మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్ 360 కనుమరుగు! | Microsoft Officially Kills Xbox 360 | Sakshi
Sakshi News home page

మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్ 360 కనుమరుగు!

Published Thu, Apr 21 2016 6:48 PM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్ 360 కనుమరుగు! - Sakshi

మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్ 360 కనుమరుగు!

బెంగళూరు: మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ మార్కెట్ లో స్థాన బలం సంపాదించేందుకు  ఎంతగానో సహకరించిన, అత్యంత ప్రజాదరణ పొందిన ఎక్స్ బాక్స్ 360 వీడియో గేమ్ కన్సోల్ ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది.  2005 లో ఉత్పత్తి  ప్రారంభమైనప్పటినుంచీ  ఈ కన్సోల్ లో 80 మిలియన్ల యూనిట్ల కంటే  అధికంగా అమ్ముడయ్యాయి.  

మైక్రోసాఫ్ట్  ఎక్స్ బాక్స్ 360.. కినెక్ట్ మోషన్ సెన్సింగ్ గేమ్ డివైజ్ ను కూడా పరిచయం చేసింది. 2013 లో ఎక్స్ బాక్స్ వన్ ప్రారంభమయ్యే వరకు ఇది సంస్థ యొక్క ప్రాథమిక గేమింగ్ కన్సోల్ గానే ఉంది. ఎక్స్ బాక్స్ 360 తో పాటు... 'కాల్ ఆఫ్ డ్యూటీ 2'  గా పిలిచే యాక్టివిజన్ బ్లిజార్డ్ ఇంక్స్, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ ఇంక్స్ వంటి ఎన్నో ప్రముఖమైన  వీడియోగేమ్స్  ప్రారంభించారు. ఇకపై కన్సోల్స్ అమ్మకాలు కొనసాగిస్తూనే, వినియోగదారులకు కంపెనీ మద్దతుగా నిలుస్తుందని మైక్రోసాఫ్ట్ తన బ్లాగ్ పోస్ట్ లో తెలిపింది.  సంస్థ యొక్క  ఆన్ లైన్ మల్టీ ప్లేయర్ గేమింగ్ వ్యవస్థ ఎక్స్ బాక్స్ లైవ్ నెట్ వర్క్ మాత్రం ఎక్స్ బాక్స్ 360 కోసం అందుబాటులో ఉంటుందని తెలిపింది. పాతతరపు కన్సోళ్ళు ఎక్స్ బాక్స్ 360, సోనీ ప్లే స్టేషన్ 3 వంటి అమ్మకాలను తగ్గించడంతో కస్టమర్లు కంపెనీ అందించే నూతన సంస్కరణలకు మారాలని సూచిస్తోంది.

పదేళ్ళకు పైగా వస్తు ఉత్పత్తుల్లో వెనుకంజ వేయకుండా ప్రయాణించిన తమకు... ఓ వస్తువు తయారీ భీతిని కలిగించిందని మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్ డివిజన్ అధిపతి ఫిల్ స్పెన్సర్ తెలిపారు. వినియోగదారులు గేమ్స్ ప్లే చేసుకునేందుకు అనువుగా ఉండే ఎక్స్ బాక్స్ 360 ఆధునిక కన్సోల్ ను ఇప్పటికే  సంస్థ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. బ్యాక్ వార్డ్ కంపాటబిలిటీ సౌకర్యంతో మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం వినియోగదారులకోసం 100 వరకూ వీడియో గేమ్స్ అందుబాటులోకి తెచ్చినట్లు.. ఫిల్ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement