Andhra Pradesh Global Investors Summit 2023 Day 1 Live Updates In Telugu - Sakshi
Sakshi News home page

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌-2023: రూ.11లక్షల 87 వేల 756 కోట్ల ఒప్పందాలు

Published Fri, Mar 3 2023 9:28 AM | Last Updated on Fri, Mar 3 2023 3:51 PM

Andhra Pradesh Global Investors Summit 2023 Day 1 Live Updates In Telugu - Sakshi

Updates..
స్టాల్స్‌ను పరిశీలించిన గడ్కరీ..

► 150కి పైగా స్టాల్స్‌తో ఏర్పాటు చేసిన పారిశ్రామిక ఎగ్జిబిషన్‌ను కేంద్ర మంత్రి గడ్కరీతో కలిసి సీఎం జగన్‌ ప్రారంభించారు. అనంతరం స్టాల్స్‌ను పరిశీలించారు.

జీఐఎస్‌లో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రసంగం

►ఏపీకి పారిశ్రామిక వృద్ధిలో రోడ్‌ కనెక్టివిటీ కీలకం

►పోర్టులతో రహదారుల కనెక్టివిటీ బలోపేతం చేప్తాం

►పరిశ్రమలకు లాజిస్టిక్స్‌ ఖర్చు తగ్గించడం చాలా ముఖ్యం

►ఏనీలో 3 పారిశ్రామిక కారిడార్లు వస్తున్నాయి

►ఏపీలో రోడ్‌ కనెక్టివిటీ పెంచేందుకు రూ. 20 వేల కోట్లు: కేంద్ర మంత్రి గడ్కరీ

►ఏపీలో పెట్టుబడులను ప్రకటించిన ముకేష్‌ అంబానీ

►ఏపీలో 10 గిగావాట్ల సోలార్‌ ఎనర్జీ ప్లాంట్‌ ఏర్పాటు: ముకేష్‌ అంబానీ

►ఎనర్జీ డిపార్ట్‌మెంట్‌లో రూ, 8, 25, 639 కోట్ల పెట్టుబడులు

పలు కీలక రంగాల్లో ఏపీ ప్రభుత్వం ఎంవోయూలు

► రూ.11లక్షల 87 వేల 756 కోట్ల విలువ కలిగిన 92 ఒప్పందాలు

►ఎన్టీపీసీ ఎంవోయూ(రూ. 2..35లక్షల కోట్లు)

►ఏబీసీ లిమిటెట్‌ ఎంవోయూ(రూ. 1.20 లక్షల కోట్లు)

►రెన్యూ పవర్‌ ఎంవోయూ(రూ. 97, 550 కోట్లు)

►ఇండోసాల్‌ ఎంవోయూ(రూ. 76, 033 కోట్లు)

►ఏసీఎమ్‌ఈ ఎంవోయూ(రూ. 68,976 కోట్లు)

►టీఈపీఎస్‌ఓఎల్‌ ఎంవోయూ( రూ. 65, 000 కోట్లు)

►జేఎస్‌డబ్యూ గ్రూప్‌(రూ. 50, 632 కోట్లు)

►హంచ్‌ వెంచర్స్‌(రూ. 50 వేల కోట్లు)

►అవాదా గ్రూప్‌( రూ 50 వేల కోట్లు)

►గ్రీన్‌ కో ఎంవోయూ(47, 600 కోట్లు)

►ఓసీఐఓఆర్‌ ఎంవోయూ (రూ. 40వేల కోట్లు)

► హీరో ఫ్యూచర్‌ ఎనర్జీస్‌ (రూ. 30వేల కోట్లు)

► వైజాగ్‌ టెక్‌ పార్క్‌ (రూ. 21,844 కోట్లు)

► అదానీ ఎనర్జీ గ్రూప్‌ (రూ.21, 820 కోట్లు)

►ఎకోరెన్‌ ఎనర్జీ (రూ.15,500 కోట్లు)

►సెరంటికా ఎంవోయూ (రూ. 12,500 కోట్లు)

►ఎన్‌హెచ్‌పీసీ ఎంవోయూ (రూ.12వేల కోట్లు)

► అరబిందో గ్రూప్‌ (రూ.10, 365 కోట్లు)

►ఓ2 పవర్‌ ఎంవోయూ ( రూ.10వేల కోట్లు)

► ఏజీపీ సిటీ గ్యాస్‌ (రూ. 10వేల కోట్లు)

► జేసన్ ఇన్‌ఫ్రా ఎంవోయూ (రూ. 10వేల కోట్లు)

►ఆదిత్య బిర్లా గ్రూప్‌ (రూ. 9,300 కోట్లు)

►జిందాల్‌ స్టీల్‌ (రూ. 7500 కోట్లు) 

►టీసీఎల్‌ ఎంవోయూ(రూ. 5,500 కోట్లు)

►ఏఎం గ్రీన్‌ ఎనర్జీ(రూ. 5,000 కోట్లు)

►ఉత్కర్ష అల్యూమినియం(రూ. 4,500 కోట్లు)

►ఐపోసీఎల్‌ ఎంవోయూ(రూ. 4,300 కోట్లు)

►వర్షిణి పవర్‌ ఎంవోయూ(రూ, 4,200 ‍కోట్లు)

►ఆశ్రయం ఇన్‌ఫ్రా(రూ. 3,500 కోట్లు)

►మైహోమ్‌ ఎంవోయూ(3,100 కోట్లు)

►వెనికా జల విద్యుత్‌ ఎంవోయూ(రూ. 3000 కోట్లు)

►డైకిన్‌ ఎంవోయూ(రూ. 2,600 కోట్లు)

►సన్నీ ఒపోటెక్‌ ఎంవోయూ(రూ. 2,500 కోట్లు)

►భూమి వరల్డ్‌ ఎంవోయూ(రూ. 2,500 కోట్లు)

►అల్ట్రాటెక్‌ ఎంవోయూ(రూ. 2,500 కోట్లు)

►ఆంధ్రా పేపర్‌ ఎంవోయూ(ర. 2వేల కోట్లు)

►మోండాలెజ్‌ ఎంవోయూ(రూ. 1,600 కోట్లు)

►అంప్లస్‌ ఎనర్జీ(రూ. 1,500 కోట్లు)

►గ్రిడ్‌ ఎడ్జ్‌ వర్క్స్‌ ఎంవోయూ(రూ. 1,500 కోట్లు)

►టీవీఎస్‌ ఎంవోయూ(రూ. 1,500 కోట్లు)

►హైజెన్‌కో ఎంవోయూ(రూ. 1,500 కోట్లు)

►వెల్స్‌పన్‌ ఎంవోయూ(రూ. 1,500 కోట్లు)

►ఒబెరాయ్‌ గ్రూప్‌(రూ. 1,350 కోట్లు)

►దేవభూమి రోప్‌వేస్‌(రూ. 1,250 కోట్లు)

►సాగర్‌ పవర్‌ ఎంవోయూ(రూ. 1,250 కోట్లు)

►లారస్‌ గ్రూప్‌(రూ. 1,210 కోట్లు)

►ఎలక్ట్రో స్టీల్‌ క్యాస్టింగ్స్‌(రూ. 1,113 కోట్లు)

►డెక్కన్‌ ఫైన్‌ కెమికల్స్‌(రూ. 1,110 ‍కోట్లు)

►దివీస్‌ ఎంవోయూ(రూ. 1,100 కోట్లు)

►డ్రీమ్‌ వ్యాలీ గ్రూప్‌(రూ. 1,080 కోట్లు)

►భ్రమరాంబ గ్రూప్‌(రూ. 1,038 కోట్లు)

►మంజీరాహోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌(రూ. 1,000 కోట్లు)

►ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌(రూ. 1,000 కోట్లు)

►శారదా మెటల్స్‌ అండ్‌ అల్లాయిస్‌(రూ. 1,000 కోట్లు)

►ఎంఆర్‌కేఆర్‌ కన్‌స్టక్షన్స్‌(రూ. 1,000 కోట్లు)

►సెల్‌కాన్‌ ఎంవోయూ(రూ.1,000 కోట్లు)

►తుని హోటల్స్‌ ఎంవోయూ(రూ. 1,000 కోట్లు)

►విష్ణు కెమికల్స్‌(రూ. 1,000 కోట్లు)

జీఐఎస్‌-2023లో సీఎం జగన్‌ ప్రసంగం

►త్వరలో విశాఖ ఎగ్జిక్యూటివ్‌ రాజధాని

►త్వరలో విశాఖ నుంచి పరిపాలన సాగిస్తాం

►ఏపీ కీలక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు

►ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో వరుసగా మూడేళ్లు నంబర్‌వన్‌

►ఏపీలో సులువైన పారిశ్రామిక విధానం

►నైపుణ్యాభివద్ధి కాలేజీలతో పారిశ్రామికాభివృద్ధి

►గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 540 సేవలు

►రాష్ట్ర ఎగుమతులు గణనీయంగా పెరిగాయి

► దేశంలో 11 పారిశ్రామిక కారిడార్లు వస్తుంటే.. ఏపీలోనే 3 పారిశ్రామిక కారిడార్లు

►పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలతో నంబర్‌వన్‌గా నిలిచాం

►గ్రీన్‌ ఎనర్జీపై ప్రధాన ఫోకస్‌

►తొలిరోజే 92 ఎంవోయూలు.. 

► మొత్తం రూ 13 లక్షల కోట్ల పెట్టుబడులు

► మొత్తం 20 రంగాల్లో పెట్టుబడులు

►దేశ ప్రగతిలో ఏపీ కీలకంగా మారింది

►340 సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు వచ్చాయి

► మొత్తం 340 ఏంవోయూలు.. 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు

ముఖేష్‌ అంబానీ స్పీచ్‌

►సమ్మిట్‌లో భాగస్వామ్మనైందుకు సంతోషంగా ఉంది:

►పలు రంగాల్లో ఏపీ నంబర్‌వన్‌గా మారుతున్నందుకు శుభాకాంక్షలు: ముఖేష్‌ అంబానీ

►ఏపీలో కీలక రంగాల్లో వనరులు పుష్కలంగా ఉన్నాయి

►పలువురు అంతర్జాతీయ స్థాయి నిపుణులు ఏపీ నుంచే వచ్చారు

►నూతన భారతదేశ నిర్మాణంలో ఏపీ కీలకం కాబోతుంది: ముఖేష్‌ అంబానీ

సజ్జన్‌ భుజంకా స్పీచ్‌

►ఏపీలో అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి మంచి సహకారం

►ఏపీలో మా కంపెనీ మరింత విస్తరణకు సిద్ధంగా ఉంది

సెంచరీ ఫ్లై బోర్డ్స్‌ చైర్మన్‌

►ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొనడం సంతోషకరం: కరణ్‌ అదానీ

►ఏపీలో మౌలిక సదుపాయాలు బాగాన్నాయి

►15 వేల మెగావాట్ల వపర్‌ ప్రాజెక్ట్‌ అభివృద్ధి 

-కరణ్‌ అదానీ, సీఈవో అదానీ పోర్ట్స్‌

►ఏపీలో వేల కోట్ల పెట్టబడులు పెట్టబోతున్నాం రెన్యూ పవర్‌ ఎండీ సుమంత్‌ సిన్హా

►ఏపీలో పర్యాటక రంగం అంతర్జాతీయ స్థాయిలో ఉంది:  ఒబెరాయ్‌ హోట్స్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ అర్జున్‌ఒబెరాయ్‌

 ►సీఎం జగన్‌ దార్శనికతతో తొందరగా అనుమతలు

భారత్‌ బయోటెక్‌ చైర్మన్‌ కృష్ణ ఎల్లా ప్రసంగం

►ప్రపంచానికి ఉత్తమమైన మానవ వనరులను ఏపీ అందిస్తోంది

►ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయి

►వాటిని సమర్ధవంతంగా వాడుకుంటే ఏపీలో మరింత అభివృద్ధి

►నైపుణ్యాభివృద్ధికి ఏపీ చేస్తున్న కృషి ప్రశంసనీయం

సియాంట్‌ చైర్మన్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి స్పీచ్‌

►విశాఖలో మరిన్ని సేవలు విస్తరిస్తాం

►ఏపీలో సంక్షేమ పథకాలు అద్భుతం

►ఐటీ రంగంలో ఏపీ నిపుణుల పాత్ర ఆదర్శనీయం

►విద్యారంగంలో ఏపీ కృషి అమోఘం

►పలు రంగాల్లో సాంకేతిక పాత్ర వేగంగా జరుగుతోంది

►అమ్మఒడి, విద్యాకానుక, విద్యాదీవెన, విదేశీ విద్యా దీవనె పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి

జీఎంఆర్‌ గ్రూప్‌ చైర్మన్‌ జీఎం రావు స్పీచ్‌

►సీఎం జగన్‌ విజన్‌ అద్భుతం

►సీఎ జగన్‌ దార్శనికత ప్రశంసనీయం

►ఏపీలో కనెక్టివిటీ బాగా పెరిగింది

►ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది

►ఏపీలో ఇన్వెస్టర్స్‌ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్‌ ఉంది

►ఎయిర్‌ కనెక్టివిటీ పెరుగుతండటంతో ఏపికి మరిన్ని పరిశ్రమలు

►రాష్ట్ర జీడీపీ సుస్థిరంగా ఉండటం ప్రశంసనీయం

►ఏపీలో జిందాల్‌ స్టీల్‌ భారీ పెట్టుబడులు

►రూ. 10 వేల కోట్ల పెట్టుబడిని ప్రకటించిన నవీన్‌ జిందాల్‌

►ఏపీ ప్రగతిలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది

►రూ. 10 వేల కోట్ల పెట్టుబడులతో 10వేల మందికిపైగా ఉపాధి

►ఆర్థిక వృద్ధిలో ఏపీ నంబర్‌వన్‌గా ఉంది

►వేదికపై రూ. 10 వేల కోట్ల పెట్టుబడి ప్రకటించిన నవీన్‌ జిందాల్‌

మార్టిన్‌ ఎబర్‌ హార్డ్‌, టెస్లా కో ఫౌండర్‌ స్పీచ్‌

►గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో పాల్గొనడం సంతోషంగా ఉంది

►గ్రీన్‌ ఎనర్జీ పట్ల ఏపీ ఆసక్తి ప్రశంసనీయం

►సుస్థిర అభివృద్ధి ప్రపంచానికి చాలా ముఖ్యం

టోరే ఇండస్ట్రీస్‌ ఎండీ మసహిరో యమగూచి స్పీచ్‌

►ఏపీ ప్రభుత్వం సహకారం మరువలేనిది

►పలు కీలక రంగాల్లో వెంటనే అనుమతులు


కియా ఇండియా ప్రతినిధి కబ్‌ డోంగ్‌ లి ప్రసంగం

►రాష్ట్ర అభివృద్ధిలో కియా తన పాత్ర పోషిస్తుంది

►ప్రభుత్వ సహకారాలు కియా అభివృద్ధికి దోహదపడుతున్నాయి

►ఏపీలో కియా కార్యకలాపాలు సులువుగా సాగిస్తోంది

►ఏపీ ప్రభుత్వ మద్దతు అమోఘం

శ్రీ సిమెంట్‌ చైర్మన్‌ హరిమోహన్‌ స్పీచ్‌

►ఏపీలో నైపుణ్యమైన మానవ వనరులు ఉన్నాయి: 

►జగన్‌ నాయకత్వంలో ఏపీ పరిశ్రమల హబ్‌గా మారింది

►కర్బన రహిత వాతావరణం కోసం ఏపీ కృషి ప్రశంసనీయం

►ఏపీ పారిశ్రామికీకరణలో శ్రీసిమెంట్‌ తనదైన పాత్ర పోషిస్తోంది

►రూ. 5వేల కోట్లతో ఏపీలో శ్రీ సిమెంట్‌ పెట్టుబడులు

►శ్రీ సిమెంట్‌ ద్వారా 5 వేల మందికి ఉపాధి

►వేదికపైనే ప్రకటించిన శ్రీ సిమెంట్‌ చైర్మన్‌ హరిమోహన్‌

అపోలో హాస్పిటల్స్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ ప్రీతారెడ్డి ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు

►ఆరోగ్య రంగంలో ఏపీ సర్కార్‌ కృషి అభినందనీయం

►ఏపీ సర్కార్‌తో అపోలో భాగస్వామిగా ఉండటం సంతోషంగా ఉంది

►ఆరోగ్యశ్రీ పథకం ఆవిష్కర్త వైఎ‍స్పార్‌కృషిని గుర్తు చేసిన ప్రీతారెడ్డి

►ఆరోగ్యశ్రీ పథకం ఇతర దేశాలకు విస్తరించింది

నాఫ్‌ సీఈవో సుమ్మిత్‌ బిదానీ ప్రసంగం

►పరిశ్రమలకు ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం పూర్తి సహకారం

►ఏపీలో రోడ్‌ కనెక్టివిటీ, విద్యుత్‌ సౌకర్యాలు బాగున్నాయి

►ఇన్వెస్టర్స్‌ సదస్సు పారిశ్రామికవేత్తలకు ఎంతో ఉపయోగం

 మంత్రి బుగ్గన ప్రసంగం

►ఏపీలో సహజ వనురులు పుష్కలంగా ఉన్నాయి: మంత్రి బుగ్గన

►నైపుణ్యం కలిగిన మానవ వనరులకు ఏపీలో కొదవలేదు

►పలు రంగాల్లో లాజిస్టిక్స్‌ అద్భుతంగా ఉన్నాయి

►పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు

►బిజినెస్‌ ఇండస్ట్రీలపై సీఎం జగన్‌ మంచి దార్శినికతతో ఉన్నారు

►ఐటీ, ఐటీ ఆధారిత పరిశ్రమలకు మంచి వాతావరణం ఉంది

►ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ నంబర్‌వన్‌గా ఉంది

►ఇండియా ఇండస్ట్రియల్‌ మ్యాప్‌లో ఏపీ దూసుకుపోతోంది

జీఐఎస్‌లో మంత్రి అమర్నాథ్‌ ప్రసంగం

►రాష్ట్రంలో పారిశ్రామికంగా పుష్కలమైన అవకాశాలు: మంత్రి గుడివాడ అమర్నాథ్‌
►ఏపీలో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోంది
►సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ సీఎం జగన్‌ పాలన
►రాష్ట్రంలో సీఎం జగన్‌ సారథ్యంల బలమైన నాయకత్వం ఉంది
►ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం పటిష్టంగా ఉంది

10:36AM

► జ్యోతి ప్రజ్వలన అనంతరం సీఎస్‌ జవహర్‌రెడ్డి ప్రారంభోపన్యాసం

►వీడియో ప్రజెంటేషన్‌ ద్వారా పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం ఘనస్వాగతం

►అడ్వాంటేట్‌ ఆంధ్రప్రదేశ్‌పై పలు వివరాలతో వీడియో ప్రజంటేషన్‌

►వివిధ రంగాల్లో ఏపీ సాధిస్తున్న పురోగతిపై వీడియో ప్రజెంటేషన్‌

10:34AM

►విశాఖలో ఘనంగా ప్రారంభమైన జీఐఎస్‌

10:32AM

► జ్యోతిని వెలిగించి సదస్సును ప్రారంభించిన సీఎం జగన్‌

10:30AM

► జీఐఎస్‌లో ఏపీ రాష్ట్ర గీతం  ‘మా తెలుగు తల్లికి’ ఆలాపన

► అలరించిన లేజర్‌ షో

► సభా వేదికకు చేరుకున్న సీఎం జగన్‌

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ – 2023 ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌ ప్రాంగణంలో పలువురు డెలిగేట్స్‌.. వారిని ఆత్మీయంగా పలకరిస్తున్న సీఎం జగన్‌

10:10 AM

జీఐఎస్‌కు చేరుకుంటున్న పారిశ్రామిక దిగ్గజాలు

ప్రత్యేక కాన్వాయ్‌లో జీఐఎస్‌ సదస్సుకు ముఖేష్‌ అంబానీ

 పారిశ్రామికవేత్త ముఖేష్‌ అంబానీకి స్వాగతం పలికిన ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు గుడివాడ అమర్నాథ్‌, విడదల రజినీ

జీఐఎస్‌కు పారిశ్రామికవేత్తలు కరణ్‌ అదానీ, సంజీవ్‌ బజాజ్‌, నవీన్‌ జిందాల్‌, జీఎం రావు, జీఎంఆర్‌, ప్రీతారెడ్డి

విశాఖ చేరుకున్న యూకే డిప్యూటీ హైకమిషనర్‌

09:51AM
ఏయూ ప్రాంగణానికి డెలిగేట్స్‌
గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ – 2023కు హాజరయ్యేందుకు ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌ ప్రాంగణానికి చేరుకుంటున్న డెలిగేట్స్.

09:30AM

ఏయూ ప్రాంగణానికి బయల్దేరిన సీఎం జగన్‌

👉 : గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ – 2023కు హాజరయ్యేందుకు ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌ ప్రాంగణానికి బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.


👉 :దారిపొడవునా సీఎం జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికిన విశాఖవాసులు

ఆహుతులకు ఆత్మీయ స్వాగతం


విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్స్‌ ప్రాంగణంలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ - 2023కు హాజరవుతున్న ఆహుతులకు సాంప్రదాయ నృత్యరూపకాలతో ఆత్మీయ స్వాగతం పలుకుతున్న కళాకారులు.

👉: గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023.. దేశ, విదేశీ కార్పోరేట్‌ దిగ్గజాలన్నింటినీ ఒకే వేదికపై తీసుకురావడమే లక్ష్యంగా ఈ సదస్సును ఏర్పాటు చేశారు. రాష్ట్ర చరిత్రలో పారిశ్రామిక అభివృద్ధి గతంలో జరిగిన సదస్సులకు భిన్నంగా వాస్తవితకు దగ్గరగా ప్రస్తుత సదస్సు జరగబోతుంది. 

కీలక పెట్టుబడులే ప్రధాన లక్ష్యం

👉 : ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాల మైదానం వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించే సదస్సులో రాష్ట్రంలో ఉన్న 14 కీలక రంగాల్లో పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. 

👉 : దేశ, విదేశాల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, హాజరవుతున్నారు. 

👉 : 45 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతున్న ఈ సదస్సుకు సంబంధించి ఇప్పటికే రిజిస్ట్రేషన్లు 18 వేలు దాటడం విశేషం.

ముఖేష్‌ అంబానీ, కుమార మంగళం బిర్లా, కరణ్‌ అదానీ, సంజీవ్‌ బజాజ్, అర్జున్‌ ఒబెరాయ్, సజ్జన్‌ జిందాల్, నవీన్‌ జిందాల్, మార్టిన్‌ ఎబర్‌ హార్డ్డ్, హరిమోహన్‌ బంగూర్, సజ్జన్‌ భజాంకా వంటి 30కి పైగా కార్పొరేట్‌ దిగ్గజ ప్రముఖులు రెండు రోజుల సదస్సులో పాల్గొంటున్నారు. 

ఈ సదస్సు ఏర్పాట్లపై సీఎం ప్రత్యేక శ్రద్ధ కనపరుస్తున్నారు. గురువారం సాయంత్రమే విశాఖకు చేరుకుని, ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డితో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమరనాథ్‌లు సభా స్థలి, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించారు.

కార్పొరేట్‌ ప్రముఖులు విమానాశ్రయం నుంచి నేరుగా సభా స్థలికి చేరుకునేందుకు మూడు హెలిపాడ్స్‌ను సిద్ధం చేశారు. అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్‌ కెమెరాల ద్వారా కదలికలను ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తున్నారు. తొలిసారిగా స్నిఫర్‌ డాగ్స్‌తో కే9 సెక్యూరిటీ వ్యవస్థ ఏర్పాటు చేశారు.


14 రంగాల్ని ప్రమోట్‌ చేస్తున్న ప్రభుత్వం

👉: రాష్ట్రంలో సరళమైన పారిశ్రామిక విధానం, సీఎం వైఎస్‌ జగన్‌ విశ్వసనీయతకు ఆకర్షితులై దిగ్గజ పరిశ్రమలన్నీ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అడుగులు ముందుకు వేస్తున్నాయి. అడ్వాంటేజ్‌ ఏపీ పేరుతో రాష్ట్రంలో ఉన్న వనరులు, వసతుల్ని ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ఈ సదస్సు జరగనుంది. మూడున్నరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలలో 90 శాతానికి పైగా గ్రౌండ్‌ అయ్యాయి. అదే స్ఫూర్తితో ఈ సదస్సులో చేసుకునే ఒప్పందాలు 100 శాతం గ్రౌండ్‌ అవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది.

👉: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మెరుగైన అవకాశాలు ఉన్న 14 రంగాలను ప్రభుత్వం ఎంపిక చేసింది. పునరుత్పాదక ఇంధన వనరులు, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఐటీ, హెల్త్‌కేర్‌ అండ్‌ మెడికల్‌ ఎక్విప్‌మెంట్, ఎంఎస్‌ఎంఈ, స్టార్టప్స్‌ అండ్‌ ఇన్నోవేషన్స్, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎడ్యుకేషన్, ఇండస్ట్రియల్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫార్మాస్యుటికల్స్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్, ఆటోమొబైల్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ, అగ్రి అండ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్‌ అండ్‌ అప్పరెల్స్, ఏరోస్పేస్‌ అండ్‌ డిఫెన్స్, పెట్రోలియం అండ్‌ పెట్రోకెమికల్స్‌ తదితర రంగాలపై ఫోకస్‌ చేస్తోంది.

👉: ఈ రంగాలకు సంబంధించిన కేంద్ర మంత్రులను ఆహ్వానించారు. వారంతా ఈ సదస్సుకు హాజరవుతున్నారు. ఆడియో వీడియో విజువల్‌ ప్రదర్శన అనంతరం సంబంధిత అధికారులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు ప్రసంగించనున్నారు. 

👉: సభా ప్రాంగణానికి పక్కనే ఉన్న మరో గదిలో 20కి పైగా బ్రేక్‌ అవుట్‌ బిజినెస్‌ సెషన్లు జరగనున్నాయి. సభా ప్రాంగణంలోనే సీఎం కార్యాలయం.. లాంజ్, సమావేశ మందిరం, వ్యక్తిగత గదులను సిద్ధం చేశారు. ఆ పక్కనే మంత్రులకు, మీడియా ప్రతినిధులకు వేర్వేరుగా డైనింగ్‌ సౌకర్యం కల్పించారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement