కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ ఉత్తర్వులు
న్యూఢిల్లీ: సొంత ఊళ్లలో విధులు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వోద్యోగులు లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ) పొందడం కుదరదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థ హెడ్‌క్వార్టర్స్ లేదా పోస్టింగ్ పొందిన ప్రాంతంతోపాటు వారి సొంత ఊళ్లు ఒకటే అయితే అటువంటి ఉద్యోగులు ఎల్టీసీ పొందడానికి అర్హులు కాదని పేర్కొంది. అలాగే ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్, అండమాన్ నికోబార్ దీవుల సందర్శనకు అందించే ప్రత్యేక రాయితీ పథకాన్ని ఆయా ఉద్యోగులు ఎల్టీసీ కింద మార్చుకోవడం కుదరదని స్పష్టం చేసింది.
ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఢిల్లీలో సంస్థ హెడ్‌క్వార్టర్స్ ఉండి దేశ రాజధాని వెలుపల ఉన్న నగరాలు లేదా పట్టణాల్లో ప్రభుత్వోద్యోగులు నివసిస్తూ ఆయా ప్రాంతాలు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సీఆర్)లోని ఇతర రాష్ట్రాల పరిధిలో ఉంటే మాత్రం అటువంటి వారు ఎల్టీసీకి అర్హులని తెలిపింది.