LTC
-
ఉద్యోగుల ఎల్టీసీ విషయంలో కీలక సూచన?
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ స్థానంలో లీవ్ ట్రావెల్ కన్సెషన్ వోచర్‌ను అనుమతించడాన్ని తిరిగి పరిశీలించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖను ఆతిథ్య పరిశ్రమ కోరింది. మరో 2 నెలల్లో కేంద్రం తదుపరి ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ తీసుకరానున్న నేపథ్యంలో పరిశ్రమ తన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. ఈ మేరకు తమ డిమాండ్లతో కూడిన లేఖను హోట ల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండి యా (ఎఫ్హెచ్ఆర్ఏఐ) వైస్ ప్రెసిడెంట్ గుర్‌బక్సి సింగ్ కోహ్లి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పంపారు. 2020లో కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్లు విధించడంతో.. ఉద్యోగులు తమ ఎల్టీసీ (కుటుంబ సమేతంగా చేసే పర్యటనకు ఇచ్చే అలవెన్స్) ప్రయోజనాన్ని వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీన్ని గమనించిన కేంద్రం ఎల్టీసీ వోచర్‌ను తీసుకొచ్చింది. ఎల్టీసీ ప్రయోజనం మేర ఉత్పత్తులు, సేవల కొనుగోలుకు చెల్లింపులు చేసుకునేందుకు అనుమతించింది. పరిశ్రమ పుంజుకునేందుకు వీలుగా దీన్ని సమీక్షించాలని ఎఫ్హెచ్ఆర్ఏఐ తాజాగా కోరింది. చదవండి:ఈపీఎఫ్‌వో కిందకు కొత్తగా 12.73 లక్షల మంది -
మార్చి 31లోగా ఈ పనులను వెంటనే పూర్తి చేయండి!
కొత్త 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభంకానుంది. ఏప్రిల్ 1 నుంచి అనేక విషయాలలో కీలక మార్పులు జరగనున్నాయి. కాబట్టి మార్చి నెలలో ఎక్కువ శాతం ప్రజలు కొత్త నిబంధనల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. కరోనా మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలు, నిబంధనలకు గడువును పొడిగించిన విషయం తెలిసిందే. ఇందులో పాన్-ఆధార్ కార్డు లింకు, ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు గడువు వంటివి ఉన్నాయి. వీటి గడువు 2021 మార్చి 31వ తేదీతో ముగుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ క్రింద తెలిపిన పనులను మార్చి 31వ తేదీ లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. పాన్ - ఆధార్ లింక్ పాన్ కార్డు - ఆధార్ కార్డును లింకు చేసే గడువును కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు పొడిగించింది. ఈసారి పాన్-ఆధార్ లింక్ గడువును 2021 మార్చి 31 వరకు పొడిగించబడింది. ఈలోగా మీ పాన్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫలితంగా పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరపడం సాధ్యం కాదు. అందుకే 31లోగా ఈ పని పూర్తి చేసుకుంటే మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఐటీఆర్ ఫైలింగ్ 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడంలో విఫలమైతే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నందున, వీలైనంత త్వరగా ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. గడువు ముగిసిన తర్వాత ఐటీఆర్ దాఖలు చేస్తే రూ.10,000 ఆలస్య రుసుము వసూలు చేయబడుతుంది. రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్న చిన్న చెల్లింపుదారులు రూ.1000 ఆలస్య రుసుము చెల్లించాలి. కాబట్టి మార్చి 31లోగా మీ ఐటీఆర్ దాఖలు చేయడం మంచిది. క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ కరోనా కారణంగా దెబ్బతిన్న వ్యాపారాలను పునరుద్దరించేందుకు కేంద్రం ఆత్మ నిర్భర్ భారత్ ప్రాజెక్టులో భాగంగా క్రెడిట్ లైన్ గ్యారెంటీ పథకాన్ని 2020 మే 13న ప్రకటించింది. కరోనా మహమ్మారి సమయంలో వ్యాపారులకు ప్రభుత్వం హామీ లేకుండా రుణాలు మంజూరు చేసింది. ఈ రుణాలు తీసుకున్న వారు కాన్ఫిడెన్స్ బై కాన్ఫిడెన్స్ స్కీమ్ కింద డిక్లరేషన్ దాఖలు చేయడానికి గడువును 2021 మార్చి 31 వరకు పొడిగించింది. ఎల్టీసీ క్యాష్ వోచర్ ఎల్టీసీ క్యాష్ వోచర్ పథకం కింద బిల్లులు అందజేసేవారు ప్రయోజనాలను పొందేందుకు మార్చి 31లోగా మీ బిల్లులను సరైన ఫార్మాట్లో ప్రభుత్వానికి సమర్పించాలి. ఆ బిల్లులో జీఎస్టీ మొత్తం, వోచర్ నెంబర్ వంటి వాటిని పేర్కొనాలి. ఈ పథకాన్ని 2020 అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ ప్రభుత్వ ఉద్యోగులు 2021 మార్చి 31 వరకు రూ.10 వేల వరకు స్పెషల్ ఫెస్టివల్ అడ్వాన్స్ పొందవచ్చు. ఎల్టీసీ క్యాష్ వోచర్ పథకంతో పాటు 2020 అక్టోబర్‌లో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఈ అడ్వాన్స్ తీసుకుంటే 10 వాయిదాల్లో డబ్బును తిరిగి చెల్లించవచ్చు. డబుల్ టాక్సేషన్ కోవిడ్ -19 కారణంగా చాలా మంది విదేశీ పౌరులు, వలసదారులు భారతదేశంలోనే ఉండాల్సి వచ్చింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వారు ఇక్కడ సంపాదించే ఆదాయంపై రెట్టింపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాంటి వారు మార్చి 31లోగా ప్రభుత్వానికి డిక్లరేషన్ సమర్పించి డబుల్ టాక్సేషన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. 2021 మార్చి 3న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం.. డబుల్ టాక్సేషన్ చెల్లింపుదారులు తమ వివరాలను ఫారం-ఎన్ఆర్ లో సమర్పించాల్సి ఉంటుంది. చదవండి: ఈ స్కీమ్‌లో చేరితే ప్రతి నెల పదివేల పెన్షన్ ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త! -
ఏప్రిల్ 1 నుంచి ఐటీలో ఐదు కొత్త నిబంధనలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2021లో సమర్పించిన కేంద్ర బడ్జెట్ లో ఆదాయపు పన్ను నిబంధనలలో కొన్ని మార్పులు రానున్నట్లు ప్రకటించారు. ఈ మార్పులు 1 ఏప్రిల్ 2021 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం.. 75 అంతకంటే ఎక్కువ వయస్సు గల సీనియర్ సిటిజన్లకు పెన్షన్ నుండి వచ్చే ఆదాయం, అదే బ్యాంకులో స్థిర డిపాజిట్ నుంచి వచ్చే వడ్డీపై ఏప్రిల్ 1 నుంచి ఐటిఆర్ దాఖలు నుంచి మినహాయింపు ఉంటుంది. అంతేకాకుండా, ఆర్థిక మంత్రి ఐటిఆర్ దాఖలు చేయని వారి కోసం అధిక టిడిఎస్ ను ప్రతిపాదించారు. ఇక ఈపిఎఫ్ ఖాతాలో ఏటా రూ.2.5 లక్షలకు పైగా డిపాజిట్ చేసే వ్యక్తులపై పన్ను విధించాలని ప్రకటించారు. 1) పిఎఫ్ పన్ను నియమాలు: 2021 ఏప్రిల్ 1 నుంచి ప్రావిడెంట్ ఫండ్‌లో ఏడాదికి రూ.2.5 లక్షలకు పైగా డిపాజిట్ చేసే వ్యక్తులకు అంత మొత్తం మీద పన్ను వర్తిస్తుంది. అది ఎంత అనేది ఇంకా తెలీదు. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపిఎఫ్)లో అధిక మొత్తం కలిగిన డిపాజిటర్లపై పన్ను విధించేందుకే ఈ చర్య అని ప్రభుత్వం తెలిపింది. దీని వల్ల సాధారణ ఈపీఎఫ్ కార్మికులకు ఎటువంటి ఇబ్బంది కలగదు అని చెప్పింది. కార్మికుల సంక్షేమం కోసం ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. 2) టిడిఎస్: ఎక్కువ మంది ఆదాయపు పన్ను రిటర్నులు(ఐటిఆర్) దాఖలు చేయడం కోసం ఆర్థిక మంత్రి 2021 బడ్జెట్లో అధిక టిడిఎస్(మూలం వద్ద పన్ను) లేదా టిసిఎస్ (మూలం వద్ద వసూలు చేసిన పన్ను) రేట్లు ప్రతిపాదించారు. ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయనివారిపై టీడీఎస్, టీసీఎస్‌ల అధిక రేట్లు విధించేందుకు ప్రత్యేక నిబంధనగా ఆదాయపు పన్ను చట్టంలో 206ఎబి, 206 సిసిఎ తీసుకొచ్చారు. 3) సీనియర్ సిటిజన్లకు మినహాయింపు: సీనియర్ సిటిజన్లపై పన్ను భారం తగ్గించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 బడ్జెట్లో 75 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్న్స్(ఐటిఆర్) దాఖలు చేయకుండా మినహాయింపు కల్పించారు. ఈ మినహాయింపు ఇతర ఆదాయం లేని సీనియర్ సిటిజన్లకు మాత్రమే లభిస్తుంది. కానీ పెన్షన్ ఖాతా ఉన్న బ్యాంక్ నుంచి లభించే పెన్షన్, వడ్డీ ఆదాయంపై ఐటిఆర్ దాఖలు ఆధారపడి ఉంటుంది. 4) ముందే నింపిన ఐటిఆర్ ఫారాలు: వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ముందుగా నింపిన ఆదాయపు పన్ను రిటర్నులు(ఐటిఆర్) జారీ చేయనున్నారు. పన్ను చెల్లింపుదారునికి ఈ కొత్త విధానంలో ప్రాసెస్ సులభతరం చేయడానికి జీతం ఆదాయం, పన్ను చెల్లింపులు, టిడిఎస్ మొదలైన వివరాలు ముందే ఆదాయపు పన్ను ఫారంలలో ముందే నింపబడి ఉంటాయి. అలాగే రిటర్న్స్ దాఖలు మరింత సులభతరం చేయడం కోసం లిస్టెడ్ సెక్యూరిటీల మూలధన లాభాల వివరాలు, డివిడెండ్ ఆదాయం, బ్యాంకుల వడ్డీ, పోస్ట్ ఆఫీస్ మొదలైనవి కూడా ముందే నింపబడతాయి. 5) ఎల్‌టిసి: సెలవు ప్రయాణ రాయితీ(ఎల్‌టిసి) బదులుగా నగదు భత్యానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని బడ్జెట్ 2021లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది . ప్రయాణానికి కోవిడ్ సంబంధిత పరిమితుల కారణంగా తమ ఎల్‌టిసి పన్ను ప్రయోజనాన్ని పొందలేకపోయిన వ్యక్తుల కోసం ఈ పథకాన్ని ప్రభుత్వం గత సంవత్సరం ప్రకటించింది. చదవండి: 2నిమిషాల్లో పాన్-ఆధార్ అనుసంధానం పాన్-ఆధార్ లింకుకు ఇంకా పదిహేను రోజులే -
కేంద్ర ఉద్యోగులకు బొనాంజా
న్యూఢిల్లీ: పండుగ సీజన్ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పండుగల సమయంలో వినిమయ డిమాండ్‌ను పెంచి, ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ. 10 వేల వేతన అడ్వాన్స్‌ను, ఎల్టీసీ స్థానంలో నగదు ఓచర్లను అందించనున్నట్లు ప్రకటించింది. అలాగే, రాష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీ లేని రుణంగా అందించేందుకు రూ. 12 వేల కోట్లను కేటాయించింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఈ వివరాలను వెల్లడించారు. ఆర్థిక మంత్రి తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్యోగులకు ఇచ్చే లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ) స్థానంలో ఈ సంవత్సరం క్యాష్ ఓచర్లను ఇస్తారు. జీఎస్టీ రిజిస్టర్డ్ అమ్మకందారు వద్ద, డిజిటల్ మోడ్‌లో, 12% లేదా అంతకుమించి జీఎస్టీ ఉన్న వస్తువులను కొనేందుకే వాటిని వినియోగించాలి. ఆహార ఉత్పత్తుల కొనుగోలుకు ఆ ఓచర్లను వినియోగించడం కుదరదు. 2021 మార్చి 31లోగా వాడేయాలి. ఎల్టీసీ ద్వారా పొందే విమాన/రైలు చార్జీ కన్నా 3 రెట్లు ఎక్కువ విలువైన వస్తువులు/ సేవలను కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు తమ ఉద్యోగులకు ఎల్టీసీల స్థానంలో నగదు ఓచర్లు ఇవ్వనున్నాయి. శాలరీ అడ్వాన్స్, ఎల్టీసీ స్థానంలో నగదు ఓచర్లతో మార్కెట్లో రూ. 28 వేల కోట్ల విలువైన డిమాండ్ ఉంటుందని నిర్మల వెల్లడించారు. ఎల్టీసీ ఇచ్చే రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగ సంస్థలకు కూడా, షరతులకు లోబడి, సంబంధిత మొత్తంపై పన్ను రాయితీ ఉంటుందని పేర్కొన్నారు. రూ. 10 వేల శాలరీ అడ్వాన్స్‌ను 2021మార్చి 31లోగా ఉద్యోగులు ప్రీలోడెడ్ రూపే కార్డుల రూపంలో తీసుకోవాలి. వడ్డీ లేని ఆ రుణాన్ని గరిష్టంగా 10 వాయిదాల్లో చెల్లించాలి. సొంత ఊరికి లేదా దేశంలోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు పలు షరతులతో ఉద్యోగులకు ఎల్టీసీ లభిస్తుంది. అయితే, కరోనా కారణంగా ప్రయాణాలు సాధ్యం కాని పరిస్థితులు నెలకొనడంతో ఆ స్థానంలో నగదు ఓచర్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. మొత్తం రూ. 73 వేల కోట్ల ఉద్దీపన ఎల్టీసీ క్యాష్ ఓచర్లు, శాలరీ అడ్వాన్స్ సహా మొత్తంగా రూ. 73 వేల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇందులో ఎల్టీసీ, శా లరీ అడ్వాన్స్ కోసం రూ. 11,575 కోట్లు, రా ష్ట్రాలకు 50 ఏళ్ల పాటు వడ్డీలేని రుణంగా రూ. 12 వేల కోట్లు ఉన్నాయన్నారు. అదనంగా రూ. 2500 కోట్లను కేంద్రం రోడ్లు, డిఫెన్స్, పట్టణాభివృద్ధి తదితర రంగాల్లో మౌలిక వసతుల కోసం ఖర్చు చేయనుందని తెలిపారు. రాష్ట్రాలకు ప్రకటించిన రూ. 12 వేల కోట్ల రుణంలో రూ. 1,600 కోట్లు ఈశాన్య రాష్ట్రాలకు, రూ. 900 కోట్లు ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లకు, రూ. 7,500 కోట్లు ఇతర రా ష్ట్రాలకు కేటాయించామన్నారు. ప్యాకేజీతో ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెరుగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
కేంద్ర ఉద్యోగుల ఎల్టీసీపై డీఏ కట్
న్యూఢిల్లీ: సెలవు ప్రయాణ రాయితీ(ఎల్టీసీ) సదుపాయం పొందుతున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆయా ప్రయాణ రోజుల్లో రోజువారీ భత్యాన్ని(డీఏ) పొందలేరని కేంద్ర సిబ్బంది శిక్షణా సంస్థ(డీవోపీటీ) తెలిపింది. దీంతోపాటు ఉద్యోగుల స్థానిక ప్రయాణాలకు ఎల్టీసీ వర్తించదని పేర్కొంటూ డీవోపీటీ ఉత్తర్వులు జారీచేసింది. ఎల్టీసీ ప్రకారం సొంత నగరానికి, వేరే ప్రాంతాలకు వెళ్లే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిబంధనల మేరకు సెలవులు ఇవ్వడంతో పాటు వారి టికెట్ ఖర్చుల మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు. వీరి హోదాను బట్టి గతంలో డీఏ కూడా ఇచ్చేవారు. తాజాగా ఈ సదుపాయాన్ని రద్దు చేస్తూ డీవోపీటీ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా ్రíపీమియం, సువిధా, తత్కాల్ రైళ్లలో ప్రయాణించే ప్రభుత్వ ఉద్యోగుల టికెట్ చార్జీలను రీయింబర్స్ చేస్తామని డీవోపీటీ తెలిపింది. వీటితో పాటు రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లల్లో డిమాండ్‌కు అనుగుణంగా పెరిగే చార్జీలను ఎల్టీసీ పరిధిలోకి తెచ్చామంది. అయితే విమాన ప్రయాణానికి ఎల్టీసీ అనుమతి లేని ఉద్యోగులు విమాన ప్రయాణం చేసి.. తమకు అర్హత ఉన్న దురంతో, రాజధాని, శతాబ్ది రైళ్ల చార్జీలను రీయింబర్స్ ద్వారా పొందలేరని స్పష్టం చేసింది. ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు నడిపే వాహనాలకే ఎల్టీసీ వర్తిస్తుందంది. ఒకవేళ ప్రభుత్వ రవాణా వ్యవస్థలు అందుబాటులో లేకుంటే గరిష్టంగా 100 కి.మీ వరకు ప్రైవేటు లేదా వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించవచ్చని, 100 కి.మీ. దాటితే తర్వాత ఖర్చులను సదరు ఉద్యోగే వ్యక్తిగతంగా భరించాల్సి ఉంటుంది. ఏడవ పే కమిషన్ సిఫార్సుల అధారంగానే తీసుకున్న ఈ నిర్ణయాలు 2017, జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. -
సొంతూళ్లో పనిచేస్తుంటే ఎల్టీసీ ఉండదు
కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ ఉత్తర్వులు న్యూఢిల్లీ: సొంత ఊళ్లలో విధులు నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వోద్యోగులు లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ) పొందడం కుదరదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థ హెడ్‌క్వార్టర్స్ లేదా పోస్టింగ్ పొందిన ప్రాంతంతోపాటు వారి సొంత ఊళ్లు ఒకటే అయితే అటువంటి ఉద్యోగులు ఎల్టీసీ పొందడానికి అర్హులు కాదని పేర్కొంది. అలాగే ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూకశ్మీర్, అండమాన్ నికోబార్ దీవుల సందర్శనకు అందించే ప్రత్యేక రాయితీ పథకాన్ని ఆయా ఉద్యోగులు ఎల్టీసీ కింద మార్చుకోవడం కుదరదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాలశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఢిల్లీలో సంస్థ హెడ్‌క్వార్టర్స్ ఉండి దేశ రాజధాని వెలుపల ఉన్న నగరాలు లేదా పట్టణాల్లో ప్రభుత్వోద్యోగులు నివసిస్తూ ఆయా ప్రాంతాలు నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లోని ఇతర రాష్ట్రాల పరిధిలో ఉంటే మాత్రం అటువంటి వారు ఎల్టీసీకి అర్హులని తెలిపింది.