సాక్షి, అమరావతి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవం ఈ నెల 4వ తేదీన అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సోమవారం ఉత్తర్వులిచ్చింది.
క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ శాఖల పరిధిలో మంగళవారం అల్లూరి జయంతిని జరపాలని పేర్కొంది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన అధిపతులు, జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముత్యాలరాజు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
చదవండి: అప్పటి టీడీపీ ప్రభుత్వం అంటే హెరిటేజ్ ప్రభుత్వమేనా..!
Comments
Please login to add a commentAdd a comment