సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంగళవారం తాడేపల్లిలో ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు భేటీ జరిగింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ SIPB) పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. అయితే.. ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పరిశ్రమల్లో స్థానికులకే 75% ఉద్యోగాల కల్పన కచ్చితంగా అమలు చేయాలని, అది సమగ్రంగా అమలవుతుందా? లేదా? అనేది ఆరు నెలలకొకసారి నివేదిక పంపాలని కలెక్టర్లు ఆదేశించారు సీఎం జగన్. అదే సమయంలో ప్రైవేట్ పరిశ్రమల్లో కూడా 75 శాతం, ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాల్సిందేనని తెలిపారు. అలాగే.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని తప్పకుండా అమలు చేయలని, స్థానికులకు ఉద్యోగాలు కల్పన క్రమంలోనే పరిశ్రమలకు అన్ని రకాలుగా తోడుగా నిలుస్తున్నామని స్పష్టం చేశారాయన.
‘‘ఒక పరిశ్రమ సమర్థవంతా నడవాలంటే ఆ ప్రాంత ప్రజల మద్దతు అవసరం. రాబోతున్న పరిశ్రమల్లో కూడా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి. రాష్ట్రంలో మానవవనరులు నైపుణాభివృద్ధికి కొరత లేదు. రైతుల వద్ద పంటల ఉత్పత్తుల, కనీస మద్దతు ధరకు కొనాల్సిందే!. ఇజ్రాయెల్ తరహా విధానాలనూ ఏపీలోనూ అమలయ్యేలా చూడాలని.. పరిశ్రమల్లో శుద్ధి చేసిన నీరు, డీ శాలినేషిన్ నీటినే వినియోగించేలా చూడాలని అధికారులకు సూచించారాయన.
ఇదీ చదవండి: అవినీతి రహితం సంక్షేమ స్వర్ణయుగం
Comments
Please login to add a commentAdd a comment