local employees
-
CM Jagan: స్థానికులకే ఉద్యోగాలు.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
సాక్షి, గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మంగళవారం తాడేపల్లిలో ఇండస్ట్రియల్ ప్రమోషన్ బోర్డు భేటీ జరిగింది. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ SIPB) పలు ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. అయితే.. ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమల్లో స్థానికులకే 75% ఉద్యోగాల కల్పన కచ్చితంగా అమలు చేయాలని, అది సమగ్రంగా అమలవుతుందా? లేదా? అనేది ఆరు నెలలకొకసారి నివేదిక పంపాలని కలెక్టర్లు ఆదేశించారు సీఎం జగన్. అదే సమయంలో ప్రైవేట్ పరిశ్రమల్లో కూడా 75 శాతం, ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాల్సిందేనని తెలిపారు. అలాగే.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని తప్పకుండా అమలు చేయలని, స్థానికులకు ఉద్యోగాలు కల్పన క్రమంలోనే పరిశ్రమలకు అన్ని రకాలుగా తోడుగా నిలుస్తున్నామని స్పష్టం చేశారాయన. ‘‘ఒక పరిశ్రమ సమర్థవంతా నడవాలంటే ఆ ప్రాంత ప్రజల మద్దతు అవసరం. రాబోతున్న పరిశ్రమల్లో కూడా 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి. రాష్ట్రంలో మానవవనరులు నైపుణాభివృద్ధికి కొరత లేదు. రైతుల వద్ద పంటల ఉత్పత్తుల, కనీస మద్దతు ధరకు కొనాల్సిందే!. ఇజ్రాయెల్ తరహా విధానాలనూ ఏపీలోనూ అమలయ్యేలా చూడాలని.. పరిశ్రమల్లో శుద్ధి చేసిన నీరు, డీ శాలినేషిన్ నీటినే వినియోగించేలా చూడాలని అధికారులకు సూచించారాయన. ఇదీ చదవండి: అవినీతి రహితం సంక్షేమ స్వర్ణయుగం -
విప్రోలో స్థానికులకే అధిక ఉద్యోగాలు
బెంగుళూరు: దేశీయ సాఫ్ట్వేర్ దిగ్గజం విప్రో సంస్థ స్థానిక అభ్యర్థులకే ఉద్యోగ నియామకాలలో ప్రాధాన్యతిస్తున్నట్లు తెలిపింది. కాగా 2019-20సంవత్సరానికి అమెరికాలో విప్రో సంస్థ 69 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చినట్లు వార్షిక నివేదికలో ప్రకటించింది. కాగా లాటిన్ అమెరికాలో అన్ని ఉద్యోగాలను స్థానికుల ద్వారా నియమించుకున్నామని విప్రో తెలిపింది. అందుకు అనుగుణంగా గత కొద్ది కాలంగా ఐటీ కంపెనీలు స్థానికులకే అత్యుత్తమ శిక్షణ అందించి వారిని నియమించుకుంటున్నాయి. నైపుణ్యం ఉన్న స్థానికులకే ఉద్యోగ నియామకాలలో ప్రాధాన్యమిస్తున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్ష 88వేల మంది ఉద్యోగులు విప్రో సంస్థకు సేవలందిస్తున్నారు. అయితే అమెరికన్స్ ఫస్ట్(స్థానికులకే ఉద్యోగాలు) అనే నినాదంతో గత ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలకు అనుగుణంగా విప్రో చర్యలు చేపడుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల హెచ్-1 బి వీసా(అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులు)లను తగ్గించడం వంటి చర్యలకు ట్రంప్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మళ్లీ స్థానికులకే ఉద్యోగాలు అనే నినాదంతో గెలవడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల విప్రో లిమిటెడ్ కొత్త సీఈవోగా థియర్రీ డెలాపోర్ట్ బాధ్యతలు చేపట్టారు. (చదవండి: కరోనా: అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూ. 1125 కోట్లు!) -
కియాలో స్థానికులకు ఉద్యోగాలివ్వాలి
సాక్షి, అనంతపురం : కియా కార్ల పరిశ్రమలో అర్హులైన స్థానిక అభ్యర్థులకు ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆ కంపెనీ యాజమాన్యానికి కలెక్టర్ ఎస్.సత్యనారాయణ సూచించారు. కియా, దాని అనుబంధ సంస్థల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించే అంశంపై గురువారం తన చాంబర్లో అహుడా వైస్ చైర్పర్సన్ ప్రశాంతితో కలిసి కియా యాజమాన్య ప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్షించారు. స్థానికులకు వారి విద్యార్హతల మేరకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ముఖ్యంగా భూములిచ్చిన రైతుల పిల్లలకు కచ్చితంగా ప్రాధానత్యనివ్వాలన్నారు. ఉద్యోగాలకు తగిన వేతనమూ ఉండాలని సూచించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జికి 19.33 ఎకరాలు కావాలి కియా సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి 19.33 ఎకరాలు అవసరమున్నట్లు ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి కియా ప్రతినిధులు తీసుకొచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ అంశంపై రైతులతో చర్చించాలని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ గోపీకృష్ణ, , పెనుకొండ ఆర్డీఓ శ్రీనివాస్‌కు సూచించారు. ప్రాజెక్టు లే–ఔట్ ఆమోదానికి చర్యలు తీసుకోవాలని అహుడా వీసీ ప్రశాంతికి సూచించారు. కియా ట్రైనింగ్ సైట్ నుంచి రోడ్డు ఏర్పాటు, తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో కియా కంపెనీ చీఫ్ అడ్మినిస్టేటివ్ అధికారి కిమ్, చీఫ్ కన్స్ట్రక్షన్ అధికారి జిమ్, లీగల్ హెడ్ జూడ్, పరిశ్రమల శాఖ జీఎం సుదర్శన్‌బాబు, ఆర్అండ్బీ ఎస్ఈ శివకుమార్, తదితరులు పాల్గొన్నారు. -
సగం మంది ఉద్యోగులు అమెరికన్లే: విప్రో
బెంగళూరు: అమెరికాలోని తమ కార్యాలయాల్లో స్థానిక ఉద్యోగుల సంఖ్య సగానికి పైగానే ఉందని ఐటీ దిగ్గజం విప్రో వెల్లడించింది. గడిచిన ఆరు నెలల్లో స్థానిక నిపుణులకు శిక్షణనిచ్చి సుమారు 1,600 మంది ఉద్యోగులను తీసుకున్నట్లు పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 3,000 మంది స్థానికులు చేరారని, దీంతో అమెరికాలో మొత్తం సిబ్బంది సంఖ్య 14,000కు చేరినట్లు విప్రో వివరించింది. నెక్ట్స్ జనరేషన్ లోకల్ డెలివరీ సెంటర్స్ ఏర్పాటు చేసిన ఫ్లోరిడా, కాలిఫోర్నియా, జార్జియా, టెక్సాస్ రాష్ట్రాల్లో తలో వెయ్యి మంది ఉద్యోగులు ఉన్నట్లు తెలిపింది. గత దశాబ్ద కాలంలో తాము 2 బిలియన్ డాలర్ల పైగా అమెరికాలో ఇన్వెస్ట్ చేశామని, స్థానికంగా ఉపాధి కల్పనపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నామని విప్రో సీఈవో ఆబిదాలి నీముచ్వాలా తెలిపారు. -
సొంతూళ్లో పనిచేస్తుంటే ఎల్టీసీ ఉండదు
కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ ఉత్తర్వులు న్యూఢిల్లీ: సొంత ఊళ్లలో విధులు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వోద్యోగులు లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ) పొందడం కుదరదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థ హెడ్‌క్వార్టర్స్ లేదా పోస్టింగ్ పొందిన ప్రాంతంతోపాటు వారి సొంత ఊళ్లు ఒకటే అయితే అటువంటి ఉద్యోగులు ఎల్టీసీ పొందడానికి అర్హులు కాదని పేర్కొంది. అలాగే ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్, అండమాన్ నికోబార్ దీవుల సందర్శనకు అందించే ప్రత్యేక రాయితీ పథకాన్ని ఆయా ఉద్యోగులు ఎల్టీసీ కింద మార్చుకోవడం కుదరదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఢిల్లీలో సంస్థ హెడ్‌క్వార్టర్స్ ఉండి దేశ రాజధాని వెలుపల ఉన్న నగరాలు లేదా పట్టణాల్లో ప్రభుత్వోద్యోగులు నివసిస్తూ ఆయా ప్రాంతాలు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లోని ఇతర రాష్ట్రాల పరిధిలో ఉంటే మాత్రం అటువంటి వారు ఎల్టీసీకి అర్హులని తెలిపింది.