CM Jagan: ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు | CM Jagan foundation stones for New Industries: andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏపీకి రిలయ్స్‌, బిర్లా భారీ పెట్టుబడులు.. నేడు శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్‌

Published Wed, Feb 14 2024 5:13 AM | Last Updated on Wed, Feb 14 2024 11:25 AM

CM Jagan foundation stones for New Industries: andhra pradesh - Sakshi

సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక రంగ అభివృద్ధిలో మరో కీలక ఘట్టానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు శ్రీకారం చుడుతున్నారు. రిలయన్స్‌ బయో ఎనర్జీ, ఆదిత్య బిర్లా గ్రూప్‌తోపాటు  పలు సంస్థలు రాష్ట్రంలో నెలకొల్పుతున్న పరిశ్రమలకు ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు.

సుమారు రూ.4,178 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటవుతున్న పలు పరిశ్రమలకు భూమి పూజ నిర్వహించనున్నారు. ఇవి కాకుండా రూ.655 కోట్లతో నెలకొల్పిన ఆగ్రో ప్రాసెసింగ్‌ యూనిట్లను ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించనున్నారు. మొత్తంగా సుమారు రూ.4,833 కోట్ల పెట్టుబడులు రానుండగా కొత్తగా 4,046 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి.   

తొలుత 8 చోట్ల రిలయన్స్‌ ప్లాంట్లు 
రిలయన్స్‌ బయో ఎనర్జీ రాష్ట్రంలో 8 ప్రాంతాల్లో వ్యవసాయ వ్యర్ధాల నుంచి బయో గ్యాస్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. మొత్తం రూ.1,024 కోట్ల పెట్టుబడితో తొలి దశలో కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, నెల్లూరులో బయో గ్యాస్‌ ప్లాంట్లను నెలకొల్పనుంది. తద్వారా 576 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

ఆదిత్య బిర్లా గ్రూప్‌ రూ.1,700 కోట్ల పెట్టుబడితో తిరుపతి జిల్లా నాయుడుపేటలో మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ కార్బన్‌ బ్లాక్‌ను ఏర్పాటు చేయనుంది. దీనిద్వారా 250 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.

వీటితో పాటు హెల్లా ఇన్‌ఫ్రా, వెసువియస్‌ ఇండియా లిమిటెడ్, ఏపీఐఐసీ, ఏపీ ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్, అన ఒలియో ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన పలు ప్రాజెక్టులకు సీఎం జగన్‌ వర్చువల్‌గా శంకుస్థాపనలతో పాటు పలు యూనిట్లను ప్రారంభిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement