అల్లూరి 125వ జయంతి వేడుకలకు రాష్ట్రపతి  | President to attend Alluri Sitaramarajus 125th birth anniversary celebrations | Sakshi

అల్లూరి 125వ జయంతి వేడుకలకు రాష్ట్రపతి 

Jul 1 2023 4:10 AM | Updated on Jul 1 2023 10:14 AM

President to attend Alluri Sitaramarajus 125th birth anniversary celebrations - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 4న హైదరాబాద్‌లో జరగనున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారని క్షత్రియ సేవా సమితి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పేరిచర్ల నాగరాజు, నడింపల్లి నానిరాజు తెలిపారు. వారు శుక్రవారం హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఈ వేడుకలను గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు.

ఉత్సవాలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు హాజరవుతారని తెలిపారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా అల్లూరి జయంతి వేడుకలను గతేడాది జూలై నుంచి ఈ ఏడాది జూలై వరకు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది భీమవరంలో ప్రధాని మోదీ అల్లూరి కాంస్య విగ్రహావిష్కరణతో సంబరాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement