Income Tax 5 New Rules Changing From April 2021: Know About The Details - Sakshi
Sakshi News home page

ఏప్రిల్ 1 నుంచి ఐటీలో ఐదు కొత్త నిబంధనలు

Published Mon, Mar 15 2021 3:55 PM | Last Updated on Mon, Mar 15 2021 8:15 PM

Income Tax: 5 Rules That Are Changing From April 1 - Sakshi

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 2021లో సమర్పించిన కేంద్ర బడ్జెట్ లో ఆదాయపు పన్ను నిబంధనలలో కొన్ని మార్పులు రానున్నట్లు ప్రకటించారు. ఈ మార్పులు 1 ఏప్రిల్ 2021 నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం.. 75 అంతకంటే ఎక్కువ వయస్సు గల సీనియర్ సిటిజన్లకు పెన్షన్ నుండి వచ్చే ఆదాయం, అదే బ్యాంకులో స్థిర డిపాజిట్ నుంచి వచ్చే వడ్డీపై ఏప్రిల్ 1 నుంచి ఐటిఆర్ దాఖలు నుంచి మినహాయింపు ఉంటుంది. అంతేకాకుండా, ఆర్థిక మంత్రి ఐటిఆర్ దాఖలు చేయని వారి కోసం అధిక టిడిఎస్ ను ప్రతిపాదించారు. ఇక ఈపిఎఫ్ ఖాతాలో ఏటా రూ.2.5 లక్షలకు పైగా డిపాజిట్ చేసే వ్యక్తులపై పన్ను విధించాలని ప్రకటించారు.

1) పిఎఫ్ పన్ను నియమాలు: 
2021 ఏప్రిల్ 1 నుంచి ప్రావిడెంట్ ఫండ్‌లో ఏడాదికి రూ.2.5 లక్షలకు పైగా డిపాజిట్‌ చేసే వ్యక్తులకు అంత మొత్తం మీద పన్ను వర్తిస్తుంది. అది ఎంత అనేది ఇంకా తెలీదు. ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపిఎఫ్)లో అధిక మొత్తం కలిగిన డిపాజిటర్లపై పన్ను విధించేందుకే ఈ చర్య అని ప్రభుత్వం తెలిపింది. దీని వల్ల సాధారణ ఈపీఎఫ్‌ కార్మికులకు ఎటువంటి ఇబ్బంది కలగదు అని చెప్పింది. కార్మికుల సంక్షేమం కోసం ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది. 

2) టిడిఎస్: 
ఎక్కువ మంది ఆదాయపు పన్ను రిటర్నులు(ఐటిఆర్) దాఖలు చేయడం కోసం ఆర్థిక మంత్రి 2021 బడ్జెట్‌లో అధిక టిడిఎస్(మూలం వద్ద పన్ను) లేదా టిసిఎస్ (మూలం వద్ద వసూలు చేసిన పన్ను) రేట్లు ప్రతిపాదించారు. ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయనివారిపై టీడీఎస్, టీసీఎస్‌ల‌ అధిక రేట్లు విధించేందుకు ప్రత్యేక నిబంధనగా ఆదాయపు పన్ను చట్టంలో 206ఎబి, 206 సిసిఎ తీసుకొచ్చారు.

3) సీనియర్ సిటిజన్లకు మినహాయింపు: 
సీనియర్ సిటిజన్లపై ప‌న్ను భారం తగ్గించడానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 బడ్జెట్‌లో 75 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఆదాయపు పన్ను రిటర్న్స్(ఐటిఆర్) దాఖలు చేయకుండా మినహాయింపు కల్పించారు. ఈ మినహాయింపు ఇతర ఆదాయం లేని సీనియర్ సిటిజన్లకు మాత్రమే లభిస్తుంది. కానీ పెన్షన్ ఖాతా ఉన్న‌ బ్యాంక్ నుంచి ల‌భించే పెన్షన్, వడ్డీ ఆదాయంపై ఐటిఆర్ దాఖలు ఆధారపడి ఉంటుంది.

4) ముందే నింపిన ఐటిఆర్ ఫారాలు: 
వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ముందుగా నింపిన ఆదాయపు పన్ను రిటర్నులు(ఐటిఆర్) జారీ చేయనున్నారు. పన్ను చెల్లింపుదారునికి ఈ కొత్త విధానంలో ప్రాసెస్ సులభతరం చేయడానికి జీతం ఆదాయం, పన్ను చెల్లింపులు, టిడిఎస్ మొదలైన వివరాలు ముందే ఆదాయపు పన్ను ఫారంల‌లో ముందే నింపబడి ఉంటాయి. అలాగే రిటర్న్స్ దాఖలు మరింత సులభతరం చేయడం కోసం లిస్టెడ్ సెక్యూరిటీల మూలధన లాభాల వివరాలు, డివిడెండ్ ఆదాయం, బ్యాంకుల వడ్డీ, పోస్ట్ ఆఫీస్ మొదలైనవి కూడా ముందే నింపబడతాయి. 

5) ఎల్‌టిసి: 
సెలవు ప్రయాణ రాయితీ(ఎల్‌టిసి) బదులుగా నగదు భత్యానికి పన్ను మినహాయింపు ఇవ్వాలని బడ్జెట్ 2021లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది . ప్రయాణానికి కోవిడ్ సంబంధిత పరిమితుల కారణంగా తమ ఎల్‌టిసి పన్ను ప్రయోజనాన్ని పొందలేకపోయిన వ్యక్తుల కోసం ఈ పథకాన్ని ప్రభుత్వం గత సంవత్సరం ప్రకటించింది.

చదవండి:

2నిమిషాల్లో పాన్-ఆధార్ అనుసంధానం

పాన్‌-ఆధార్‌ లింకుకు ఇంకా పదిహేను రోజులే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement