న్యూఢిల్లీ: గత రెండేళ్లుగా మూలం వద్ధపన్ను కోత(టీడీఎస్), మూలం వద్దే పన్ను వసూలు(టీసీఎస్) చేసేవారు.. పన్ను రిటర్నులు దాఖలు చేయని వారిని గుర్తించేందుకు తగిన సదుపాయాన్ని ప్రత్యక్ష పన్నుల కేంద్రమండలి(సీబీడీటీ) ప్రారంభించింది. సెక్షన్206ఏబీ, సెక్షన్ 206సీసీఏ విషయమై ఆదేశాలు జారీ చేసింది. వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాలకు పన్ను రిటర్నులు దాఖలు చేయని వారీ విషయంలో జూలై 1 నుంచి అధిక టీడీఎస్, టీసీఎస్ అమల్లోకి రానుంది. వీరిని ‘ప్రత్యేక వ్యక్తులు’ (స్పెసిఫైడ్ పర్సన్స్)గా గుర్తించేందుకు అవసరమైన ఒక యుటిలిటీని టీడీఎస్, టీసీఎస్ వసూలు చేసేవారికి అందుబాటులోకి తెచ్చింది.
అంటే 2018-19, 2019-20 అర్థిక సంవత్సరాల రిటర్నులు వేయకుండా.. టీడీఎస్ లేదా టీసీఎస్ రూ.50,000, అంతకుమించి మినహాయించి ఉంటే, అటువంటి వారికి(నిర్ధేశిత వ్యక్తులు) జూలై 1 నుంచి 5 శాతం అధిక రేటును వసూలు చేయనన్నారు. ఇటువంటి నిర్దేశిత వ్యక్తులను తెలుసుకునే సదుపాయాన్ని https://report.insight.gov.in/ పోర్షల్‌పై అందుబాటులోకి తీసుకొచ్చినట్లు సీబీటీటీ ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment