Officially
-
హమాస్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అర్జెంటీనా
అర్జెంటీనా తాజాగా హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంతో పాటు దాని ఆర్థిక మూలాలను జప్తు చేయాలని అధికారులను ఆదేశించింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో తమ దేశ సంబంధాలను బలోపేతం చేసేదిశగా యోచిస్తున్న అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మెయిలీ ఈ విధమైన ప్రకటన చేశారు.గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో పాలస్తీనా గ్రూపు జరిపిన దాడిని అర్జెంటీనా ఖండించింది. ఇజ్రాయెల్ 76 ఏళ్ల చరిత్రలో ఈ దాడి మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఆర్జెంటీనా దేశంలోని యూదులు ఉంటున్న ప్రాంతాలపై హమాస్ ఉగ్రదాడులు చేసిందని, ఈ సంస్థకు ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయని అర్జెంటీనా ఆరోపించింది.ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ తరచూ హమాస్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. గాజాలో జరిగిన ఈ దాడుల్లో 70 మందికి పైగా పాలస్తీనియన్లు మృతిచెందారు. హమాస్ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఇజ్రాయెల్ ఇక్కడి ప్రజలను ఊచకోత కోస్తున్నది ఆరోపించారు. తూర్పు గాజా నగరంలోని వేలాది మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ దళాలు పశ్చిమ, దక్షిణ ప్రాంతాలకు తరిమికొట్టాయని, అయితే వారు అక్కడికి రాగానే వారిపై కాల్పులు జరిపారని హమాస్ ప్రభుత్వ మీడియా కార్యాలయం డైరెక్టర్ జనరల్ ఇస్మాయిల్ అల్ తౌబ్తా పేర్కొన్నారు.పాలస్తీనియన్లంతా గాజా సిటీని ఖాళీ చేసి దక్షిణం వైపు వెళ్లాలని ఇటీవల ఇజ్రాయెల్ ఆర్మీ ఆదేశించింది. ఇజ్రాయెల్ దళాలు గాజా నగరంలో హెచ్చరికల కరపత్రాలను జారవిడిచాయి. అక్కడి ప్రజలంతా దక్షిణం వైపుకు వెళ్లాలని దానిలో కోరాయి. -
అధికారికంగా ‘అల్లూరి’ జయంతి.. ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
సాక్షి, అమరావతి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవం ఈ నెల 4వ తేదీన అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు సోమవారం ఉత్తర్వులిచ్చింది. క్షేత్ర స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ శాఖల పరిధిలో మంగళవారం అల్లూరి జయంతిని జరపాలని పేర్కొంది. ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు చెందిన అధిపతులు, జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ముత్యాలరాజు జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చదవండి: అప్పటి టీడీపీ ప్రభుత్వం అంటే హెరిటేజ్ ప్రభుత్వమేనా..! -
5G: ఎయిర్టెల్, జియో కీలక నిర్ణయం: చైనాకు షాక్!
సాక్షి, ముంబై: దేశంలో 5జీ సేవలను అందించేందుకు సంబంధించిన 5G నెట్వర్క్ స్పెక్ట్రమ్ వేలం మూడో రోజు విజయవంతంగా కొనసాగుతోంది. మరోవైపు దేశీయ దిగ్గజ కంపెనీలు ఎయిర్టెల్, జియో చైనా కంపెనీలతో భాగస్వామ్యాన్ని క్యాన్సిల్ చేసుకోవడంతో చైనాకు ఇక తలుపులు మూత పడ్డాయని వాణిజ్య వర్గాలు భావిస్తున్నాయి. అత్యంత వేగవంతమైన 5జీ టెలికం సేవలకవసరమైన స్పెక్ట్రంను కేటాయింపుల వేలంలో టెల్కోలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. రెండో రోజు (బుధవారం) ముగిసేసరికి తొమ్మిది రౌండ్లు పూర్తి కాగా రూ. 1.49 లక్షల కోట్ల విలువ చేసే బిడ్లు వచ్చిన సంగతి తెలిసిందే. వేలం ప్రక్రియ మూడో రోజు నేడు (గురువారం) కూడా కొనసాగనున్నట్లు టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. బుధవారం బిడ్డింగ్ ముగిసే సమయానికి జియో రూ. 82,500 కోట్లకు దాదాపు 46,000 కోట్లతో ఎయిర్టెల్, రూ. 19,000 కోట్లతో వొడాఫోన్ ఐడియా బిడ్డింగ్ చేయగా, కొత్తగా వచ్చిన అదానీ డేటా నెట్వర్క్స్ హై బ్యాండ్ స్పెక్ట్రమ్ కోసం దాదాపు రూ.900-1,000 కోట్లకు బిడ్ చేసింది. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ప్రత్యర్థులకు గట్టిపోటీ ఇచ్చేలా 700 GHz బ్రాండ్‌ను కొనుగోలు చేయగల ఏకైక టెలికాం జియో మాత్రమేనని విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపు 5జీ సేవలకు సంబంధించి జియో ఎయిర్టెల్ భాగస్వామ్యాలు విశేషంగా నిలిచాయి. టెలికాం కంపెనీల 5జీ పార్టనర్షిప్స్ జియో, ఎయిర్టెల్ ఫిన్లాండ్కు చెందిన నోకియా, స్వీడన్‌కు చెందిన ఎరిక్సన్, కొరియాకు చెందిన శాంసంగ్‌లకు కాంట్రాక్టుల భాగస్వామ్యాల్ని కుదుర్చుకున్నాయి. తద్వారా 5జీ సేవల విషయంలో చైనా కంపెనీలు,హువావే, జెడ్‌టీఈలకు మన దేశంలో అధికారికంగా తలుపులు మూసేసినట్టైంది. కాగా 5జీసేవలు ఈ ఏడాది అక్టోబర్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఆగస్టు 14 తర్వాత ప్రభుత్వం స్పెక్ట్రమ్‌ను ఆయా కంపెనీలకు కేటాయించనుంది. -
రియో డీజనిరియోలో కేక పుట్టించిన కర్నివాల్
-
త్యాగధనులను స్మరించుకుందాం
మజ్లీస్ చేతిలో కీలుబొమ్మగా ప్రభుత్వం బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి ధ్వజం బోధన్: దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన త్యాగధనులను స్మరించుకుంటూ, వారు చూపిన బాటలో నడుద్దామని బీజేపీ శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మజ్లీస్ చేతిలో టీఆర్ఎస్ సర్కారు కీలుబొమ్మగా మారిందని, అందుకే తెలంగాణ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వం అధికారికంగా విమోజన దినోత్సవాలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆదివారం బోధన్‌లో నిర్వహించిన తిరంగ యాత్ర ర్యాలీలో కిషన్‌రెడ్డి మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వారిని స్మరిస్తూ, వారి త్యాగాలను భావితరాలకు చాటిచెప్పాలనే లక్ష్యంతోనే తిరంగ యాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. మజ్లీస్ ప్రభావంతోనే.. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తున్నాయని, కానీ ఉమ్మడి రాష్ట్రం నుంచి గత ప్రభుత్వాలు ఇక్కడ విమోచన దినోత్సవాన్ని నిర్వహించేడం లేదన్నారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు ఎంఐఎంతో పొత్తు పెట్టుకొని, విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలోనైనా అధికారికంగా నిర్వహిస్తారని భావిస్తే.. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా పాత ప్రభుత్వాల బాటలోనే నడుస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం మజ్లీస్ పార్టీ నేతలను భుజాన మోస్తోందని, ఆ పార్టీ కనుసన్నల్లోనే పాలన సాగుతోందని ఆరోపించారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. మాట తప్పిన కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఉద్యమ సమయంలో డిమాండ్ చేసిన సీఎం కెసీఆర్ అధికారంలోకి రాగానే మాట మార్చారని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎం.. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా అడ్డు పడుతోందన్నారు. తెలంగాణకు ప్రత్యేక చరిత్ర ఉందని, నిజాం నిరంకుశ పాలన, రజకార్ల అకృత్యాలకు వందలాది మంది తెలంగాణ ప్రజలు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. వందలాది మంది త్యాగల చరిత్ర కలిగిన సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ నెల 17న వరంగల్‌లో విమోదచన దినోత్సవ సభ తలపెట్టామని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరవుతారని తెలిపారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, మాజీ మంత్రి నేరేళ్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, నేతలు అడ్లూరి శ్రీనివాస్, మురళీధర్‌గౌడ్, నర్సింహారెడ్డి, ఉమాశంకర్, శివప్ప, సుభాష్, బాపురెడ్డి, లింగం, రాజు, రామరాజు తదితరులు పాల్గొన్నారు. -
‘విమోచన’ను అధికారికంగా నిర్వహించాలి
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి తహసీల్దార్‌కు వినతిపత్రం ఘట్కేసర్ టౌన్: నిరంకుశ నిజాం పాలన నుంచి విముక్తి లభించిన సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం తహసీల్దార్ విష్ణువర్ధన్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినాన్ని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలన్నారు. దీనిపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతు చించుకున్న సీఎం కేసీఆర్‌కు.. అధికారంలోకి రాగానే ఈ విషయాన్ని మర్చిపోయారా అని ప్రశ్నించారు. దేశమంతా స్వాతంత్ర్యం సంబరాల్లో మునిగి తేలుతుంటే నియంత నిజాం మాత్రం ప్రజల మనోభావాలను అణగదొక్కాడన్నారు. మతోన్మాద ఖాసీం రజ్వీ నేతృత్వంలోని రజాకార్లు ప్రజలపై అఘాయిత్యాలు చేసి హైదరాబాద్ సంస్థానానికి తానే రాజునని ప్రకటించుకున్నాడన్నారు. ప్రజలపై జరుగుతున్న అకృత్యాలు, అత్యాచారాలు పెరిగిపోవడంతో అప్పటి కేంద్రం హోంమంత్రి సర్దార్ వల్లబాయ్ పటేల్ చొరవ తీసుకొని భారత సైనిక దళాలను పంపి హైదరాబాద్ సంస్థానాన్ని విముక్తి చేశారని గుర్తు చేశారు. భారతదేశానికి ఆగస్టు 15, 1947న స్వాతంత్ర్యం లభిస్తే.. హైదరాబాద్ సంస్థానంలో ఉన్న తెలంగాణ ప్రజలకు 17 సెప్టెంబర్ 1948న నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిందన్నారు. తెలంగాణతో పాటు విముక్తి లభించిన మహరాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని 8 జిల్లాలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విమోచన దినోత్సవాలను నిర్వహిస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించక పోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వమే అధికరకారికంగా విమోచన దినాన్ని నిర్వహించాలని, తెలంగాణ చర్రిత, తెలంగాణ వీరుల జీవిత విశేషాలను పాఠ్యాంశాలుగా పెట్టాలని, తెలంగాణ త్యాగధనుల స్వస్థలాల్లో స్ఫూర్తి కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు కంభం లక్ష్మారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గుండ్ల బాల్రాజ్ముదిరాజ్, గిరిజన మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంపీటీసీ బిక్కునాయక్, ఎంపీటీసీ కరుణాకర్, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు ఎదుగిన శ్రీరాములు, గొంగల్ల రమేష్, రాష్ట్ర నాయకుడు అచ్చిన నర్సింహ్మ, బీజేవైఎం మండల అధ్యక్షుడు పసులాది చంద్రశేఖర్‌ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి రాంరతన్శర్మ, సగ్గు మోహన్రావ్, రఘువర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. -
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
చింతపల్లి ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కళ్యాణ్‌నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరంగా యాత్ర విజయవంతానికి బీజేపీ శ్రేణులు కృషి చేయాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.సమావేశంలో బీజేపీ మండల అధ్యక్షుడు కుకుడపు రామకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, శంకర్, నగేష్, పర్వతాలు, సైదులు, విక్రమ్, ధన్‌రాజ్ ఉన్నారు. -
విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలి
బీజేపీ రాష్ర్ట కార్యవర్గసభ్యుడు కంజర్ల ప్రకాశ్ షాబాద్: తెలంగాణ విమోచనదినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ర్ట కార్యవర్గసభ్యుడు కంజర్ల ప్రకాశ్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం బీజేపీ మండల ప్రధాన కార్యదర్శిగా నరేందర్‌రెడ్డి, బీజేవైఎం మండల అధ్యక్షుడిగా వెంకటేష్‌ను నియమిస్తూ నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 17న రాష్ర్ట ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ విమోచన దినాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని సూచించారు. కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. కిసాన్ రైతు సంఘం చేవెళ్ల నియోజకవర్గ అధ్యక్షుడు కాల్వ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ... జిల్లాలో పార్టీని తిరుగులేని శక్తిగా ఎదిగేందుకు కృషి చేస్తామన్నారు. సమావేశంలో పార్టీ చేవెళ్ల అసెంబ్లీ కన్వీనర్ జంగారెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి రాము, నాయకులు వెంకట్‌రెడ్డి, శ్రీరామ్, శ్రీశైలం, సురేష్‌గౌడ్, ఆనంద్ పాల్గొన్నారు. -
సల్మాన్ అధికారికంగా ప్రకటిస్తాడట!
ముంబై: తన పెళ్లిగోల మీద ఇంతవరకు పెదవి విప్పకుండా మౌనంగా ఉన్న బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎట్టకేలకు ఒక ప్రకటన చేయనున్నాడట. తన విదేశీప్రియురాలు, రష్యా మోడల్ లులియా వంతూర్ ప్రేమకథ స్టోరీలకు త్వరలోనే శుభం కార్డు వేయనున్నాడట ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. తమ బాంధవ్యాన్ని అధికారికంగా ప్రకటించి, లులియాను అందరికీ పరిచయం చేయనున్నట్టు సమాచారం. అదీ బాలీవుడ్ సుందరి వెడ్డింగ్ రిపెప్షన్ లో. డీఎన్ఎ కథనం ప్రకారం సొట్టబుగ్గల సుందరి ప్రీతి జింటా వివాహ రిసెప్షన్ లో సల్మాన్ ఖాన్ అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నాడని తెలుస్తోంది. సల్మాన్ అధికారికంగా లులియాను సినీ పరిశ్రమకు, స్నేహితులకు పరిచయం చేయనున్నట్టు సమాచారం. ఈ మధ్య లులియా సల్మాన్ , ఆయన కుటుంబ సభ్యులతో ముంబై ఎయిర్ పోర్ట్ లో సందడి చేయడం విశేషంగా మారింది. ఈ ఏడాది చివరలో ఆమెను సల్మాన్ పెళ్లి చేసుకోవడం ఖాయమనే వార్త బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. కాగా ఇటీవలే దంపతులుగామారిన ప్రీతి , జీన్ గుడెనఫ్ బి- టౌన్ పెద్దలు, స్నేహితులకు ముంబైలో గ్రాండ్ గా రిసెప్షన్ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇండియాకు చేరుకున్న ఈ జంట ఢిల్లీలోని ప్రేమ మందిరం తాజ్ మహల్ దగ్గర సందడి చేసింది. -
మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్ 360 కనుమరుగు!
బెంగళూరు: మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ మార్కెట్ లో స్థాన బలం సంపాదించేందుకు ఎంతగానో సహకరించిన, అత్యంత ప్రజాదరణ పొందిన ఎక్స్ బాక్స్ 360 వీడియో గేమ్ కన్సోల్ ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. 2005 లో ఉత్పత్తి ప్రారంభమైనప్పటినుంచీ ఈ కన్సోల్ లో 80 మిలియన్ల యూనిట్ల కంటే అధికంగా అమ్ముడయ్యాయి. మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్ 360.. కినెక్ట్ మోషన్ సెన్సింగ్ గేమ్ డివైజ్ ను కూడా పరిచయం చేసింది. 2013 లో ఎక్స్ బాక్స్ వన్ ప్రారంభమయ్యే వరకు ఇది సంస్థ యొక్క ప్రాథమిక గేమింగ్ కన్సోల్ గానే ఉంది. ఎక్స్ బాక్స్ 360 తో పాటు... 'కాల్ ఆఫ్ డ్యూటీ 2' గా పిలిచే యాక్టివిజన్ బ్లిజార్డ్ ఇంక్స్, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ ఇంక్స్ వంటి ఎన్నో ప్రముఖమైన వీడియోగేమ్స్ ప్రారంభించారు. ఇకపై కన్సోల్స్ అమ్మకాలు కొనసాగిస్తూనే, వినియోగదారులకు కంపెనీ మద్దతుగా నిలుస్తుందని మైక్రోసాఫ్ట్ తన బ్లాగ్ పోస్ట్ లో తెలిపింది. సంస్థ యొక్క ఆన్ లైన్ మల్టీ ప్లేయర్ గేమింగ్ వ్యవస్థ ఎక్స్ బాక్స్ లైవ్ నెట్ వర్క్ మాత్రం ఎక్స్ బాక్స్ 360 కోసం అందుబాటులో ఉంటుందని తెలిపింది. పాతతరపు కన్సోళ్ళు ఎక్స్ బాక్స్ 360, సోనీ ప్లే స్టేషన్ 3 వంటి అమ్మకాలను తగ్గించడంతో కస్టమర్లు కంపెనీ అందించే నూతన సంస్కరణలకు మారాలని సూచిస్తోంది. పదేళ్ళకు పైగా వస్తు ఉత్పత్తుల్లో వెనుకంజ వేయకుండా ప్రయాణించిన తమకు... ఓ వస్తువు తయారీ భీతిని కలిగించిందని మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్ డివిజన్ అధిపతి ఫిల్ స్పెన్సర్ తెలిపారు. వినియోగదారులు గేమ్స్ ప్లే చేసుకునేందుకు అనువుగా ఉండే ఎక్స్ బాక్స్ 360 ఆధునిక కన్సోల్ ను ఇప్పటికే సంస్థ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. బ్యాక్ వార్డ్ కంపాటబిలిటీ సౌకర్యంతో మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం వినియోగదారులకోసం 100 వరకూ వీడియో గేమ్స్ అందుబాటులోకి తెచ్చినట్లు.. ఫిల్ వివరించారు.