ప్రపంచ నం.1 సంస్థ యాపిల్(Apple) తన వర్చువల్ అసిస్టెంట్ ‘సిరి’ని వినియోగదారుల అనుమతి లేకుండా ఉపయోగించడానికి వీలు కల్పించిందని ఆరోపణలు ఎదుర్కొంది. ఈమేరకు అమెరికా ఫెడరల్ కోర్టులో దావా దాఖలైంది. యూజర్లకు తెలియకుండా సిరి మైక్రోఫోన్ సంభాషణలను రికార్డ్ చేసిందని, వాటిని ఇతరులతో పంచుకునే అవకాశం ఉందని దావాలో ఆరోపించారు.
‘సిరి’ని యాపిల్ స్పైగా మార్చిందని దావాలో తెలిపారు. ఐఫోన్లు(IPhone), ఇతర డివైజ్ల యూజర్లపై సిరి నిఘా పెట్టిందని పేర్కొన్నారు. ఇది వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు, వారి నిబద్ధతకు యాపిల్ ద్రోహం చేయడమేనని దావా పేర్కొంది. ఈ విషయాన్ని యాపిల్ ధ్రువీకరించింది. దావా దాఖలు చేసినవారి వాదనలను ఖండించింది. యూజర్ ప్రైవసీ పట్ల నిబద్ధతతో ఉన్నట్లు తెలిపింది. కానీ కేసును పరిష్కరించాలనే ఉద్దేశంతో 95 మిలియన్ డాలర్లు(రూ.814 కోట్లు) చెల్లించడానికి అంగీకరిస్తున్నట్లు పేర్కొంది. ప్రతిపాదిత సెటిల్‌మెంట్‌కు సంబంధించిన వ్యాజ్యం ఈ వారం ప్రారంభంలో ఫెడరల్ కోర్టులో దాఖలు చేశారు. అయితే దీన్ని న్యాయమూర్తి ఆమోదించాల్సి ఉంది.
ఇదీ చదవండి: ప్రపంచంలో అధిక వేతనం ఈయనకే..!
అసలేం జరిగిందంటే..
2014-22 వరకు యాపిల్ తన వర్చువల్ అసిస్టెంట్ ‘సిరి(Siri)’ని వినియోగదారుల అనుమతి లేకుండా ఉపయోగించడానికి వీలు కల్పించిందని ఆరోపణలు వచ్చాయి. యూజర్లకు తెలియకుండా సిరి మైక్రోఫోన్ సంభాషణలను రికార్డ్ చేసిందని, వాటిని ప్రకటనదారులతో పంచుకునే అవకాశం ఉందనేలా దావాలో ఆరోపించారు. ఈ దావా సమస్య పరిష్కారం అయితే సెప్టెంబర్ 17, 2014 నుంచి 2022 చివరి వరకు యాపిల్ ‘సిరి’ ఎనేబుల్డ్ పరికరాలను కలిగి ఉన్న లేదా కొనుగోలు చేసిన యూఎస్‌లోని యూజర్లకు ఈ సెటిల్మెంట్ మనీ అందుతుందని నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment