ట్రంప్‌ విధానాలతో వ్యాపారానికి విఘాతం: విప్రో | An SEC filing confirms Trump as an official threat to India's IT industry | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ విధానాలతో వ్యాపారానికి విఘాతం: విప్రో

Published Sat, Jun 10 2017 1:31 AM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

ట్రంప్‌ విధానాలతో వ్యాపారానికి విఘాతం: విప్రో - Sakshi

ట్రంప్‌ విధానాలతో వ్యాపారానికి విఘాతం: విప్రో

న్యూఢిల్లీ: స్వేచ్ఛా వాణిజ్యంపై ఆంక్షలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో తమ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం పడవచ్చని ఐటీ దిగ్గజం విప్రో పేర్కొంది.  అమెరికాలో దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై టారిఫ్‌లను ట్రంప్‌ ప్రభుత్వం గణనీయంగా పెంచేస్తోందని తమ వార్షిక నివేదికలో తెలిపింది. విప్రో ఐటీ సేవల విభాగం ఆదాయంలో సుమారు 52 శాతం అమెరికా మార్కెట్‌ నుంచే వస్తున్న నేపథ్యంలో కంపెనీ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.

అమెరికాతో పాటు తమ కార్యకలాపాలున్న దేశాల్లో సామాజిక, రాజకీయ, ఆర్థిక, నియంత్రణ సంస్థలపరమైన విధానాలు, చట్టాల్లో చోటుచేసుకునే మార్పులు తమ వ్యాపారంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని విప్రో తెలిపింది. భారత ఐటీ కంపెనీలు హెచ్‌–1బీ వీసాలు దుర్వినియోగం చేశాయంటూ ఆరోపించిన ట్రంప్‌ .. వీసా నిబంధనలను కఠినతరం చేయడం తదితర చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement