హమాస్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అర్జెంటీనా | Argentina Officially Designates Hamas As A Terrorist Organization In Show Of Support For Israel | Sakshi
Sakshi News home page

హమాస్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అర్జెంటీనా

Published Sat, Jul 13 2024 1:30 PM | Last Updated on Sat, Jul 13 2024 1:47 PM

Argentina Officially Designates Hamas Terrorist Organization

అర్జెంటీనా తాజాగా హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంతో పాటు దాని ఆర్థిక మూలాలను జప్తు చేయాలని అధికారులను ఆదేశించింది. అమెరికా, ఇజ్రాయెల్‌తో తమ దేశ సంబంధాలను బలోపేతం చేసేదిశగా యోచిస్తున్న అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మెయిలీ ఈ విధమైన ప్రకటన చేశారు.

గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో పాలస్తీనా గ్రూపు జరిపిన దాడిని  అర్జెంటీనా ఖండించింది. ఇజ్రాయెల్ 76 ఏళ్ల చరిత్రలో ఈ దాడి మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఆర్జెంటీనా దేశంలోని యూదులు ఉంటున్న ‍ప్రాంతాలపై హమాస్‌ ఉగ్రదాడులు చేసిందని, ఈ సంస్థకు ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలున్నాయని అర్జెంటీనా ఆరోపించింది.

ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ తరచూ హమాస్‌ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. గాజాలో జరిగిన ఈ దాడుల్లో 70 మందికి పైగా పాలస్తీనియన్లు మృతిచెందారు. హమాస్ ప్రతినిధి ఒకరు మీడియాతో మాట్లాడుతూ ఇజ్రాయెల్ ఇక్కడి  ప్రజలను ఊచకోత కోస్తున్నది ఆరోపించారు. తూర్పు గాజా నగరంలోని వేలాది మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ దళాలు పశ్చిమ, దక్షిణ ప్రాంతాలకు తరిమికొట్టాయని, అయితే వారు అక్కడికి రాగానే వారిపై కాల్పులు జరిపారని హమాస్ ప్రభుత్వ మీడియా కార్యాలయం డైరెక్టర్ జనరల్ ఇస్మాయిల్ అల్ తౌబ్తా పేర్కొన్నారు.

పాలస్తీనియన్లంతా గాజా సిటీని ఖాళీ చేసి దక్షిణం వైపు వెళ్లాలని ఇటీవల ఇజ్రాయెల్ ఆర్మీ ఆదేశించింది. ఇజ్రాయెల్ దళాలు గాజా నగరంలో హెచ్చరికల కరపత్రాలను జారవిడిచాయి. అక్కడి ప్రజలంతా దక్షిణం వైపుకు వెళ్లాలని దానిలో కోరాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement