్రూప్‌లో పనిచేసే ఉద్యోగులు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక లేఖ విడుదల చేశారు. రానున్న రోజుల్లో గ్రూప్ మరింత ముందుకు దూసుకువెళుతుందని భరోసా ఇచ్చారు. టాటా ట్రస్ట్‌లకు ఈ ఏడాదితో 125 సంవత్సరాలు పూర్తవుతున్న విషయాన్ని కూడా ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు. -
'ఐటీ ఇండస్ట్రి పండుగ చేసుకోవాలి'
ముంబై : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్-1బీ వీసాల్లో తీసుకుంటున్న కఠిన చర్యలతో భారతీయ ఐటీ సర్వీసులు వణికిపోవాల్సిన పనిలేదని టీసీఎస్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ చెప్పారు. అమెరికా ఉపాధి కల్పనను తగ్గించుకుంటే మనం సెలబ్రేట్ చేసుకోవాలే తప్ప దాన్ని కార్మికుల బేరసారాలుగా వ్యాఖ్యానించాల్సిన పనిలేదన్నారు. టీసీఎస్ ఒక ఉత్పత్తులు తయారుచేసే సంస్థగా కాకుండా.. ఖర్చును తగ్గించుకోవడానికి ఎందుకు ఎక్కువగా దృష్టిసారిస్తుందనే ప్రశ్నకు సమాధానంగా చంద్రశేఖరన్ ఈ సమాధానమిచ్చారు. నాస్కామ్ ఇండియా లీడర్షిప్ ఫోరమ్‌లో పాల్గొన్న చంద్రశేఖరన్, వివిధ రకాల పరిశ్రమల్లో, భౌగోళిక ప్రాంతాల్లో కొత్త అవకాశాలను ఇండస్ట్రి వెలికి తీయాల్సి ఉందని చెప్పారు. హెచ్-1బీ వీసాలో కఠినతరమైన నిబంధనలు తీసుకురావడం, వీసా ధరలు పెంచడం ఇవేమి దేశీయ ఐటీ ఇండస్ట్రికి సవాళ్లు కాదని, ఇవి కొత్త కొత్త అవకాశాలని పేర్కొన్నారు. ఎక్కడైనా ఐటీ సర్వీసులు వర్క్ చేసే విధంగా, ఇప్పటికీ వెలికితీయని వాటిని అన్వేషించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. హెచ్-1బీ వీసాల్లో నిబంధనలు మార్చిన ప్రతీసారి, దేశీయ ఐటీ ఇండస్ట్రి చిక్కుల్లో పడుతుందని వార్తలు వస్తుంటాయి, కానీ ఇవి పరిశ్రమకు అత్యంత ఉత్తేజకరమని పేర్కొన్నారు. పరిశ్రమను మరింత విస్తరించడానికి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎంతో సహకరిస్తుందన్నారు. ''మైక్రోసాఫ్ట్ ఉత్పత్తి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిదాన్ని భారతీయులు ఎందుకు రూపొందించలేకపోయారని అడగటం కాదు.. మరో టీసీఎస్‌ని నీవెందుకు సృష్టించలేకపోయావని మనమే మైక్రోసాఫ్ట్‌ని ప్రశ్నించాలి'' అని చంద్రశేఖరన్ సవాల్ విసిరారు. -
గతవారం బిజినెస్
నియామకాలు టాటా సన్స్ చైర్మన్‌గా చంద్రశేఖరన్ టాటా సన్స్‌కు కొత్త చైర్మన్ ఎంపికయ్యారు. ఇప్పటిదాకా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈవో, ఎండీగా పనిచేస్తున్న ఎన్.చంద్రశేఖరన్‌ను టాటా గ్రూపు కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించారు. ముంబైలో జరిగిన బోర్డు సమావేశంలో నూతన చైర్మన్‌గా ఆయన్ను టాటా సన్స్ ఎంపిక చేసింది. చంద్రశేఖరన్ ఫిబ్రవరి 21న బాధ్యతలు స్వీకరిస్తారు. ఇక టీసీఎస్ నూతన ఎండీ, సీఈవోగా రాజేశ్ గోపీనాథన్ ఎంపికయ్యారు. అలాగే, కంపెనీ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఎఫ్‌వో)గా ఎన్.గణపతి సుబ్రమణ్యం నియమితులయ్యారు. అంచనాల్ని మించిన టీసీఎస్ దేశీ ఐటీ దిగ్గజం టీసీఎస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో అంచనాల్ని మించి వృద్ధి సాధించింది. క్యూ3లో నికర లాభం 10.9 శాతం ఎగిసి రూ. 6,778 కోట్లకు చేరింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ.6,110 కోట్లు. తాజా క్యూ3లో మొత్తం ఆదాయం 8.7 శాతం వృద్ధితో రూ.27,364 కోట్ల నుంచి రూ. 29,735 కోట్లకు పెరిగింది. రెండో త్రైమాసికంతో పోలిస్తే నికర లాభం 2.9 శాతం, ఆదాయం 1.5 శాతం మేర పెరిగాయి. నిర్వహణ లాభం రూ. 7,733 కోట్లుగా నమోదైంది. షేరు ఒక్కింటికి రూ. 6.5 మేర డివిడెండ్ ఇవ్వనున్నట్లు టీసీఎస్ తెలిపింది. విమానాల్లో... మహిళలకు మాత్రమే!! ఎయిర్ ఇండియా తాజాగా తన దేశీ విమానాల్లో మహిళల కోసం ఆరు సీట్లను ప్రత్యేకంగా రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది త్వరలోనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఇది దేశీ సర్వీసులకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఎయిర్‌బస్ ఏ320లో ఎకానమీ క్లాస్‌లోని మూడవ వరుసలో ఉన్న ఆరు సీట్లను జనవరి 18 నుంచి మహిళలకు కేటాయించామని ఎయిర్ ఇండియా అధికారి చెప్పారు. కుటుంబంతో కలసి ప్రయాణించే మహిళలకు ఈ సౌకర్యం వర్తించదు. ఏవియేషన్ పరిశ్రమలో ఇలాంటి సేవలు ప్రారంభించడం ఇదే ప్రథమం. దేశవ్యాప్తంగా ఎయిర్టెల్ బ్యాంక్ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తాజాగా దేశవ్యాప్తంగా తమ కార్యకలాపాలు విస్తరించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వీటిని అధికారికంగా ప్రారంభించారు. గతేడాది నవంబర్‌లో రాజస్థాన్‌లో బ్యాంకింగ్ సేవలు ప్రారంభించిన ఎయిర్టెల్... ఆ తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కి విస్తరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కార్యకలాపాలు ప్రారంభించింది. కస్టమర్ల ఫోన్ నంబర్‌నే బ్యాంకు ఖాతా నంబరుగా కూడా ఉపయోగించుకోవచ్చని భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ చెప్పారు. పొదుపు ఖాతాల్లో డిపాజిట్లపై వార్షికంగా 7.25 శాతం మేర వడ్డీ రేటు ఇస్తున్నట్లు తెలిపారు. 6 లోగా... 600 కోట్లు కట్టాల్సిందే! సహారా చీఫ్ సుబ్రతోరాయ్ మళ్లీ తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్నట్లు కనిపిస్తోంది. పెరోల్ పొడిగింపునకు చెల్లించాల్సిన రూ.600 కోట్లను ఫిబ్రవరి 6వ తేదీలోగా చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గడువును ఎంతమాత్రం పొడిగించేది లేదంటూ... డిపాజిట్ చేయలేకపోతే జైలుకు వెళ్లక తప్పదని పేర్కొంది. మూడేళ్ల కనిష్టానికి రిటైల్ ద్రవ్యోల్బణం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్లో మూడేళ్ల కనిష్ట స్థాయి 3.41 శాతానికి పడిపోయింది. అంటే 2015 డిసెంబర్లో కొన్ని వస్తువుల బాస్కెట్ ధరను 2016 డిసెంబర్‌తో పోలిస్తే... ధరలు 3.41 శాతం పెరిగాయన్నమాట. కాగా 2015 నవంబర్‌లో ఈ రేటు 3.63 శాతంకాగా, 2015 డిసెంబర్లో 5.61 శాతం. తాజా గణాంకాలను చూస్తే,... డిసెంబర్ నెలలో కొన్ని రంగాలపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం పడి డిమాండ్ తగ్గడంతో పాటు కూరగాయల ధరలు తగ్గడం దీనికి ప్రధాన కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. వాహన విక్రయాలు ఢమాల్ పెద్ద నోట్ల రద్దుతో వాహన పరిశ్రమ కుదేలయ్యింది. దేశంలో కన్సూమర్ డిమాండ్‌ను ప్రతిబింబించే వాహన విక్రయాలు డిసెంబర్ నెలలో 16 ఏళ్ల కనిష్ట స్థాయికి పతనమయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే దాదాపు 18.66 శాతం క్షీణించాయి. సియామ్ తాజా గణాంకాల్లో ఈ విషయాలను వెల్లడయ్యాయి. తేలికపాటి వాణిజ్య వాహన విభాగాన్ని మినహాయిస్తే (వీటి విక్రయాలు 1.15 శాతం పెరిగాయి).. మిగతా స్కూటర్లు, మోటార్‌సైకిళ్లు, కార్లు.. ఇలా అన్ని విభాగాల్లో విక్రయాలు గత నెల రికార్డ్ స్థాయికి పడిపోయాయి. క్షీణించిన వ్యాపార విశ్వాసం దేశంలో వ్యాపార విశ్వాసం క్షీణించింది. 2017 జనవరి–మార్చి క్వార్టర్లో వ్యాపారం మెరుగ్గా వుండబోదన్న అంచనాలు వెలువడ్డాయి. ఈ విశ్వాసం 31 త్రైమాసికాల కనిష్ట స్థాయికి పడింది. కంపెనీలపై నోట్ల రద్దు అంశం తీవ్ర ప్రభావం చూపింది. నగదు కొరతతో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల వల్ల వాటి వ్యాపార విశ్వాసం సన్నగిల్లింది. డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ కంపొసైట్ బిజినెస్ ఆప్టిమిజమ్ ఇండెక్స్ 2017 తొలి త్రైమాసికంలో 65.4 వద్ద ఉంది. 2016 జనవరి–మార్చి త్రైమాసికంతో పోలిస్తే సూచీలో 23.9 శాతం క్షీణత నమోదయ్యింది. ఇండస్ఇండ్ బ్యాంకు నుంచి మెరుగైన ఫలితాలు గతేడాది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో పెద్ద నోట్ల రద్దు వంటి ప్రతికూలతలను తట్టుకుని మరీ ప్రైవేటు రంగ ఇండస్ఇండ్ బ్యాంకు మెరుగైన ఫలితాలను ప్రకటించింది. బ్యాంకు లాభం 29% అధికంగా రూ.750.64కోట్లు నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో బ్యాంకు లాభం రూ.581 కోట్లే. డీమానిటైజేషన్ ప్రభావం అంతగా లేదని బ్యాంకు తెలిపింది. ఇన్ఫోసిస్ నికర లాభం రూ.3,708 కోట్లు దేశీ సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ ఫలితాలు ఆకట్టుకున్నప్పటికీ.. ఆదాయ అంచనాలు (గైడెన్స్) మాత్రం నిరుత్సాహపరిచాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం(2016–17, క్యూ3)లో కంపెనీ కన్సాలిడేషన్ నికర లాభం రూ.3,708 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.3,465 కోట్లతో పోలిస్తే 7 శాతం వృద్ధి చెందింది. ఇక ఆదాయం రూ.15,902 కోట్ల నుంచి రూ.17,273 కోట్లకు ఎగసింది. క్రితం ఏడాది క్యూ3తో పోలిస్తే 8.6 శాతం పెరిగింది. ఈ నెల 23 నుంచి బీఎస్ఈ ఐపీఓ బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. రూ.1,500 కోట్లు సమీకరిస్తుందన్న అంచనాలున్న ఈ ఐపీఓ ఈ నెల 25న ముగుస్తుంది. వచ్చే నెల 3న బీఎస్ఈ షేర్లు ఎన్ఎస్ఈలో లిస్ట్ అవుతాయని అంచనా. ఈ ఐపీఓలో భాగంగా బీఎస్ఈలో వాటాలు ఉన్న సంస్థలు 1.54 కోట్లషేర్లను (దాదాపు 30 శాతం వాటా) ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయించనున్నాయి. ఈ షేర్ ధర గరిష్టంగా రూ.500 ఉండొచ్చని అంచనా. డిసెంబర్లో ఎగుమతులు పైకే ట్రంప్ ఎన్నికతో అనిశ్చితిని, దేశీయంగా డీమోనిటైజేషన్ను ఎదుర్కొని మరీ దేశీయ ఎగుమతులు వరుసగా నాలుగో నెల డిసెంబర్‌లోనూ వృద్ధి దిశగా పయనించాయి. డిసెంబర్ నెలలో 5.72 శాతం వృద్ధితో 23.9 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయి. దిగుమతులు సైతం స్వల్పంగా 0.46 శాతం పెరిగాయి. 34.25 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు నమోదయ్యాయి. 2015 డిసెంబర్లో వాణిజ్య లోటు 11.5 బిలియన్ డాలర్లుగా ఉండగా... గత డిసెంబర్లో వాణిజ్య లోటు 10.36 బిలియన్ డాలర్లకు పరిమితం అయింది. డీల్స్.. డీపీ వరల్డ్ గ్రూప్ భారత్‌లో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. పోర్ట్, లాజిస్టిక్స్ రంగంలో దశలవారీగా వంద కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు డీపీ వరల్డ్ గ్రూప్ చైర్మన్, సీఈఓ సుల్తాన్ అహ్మద్ బిన్ సులాయేమ్ పేర్కొన్నారు. ఆన్లైన్ రియల్ ఎస్టేట్ సర్వీసుల రంగంలో మరో కన్సాలిడేషన్ డీల్‌కు తెరతీస్తూ ప్రాప్‌టైగర్‌డాట్‌కామ్, హౌసిం గ్డాట్కామ్ సంస్థలు విలీనం కానున్నాయి. తద్వారా దేశీయంగా అతి పెద్ద ఆన్లైన్ రియల్టీ సేవల సంస్థ ఆవిర్భవించనుంది. ఇది వ్యాపార కార్యకలాపాల విస్తరణ కోసం 55 మిలియన్ డాలర్లు సమీకరించనుంది. అమెరికా ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం, మెక్‌డొనాల్డ్.. చైనా, హాంగ్‌కాంగ్ వ్యాపారానికి సంబంధించి నియంత్రిత వాటాను విక్రయించింది. ఈ వాటాను 208 కోట్ల డాలర్లకు చైనా ప్రభుత్వ సంస్థ సిటిక్, కార్లైల్ గ్రూప్‌కు అమ్మేశామని మెక్‌డొనాల్డ్ తెలిపింది. -
30 ఏళ్ల... ‘చంద్ర’యాన్
కాలేజీ నుంచి టీసీఎస్ ఉద్యోగానికి • కెరీర్ మొత్తం అక్కడే; ఇపుడు గ్రూపు చైర్మన్‌గా • నా సామర్థ్యానికి గౌరవమిది: చంద్రశేఖరన్ పూర్తిపేరు నటరాజన్ చంద్రశేఖరన్. అందరూ పిలిచేది మాత్రం చంద్ర... అనే. వయసు 54 ఏళ్లు. తమిళనాడులోని తిరుచ్చి రీజినల్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి బయటకొచ్చిన తరవాత ఆయన ఎంచుకున్నది టీసీఎస్‌నే. తన పూర్తి సామర్థ్యాన్ని కంపెనీకే ధారపోసిన చంద్రశేఖరన్... 2009 నాటికి టీసీఎస్ ఎండీ, సీఈవో స్థాయికి చేరుకున్నారు. 2014లో ఐదేళ్ల పదవీ కాలం ముగిసినా... రెండోసారీ దక్కించుకున్నారు. గతేడాది అక్టోబర్ 24న సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలికిన మర్నాడే చంద్రశేఖరన్‌ను టాటా సన్స్ డైరెక్టర్ల బోర్డులోకి తీసుకున్నారు. తాజాగా ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బాధ్యతలకు ఎంపిక చేశారు. టీసీఎస్ విజయం వెనక ‘చంద్ర’ చంద్రశేఖరన్ విషయంలో చెప్పుకోవాల్సింది ఒకటుంది. ఇప్పటిదాకా టాటా సన్స్ పగ్గాలు దక్కించుకున్నది టాటాల కుటుంబీకులు... లేదా వాటాదారులు మాత్రమే. ఒక ఉద్యోగికి ఈ స్థాయి దక్కటం ఇదే తొలిసారి కూడా. రతన్ టాటా సోదరుడు నోయెల్ టాటా, జేఎల్ఆర్కు చెందిన రాల్ఫ్ స్పెత్, పెప్సీకో సీఈవో ఇంద్రా నూయి తదితరులతో పోటీ పడి మరీ అగ్ర పీఠాన్ని దక్కించుకున్నారు. విశేషమేంటంటే ఒకదశలో టాటా అగ్రపీఠానికి టీసీఎస్ మాజీ సీఈఓ రామదురై పేరు కూడా వినిపించింది. టీసీఎస్ ఎండీ కావటానికి ముందు... నాటి సీఈవో రామదొరైకు సహాయకుడిగా చంద్ర సేవలందించారు కూడా. రెండు దశాబ్దాల కాలంలో ప్రత్యర్థి కంపెనీలను దాటుకుని దేశీయ అగ్రగామి ఐటీ కంపెనీగా టీసీఎస్ అవతరించడం, రూ.5 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో టాటా గ్రూపునకు కల్పవృక్షంగా మారటం వెనక చంద్ర కృషి చాలా ఉంది. ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని ఆయన టీసీఎస్‌ను అగ్రగామిని చేశారు. టాటా గ్రూపు లాభాల్లో 80 శాతానికి పైగా టీసీఎస్ నుంచే వస్తుండటం గమనార్హం. 2015లో ఐటీ సేవల్లో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన బ్రాండ్‌గా టీసీఎస్ ఖ్యాతిని సొంతం చేసుకుంది కూడా. 2015–16లో 16.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఈ కంపెనీ ఆర్జించింది. దేశంలో 3.78 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది కూడా. సానుకూలతలే కాదు... సవాళ్లూ ఉన్నాయ్ టీసీఎస్‌లో సుదీర్ఘ అనుభవం, గ్రూపునకు ఆశాకిరణంగా కనిపిస్తున్న జేఎల్ఆర్లు చంద్రకు సానుకూలాంశాలు. అయితే గ్రూపులోని పలు కంపెనీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి గాడిన పెట్టడం పెద్ద సవాలే. చంద్రకు భార్య లలిత, కుమారుడు ప్రణవ్ ఉన్నారు. ఇండో–యూఎస్, భారత్–బ్రిటిష్ సీఈవోల ఫోరంలో చంద్ర కీలక పాత్ర పోషిస్తున్నారు. ఐటీ పరిశ్రమ అసోసియేషన్ నాస్కామ్కు 2012–13లో చైర్మన్‌గా పనిచేశారు. మార్పు దశలో టాటా...: చంద్రశేఖరన్ టాటా గ్రూపు మార్పు దశలో ఉందని ఆ గ్రూపు కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎంపికైన చంద్రశేఖరన్ అన్నారు. టాటాలు సృష్టించిన విలువలు, నైతికత, సంస్కృతితో గ్రూపును ప్రగతి దిశగా నడిపించడమే తన కర్తవ్యమన్నారు. టాటా సన్స్ తనను చైర్మన్‌గా ఎంపిక చేసిన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ ‘‘కొత్త పాత్ర ఎన్నో బాధ్యతలతో కూడుకున్నదని నాకు తెలుసు. దేశ ప్రజల్లో సమున్నత స్థానాన్ని ఆక్రమించిన ఓ గొప్ప సంస్థను నడిపించేందుకు నన్ను ఎంపిక చేయడం గౌరవంగా భావిస్తున్నా. టాటా గ్రూపుతో 30 ఏళ్ల పాటు కలసి నడుస్తూ ఈ స్థాయికి చేరుకోవడం చాలా గర్వంగా ఉంది’’ అన్నారాయన. -
‘టాటా’ మనిషికే పగ్గాలు
టాటా సన్స్ చైర్మన్‌గా టీసీఎస్ చంద్రశేఖరన్ • గురువారం సాయంత్రం బోర్డు భేటీలో నిర్ణయం • అనిశ్చితికి తెర; ఫిబ్రవరి 21న బాధ్యతలు ముంబై: టాటా సన్స్‌కు కొత్త చైర్మన్ ఎంపికయ్యారు. ఇప్పటిదాకా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సీఈవో, ఎండీగా పనిచేస్తున్న ఎన్.చంద్రశేఖరన్‌ను టాటా గ్రూపు కొత్త ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నియమించారు. సైరస్ మిస్త్రీ వ్యవహారంతో ఇబ్బందులెదుర్కొన్న రతన్ టాటా... ఇకపై అలాంటి సమస్యలు తలెత్తకుండా తనకు నమ్మకంగా ఉండే చంద్రశేఖరన్వైపు మొగ్గు చూపించారని తెలుస్తోంది. దీనికితోడు గ్రూపులో మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కంపెనీ అయిన టీసీఎస్‌ను విజయవంతంగా నడిపిస్తున్న చరిత్ర కూడా చంద్రశేఖరన్‌కు ఉంది. గురువారం సాయంత్రం ముంబైలో జరిగిన బోర్డు సమావేశంలో నూతన చైర్మన్‌గా ఆయన్ను టాటా సన్స్ ఎంపిక చేసింది. ఇక కొత్త బాధ్యతలను చంద్రశేఖరన్ ఫిబ్రవరి 21న స్వీకరిస్తారు. ‘‘టాటా గ్రూపు ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఎన్S.చంద్రశేఖరన్ టాటాసన్స్ డైరెక్టర్ల బోర్డు గురువారం నాటి సమావేశంలో నియమించింది. ఎంపిక కమిటీ ఏకగ్రీవ సిఫార్సు మేరకు ఈ నియామకం జరిగింది’’ అని టాటా సన్స్ ఒక ప్రకటనలో తెలియజేసింది. కాకపోతే చంద్రశేఖరన్ పదవీ కాలం ఎన్నాళ్లుంటుంది? రతన్‌టాటాకు గ్రూపులో కొత్తగా ఏవైనా బాధ్యతలు అప్పగిస్తున్నారా? వంటి వివరాలను మాత్రం టాటా సన్స్ వెల్లడించలేదు. ఎంపిక కమిటీ ఏకగ్రీవ సిఫారసు గతేడాది అక్టోబర్ 24న టాటా గ్రూపు చైర్మన్ పదవి నుంచి సైరస్ పీ మిస్త్రీని తప్పించడంతో తాత్కాలిక చైర్మన్‌గా రతన్ టాటా పగ్గాలు చేపట్టారు. ఉప్పు నుంచి సాఫ్ట్వేర్ వరకు భిన్న రంగాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న 103 బిలియన్ డాలర్ల విలువగల టాటా గ్రూపు చైర్మన్‌గా అర్హత కలిగిన వ్యక్తి ఎంపిక కోసం... అదే రోజున రతన్‌టాటా, టీవీఎస్ గ్రూపు హెడ్ వేణు శ్రీనివాసన్, అమిత్ చంద్ర, రోనెన్ సేన్, లార్డ్ కుమార్ భట్టాచార్యతో ఓ కమిటీ ఏర్పడింది. కమిటీకి కొత్త చైర్మన్ ఎంపిక కోసం 4 నెలల సమయం ఇచ్చారు. కానీ కమిటీ దీన్ని 2 నెలల్లోనే ముగించింది. తాజా నిర్ణయంతో టాటా గ్రూపు నాయకత్వంపై రెండు నెలలుగా ఏర్పడిన సందిగ్ధతకు తెరపడినట్లే. మిస్త్రీ కుటుంబం టాటా సన్స్‌పై న్యాయపోరాటం చేస్తున్న కీలక సమయంలో ‘చంద్ర’ టాటా చైర్మన్ బాధ్యతల్లోకి వస్తుండడం గమనార్హం. చంద్రశేఖరుడిపై ఆశలు... ‘‘చంద్రశేఖరన్ టీసీఎస్ సీఈవో, ఎండీగా ఉత్తమనాయకత్వాన్ని అందించారు. టాటా గ్రూపు మొత్తం తన సామర్ధ్యాన్ని గుర్తించడంతోపాటు ఆయా వ్యాపారాల్లో నాయకులుగా రాణించేందుకు ఆయన స్ఫూర్తినిస్తారని నమ్ముతున్నాం. అలాగే, మా విలువలతో కూడిన వ్యవస్థను, నైతికతను కొనసాగిస్తారని, టాటా గ్రూపు విధానాలను అనుసరిస్తారని భావిస్తున్నాం’’ అని టాటా సన్స్ ప్రకటనలో పేర్కొంది. నియమకాన్ని ఆహ్వానిస్తున్నాం.. టాటాసన్స్ చైర్మన్‌గా చంద్రశేఖరన్ నియామకాన్ని ఆహ్వానిస్తున్నాం. ఈ నిర్ణయంతో టాటా గ్రూపు దేశ వ్యాపార రంగంలో అగ్రగామిగా తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు కృషిని కొనసాగిస్తుందనే నమ్మకం ఉంది. – అరుంధతీ భట్టాచార్య, ఎస్బీఐ చైర్పర్సన్ సారథ్యానికి తగిన వ్యక్తి... టీసీఎస్‌ను ప్రపంచ టెక్నాలజీ రంగంలో అగ్రగామి స్థాయికి తీసుకె ళ్లారు. అంతర్జాతీయంగా చంద్రశేఖరన్కున్న అనుభవం, వ్యాపార చతురత, టాటాలతో సుదీర్ఘ అనుబంధం నూతన బాధ్యతలకు ఆయన తగిన వారని నిరూపిస్తుంది. – చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో సవాళ్లను ఎదుర్కోనే సత్తా చంద్రకు ఉంది.. టాటా గ్రూపు చైర్మన్‌గా చంద్రశేఖరన్ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది. ఆ సామర్థ్యం తనకు ఉందని ఆయన ఇప్పటికే టీసీఎస్‌లో నిరూపించుకున్నారు. – ఎన్.నారాయణమూర్తి, ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఇండియన్ ఐకాన్ రక్షకుడు.. కొత్త బాధ్యతలు స్వీకరించనున్న చంద్రశేఖరన్‌ను అభినందనలు. మీరిప్పుడు ఇండియన్ ఐకాన్ సంరక్షకులు. ఆ బాధ్యతను చేపట్టగల విశాలమైన భుజస్కంధాలు మీకున్నాయి. – ఆనంద్ మహింద్రా, మహింద్రా గ్రూపు చైర్మన్ -
టీసీఎస్.. భేష్!
ముంబై: భారత్‌లో అగ్రశ్రేణి ఐటీ కంపెనీ టీసీఎస్ అంచనాలను మించిన ఫలితాలతో ఆకట్టుకుంది. కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభం డిసెంబర్‌తో ముగిసిన మూడో క్వార్టర్(2013-14; క్యూ3)లో 50.3 శాతం దూసుకెళ్లి... రూ.5,333 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.3,550 కోట్లుగా ఉంది. కాగా, మొత్తం కన్సాలిడేటెడ్ ఆదాయం కూడా రూ.16,070 కోట్ల నుంచి రూ.21,294 కోట్లకు ఎగబాకింది. 32.5% వృద్ధి చెందింది. యూరప్‌లో వ్యాపారం పుంజుకోవడం... లైఫ్‌సెన్సైస్, టెలికం, తయారీ రంగం తదితర విభాగాల్లో మెరుగైన పనితీరు మూడో క్వార్టర్లో జోరుకు దోహదం చేసింది. బ్రోకరేజి సంస్థల విశ్లేషకులు టీసీఎస్ క్యూ3లో సగటున రూ. 5,179 కోట్ల లాభాన్ని రూ. 21,373 కోట్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చని అంచనా వేశారు. సీక్వెన్షియల్‌గానూ... ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్(క్యూ2-రూ.4,633 కోట్లు)తో పోల్చినా కూడా(సీక్వెన్షియల్‌గా) క్యూ3 నికర లాభంలో 15.1% వృద్ధి నమోదవడం విశేషం. ఆదాయం మాత్రం 1.5% స్వల్పంగా పెరిగింది. క్యూ2లో ఆదాయం రూ.20,977 కోట్లుగా ఉంది. ఇతర ముఖ్యాంశాలివీ... డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌కు గాను టీసీఎస్ రూ. 1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.4 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. 2013-14లో వరుసగా మూడో క్వార్టర్లోనూ మధ్యంతర డివిడెండ్ ఇవ్వడం విశేషం. కాగా, దీనికి ఈ నెల 28ని రికార్డు తేదీగా నిర్ణయించింది. కంపెనీ నిర్వహణ మార్జిన్లు 29.7 శాతంగా నమోదయ్యాయి. 8 బడా డీల్స్ కుదిరాయి. ఇందులో 2 కోట్ల డాలర్ల విలువైన 4 కాంట్రాక్టులు, 5 కోట్ల డాలర్ల 2 కాంట్రాక్టులున్నాయి. మరిన్ని ఉద్యోగాలు... ఐటీ సేవలకు డిమాండ్ పుంజుకుంటుండటంతో టీసీఎస్ మరిన్ని ఉద్యోగాలు ఇవ్వనుంది. ఈ ఏడాది(2013-14)లో నియామకాల లక్ష్యం 50 వేలు కాగా, దీనికి మరో 5 వేల మందిని జోడించనున్నట్లు కంపెనీ గ్లోబల్ హెచ్ఆర్ హెడ్ అజోయ్ ముఖర్జీ ప్రకటించారు. ఇదిలాఉండగా... క్యూ3లో స్థూలంగా 14,663 మంది ఉద్యోగులను టీసీఎస్ జతచేసుకుంది. అయితే, 9,200 మంది సిబ్బంది కంపెనీని వీడటంతో నికరంగా 5,463 మంది జతయ్యారు. డిసెంబర్ చివరినాటికి టీసీఎస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,90,713కు చేరింది. జోరు ఎందుకంటే.. ఈ ఏడాది క్యూ3లో కంపెనీ ఫలితాలు చాలా బాగున్నాయి. మా సేవలకు అంతర్జాతీయంగా ఐటీకి పటిష్టమైన డిమాండ్, కాంట్రాక్టుల నిర్వహణలో క్రమశిక్షణే ఈ మెరుగైన వృద్ధికి కారణం. తక్కువ ఫారెక్స్ నష్టాలు, మార్జిన్లు అంచనాల కంటే ఎక్కువగా నమోదవడం కూడా లాభాలను పెంచాయి. వచ్చే ఏడాది (2014-15)లో మా రాబడులు కూడా మరింత జోరందుకోవచ్చు. - ఎన్. చంద్రశేఖరన్, టీసీఎస్ సీఈఓ టీసీఎస్ షేరు ధర గురువారం బీఎస్ఈలో రూ. 2.90 స్వల్ప నష్టంతో రూ. 2,351.35 వద్ద ముగిసింది. ఒకానొక దశలో రూ. 2,380 గరిష్టాన్ని తాకింది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. -
టీసీఎస్ జూమ్
న్యూఢిల్లీ: దేశంలో నంబర్ వన్ సాఫ్ట్వేర్ కంపెనీ టీసీఎస్.. బంపర్ ఫలితాలతో అదరగొట్టింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2013-14; క్యూ2)లో రూ.4,633 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.3,512 కోట్లతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన లాభం 34 శాతం దూసుకెళ్లింది. ఇక మొత్తం ఆదాయం కూడా రూ.15,621 కోట్ల నుంచి రూ.20,977 కోట్లకు ఎగబాకింది. 34.3 శాతం వృద్ధి నమోదైంది. అన్ని రంగాలు, వివిధ దేశాల మార్కెట్ల నుంచి ఐటీకి డిమాండ్ జోరందుకోవడం, డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా పడిపోవడం వంటివి కంపెనీకి కలిసొచ్చాయి. ప్రధానంగా బ్యాంకింగ్-ఫైనాన్షియల్ సర్వీసెస్, బీమా(బీఎఫ్ఎస్ఈ), తయారీ రంగాలు ఈ పటిష్టమైన వృద్ధికి దోహదం చేశాయి. ఉత్తర అమెరికా, యూరప్ సహా అన్ని కీలక ప్రాంతాల నుంచి డిమాండ్ పుంజుకుంది. ఇక డాలరు రూపంలో నికరలాభం కూడా 16.4 శాతం ఎగసి 74.8 కోట్ల డాలర్లకు చేరింది. ఆదాయం 17 శాతం వృద్ధితో 334 కోట్ల డాలర్లుగా నమోదైంది. త్రైమాసికంగానూ జోష్... ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(క్యూ1, సీక్వెన్షియల్‌గా)తో పోల్చినా టీసీఎస్ లాభాలు దూసుకెళ్లాయి. క్యూ1లో రూ.3,830 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా లాభం క్యూ2లో 22.76 శాతం ఎగసింది. ఇక ఆదాయం క్యూ1లో రూ.17,987 కోట్లుగా ఉంది. దీంతో చూస్తే.. క్యూ2లో 16.6 శాతం వృద్ధి చెందింది. ఇతర ముఖ్యాంశాలివీ... సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీకి 10 కోట్ల డాలర్లకు పైగా విలువగల కాంట్రాక్టులు ఇచ్చిన ముగ్గురు క్లయింట్లు జతయ్యారు. బీపీఓ విభాగంతో సహా నికరంగా 7,664 మంది ఉద్యోగులు కంపెనీలో చేరారు(స్థూలంగా 17,362 మంది జతయ్యారు). దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 2,85,250కి చేరింది. పటిష్టమైన వ్యాపార పరివూణంతో పాటు, కరెన్సీ క్షీణత(డాలరుతో పోలిస్తే క్యూ2లో రూపాయి మారకం విలువ 11% పడిపోయింది), కాంట్రాక్టులను కచ్చితత్వంతో అమలు చేయడం తమకు మేలు చేశాయని టీసీఎస్ సీఎఫ్ఓ రాజేష్ గోపీనాథన్ వ్యాఖ్యానించారు. దీంతో దేశీ ఐటీ పరిశ్రమను మించిన నిర్వహణ మార్జిన్లను క్యూ2లో నమోదుచేయగలిగామని చెప్పారు. కరెన్సీ క్షీణతతో మార్జిన్లు 300 బేసిస్ పాయింట్లు మెరుగైనట్లు తెలిపారు. వాటాదారులకు రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ. 4 చొప్పున ఈ ఆర్థిక సంవత్సరంలో రెండో విడత మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. క్యూ1లో కూడా రూ. 4 చొప్పున మధ్యంతర డివిడెండ్ ఇచ్చింది. తాజా మధ్యంతర డివిడెండ్ చెల్లింపునకు రికార్డు తేదీ ఈ నెల 28. పటిష్టమైన ఫలితాలు ఉంటాయన్న అంచనాలతో టీసీఎస్ షేరు ధర మంగళవారం బీఎస్ఈలో ఒకానొకదశలో 2%(రూ.44) ఎగబాకి రూ.2,258ని తాకింది. చివరకు స్వల్ప లాభంతో రూ.2,218 వద్ద ముగిసింది. ఇది కొత్త గరిష్టస్థాయి. నియామకాలను పెంచే అవకాశం... ఈ ఏడాది కొత్త ఉద్యోగుల నియామకాల సంఖ్యను పెంచే అవకాశం కూడా ఉందని టీసీఎస్ సీఈఓ, ఎండీ ఎన్.చంద్రశేఖరన్ చెప్పారు. ‘ఐటీకి మంచి డిమాండ్ ఉంది. దీంతో కంపెనీ నియామకాల లక్ష్యాన్ని కూడా కాస్త పెంచొచ్చు’ అని తెలిపారు. అయితే, అదనంగా ఎంతమందిని తీసుకుంటారనేది ఆయన వెల్లడించలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 45,000-50,000 మంది కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని గతంలో లక్ష్యంగా నిర్దేశించుకుంది. ట్రైనీలను మినహాయిస్తే.. ‘ఉద్యోగుల వినియోగం క్యూ2లో 0.75 శాతం పెరిగి 83.4 శాతానికి చేరింది. క్యూ3లో కూడా ఇది మరింత పెరగనుంది. దీంతో నియామకాలపై దృష్టిపెడుతున్నాం. ఈ దిశగా చర్యలు జరుగుతున్నాయి. మరోపక్క, ఐటీ విభాగంలో సిబ్బంది వలసల రేటు (అట్రిషన్) 9.8 శాతంగా ఉంది. మొత్తం మీద చూస్తే 10.9 శాతంగా నిలిచింది’ అని చంద్రశేఖరన్ పేర్కొన్నారు. ఐటీకి అన్ని మార్కెట్లు, పరిశ్రమల నుంచి అత్యంత పటిష్టమైన డిమాండ్ కొనసాగుతోంది. దీంతోపాటు క్లయింట్లతో వ్యూహాత్మక భాగస్వామ్యాల ఆసరాతో క్యూ2లో మెరుగైన ఫలితాలను సాధించగలిగాం. భవిష్యత్తులోనూ ఇదే ధోరణి ఉంటుందని బలంగా విశ్వసిస్తున్నాం. - ఎన్. చంద్రశేఖరన్,టీసీఎస్ ఎండీ, సీఈఓ