జంషెడ్జీ 179వ జయంత్యుత్సవంలో మాట్లాడుతున్న చంద్రశేఖరన్. పక్కన రతన్ టాటా
టాటా గ్రూప్‌నకు మరింత వృద్ధి సాధ్యమన్న రతన్ టాటా
జంషెడ్‌పూర్: టాటా గ్రూప్ ఇప్పుడు సురక్షిత హస్తాల్లో ఉందని ఆ గ్రూప్ చైర్మన్‌ను ఉద్దేశించి టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా పేర్కొన్నారు. చంద్రశేఖరన్‌తో కలిసి ఆయన శుక్రవారం ఇక్కడ టాటా గ్రూప్ వ్యవస్థాపకులు– జెంషెడ్జీ టాటా 179వ జయంత్యుత్సవాల్లో పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రతన్ ఏమన్నారంటే...
‘‘చంద్రశేఖరన్ టాటా గ్రూప్‌ను వృద్ధి బాటలో కొత్త శిఖరాలకు తీసుకెళ్తారు. ఈ నగరం (జంషెడ్‌పూర్)కూడా మరింత అభివృద్ధి చెందుతుంది. పనితీరులో అత్యున్నత ప్రమాణాలు, ఎటువంటి లోపాలూ లేని రికార్డు ఉన్న చంద్రశేఖరన్ మన గ్రూప్‌లో ఒక భాగంగా ఉండటం ఎంతో గర్వించతగిన అంశం. ఆయన నియంత్రణలో టీసీఎస్ ఎంతో పురోగమించింది.
చంద్రశేఖరన్ ఏమన్నారంటే...
గత 36 గంటలుగా నేను ఈ స్టీల్‌సిటీలో ఉన్నాను. మానవ జీవితాలపై ఈ నగరం ప్రభావం ఎంతనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటుంటాను. ప్రతిష్టాత్మకమైన టాటా స్టీల్‌నూ– జంషెడ్‌పూర్‌నూ వేరుచేసి చూడలేము. ఒక బ్రాండ్‌కు ఒక నగరంతో ఉన్న ఈ పటిష్ట అనుబంధాన్ని ప్రపంచంలో ఎక్కడా చూడలేము.
ఉద్యోగులకు రతన్ లేఖ...
జెంషెడ్జీ 178వ జయంతి సందర్భంగా రతన్‌టాటా గ్రూప్‌లో పనిచేసే ఉద్యోగులు అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక లేఖ విడుదల చేశారు. రానున్న రోజుల్లో గ్రూప్ మరింత ముందుకు దూసుకువెళుతుందని భరోసా ఇచ్చారు. టాటా ట్రస్ట్‌లకు ఈ ఏడాదితో 125 సంవత్సరాలు పూర్తవుతున్న విషయాన్ని కూడా ఆయన ఈ లేఖలో ప్రస్తావించారు.