న్యూఢిల్లీ: మూలం వద్దే పన్ను వసూలు చేయడం (టీసీఎస్), మూలం వద్ద పన్ను మినహాయించడం (టీడీఎస్)ను ప్రభుత్వం అనుసంధానించే ప్రయత్నం చేస్తోందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ తెలిపారు. దీనివల్ల టీసీఎస్ చెల్లించిన వారిపై టీడీఎస్ భారం తగ్గుతుందని.. తద్వారా పన్ను చెల్లింపుదారు నగదు ప్రవాహాలపై ప్రభావం పడకుండా ఉంటుందన్నారు. జూలై 1 నుంచి కొన్ని రకాల అంతర్జాతీయ క్రెడిట్ కార్డు వ్యయాలపై 20 శాతం టీసీఎస్‌ను అమలు చేస్తున్న దశలో అనంతనాగేశ్వరన్ ఈ అంశంపై మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వర్తకులు తాము విక్రయించే ఉత్పత్తులు లేదా సేవలపై టీసీఎస్‌ను వసూలు చేస్తుంటారు. అదే టీడీఎస్ అయితే ప్రభుత్వం అమలు చేస్తుంది. క్రెడిట్‌కార్డు లావాదేవీలపై 20 శాతం టీసీఎస్ పట్ల నిరసన వ్యక్తం కావడంతో రూ.7 లక్షల వరకు లవాదేవీలకు మినహాయింపునిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించడం గమనార్హం. దీనివల్ల చిన్న పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం లభించిందని... కనుక ఎక్కువ శాతం లావాదేవీలు 20 శాతం టీసీఎస్ పరిధిలోకి రావంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని అనంత నాగేశ్వరన్ సమర్థించారు.
Comments
Please login to add a commentAdd a comment