
రెండో బిడ్డకు స్వాగతం పలికినట్లు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించాడు

తన భార్య రితికా సజ్దే తమ రెండో సంతానానికి జన్మనిచ్చినట్లు శనివారం అధికారికంగా ప్రకటించాడు

నవంబరు 15, 2024 అనే డేట్‌తో తమ కుటుంబంలో ఇప్పుడు నలుగురం ఉన్నామంటూ రోహిత్ ఫొటో షేర్ చేశాడు

2015, డిసెంబరు 13న రోహిత్ శర్మ రితికా సజ్దే వివాహం జరిగింది

రోహిత్- రితికాలకు తొలి సంతానంగా కుమార్తె సమైరా శర్మ 2018, డిసెంబరు 30న జన్మించింది

తాజాగా వీరు మరో సంతానానికి జన్మనివ్వగా.. సమైరాకు అక్కగా ప్రమోషన్ వచ్చింది

ఇక రోహిత్ శర్మ త్వరలోనే ఆస్ట్రేలియాకు బయల్దేరనున్నాడు. కంగారూ జట్టుతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో పాల్గొనున్నాడు.
















