Alluri Seetharama Raju
-
ఎగిరే పామును చూశారా..?
సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఏజెన్సీ ప్రాంత ప్రజలు కూడా ఎన్నడు చూడని అరుదైన పాము పాడేరులో కనిపించింది. స్థానిక చాకలిపేటలో ఉపాధ్యాయుడు ఒంపురి కేశవరావు ఇంటి రెండో అంతస్తులోని వంటగదిలో నలుపు ఎరుపు, గోల్డ్ రంగుల మిశ్రమంలో రింగ్‌లుగా ఉన్న ఈ పామును చూసి స్థానికులంతా భయాందోళన చెందారు. స్థానికుల ఫోన్‌తో వచ్చిన స్నేక్ క్యాచర్ బండారు వాసు చాకచక్యంగా పామును పట్టుకున్నారు. మూడున్నర అడుగులున్న ఈ పాము ఒరంటే ఫ్లయింగ్ స్నేక్ అని వాసు తెలిపారు. ఎగిరే స్వభావంగల ఈ పాము అడవుల్లో రాత్రిళ్లు ఎక్కువగా సంచరిస్తుందని చెప్పారు. ఆ పామును ఆయన పాడేరు ఘాట్‌లోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. -
జలపాతంలో ఇద్దరి మృతదేహాలు లభ్యం
మారేడుమిల్లి: అల్లూరి జిల్లా మారేడుమిల్లి సమీపంలోని పర్యాటక ప్రదేశమైన జలతరంగిణి జలపాతంలో ఆదివారం గల్లంతైన ముగ్గురు వైద్య విద్యార్థుల్లో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. సోమవారం వేకువజామున జలపాతం సమీపంలోని తుప్పల మధ్య కె.సౌమ్య (21), బి.అమృత (21) మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. గల్లంతైన మరో విద్యార్థి సీహెచ్ హరదీప్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.ఏలూరు ఆశ్రం మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సెకండియర్ విద్యార్థులు 14 మంది ఆదివారం మారేడుమిల్లి వచ్చారు. జలతరంగిణి జలపాతంలో దిగి స్నానాలు చేస్తుండగా జలపాతం ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ఒక్కసారిగా వాగు ఉప్పొంగింది. ప్రవాహంలో సీహెచ్ హరదీప్, కె.సౌమ్య, బి.అమృత కొట్టుకుపోగా.. గాయత్రీపుష్ప, హరిణిప్రియ అనే విద్యార్థినులు జలపాతానికి 6 కిలోమీటర్ల సమీపంలో చెటుకొమ్మకు చిక్కుకుని ప్రాణాలతో బయటపడిన విషయం తెలిసిందే.లభ్యమైన మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్ద మృతుల బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. హరదీప్ ఆచూకీ కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, రెవెన్యూ, అటవీ, పోలీస్ అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని సీఐ గోపాలకృష్ణ తెలిపారు. -
అల్లూరి జయంతి.. వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, తాడేపల్లి: అల్లూరి సీతారామరాజుకి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాళులర్పించారు. ‘‘స్వాతంత్ర్య సమర యోధుడు.. బ్రిటీష్ పాలకులకు ఎదురొడ్డి నిలబడిన విప్లవ వీరుడు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన నాయకుడు మన అల్లూరి సీతారామరాజు గారు. ఆయన పోరాటాలు, ఆయన త్యాగాలు ఎప్పుడూ గుర్తుండిపోయేలా రాష్ట్రంలో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టుకున్నాం. నేడు అల్లూరి సీతారామరాజు గారి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నా’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.స్వాతంత్ర్య సమర యోధుడు.. బ్రిటీష్ పాలకులకు ఎదురొడ్డి నిలబడిన విప్లవ వీరుడు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన నాయకుడు మన అల్లూరి సీతారామరాజు గారు. ఆయన పోరాటాలు, ఆయన త్యాగాలు ఎప్పుడూ గుర్తుండిపోయేలా రాష్ట్రంలో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టుకున్నాం. నేడు ఆల్లూరి సీతారామరాజు గారి…— YS Jagan Mohan Reddy (@ysjagan) July 4, 2024 -
అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ డంప్ స్వాధీనం
పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): కూంబింగ్‌కు వచ్చిన పోలీస్ పార్టీలను హతమార్చాలనే లక్ష్యంతో మావోయిస్టులు ఏర్పాటు చేసిన భారీ డంప్‌ను పోలీసులు చాకచక్యంగా వెలికితీసి నిర్విర్యం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. జీకే వీధి మండలం సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పనసలబంద పరిసర అటవీ ప్రాంతంలో ఈ నెల 24న పోలీస్ పార్టీలు కూంబింగ్‌కు వెళ్లాయి. వారిని హతమార్చాలనే లక్ష్యంతో మావోలు ఏర్పాటు చేసిన భారీ డంప్‌ను పోలీసులు గుర్తించి స్వా«దీనం చేసుకున్నారు.ఈ డంప్‌లో ఆరు స్టీల్ క్యారేజ్ మందు పాత్రలు, రెండు డైరెక్షనల్ మైన్స్, ఖేల్ కంపెనీకు చెందిన ఒక పేలుడు పదార్థం, 150 మీటర్ల ఎలక్ట్రికల్ వైరు, ఐదు కిలోల మేకులు, ఇనుప నట్లు, విప్లవ సాహిత్యం ఉన్నాయని ఆయన వివరించారు. జిల్లాలో మావోయిస్టులు దాచిపెట్టిన డంప్‌లన్నింటినీ స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. మావోల కుట్రపూరిత ప్రణాళికలపై గిరిజనులంతా అప్రమత్తంగా ఉండాలని, వారి మాటలు నమ్మొద్దని సూచించారు.మావోలకు పేలుడు పదార్థాలు లభించడంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, పనసలబంద అటవీ ప్రాంతంలో అధారాల కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. డంప్‌ను స్వా«దీనం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించిన సీలేరు ఎస్ఐ రామకృష్ణ, ఆర్ఎస్ఐ జాన్‌రోహిత్, జి.మాడుగుల ఎస్ఐ శ్రీనివాసరావులను ఎస్పీ అభినందించారు. -
నాన్నను అలా చూడటం ఇప్పటికీ గుర్తుంది: మహేశ్ బాబు
సూపర్ స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు తెలుగు సినిమాలో ఎప్పటికీ చెరగని ముద్ర వేసింది. 1974లో రామచంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. అల్లూరి సీతారామరాజు మూవీ విడుదలై మే 1వ తేదీ నాటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రిన్స్ మహేశ్‌బాబు ట్వీట్ చేశారు. నాన్న నటించిన చిత్రంపై ప్రశంసలు కురిపించారు.మహేశ్ బాబు తన ట్వీట్లో రాస్తూ..' నాన్నగారిని తెరపై గంభీరమైన లుక్‌లో చూసి ఆశ్చర్యపోవడం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఇప్పుడు చూసినా మొదటిసారి చూసినట్లే ఉంది. ఈ సినిమా నేటికి 50 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా నటుడిగా నా ప్రయాణం, తెలుగు సినిమాపై నా ప్రభావాన్ని గుర్తుచేసుకుంటున్నా' అని పోస్ట్ చేశారు. కాగా.. ఈ ఏడాది గుంటూరు కారంతో అభిమానులను అలరించిన మహేశ్‌బాబు.. నెక్ట్స్ మూవీ దర్శకధీరుడు రాజమౌళితో చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధమైంది. అయితే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. #50YearsOfAlluriSeetaramaRaju… Still recall watching it for the first time and being awestruck by Nanna garu’s majestic presence on screen. As the film completes 50 years today, I’m reminded of its profound influence on my journey as an actor and on Telugu cinema. ♥️♥️♥️ pic.twitter.com/CdhAfSr0OI— Mahesh Babu (@urstrulyMahesh) May 1, 2024 -
రాజధాని హంగులు..సరికొత్త సొబగులు
అధికారంలోకి వచ్చిన ప్రతి ప్రభుత్వానికీ మొరపెట్టుకున్నారు... ఓటేసి గెలిపించిన ప్రతి ప్రతినిధికీ వినతులు అందించారు. కాలం మారిపోయింది.. తరాలు తరిగిపోయాయి. కానీ.. జిల్లాను పట్టి పీడిస్తున్న సమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు. ఇక ఆశలు వదిలేసుకున్న ప్రజలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొత్త కాంతులు చూపించింది.ఎవరొచ్చినా తీరదనుకున్న సమస్యలకు సైతం పరిష్కారం లభించింది. అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది. మామూలు జిల్లాగానే ఉండిపోతుందనుకున్న విశాఖకు రాజధాని యోగం పట్టింది. అందుకు అనుగుణంగా హంగులు సమకూరుతున్నాయి. కొత్తగా ఏర్పాటైన అనకాపల్లి, అల్లూరిజిల్లాల్లో పారిశ్రామికాభివృద్ధి, పర్యాటకం పరుగులు పెడుతున్నాయి. –సాక్షి, విశాఖపట్నం/అనకాపల్లి/పాడేరు నగరంలో రోడ్ల విస్తరణ తూర్పు నియోజకవర్గం పరిధి హనుమంతవాక నుంచి కైలాసగిరి కూడలి వరకు పదేళ్లుగా నిలిచిపోయిన రోడుŠడ్ విస్తరణ పనులు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ప్రారంభమయ్యాయి. దక్షిణ నియోజకవర్గంలో జగదాంబ జంక్షన్ నుంచి పాతనగరం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ రాణిబోమ్మ వరకు 60 అడుగుల రోడ్డు విస్తరణ, అన్నవరం సత్యదేవుని ఆలయ ఘాట్ రోడ్డు పనులు దాదాపు పూర్తయ్యాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కొండవాలు ప్రాంతాల్లో రూ.9 కోట్లతో రక్షణ గోడలు నిరి్మంచారు. భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం పాండ్రంగిలో గోస్తనీ నదిపై రూ.16.50 కోట్లతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హౌసింగ్ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న గాజువాక హౌసింగ్ సొసైటీ భూములకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శాశ్వత పరిష్కారం చూపించారు. జీవో నంబర్ 301, 388 పట్టాదారులకు టైటిల్ డీడ్స్ అందజేశారు. సుమారు రూ.1500 కోట్ల విలువైన భూమిని ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన అందజేశారు. ప్రభుత్వ భూముల్లో నివాసం ఉంటున్న 7026 మందికి కన్వేయషన్స్ డీడ్స్ అందించారు. 39 మంది ఉక్కు కర్మాగార నిర్వాసితులకు కన్వేయ¯న్స్ పట్టాలు, 40 మంది ఫార్మాసిటీ భూ నిర్వాసితులకు ఇళ్ల పట్టాలందించారు. పారిశ్రామిక హబ్‌గా అనకాపల్లి జిల్లా ► కొత్తగా ఏర్పాటైన అనకాపల్లి జిల్లాలో ఒక వైపు సంక్షేమం, మరో వైపు నూతన పరిశ్రమల ఏర్పాటు ఊపందుకుంది. ► మాకవరపుపాలెం మండలం భీమబోయినపాలెంలో రూ.500 కోట్లతో మెడికల్ కళాశాల నిర్మా ణం శరవేగంగా జరుగుతోంది. ► అనకాపల్లి మండలం కోడూరులో 70 ఎకరాల్లో ఎంఎస్ఎంఈ పార్కు కు స్థల సేకరణ పూర్తయింది. ► నక్కపల్లిలో డ్రగ్ పార్కు ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ► కోమళ్లపూడిలో మరో ఎస్ఈజెడ్కు స్థల కేటాయింపు పూర్తయింది. భారీ పరిశ్రమలకు శ్రీకారం రాజధానిగా రూపాంతరం చెందనున్న విశాఖపట్నంలో భారీ పరిశ్రమలు, ప్రాజెక్టుల స్థాపనకు మార్గం సుగమం చేశారు. అదానీ డేటా సెంటర్ ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. రూ.21,844 కోట్ల పెట్టుబడితో 39,815 మందికి ఉపాధి అవకాశాలు కలి్పంచేలా బిజినెస్ పార్క్, స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. ► గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో ఎనీ్టపీసీ, ఇంధన రంగంలో హెచ్‌పీసీఎల్, పర్యాటక రంగంలో ఒబెరాయ్, తాజ్, ఇనార్బిట్‌మాల్, టర్బో ఏవియేషన్.. వంటి బహుళ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు జరిగాయి. ► ఇన్ఫోసిస్, టెక్‌మహీంద్ర, హెచ్‌సీఎల్, యాక్సెంచర్, రాండ్‌స్టాడ్, డబ్ల్యూఎన్ఎస్, అమేజాన్ తదితర ఐటీ, ఐటీ అనుబంధ దిగ్గజ సంస్థలు విశాఖ వైపు అడుగులు వేశాయి. మరో 48 ఐటీ సంస్థలు విశాఖలో తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. వీటితో పాటు 140కి పైగా స్టార్టప్‌లు నడుస్తున్నాయి. ► ఐదేళ్లలో జిల్లాలో 35 భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే ఇక్కడ 120 భారీ పరిశ్రమలున్నాయి. మొత్తం వీటన్నింటి ద్వారా 14,114 మందికి ఉద్యోగాలు. మారిన ఏజెన్సీ రూపు రేఖలు కొత్తగా ఏర్పాటైన అల్లూరి జిల్లాలో మౌలిక వసతులు మెరుగుపడ్డాయి. ఒకప్పుడు నడవడానికి కూడా దారిలేని గిరిశిఖర గ్రామాలకు రోడ్డు సౌకర్యం కలిగింది. విద్య, వైద్యం అందుబాటులోకి వచ్చాయి. ఐదేళ్ల పాలనలో సుమారు రూ.100 కోట్లతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాన రోడ్లను తారురోడ్లుగా మార్చారు. రూ.10 కోట్లతో జామిగుడ, గిన్నెలకోట గెడ్డలపై భారీ వంతెనలు నిర్మిస్తున్నారు. మిషన్ కనెక్ట్ పాడేరు పేరుతో రూ.100 కోట్ల ఉపాధి హా మీ పథకం నిధులతో రోడ్ల నిర్మాణం జరుగుతోంది. ► పెదబయలు మండలంలోని ఇంజరి పంచాయతీలాంటి అత్యంత మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతానికి రూ.10 కోట్లతో తారురోడ్డు నిరి్మస్తున్నారు. ► రూ.500 కోట్లతో పాడేరులో మెడికల్ కళాశాల పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ► పాడేరు జిల్లా ఆస్పత్రి కార్పొరేట్ తరహాలో అభివృద్ధి చెందింది. చింతపల్లిలో రూ.20 కోట్లతో 100 పడకల ఆస్పత్రి నిరి్మస్తున్నారు. ఏజెన్సీ పర్యాటకం అద్భుతం ► అనంతగిరిలోని అంజోడ సిల్క్ ఫామ్‌లో పైన్ ప్లాంటేషన్ ఏర్పాటైంది. నీలగిరి చెట్లు పెరగడంతో అంజోడ పార్కు ఓ పర్యాటక ప్రాంతంగా మారింది. అక్కడ మంచు అందాలు కనువిందు చేస్తూ షూటింగులకు అనుకూలంగా మారింది. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సహకారంతో సుమారు రూ.70 లక్షలతో పార్కును ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ► బొర్రా గుహల వద్ద గోస్తనీ లోయపై పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన జిప్‌లైన్‌కు పర్యాటకుల తాకిడి పెరిగింది. ఏపీటీడీసీ సుమారు రూ.65 లక్షలతో ఇక్కడ సాహసక్రీడల్ని ఏర్పాటు చేసింది. ► ఏజెన్సీ నయాగరాగా చెప్పుకునే చాపరాయి జలపాతం వద్ద రూ.40 లక్షలతో కాటేజీలు, రోప్‌వేలు ఏర్పాటు చేశారు. -
కిరాయిలు ఇవ్వకుంటే ఎలా బాబూ!
హుకుంపేట (అల్లూరి సీతారామరాజు జిల్లా): చంద్రబాబు సభకు ఆటోల్లో ప్రజలను తరలించిన డ్రైవర్లకు కిరాయి డబ్బులు చెల్లించకపోవడంతో వారు ఆందోళనబాట పట్టారు. టీడీపీ నేతల తీరును నిరసిస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా బాకురులో ఆటో యూనియన్ల ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన చేపట్టారు. బాకూరు, ఉప్ప, చీకుమద్దుల, అండిభ, పంచాయతీల పరిధిలోని ఆటో డ్రైవర్లు రోడ్డెక్కారు. గతల నెల 20న అరకులో జరిగిన ‘రా కదలి రా’ సభకు జనాలను తరలించేందుకు ఒక్కొక్క ఆటోకు రూ.2,500 ఇస్తామని నేతలు ఒప్పందం చేసుకున్నారు. అయితే, ముందుగా కొంతమందికి మాత్రమే రూ.500 అడ్వాన్స్ ఇచ్చారని, మరికొందరికి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఒకేసారి ఇస్తామంటూ ఆటోలను సభకు తరలించారని పలువురు ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తంచేశారు. బాకురు, అండిభ యూనియన్ల పరిధిలో సుమారు 60 ఆటోలు, ఉప్ప ప్రాంత యూనియన్ నుంచి సుమారు 50 ఆటోలను మొత్తం 110 ఆటోల్లో ప్రజలను సభకు తీసుకువెళ్లామని వాపోయారు. సభ జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు తమకు కిరాయిలు చెల్లించకుండా టీడీపీ నేతలు తప్పించుకు తిరుగుతున్నారని మండిపడ్డారు. సభ జరిగే రోజు తమ ప్రాంతంలో సంత ఉంటుందని చంద్రబాబు సభకు వెళ్లకుండా అక్కడే టికెట్ సరీ్వసు చేసుకుంటే సుమారు రూ.3వేల వరకు సంపాదించుకుని ఉండేవారమని వారు లబోదిబోమంటున్నారు. కిరాయిలు ఇవ్వకపోతే ఓట్ల కోసం తమ గ్రామాలకు వచ్చే టీడీపీ నాయకులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఊరుకునేది లేదు.. రోజు మా కుటుంబ పోషణ నిమిత్తం ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాం. కిరాయి డబ్బులు ఇస్తామని చంద్రబాబు సభకు తీసుకువెళ్లారు. ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుతిరుగుతున్నారు. కిరాయి డబ్బులు చెల్లించకపోతే ఊరుకొనేది లేదు. – దూసురు వెంకట రమణ,ఆటో యూనియన్ అధ్యక్షుడు, అండిభ, హుకుంపేట మండలం మా పొట్ట కొడితే ఎలా? నాది పేద కుటుంబం. అమ్మా నాన్న కూలి చేస్తేనే తప్ప కడుపు నిండదు. రోజు ఎంతో కష్టపడితే గాని నాలుగు వేళ్లు నోటికి వెళ్లవు. ఆటో ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నాం. సభలకు జనాలను తరలించేటప్పుడు అడ్వాన్సులు అడిగితే అన్నీ కలిపి ఒకేసారి ఇస్తామంటూ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. – సంతోష్, ఆటో డ్రైవర్, చట్రాయిపుట్టు -
అడవి బిడ్డలకూ పథకాలు అందాలి
అరకులోయ టౌన్ (అల్లూరి సీతారామరాజు జిల్లా): ప్రభుత్వ సంక్షేమ పథకాలు మారుమూల గిరిజనులకు సైతం అందినప్పుడే నిజమైన అభివృద్ధి జరుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆదీవాసీల (పీవీటీజీల) సంక్షేమమే లక్ష్యంగా పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలతోపాటు పీవీటీజీ గిరిజనులకు 150 రోజుల పనిదినాలు కల్పిస్తున్నామన్నారు. పీఎం కిసాన్, ప్రధాని ఉజ్వల్ యోజనతో ఉచిత గ్యాస్ కనెక్షన్, ఆయుష్మాన్ భారత్ కార్డులు, అటవీ హక్కు పత్రాల పంపిణీ, జన్‌ధన్ ఖాతాలు, వన్‌దన్ వికాస్ కేంద్రాలు, పీఎం జల్ జీవన్ లాంటి పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రధాని ఆవాస్ యోజన (పీఎంఏవై) పథకం నిధుల విడుదల సందర్భంగా సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయ మండలం కొత్తభల్లుగుడ ప్రాథమిక పాఠశాల, ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కేఆర్‌పురంలో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆదీవాసీ గిరిజనులతో ప్రధాని వర్చువల్ సమావేశం ద్వారా ముచ్చటించారు. పీవీటీజీ మహిళ: నాపేరు స్వాభి గంగ, మాది గద్యగుడ గ్రామం, అరకులోయ మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నా భర్త పేరు స్వాభి రామచందర్. మాకు ఇద్దరు పిల్లలు.పీఎం: పీఎం జన్మన్ గురించి మీకు ఎలా తెలిసింది? స్వాభి గంగా: జనవరి 5న మా గ్రామంలో అధికారులు అవగాహన సదస్సు నిర్వహించి ప్రధాన మంత్రి జన్మన్ పథకం గురించి వివరించారు. పీఎం: జన్మన్ అవగాహన సదస్సుతో మీరు ఎలాంటి లబ్ధి పొందారు? స్వాభి గంగా: అవగాహన సదస్సు ద్వారా పీఎం ఆవాస్ యోజన కింద ఇంటి కోసం, పీఎం జలçజీవన్ యోజన కింద కుళాయి కోసం, పీఎం జన ఆరోగ్య కింద నా కుటుంబ సభ్యులకు ఆయుష్మాన్ భారత్ కార్డులు, ఉజ్వల యోజన కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ కోసం నమోదు చేసుకున్నా. నాకు పథకాలన్నీ మంజూరు చేశారు. పీఎం: మీ జీవనాధారం ఏమిటి? స్వాభి గంగా: ఆర్వోఎఫ్ఆర్ పథకంలో నాకు 35 సెంట్లు భూమికి పట్టా వచ్చింది. అందులో కాఫీ, మిరియాలు సాగు చేస్తూ మంచి గిట్టు బాటు ధర పొందుతున్నాం. పీఎం: అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు రావడం ఎలా అనిపిస్తోంది? స్వాభి గంగా: చాలా ఆనందంగా ఉంది. గతంలో దళారులకు విక్రయించి మోసపోయేవాళ్లం. ఇప్పుడు మంచి ధర లభిస్తోంది. కొండరెడ్డి గిరిజనులతో ముఖాముఖి పీఎం జన్మన్ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ వర్చువల్ విధానంలో ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కేఆర్‌పురం కొండరెడ్డి గిరిజనులతో మాట్లాడారు. పీఎం జనజాతి, ఆదివాసీ న్యాయ మహా అభియాన్ (పీఎం జన్మన్) కార్యక్రమం అమలులో భాగంగా అందించే సేవలను వివరించారు. ఈ కార్యక్రమం వల్ల పీవీటీజీ గ్రామాల్లో రూపురేఖలు మారబోతున్నాయని చెప్పారు. -
ఇండిపెండెన్స్ డే స్పెషల్: ఆగస్టు 15న చూడదగిన సినిమాలేవో తెలుసా?
ఈ ఏడాది స్వాతంత్య్ర సంబురాలకు యావత్ భారవతావని సిద్ధమవుతోంది. ఎంతోమంది వీరుల త్యాగాలతో మనదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సంగతి తెలిసిందే. బ్రిటీష్ వారికి తమ ప్రాణాలను ఎదురొడ్డి నిలిచిన వీరులెందరో భారతమాత ఒడిలో చేరారు. వారిలో ముఖ్యంగా అల్లూరి సీతరామరాజు, సుభాశ్ చంద్రబోస్ పేర్లు వినిపిస్తాయి. స్వాతంత్ర పోరాటంలో అమరులైన వారి చరిత్ర గురించి మనం చాలా సినిమాల్లో చూశాం. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మనలో దేశభక్తి గురించి తెలిపే టాలీవుడ్ చిత్రాలేవో ఓ లుక్కేద్దాం. 1.అల్లూరి సీతారామ రాజు ఎన్ని ఏళ్లు గడిచినా అందరికీ గుర్తుండి పోయే సినిమా 'అల్లూరి సీతారామ రాజు'. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఈ చిత్రం స్వాతంత్ర్య సమరయోధుడి జీవితం ఆధారంగా తెరకెక్కించారు. బ్రిటీష్ వారి పాలనకు వ్యతిరేకంగా 1922-24 మద్రాసు ప్రెసిడెన్సీలో స్వాతంత్య్రోద్యమ కాలంలో జరిగిన కథాంశంగా ఈ చిత్రం రూపొందించారు. అనేకమంది జీవితాలకు స్ఫూర్తిగా నిలిచిన అల్లూరి.. బ్రిటిష్ వారిపై యుద్ధంలో తన దళాన్ని ముందుకు నడిపించారు. ఈ 'అల్లూరి సీతారామ రాజు' రిలీజై 175 రోజులు విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించారు. అప్పట్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 1974లో విడుదలైన అల్లూరి సీతారామరాజు చిత్రానికి వి.రామచంద్రరావు దర్శకత్వం వహించారు. జి హనుమంత రావు, జి ఆదిశేషగిరి నిర్మించిన చిత్రంలో విజయ నిర్మల, కొంగర జగ్గయ్య, చంద్ర మోహన్ కీలక పాత్రల్లో నటించారు. భారత స్వాతంత్య్రోద్యమ కాలంలో విప్లవకారుడు, మన్యం దొర అల్లూరి సీతారామ రాజు జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు. 2.సర్దార్ పాప రాయుడు స్వాతంత్ర్య ఉద్యమ నేపథ్యంలో 1980లో వచ్చిన చారిత్రాత్మక చిత్రం సర్దార్ పాపరాయుడు. ఈ చిత్రాన్ని దాసరి నారాయణరావు దర్శకత్వంలో తెరకెక్కించారు. సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. కొన్ని థియేటర్లలో అయితే ఏకంగా 300 రోజులపాటు ప్రదర్శించారు. ఆ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా సర్దార్ పాపరాయుడు ఘనత సాధించింది. శ్రీ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై క్రాంతి కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో శ్రీదేవి, శారద ప్రధాన పాత్రల్లో నటించారు. 3.మేజర్ చంద్రకాంత్ ఎన్టీఆర్, మోహన్ బాబు, శారద ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం 'మేజర్ చంద్రకాంత్'. 1993లో విడుదలైన ఈ చిత్రం ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించే లక్ష్యంలో ఉన్న సైనికుడి జీవితం చుట్టు తిరుగుతుంది. నగ్మా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన ఈ దేశభక్తి చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌పై మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. మేజర్ చంద్రకాంత్ చిత్రంలోని 'పుణ్యభూమి నాదేశం', 'ముద్దులతో ఓనమాలు' వంటి పాటలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయాయి. 4. బొబ్బిలి పులి దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన చిత్రం బొబ్బిలి పులి. ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో కొంగర జగ్గయ్య, కైకాల సత్యనారాయణ, రావుగోపాలరావు, జయచిత్ర, మురళీమోహన్, ఎం. ప్రభాకర్ రెడ్డి, ప్రసాద్ బాబు, అల్లు రామలింగయ్య తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. 5.భారతీయుడు తమిళ స్టా హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం భారతీయుడు. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ వారిపై సాధించిన విజయాన్ని అందంగా చిత్రీకరించారు. స్వాతంత్రద్యోమంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాన్ని ఈ చిత్రం ద్వారా చూపించారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేశారు. 6.ఖడ్గం దేశభక్తిపై రూపొందించిన చిత్రాల్లో ఖడ్గం మూవీకి ప్రత్యేకస్థానం ఉంటుంది. ఈ చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహించారు. ఈ టాలీవుడ్ ఐకానిక్ చిత్రం కమర్షియల్ హిట్‌గా నిలిచింది. శ్రీకాంత్, సోనాలి బింద్రే, ప్రకాష్ రాజ్, రవితేజ కీలక పాత్రల్లో నటించిన ఖడ్గం థియేటర్లను దద్దరిల్లేలా చేసింది. 2002లో వచ్చిన ఈ చిత్రానికి సరోజిని అవార్డు, ఐదు నంది అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు దక్కాయి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ముగ్గురు యువకుల జీవితాలను ప్రభావితం చేసే అమానవీయ ఉగ్రవాద చర్యల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 7.సుభాష్ చంద్రబోస్ 2005లో విడుదలైన హిస్టారికల్ డ్రామా స్వాతంత్రానికి పూర్వం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కించారు. వెంకటేష్, శ్రియ శరణ్, జెనీలియా డిసౌజా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కె.రాఘవేంద్ర దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మూడు నంది అవార్డులను గెలుచుకుంది. బ్రిటీష్ వారితో పోరాడి చింతపల్లి గ్రామాన్ని రక్షించే సుభాష్ చంద్రబోస్ అనుచరుడి చుట్టూ కథను రూపొందించారు. 8.మహాత్మ టాలీవుడ్‌లోని ఉత్తమ దేశభక్తి చిత్రాలలో మహాత్మ ఒకటి. కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్ ప్రధానపాత్ర పోషించారు. ఈ చిత్రంలో భావోద్వేగ సన్నివేశాలు, త్యాగం ప్రేక్షకులను కంటతడి పెట్టించేలా తెరకెక్కించారు. 9. సైరా నరసింహారెడ్డి మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో నటించిన చిత్రం సైరా నరసింహారెడ్డి. బ్రిటీశ్ పాలనలో వారిని ఎదురించి నిలిచిన ఉయ్యలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో.. రామ్ చరణ్ నిర్మించారు. 2019లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. 10. ఆర్ఆర్ఆర్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. బ్రిటీష్ కాలంలో ఓ మన్యం వీరుడైన కొమురం భీం జీవితం ఆధారంగా రూపొందించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ బ్రిటీష్ పోలీసు అధికారి పాత్రలో కనిపించగా.. ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో నటించారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లూ సాధించగా.. ఆస్కార్ అవార్డ్‌ను సైతం సాధించింది. వీటితో పాటు స్వాతంత్య్ర ఉద్యమ నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. వీటిలో పల్నాటి యుద్ధం, నేటి భారతం(1983), వందేమాతరం(1985), ఆంధ్ర కేసరి, మరో ప్రపంచం(1970), మనదేశం(1949) ఘాజీ(2017), మేజర్, సైరా నరసింహా రెడ్డి(2019), గౌతమి పుత్ర శాతకర్ణి, పరమవీరచక్ర చిత్రాలు కూడా ఉన్నాయి. -
సినిమాని 'దేశభక్తి' కాపాడిందా? లేదంటే..!
యాక్షన్ సినిమా మీకు గూస్బంప్స్ తెప్పించొచ్చు.. హారర్ మూవీ భయపెట్టొచ్చు.. థ్రిల్లర్ మునివేళ్లపై కూర్చోబెట్టొచ్చు. రొమాంటిక్ లవ్‌స్టోరీ మిమ్మల్ని మైమరిచిపోయాలా చేయొచ్చు. ఇలా ఆయా జానర్స్‌కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే వీళ్లందరికీ నచ్చేది ఒకటుంది. అదే 'దేశభక్తి' జానర్. ఎన్నేళ్లు గడుస్తున్నా సరే ఈ తరహా సినిమాలకు ఉన్న డిమాండే వేరు. అయితే అన్నిసార్లు దేశభక్తి.. మన సినిమాను కాపాడిందా? తెలుగులో దేశభక్తి సినిమాలు బోలెడు. వీటిలో ది బెస్ట్ అంటే చాలామంది చెప్పేమాట 'ఖడ్గం'. ఏ ముహుర్తాన కృష్ణవంశీ ఈ మూవీ తీశారో గానీ ఈ జానర్లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసింది. చాలా సరదాగా మొదలై, క్లైమాక్స్ వచ్చేసరికి ఈ సినిమా మీలో ఎక్కడో మూల దాగున్న దేశభక్తిని రగిలిస్తుంది. అలానే 'ఖడ్గం'లోని ప్రతి పాట సినిమాని మరో లెవల్‌కి తీసుకెళ్లింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కమర్షియల్ అంశాలు ఉన్నప్పటికీ.. ఈ సినిమా హిట్ అయిందంటే దానికి ప్రధాన కారణం ఒక్కటే. అదే దేశభక్తి. (ఇదీ చదవండి: 'పోర్ తొళిల్' సినిమా తెలుగు రివ్యూ (ఓటీటీ)) అలానే తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించి, అలరించి ఆకట్టుకున్న దేశభక్తి సినిమాల్లో 'అల్లూరి సీతారామరాజు', 'మేజర్ చంద్రకాంత్', 'ఆర్ఆర్ఆర్' లాంటివి టాప్‌లో ఉంటాయి. వీటిలో ప్రారంభ సన్నివేశం నుంచి దేశభక్తిని ప్రతిబింబించే సీన్సే ఉండటం హైలెట్ అని చెప్పొచ్చు. వీటిల్లో కమర్షియల్ అంశాలున్నప్పటికీ మెయిన్ థీమ్‌ని దర్శకులు మర్చిపోలేదు. దీంతో ఈ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేశాయి. దేశభక్తి పవర్ ఏంటో ప్రూవ్ చేశాయి. ఈ లిస్టులో మేజర్, సైరా తదితర చిత్రాలు కూడా ఉన్నాయి. ఇకపోతే మిగతా భాషల్లో వచ్చిన దేశభక్తి చిత్రాలు మనవాటికి తక్కువేం కాదు. 'భారతీయుడు' దగ్గర నుంచి 'బోర్డర్', 'షేర్షా', 'కేసరి', 'ఉరి', 'ద లెజెండ్ ఆఫ్ భగత్ సింగ్', 'రాజీ'.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత జాబితా ఉంటుంది. అయితే బాక్సాఫీస్ దగ్గర అన్నిసార్లు దేశభక్తి వర్కౌట్ అయిందా అంటే 90 శాతం మాత్రమే అని చెప్పొచ్చు. ఆ 10 శాతం ఎందుకు అని మీరు కోపం తెచ్చుకోవచ్చు. ఆ పాయింటే ఇప్పుడు మాట్లాడుకుందాం. (ఇదీ చదవండి: Jailer Movie Review: 'జైలర్' సినిమా రివ్యూ) దేశభక్తి అనేది కచ్చితంగా హిట్ అయ్యే జానర్ అని చాలామంది దర్శకులు అభిప్రాయం. అయితే ఈ పాయింట్‌తో సినిమాలు తీస్తున్నప్పుడు కొన్నిసార్లు తేడా కొట్టేస్తుంది. అంతెందుకు తెలుగులోనే విక్టరీ వెంకటేశ్ హీరోగా ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు.. 'సుభాష్ చంద్రబోస్' అనే మూవీ తీశారు. బాక్సాఫీస్ దగ్గర ఇది ఫెయిలైంది. బాలకృష్ణ హీరోగా స్టార్ డైరెక్టర్ దాసరి నారాయణరావు.. 'పరమవీరచక్ర' అనే దేశభక్తి సినిమా తీశారు. కానీ ఏం లాభం. ప్రేక్షకులు ఈ రెండు చిత్రాల్ని తిరస్కరించారు. ఓవరాల్‌గా చెప్పేది ఏంటంటే.. ఏ భాషలో అయినా 'దేశభక్తి' సినిమాలకు కొదవలేదు. కాకపోతే ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా సరే ఆయా స్టోరీని సరిగా హ్యాండిల్ చేయాలి. లేదంటే మాత్రం బొక్కబోర్లా పడటం గ్యారంటీ. ఇప్పటివరకు వచ్చినవాటిలో మాత్రం దాదాపుగా 90 శాతం సినిమాలి అద్భుతమైన విజయాల్ని అందుకున్నాయని చెప్పడంలో ఎలాంటి మొహమాటం అక్కర్లేదు. (ఇదీ చదవండి: ‘భోళా శంకర్’ మూవీ రివ్యూ) -
అధికారికంగా ‘అల్లూరి’ జయంతి.. ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
సాక్షి, అమరావతి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవం ఈ నెల 4వ తేదీన అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సోమవారం ఉత్తర్వులిచ్చింది. క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ శాఖల పరిధిలో మంగళవారం అల్లూరి జయంతిని జరపాలని పేర్కొంది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన అధిపతులు, జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముత్యాలరాజు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చదవండి: అప్పటి టీడీపీ ప్రభుత్వం అంటే హెరిటేజ్ ప్రభుత్వమేనా..! -
అల్లూరి 125వ జయంతి వేడుకలకు రాష్ట్రపతి
సాక్షి, హైదరాబాద్: ఈనెల 4న హైదరాబాద్‌లో జరగనున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారని క్షత్రియ సేవా సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పేరిచర్ల నాగరాజు, నడింపల్లి నానిరాజు తెలిపారు. వారు శుక్రవారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఈ వేడుకలను గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉత్సవాలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు హాజరవుతారని తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా అల్లూరి జయంతి వేడుకలను గతేడాది జూలై నుంచి ఈ ఏడాది జూలై వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది భీమవరంలో ప్రధాని మోదీ అల్లూరి కాంస్య విగ్రహావిష్కరణతో సంబరాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. -
అల్లూరి జయంతి వేడుకలకు రాష్ట్రపతి ముర్ము
సాక్షి, హైదరాబాద్: జూలై 4న హైదరాబాద్‌లో జరిగే అల్లూరి సీతారామరాజు 125 జయంతి ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హాజరుకానున్నారు. ఈ మేరకు క్షత్రియ సేవా సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పేరిచర్ల నాగరాజు, నడింపల్లి నాని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇది కూడా చదవండి: నయా ‘అసెంబ్లీ’పై నజర్ -
హైస్పీడ్‌లో వైఎస్సార్ మెడికల్ కాలేజ్ నిర్మాణం.. టార్గెట్ డిసెంబర్..!
సాక్షి, పాడేరు: జిల్లా కేంద్రమైన పాడేరులో చేపట్టిన డాక్టర్ వైఎస్సార్ వైద్య కళాశాల నిర్మాణ పనులు జోరందుకున్నాయి. ఇప్పటికే అన్ని విభాగాలకు సంబంధించి 25 శాతం పనులు పూర్తయ్యాయి. ఇందుకు సుమారు రూ.70 కోట్లు వెచ్చించారు. ఎన్సీసీ నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరుకు పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. చలిగాలులను తట్టుకుంటూనే సుమారు 500 మంది వరకు కూలీలు శ్రమిస్తున్నారు. స్థానిక తలారిసింగి ప్రభుత్వ ఆదర్శ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంతంలో సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో రూ.500 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించడం తెలిసిందే. ఈ నిధుల్లో సగం కేంద్ర ప్రభుత్వం వెచ్చిస్తోంది. మూడు బ్లాక్‌ల్లో పనుల జోరు మెడికల్ కళాశాల నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఇక్కడ పనులపై సీఎం జగన్మోహన్రెడ్డి, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు స్థానిక అధికారులతో సమీక్షిస్తుంటారు. ప్రస్తుతం మెడికల్ కళాశాలకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి భవన నిర్మాణ పనులు చురుగ్గా జరుగుతున్నాయి.ఈ బ్లాక్‌లోని పలు భవన నిర్మాణాలు మూడవ అంతస్తుకు చేరుకున్నాయి. కొన్ని భవనాల నిర్మాణ పనులు మొదటి అంతస్తు దాటాయి. నర్సింగ్ కళాశాల విభాగానికి సంబంధించి ఒక బ్లాక్‌లో భవన నిర్మాణం రెండవ అంతస్తు శ్లాబ్‌కు సిద్ధమైంది. ఇదే బ్లాక్‌లోని పలు భవనాల పనులు పిల్లర్ల స్థాయిలో ఉన్నాయి. ప్రధాన వైద్య కళాశాల బ్లాక్‌కు సంబంధించి ఎన్సీసీ ఇంజనీరింగ్ అధికారులు మరింత దృష్టి పెట్టారు. భూమిని చదును చేసి పిల్లర్లకు బాగా లోతుగా తవ్వే పనులకే చాలా సమయం పట్టింది. ప్రస్తుతం ఆయా పనులన్ని సజావుగా జరగడంతో పిల్లర్ల నిర్మాణాలు చురుగ్గా జరుగుతున్నాయి. గడువులోగా పూర్తి చేస్తాం చలితీవ్రత అధికంగా ఉన్నప్పటికీ ప్రతికూల వాతావరణంలోను నిర్మాణ పనులకు ఇబ్బందులు లేకుండా ఎన్సీసీ సంస్థ పనిచేస్తోంది. నాణ్యతలో రాజీ లేకుండా నిరంతరం తమ ఇంజనీరింగ్ అధికారులు కూడా నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు.నిర్మాణ సామగ్రి శాంపిళ్లను కూడా ల్యాబ్‌ల్లో నాణ్యత నిర్థారణ పరీక్షలు జరిపిస్తున్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈఏడాది డిసెంబర్ నెలాఖరుకు మొత్తం పనులన్నీ పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నాం. శీతాకాలం ముగియగానే పనులు మరింత వేగవంతం చేస్తాం. – డీఏ నాయుడు, ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్, ఏపీఎస్ఎంఐడీసీ. -
AP: ప్రధాని సభకు సర్వసన్నద్ధం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఈ నెల నాలుగో తేదీన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన ఖరారైంది. స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల్లో ఇద్దరూ పాల్గొని అనంతరం జరిగే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. శనివారం ప్రధాన మంత్రి భద్రతా విభాగం, రాష్ట్ర మంత్రులు, సీఎం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్, సీనియర్ ఐఏఎస్ అ«ధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. గన్నవరం నుంచి హెలీకాప్టర్‌లో.. ప్రధాని మోదీ సోమవారం ఉదయం 10.10 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ప్రత్యేక హెలీకాప్టర్‌లో ఉదయం 11 గంటలకు భీమవరానికి చేరుకుంటారు. అనంతరం 34వ వార్డులోని ఏఎస్ఆర్ నగర్ మునిసిపల్ పార్కులో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో సుమారు రూ.3కోట్లతో ఏర్పాటుచేసిన 30 అడుగుల అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోదీ, సీఎం జగన్ ఆవిష్కరిస్తారు. అక్కడ నుంచి బయలుదేరి పెదఅమిరంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌రెడ్డి హాజరుకానున్నారు. పార్టీలకు అతీతంగా జరిగే కార్యక్రమం కావడంతో కేంద్ర సాంస్కృతిక శాఖ సినీ నటుడు చిరంజీవి, టీడీపీ, జనసేన ప్రతినిధులను సభకు ఆహ్వానించింది. మరోవైపు పెదఅమిరంలో 12 ఎకరాల ప్రాంగణంలో బహిరంగ సభ, వేదిక ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. భారీ సభా వేదికతో పాటు ప్రత్యేకంగా గ్యాలరీలు నిర్మించారు. పీఎం, సీఎంల పర్యటన ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎస్పీజీ పహారాలో పెదఅమిరం.. బహిరంగ సభా ప్రాంగణాన్ని ప్రధాని భద్రతా విభాగం ఎస్పీజీ పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుంది. స్థానిక పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఐదు హెలీప్యాడ్లను సభా ప్రాంగణానికి సమీపంలో సిద్ధం చేశారు. 11 పార్కింగ్ ప్రదేశాలు కేటాయించడంతో పాటు ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. రెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏలూరు, పశ్చిమగోదావరి, కాకినాడ ఎస్పీలతో సమన్వయం చేస్తూ డీఐజీ పాలరాజు బందోబస్తు విధుల్లోనే ఉన్నారు. ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు .. పెదఅమిరం సభా ప్రాంగణాన్ని రాష్ట్ర మంత్రులు రోజా, దాడిశెట్టి రాజా, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, సీఎం ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, మాజీ మంత్రి, ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు, జెడ్పీ చైర్మన్ కవురు శ్రీనివాస్, ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, సీనియర్ ఐఏఎస్‌లు గోపాలకృష్ణ ద్వివేది, రజత్‌భార్గవ, కలెక్టర్ ప్రశాంతి పరిశీలించారు. -
15 టన్నుల బరువు.. 30 అడుగుల పొడవు
సాక్షి, భీమవరం: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని జూలై 4న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్కరించే అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చేరుకుంది. పట్టణంలోని 34వ వార్డు ఏఎస్ఆర్ నగర్‌లోని మునిసిపల్ పార్కులో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు రూ.3 కోట్లతో 15 టన్నుల బరువు గల అల్లూరి విగ్రహాన్ని పాలకొల్లు మండలం ఆగర్రు గ్రామానికి చెందిన అల్లూరి సీతారామరాజు సహకారంతో తయారు చేయించారు. అల్లూరి విగ్రహాన్ని ఎత్తులో నిర్మించిన కాంక్రీట్ దిమ్మెపై నిలబెట్టారు. విగ్రహం ఆవిష్కరణ నాటికి పార్క్‌ను అందంగా తీర్చిదిద్దడానికి క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీజీ ఏఐజీ కాగా, ప్రధాన మంత్రి భీమవరం ప్రాంతంలో పర్యటించనున్న నేపథ్యంలో∙ఎస్పీజీ ఏఐజీ హిమాన్షు గుప్త, కేంద్ర కల్చరల్ డైరెక్టర్ అతుల్ మిశ్రా, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ రవిప్రకాష్ హెలీప్యాడ్ స్థలం, బహిరంగ సభ స్థలాలను మంగళవారం పరిశీలించారు. అనంతరం హిమాన్షు గుప్త మాట్లాడుతూ.. ప్రధాని మోదీ పర్యటనకు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఐజీ పాలరాజు, సెక్యూరిటీ ఐజీ శశిధర్‌రెడ్డి, జిల్లా ఎస్పీ యు.రవి ప్రకాష్, ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, కాకినాడ ఎస్పీ రవీంద్రబాబు, కోనసీమ ఎస్పీ సుదీప్‌కుమార్‌రెడ్డి, కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా పాల్గొన్నారు. -
చెత్తకు కొత్త రూపుం...వేస్ట్ క్రాఫ్ట్
సాక్షి, విశాఖపట్నం : మనం రోజూ రకరకాల వస్తువులను ఎడాపెడా వాడేస్తుంటాం.. బోలెడన్ని పదార్థాలు తింటూ ఉంటాం. కానీ.. ఎప్పుడైనా చెత్తగురించి ఆలోచించామా.? రోడ్లపై పడేసిన వస్తువులు, సీసాలు, పాత ఎలక్ట్రానిక్ సామాన్లు.. ఇలా ఒకటేమిటి.? అన్నీ చెత్తని సృష్టించేవే..? వస్తువూ వస్తువూ పోగై.. కొండంత చెత్తగా మారుతూ ప్రపంచానికే సవాల్ విసురుతున్నా.. దాని గురించి మాత్రం ఎప్పుడూ పట్టించుకోం. నగరానికి చెందిన ఓ సంస్థ మాత్రం.. అగ్గిపుల్ల, సబ్బుబిళ్ల.. కాదేదీ పునర్వినియోగానికి అనర్హం అన్నట్లుగా తనదైన శైలిలో వ్యర్థాలకు సరికొత్త అర్థాన్ని చెబుతోంది. జీరో వేస్ట్ నినాదంతో నగరంలోని పలు వ్యర్థాలకు కొత్త రూపునిస్తూ.. ప్రజల్ని చైతన్యవంతులను చేస్తోంది. చీపురు పుల్లల నుంచి.. వలల వరకూ.. గాజువాక ప్రాంతానికి చెందిన గ్రీన్ వేవ్స్ ఎన్విరాన్మెంటల్ సొల్యూషన్స్ సంస్థ.. జీరో వేస్ట్ నినాదంతో ముందుకు వెళ్తోంది. అంటే మనం వాడే ప్రతి వస్తువూ ఏదో ఒక విధంగా.. పునర్వినియోగానికి పనికొస్తుందని సంస్థ భావన. కేవలం భావన మాత్రమే కాదండోయ్.. ఎలా కొత్త రూపాన్ని ఇచ్చి.. పాత వస్తువును ఉపయోగించగలమో చేసి చూపిస్తోంది. చీపురు పుల్లల నుంచి చిరిగిపోయిన చేపల వలల వరకూ.. కాలిపోయిన వైర్ల నుంచి కొబ్బరి చిప్పల వరకూ.. ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి గాజు సీసాల వరకూ.. ప్రతి వస్తువుకూ కొత్తందం తీసుకొస్తోంది. కొబ్బరి చిప్పలతో కళాకృతులు.. మనమంతా కొబ్బరి మాత్రమే తీసుకొని.. చిప్పల్ని బయట పడేస్తాం. ఈ గ్రీన్‌వేవ్స్ సంస్థ ప్రతినిధులు మాత్రం.. అవి కేవలం చిప్పలు మాత్రమే కాదు.. విభిన్న కళాత్మక వస్తువులకు ప్రతిరూపాలని నిరూపిస్తున్నారు. కొబ్బరి చిప్పలతో కాఫీకప్పులు, కీ చైన్లు.. ఎన్ని రకాలుగా తయారు చేశారు. కొత్తగా వచ్చిన కేజీఎఫ్–2 సినిమాకు ప్రతిరూపాన్ని కూడా అచ్చుగుద్దినట్లు తయారు చేసేశారు. అంతేకాదు బుల్లెట్ బండి, దేవుళ్ల ప్రతిమలు, వాచీలు, నైట్ ల్యాంపులు, ఇలా.. ఎన్నో అలంకరణ వస్తువులు తయారు చేస్తున్నారు. (చదవండి: సరదాగా మాట్లాడుకుందామని పిలిచి..) -
అల్లూరిని స్మరించుకోవడం అదృష్టం
సీతమ్మధార (విశాఖ ఉత్తర): అల్లూరిని స్మరించుకోవడం మన అదృష్టమని, దేశ స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. అలాగే అల్లూరితో కలసి బ్రిటీష్ వారితో పోరాటం చేసిన కుటుంబాలను గుర్తించి.. వారి వారసుల పిల్లలకు ప్రైవేట్ సెక్టార్లలో ఉద్యోగాలు కల్పించడంతో పాటు ఇళ్లు నిర్మించి ఇస్తామని కిషన్‌రెడ్డి చెప్పారు. లంబసింగిలో రూ.35 కోట్లతో అల్లూరి మ్యూజియంను ఏడాదిలోపు ఏర్పాటు చేస్తామన్నారు. సీతమ్మధార క్షత్రియ కల్యాణమండపంలో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కిషన్‌రెడ్డి హాజరై అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ అల్లూరి 125వ జయంత్యుత్సవాలను ఈ ఏడాది జూలై 4 నుంచి వచ్చే ఏడాది జూలై 4 వరకు దేశ వ్యాప్తంగా ఏడాదిపాటు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా మాట్లాడుతూ అల్లూరి కేవలం 27 ఏళ్లే జీవించినా 27 తరాలకు గుర్తుండేలా స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. సీఎం జగన్ రాష్ట్రంలోని ఓ జిల్లాకు అల్లూరి సీతారామరాజు జిల్లాగా నామకరణం చేయడం ఆయనకు ఇచ్చిన గౌరవమన్నారు. అల్లూరి తిరిగిన ప్రాంతాలను టూరిజం ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్, నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి, విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్సీలు మాధవ్, వరుదు కల్యాణి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర, నెడ్‌క్యాప్ చైర్మన్ కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర ఉపా«ధ్యక్షుడు పి.విష్ణుకుమార్‌రాజు పాల్గొన్నారు. రావాల్సిన నిధులివ్వండి : మంత్రి రోజా మహారాణిపేట: రాష్ట్రంలో పర్యాటక రంగానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులను వెంటనే మంజూరు చేయాలని మంత్రి ఆర్కే రోజా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరారు. శనివారం పోర్టు గెస్టు హౌస్‌లో కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రోజా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో పిలిగ్రిమ్స్, హెరిటేజ్ డెస్టినేషన్ మ్యూజియం గ్రాంట్స్ మంజూరు చేయాలని కోరుతూ.. డీపీఆర్‌లను కేంద్ర మంత్రికి అందజేశారు. -
బ్రిటిష్ సైన్యానికి పట్టుబడిన చోటే.. 18 అడుగుల అల్లూరి విగ్రహం..
ఒక అల్లూరి మరణిస్తే లక్షల మంది వీరులు పుట్టుకువస్తారు.. వారంతా విప్లవ యోధులుగా మారతారు.. ప్రతి రక్తం బొట్టు ఒక సైనికుడిని తయారు చేస్తుంది.. బ్రిటిష్ సామ్రాజ్యం నేల కూలుతుంది.. మేజర్ గుడాల్‌తో అల్లూరి సీతారామరాజు నిర్భయంగా పలికిన పలుకులివి. ఆ వీరుడు అన్నట్టుగానే అతని మరణం తరువాత దేశంలో స్వాతంత్య్ర పోరాటం నిప్పుకణమై మండింది. లక్షల మంది స్వాతంత్య్ర సమరయోధులు పుట్టుకువచ్చారు. తెల్లవారిని తరిమికొట్టారు. సీతారామరాజును కొయ్యూరు మండలం మంపలో బ్రిటిష్ సైన్యం చుట్టుముట్టి అదుపులోకి తీసుకుంది. ఆ ప్రాంతంలోనే ఆ యోధుడి అధ్యాయం ముగిసింది. అందుకు గుర్తుగా అదే చోట 18 అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తలపెట్టారు. ఆ బృహత్ కార్యక్రమానికి ఆదివారం శంకుస్థాపన జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.. కొయ్యూరు: అది మే నెల ఏడవ తేదీ.. 1924వ సంవత్సరం. ఉదయం ఎనిమిది గంటలకు మంపలో ఉన్న కొలనులో సీతారామరాజు స్నానం చేస్తున్నారు. ఆ ప్రాంతాన్ని బ్రిటిష్ సైన్యం మేజర్ గుడాల్ నేతృత్వంలో చుట్టుముట్టింది. ఆయనే అల్లూరి అని నిర్ధారించుకునేందుకు గుడాల్ ఓ పరీక్ష పెట్టాడు. మరిగే పాలను ఇచ్చినా రామరాజు గటగటా తాగుతారని తెలిసి వేడి పాలను తీసుకువచ్చి తాగించారు. ఆయన ఆ పాలను నీళ్లు మాదిరిగా తాగడంతో అతనే సీతారామరాజని తేలింది. అప్పుడు అల్లూరిని మంపకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజేంద్రపాలేనికి తీసుకువచ్చారు. అక్కడ అతడిని మంచానికి కట్టి మేజర్ గుడాల్ కాల్చి చంపారు. రామరాజు చనిపోయే ముందు పలికిన ఒక్కో మాట తూటాగా పేలింది. వందేమాతరం అంటూ దేశభక్తిని నింపి ప్రాణత్యాగం చేశారు. అక్కడ నుంచి అతని పార్థివ దేహాన్ని కృష్ణాదేవిపేటకు తరలించి అక్కడ అంత్యక్రియలు చేశారు. అల్లూరి మరణించి 98 సంవత్సరాలు కావస్తోంది. జాతీయ అల్లూరి యువజన సంఘం ఆధ్వర్యంలో మంపలో ఆయన పట్టుబడిన కొలను మధ్యలో 18 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటు అల్లూరికి కుడి ఎడమ భుజాలుగా నిలిచిన గాం గంటన్నదొర, మల్లుదొరతోపాటు మరికొందరి విగ్రహాలను ఏర్పాటు చేయనున్నారు. దీని శంకుస్థాపనకు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అరకు ఎంపీ మాధవి, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిలను ఆహ్వానించారు. వేధింపులతో విప్లవానికి నాంది: నాడు రంపుల, చింతపల్లి ఘాట్రోడ్ల నిర్మాణ సమయంలో కూలి విషయంలో బ్రిటిష్ పాలకులు గిరిజనులను వేధించడాన్ని సీతారామరాజు స్వయంగా చూశారు. వారికి జరుగుతున్న అన్యాయంపై అతను సాయుధ పోరాటం మొదలు పెట్టారు. 1922 ఆగస్టులో చింతపల్లి, కృష్ణాదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల స్టేషన్లపై రామరాజు ధైర్యంగా దాడులు చేశారు. పోలీసు రికార్డుల్లో ఆయన పట్టుకువెళ్లిన ఆయుధాలను కూడా నమోదు చేశారు. అతనితో కలిసి పోరాటం చేసిన వారిలో మల్లుదొర, గంటన్నదొరతో పాటు అగ్గిరాజు, యర్రయ్య కూడా కీలకంగా వ్యవహరించారు. మొత్తం 212 మంది ఈ సాయుధ పోరాటంలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. వందలాదిమంది పోలీసులను నియమించినా అల్లూరిని పట్టుకోలేకపోయారు. మంపకు సమీపంలో ఉర్లకొండ వద్ద ఉన్న గృహంలో సీతారామరాజు సమావేశాలు ఏర్పాటు చేసేవారు. అక్కడి నుంచే వ్యూహాలను అమలు చేశారు. ఆ గుహ నుంచి చూస్తే మంప, రేవళ్లు రహదారుల నుంచి ఎవరు వస్తున్నారో స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు గుహ వైపు వచ్చినా తెలిసిపోతుంది. దీంతో దానినే రాజు స్థావరంగా ఎన్నుకున్నారు. ఈ విషయాలను సేకరించిన మేజర్ గుడాల్ మంపలో అల్లూరిని పట్టుకునేందుకు పథకం రచించారు. అల్లూరి విగ్రహం ఏర్పాటు చేసేది ఈ కొలనులోనే.. కొలను చుట్టూ ఇనుప కంచె పెట్టాలి సీతారామరాజు స్మారక ప్రదేశంలో ప్రస్తుతం కొలను వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీని చుట్టూ ఇనుప కంచెను ఏర్పాటు చేయాలి. లేకుంటే పశువులు వచ్చి పాడు చేసే అవకాశం ఉంది. అదే విధంగా స్మారక ప్రాంతంలో మంచి మొక్కలను నాటాలి. గోడలపై సీతారామరాజు జీవిత చరిత్రను చిత్రాల రూపంలో వేయాలి. ఇలా చేస్తే సందర్శకులకు చారిత్రక విషయాలు తెలుస్తాయి. మంచి పర్యాటక ప్రదేశమవుతుంది. – ఇంగువ త్రినాథ్ పడాల్, మంప, సర్పంచ్ అల్లూరి జిల్లాతో నిజమైన నివాళి మన్యం వీరుడు అల్లూరిని పట్టుకున్న మంప, అతడిని కాల్చి చంపిన రాజేంద్రపాలెంతోపాటు కృష్ణాదేవిపేటలో ఉన్న సమాధుల ప్రాంతాన్ని పూర్తిగా పరిరక్షించేందుకు చర్యలు తీసుకోవాలి. మంపకు సమీపంలో ఉన్న ఉర్లకొండ గుహ ఒకప్పుడు అల్లూరి స్థావరంగా ఉండేది. దానిని వెలుగులోకి తీసుకురావాలి. పాడేరు కేంద్రంగా ఏర్పాటు కానున్న జిల్లాకు అల్లూరి పేరు పెట్టడం నిజమైన నివాళి. – పడాల వీరభద్రరావు, జాతీయ అల్లూరి యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు -
అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి వేడుకలు
-
నాడు అర లక్ష..నేడు పది లక్షలు
సాక్షి, విశాఖపట్నం : రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఊరు.. నడయాడిన ప్రాంతాలు.. మన్యం పితూరీ నిర్వహించిన గిరిసీమలు.. చివరికి దేశం కోసం ప్రాణాలర్పించిన పుణ్యభూమి.. అన్నీ మన విశాఖ జిల్లాలోనే ఉన్నాయి. పద్మనాభం మండలం పాండ్రంకిలో జన్మించిన అల్లూరి తెల్లదొరల పాలనకు సమాంతరంగా అఖండ భారతంలోనే తొలిసారి 1920లో పంచాయతీ పాలనను గొలుగొండ మండలం పాతూరు(కృష్ణదేవిపేట– కేడీపేట) నుంచే ప్రారంభించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆయన పార్థివ దేహానికి ఏఎల్‌పురంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అక్కడే ఆయన సమాధితో పాటు అనుచరుల సమాధులూ ఉన్నాయి. దేశ స్వాతంత్య్రం కోసం, గిరిజనుల విముక్తి కోసం బ్రిటీష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఈనెల 4న నిర్వహించేందుకు రూ.10లక్షలు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. దీన్ని రాష్ట్ర వేడుకగా అల్లూరి జన్మస్థలమైన భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం పాండ్రంకిలో, పంచాయతీ పాలనకు శ్రీకారం చుట్టిన నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం కృష్ణదేవిపేటల్లో నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాల అభివృద్ధి మాటేమిటి..? గత టీడీపీ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో అల్లూరి నడయాడిన ప్రాంతాల అభివృద్ధికి లెక్కలేనన్ని హామీలిచ్చి.. అన్నింటినీ విస్మరించింది. కానీ అల్లూరి నడయాడిన సీమలోనే తొలి అడుగు వేయడం ద్వారా జిల్లాలో చారిత్రక ప్రజాసంకల్పయాత్రకు శ్రీకారం చుట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి.. నేడు ప్రభుత్వాధినేతగా ఆ మహనీయుడి జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని నిర్ణయించారు. పాలనాపరమైన అనుమతులిచ్చారు.ఇక్కడ ప్రస్తావించాల్సిన విశేషం ఏమిటంటే.. గత ఏడాది టీడీపీ ప్రభుత్వం ఇదే అల్లూరి జయంతికి విడుదల చేసిన సొమ్ము ఎంతో తెలుసా?.. కేవలం రూ.50 వేలు!.. ఇప్పటి ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం ఏకంగా రూ. 10 లక్షలు.. నాడు నివాళులే.. నిధుల్లేవు అల్లూరి సీతారామరాజు జయంతి, వర్ధంతుల సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఫొటోల కోసం, ప్రచారం కోసం ‘ఘనమైన’ నివాళులర్పించడం.. ఆ తర్వాత పట్టించుకోకపోవడం గత ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో తంతుగా నడిచింది. యాధృచ్ఛికమే కావొచ్చు గానీ.. చారిత్రక స్థలాలైన అల్లూరి పుట్టిన ఊరు, సమాధి ఉన్న ప్రాంతాలు గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా చెలామణీ అయిన గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహించిన నియోజకకవర్గాల్లోనే ఉన్నాయి. అల్లూరి జన్మస్థలమైన పాండ్రంకి మంత్రిగా గంటా ప్రాతినిధ్యం వహించిన భీమిలిలో ఉంటే.. అల్లూరి నడయాడిన ప్రాంతాలు, పంచాయతీ పాలనకు శ్రీకారం చుట్టిన పాతూరు(కేడీపేట), ప్రాణాలొదిలిన ప్రాంతం, సమాధులు.. అన్నీ నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండలో ఉన్నాయి. వీటన్నింటినీ అభివృద్ధి చేస్తామని ఐదేళ్ల క్రితం అప్పటి టీడీపీ సర్కారు ఎన్నో హామీలిచ్చింది. కృష్ణదేవిపేట (పాతూరు) మొదలు కొంకసింగి, నాగాపురం, ఏఎల్‌పురం గ్రామాల రూపురేఖలు మార్చేస్తామని 2014లో ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడు హామీ ఇచ్చారు. అరకు, చింతపల్లి, లంబసింగితో పాటు టూరిజం ప్యాకేజీలో కేడీ పేటలోని అల్లూరి పార్కును చేర్చి అభివృద్ధి చేస్తామన్నారు. పార్కులో 24 గంటలూ విద్యుత్ సౌకర్యం, సోలార్ వెలుగులు ఏర్పాటు చేస్తామని, మ్యూజియం, గ్రంధాలయం, అల్లూరి 12 అడుగుల కాంస్య విగ్రహం, సమావేశ మందిరం, రూ.5 లక్షలతో సభా వేదిక ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. ఇక మంత్రి హోదాలో దత్తత తీసుకున్న ఏఎల్‌పురం(అల్లూరి సమాధులున్న గ్రామం) పరిస్థితీ అంతే. ఇక్కడ అండర్ డ్రైనేజీ, ఎల్ఈడీ బల్బులు, ప్రతి ఇంటికి తాగునీరు, మరుగుదొడ్లు, సీసీ రోడ్లు, విద్య, వైద్యం, పశువైద్య కేంద్రం, ఆయుర్వేద ఆస్పత్రికి కొత్తభవనం ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. కానీ ఏ ఒక్క హామీ నెరవేరలేదు. అంతెందుకు.. కనీసం అల్లూరి జయంతి కార్యక్రమానికి కూడా సరిగ్గా నిధులు విడుదల చేయని గత ప్రభుత్వ నిర్వాకంతో అధికారులు అల్లాడిపోయేవారు. గత ఏడాది కేవలం రూ.50వేలు విడుదల చేసి ఆర్భాటాలో హడావుడి చేయాలని అప్పటి పాలకులు ఆదేశించడంతో.. నానా పాట్లు పడి రెండులక్షలు ఖర్చు చేశామని ఓ అధికారి చెప్పుకొచ్చారు. రాష్ట్ర వేడుకగా అల్లూరి జయంతి :మంత్రి అవంతి తెలుగువాడి పౌరుషానికి ప్రతీక అయిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహిస్తాం. మహనీయుడి పోరాట స్ఫూర్తిని నలుదిశలా చాటేలా ఘనంగా నిర్వహిస్తాం. అల్లూరి నడయాడిన చారిత్రక ప్రాంతాలను పర్యాటక స్థలాలుగా తీర్చిదిద్దుతాం. ఇందుకోసం ఎంతైనా ఖర్చుకైనా వెనుకాడం. ఇందుకోసం పర్యాటక శాఖామంత్రిగా మరింత చొరవ తీసుకుంటాను. ఇక అల్లూరి జయంతి రోజైన ఈనెల 4వ తేదీ గురువారం పాండ్రంకిలో అల్లూరి ఉత్సవ ర్యాలీలు, గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. ఆ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నా: ఎమ్మెల్యే గణేష్ నర్సీపట్నం: జిల్లాలో అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను. టీడీపీ పాలకుల మాదిరిగా మాటలతో సరిపెట్టను. అల్లూరి జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేందుకు పది లక్షలు విడుదల చేయడంతోనే ఆ మహనీయుడికి తమ ప్రభుత్వం ఎంత గౌరవం ఇస్తుందో అర్ధం చేసుకోవచ్చు. కృష్ణదేవిపేటలో అల్లూరి స్మారక మందిరాన్ని మరింత అభివృద్ధి చేస్తా. దాంతో పాటు పార్కును అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా. పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సహకారంతో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా. ఈ నెల 4న అల్లూరి జయంతిని ఘనంగా నిర్వహించాలని ఆర్డీవో ఆర్.గోవిందరావుకు సూచిం చాం. అల్లూరి అనుచరుడు గంటందొర కుటుంబ సభ్యులను సత్కరించాలని, జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించాం. -
ఘనంగా మన్యం వీరుడి జయంతి ఉత్సవాలు
సాక్షి, విశాఖపట్నం : మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలను జూలై 4వ తేదీన విశాఖలో ఘనంగా నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. కొత్త జిల్లా ఏర్పడితే దానికి అల్లూరి పేరు పెడతామని హామీ అన్నారు. జిల్లాలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు ఆర్జీఎల్ విత్తనాల కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువుల బెడద లేకుండా చర్యలు చేపట్టామని వెల్లడించారు. సాగు, తాగు నీటి అవసరాలపై ప్రత్యేక దృష్టి సారించి విశాఖ జిల్లాలో వెయ్యి కోట్ల రూపాయలతో డీపీఆర్ సిద్దం చేస్తున్నట్టు పేర్కొన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసాను తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని స్పష్టం చేశారు. అమ్మ ఒడి పథకం ప్రైవేటు స్కూళ్లకు కూడా వర్తించడం పట్ల దురుద్దేశాలు ఆపాదించవద్దన్నారు. ప్రైవేటు స్కూళ్లు వసూలు చేసే ఫీజులకు తాము వ్యతిరేకమని.. అందులో చదివే విద్యార్థులకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ఫీజు నియంత్రణ కమిటీ తీసుకువచ్చి తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని తొలగిస్తామని అన్నారు. -
నిజమైన యోధుడు
మన్యంలో జరుగుతున్న తెల్లదొరల అకృత్యాలకు నిరసనగా విప్లవ బావుటా ఎగరవేసిన అల్లూరి సీతారామరాజు పోరాట గాథ ‘సీతారామరాజు’ పేరుతో తెరకెక్కనుంది. ఉపశీర్షిక ‘ఎ ట్రూ వారియర్’. ‘సొంత ఊరు, గంగపుత్రులు, గల్ఫ్, రొమాంటిక్ క్రైమ్ కథ, క్రిమినల్ ప్రేమ కథ’ వంటి చిత్రాలను తెరకెక్కించిన పి. సునీల్ కుమార్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. డా. శ్రీనివాస్ నిర్మించనున్న ఈ సినిమా మార్చిలో స్టార్ట్ కానుంది. ‘‘యువతకి స్ఫూర్తి నింపేలా, అల్లూరిత్యాగం, కీర్తిని మరింత ఇనుమడింపజేసేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు దర్శక– నిర్మాతలు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: యెక్కలి రవీంద్రబాబు, డా.ఎల్.ఎన్.రావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాపిరాజు. -
త్వరలో అల్లూరి బయోపిక్
ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో బయోపిక్‌ల సీజన్ నడుస్తోంది. మహానటి ఘనవిజయం సాధించటంతో సౌత్‌లోనూ ఈ హవా కనిపిస్తోంది. ఇదే బాటలో మరో చారిత్రక వీరుడి కథను వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు. మన్యం వీరుడిగా బ్రిటీష్ పాలకులను గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు జీవితకథను మరోసారి వెండితెర మీద ఆవిష్కరించేందుకు రెడీ అవుతున్నారు. గంగపుత్రులు లాంటి అవార్డ్విన్నింగ్ సినిమాతో పాటు రొమాంటిక్ క్రైమ్ కథ లాంటి కమర్షియల్ సక్సెస్‌ను అందించిన పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో అల్లూరి బయోపిక్ తెరకెక్కనుంది. సీతారామరాజు అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాను రిసాలి ఫిల్మ్ అకాడమీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ కృష్ణ అద్భుతమైన నటనతో అల్లూరి పాత్రకు ప్రాణం పోసిన తరువాత ఎవరు ఆ పాత్రలో కనిపించే సాహసం చేయలేదు. మరి ఇప్పుడు సునీల్ కుమార్ రెడ్డి సీతారామరాజులో అల్లూరి గా ఎవరు కనిపిస్తారో చూడాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమాకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. సినిమాను మార్చిలో ప్రారంభించి ఆగస్టులో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.