బెంగుళూరు: దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం విప్రో సంస్థ స్థానిక అభ్యర్థులకే ఉద్యోగ నియామకాలలో ప్రాధాన్యతిస్తున్నట్లు తెలిపింది. కాగా 2019-20సంవత్సరానికి అమెరికాలో విప్రో సంస్థ 69 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చినట్లు వార్షిక నివేదికలో ప్రకటించింది. కాగా లాటిన్ అమెరికాలో అన్ని ఉద్యోగాలను స్థానికుల ద్వారా నియమించుకున్నామని విప్రో తెలిపింది. అందుకు అనుగుణంగా గత కొద్ది కాలంగా ఐటీ కంపెనీలు స్థానికులకే అత్యుత్తమ శిక్షణ అందించి వారిని నియమించుకుంటున్నాయి. నైపుణ్యం ఉన్న స్థానికులకే ఉద్యోగ నియామకాలలో ప్రాధాన్యమిస్తున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు లక్ష 88వేల మంది ఉద్యోగులు విప్రో సంస్థకు సేవలందిస్తున్నారు.
అయితే అమెరికన్స్ ఫస్ట్(స్థానికులకే ఉద్యోగాలు) అనే నినాదంతో గత ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచనలకు అనుగుణంగా విప్రో చర్యలు చేపడుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల హెచ్-1 బి వీసా(అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగులు)లను తగ్గించడం వంటి చర్యలకు ట్రంప్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మళ్లీ స్థానికులకే ఉద్యోగాలు అనే నినాదంతో గెలవడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల విప్రో లిమిటెడ్ కొత్త సీఈవోగా థియర్రీ డెలాపోర్ట్ బాధ్యతలు చేపట్టారు.
(చదవండి: కరోనా: అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూ. 1125 కోట్లు!)
Comments
Please login to add a commentAdd a comment