భవిష్యత్తులో చిన్న, డొమైన్ ఫోకస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) మోడళ్లకు డిమాండ్ ఏర్పడుతుందని టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ భావిస్తున్నట్లు తెలిపారు. చిన్న మోడళ్లు తక్కువ వనరులను వినియోగిస్తాయని, దాంతోపాటు సమర్థంగా పనిచేస్తాయని, వేగంగా ఫలితాలు అందిస్తాయని చెప్పారు. ఇంధన వ్యయాలను తగ్గించుకోవాలని, చిన్న మాడ్యులర్ రియాక్టర్లు(ఎస్‌ఎంఆర్) వంటి ఎనర్జీ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆయన నొక్కి చెప్పారు.
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్)-తిరుచ్చి పూర్వ విద్యార్థుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘2023లో లార్జ్ లాంగ్వేజీ మోడల్స్‌కు(ఎల్ఎల్ఎం) మంచి అవకాశం వచ్చింది. కానీ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. దాంతో 2024లో మల్టీమోడల్ ఏఐలకు అపారమైన అవకాశాలు వచ్చాయి. 2025లో ఇందుకు భిన్నంగా స్మాల్ ల్యాంగ్వేజీ మోడళ్లకు భారీగా డిమాండ్ రానుంది’ అని చెప్పారు.
ఇదీ చదవండి: యాపిల్ స్పైగా ‘సిరి’..? రూ.814 కోట్లకు దావా
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ సవాళ్లను ప్రస్తావిస్తూ పారిశ్రామిక వృద్ధిని పునరుద్ధరించే ప్రయత్నాలు చేయాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్ల వినియోగం పెరగడం వల్ల ప్రపంచ ఇంధన అవసరాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆర్థికాభివృద్ధి పెరగాలంటే ఇంధన వ్యయాలు తగ్గించుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment