Xbox
-
మైక్రోసాఫ్ట్ గేమింగ్ కన్సోల్ ఎక్స్‌బాక్స్, ధర ఎంత?
మైక్రోసాఫ్ట్ తన పాపులర్ గేమింగ్ కన్సోల్‌ను మళ్లీ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ‘ఎక్స్‌బాక్స్ వన్ఎక్స్’ పేరుతో దీన్ని కస్టమర్లకు అందుబాటులోకి తెస్తోంది. దీని ధరను రూ. 44,990 గా నిర్ణయించింది. ఆన్లైన్ రీటైలర్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా, లాండ్మార్క్ లతో పాటు, 100 గేమింగ్ స్పెషల్ ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా ఇది లభ్యం కానుందని సంస్థ తెలిపింది. 1300 వందకు పైగా గేమింగ్ టైటిల్స్‌తో వచ్చిన ఈ డివైస్ పీఎస్4 ప్రో గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. శక్తివంతమైన గేమింగ్ సదుపాయంకోసం రూపొందించిన మైక్రోసాఫ్ట్ ఈ కొత్త గేమింగ్ కన్సోల్ లో 8కోర్ సీపియూ (2.3గిగాహెడ్జ్) కస్టమ్ సీపియూ(1.172గిగాహెడ్జ్) వాడింది. అలాగే దీని గ్రాఫికల్ ప్రాసెసింగ్ పవర్ విడ్త్ 6 టెర్రా ఫ్లాప్స్. ఇంకా 8 జీబీ ర్యామ్, 12జీబీ జీడీఆర్5 వీడియో ర్యామ్ , 326జీబీ /ఎస్ మొమరీ బ్యాండ్‌విడ్త్, 1టీబీ హెచ్డీడీ ఇంటర్నల్ స్టోరేజ్, వైర్లెస్ కంట్రోలర్, హెచ్డీఎంఐ కేబుల్ ఈ డివైస్ స్పెషల్ ఫీచర్లుగా ఉండనున్నాయి. మైక్రోసాఫ్ట్ ఇండియా కన్స్యూమర్ అండ్ డివైస్ సేల్స్, జనరల్ మేనేజర్ ప్రియదర్శి మొహాపాత్ర మాట్లాడుతూ ప్రపంచంలో మోస్ట్పవర్ఫుల్ కన్సోల్ భారత వినియోగదారులకు అందించడం సంతోషంగా ఉందన్నారు. -
మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్ 360 కనుమరుగు!
బెంగళూరు: మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ మార్కెట్ లో స్థాన బలం సంపాదించేందుకు ఎంతగానో సహకరించిన, అత్యంత ప్రజాదరణ పొందిన ఎక్స్ బాక్స్ 360 వీడియో గేమ్ కన్సోల్ ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించింది. 2005 లో ఉత్పత్తి ప్రారంభమైనప్పటినుంచీ ఈ కన్సోల్ లో 80 మిలియన్ల యూనిట్ల కంటే అధికంగా అమ్ముడయ్యాయి. మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్ 360.. కినెక్ట్ మోషన్ సెన్సింగ్ గేమ్ డివైజ్ ను కూడా పరిచయం చేసింది. 2013 లో ఎక్స్ బాక్స్ వన్ ప్రారంభమయ్యే వరకు ఇది సంస్థ యొక్క ప్రాథమిక గేమింగ్ కన్సోల్ గానే ఉంది. ఎక్స్ బాక్స్ 360 తో పాటు... 'కాల్ ఆఫ్ డ్యూటీ 2' గా పిలిచే యాక్టివిజన్ బ్లిజార్డ్ ఇంక్స్, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ ఇంక్స్ వంటి ఎన్నో ప్రముఖమైన వీడియోగేమ్స్ ప్రారంభించారు. ఇకపై కన్సోల్స్ అమ్మకాలు కొనసాగిస్తూనే, వినియోగదారులకు కంపెనీ మద్దతుగా నిలుస్తుందని మైక్రోసాఫ్ట్ తన బ్లాగ్ పోస్ట్ లో తెలిపింది. సంస్థ యొక్క ఆన్ లైన్ మల్టీ ప్లేయర్ గేమింగ్ వ్యవస్థ ఎక్స్ బాక్స్ లైవ్ నెట్ వర్క్ మాత్రం ఎక్స్ బాక్స్ 360 కోసం అందుబాటులో ఉంటుందని తెలిపింది. పాతతరపు కన్సోళ్ళు ఎక్స్ బాక్స్ 360, సోనీ ప్లే స్టేషన్ 3 వంటి అమ్మకాలను తగ్గించడంతో కస్టమర్లు కంపెనీ అందించే నూతన సంస్కరణలకు మారాలని సూచిస్తోంది. పదేళ్ళకు పైగా వస్తు ఉత్పత్తుల్లో వెనుకంజ వేయకుండా ప్రయాణించిన తమకు... ఓ వస్తువు తయారీ భీతిని కలిగించిందని మైక్రోసాఫ్ట్ ఎక్స్ బాక్స్ డివిజన్ అధిపతి ఫిల్ స్పెన్సర్ తెలిపారు. వినియోగదారులు గేమ్స్ ప్లే చేసుకునేందుకు అనువుగా ఉండే ఎక్స్ బాక్స్ 360 ఆధునిక కన్సోల్ ను ఇప్పటికే సంస్థ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. బ్యాక్ వార్డ్ కంపాటబిలిటీ సౌకర్యంతో మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం వినియోగదారులకోసం 100 వరకూ వీడియో గేమ్స్ అందుబాటులోకి తెచ్చినట్లు.. ఫిల్ వివరించారు. -
మహిళా డెరైక్టర్ల ఎంపికకు మరింత గడువు
న్యూయార్క్: టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ స్టాక్‌హోమ్ గేమింగ్ సంస్థ మోజంగ్కు చెందిన మైన్క్రాఫ్ట్ను సొంతం చేసుకోనుంది. ఇందుకు 2.5 బిలియన్ డాలర్లను(రూ. 15,000 కోట్లు) వెచ్చించనుంది. 2009లో విడుదలైన మైన్‌క్రాఫ్ట్ గేమ్‌ను దీర్ఘకాలంగా కంప్యూటర్స్‌లో డౌన్లోడ్ చేసుకుంటూనే ఉండటం విశేషం. ఎక్స్‌బాక్స్‌లో ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన గేమ్కాగా, యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఐవోఎస్, గూగుల్ ఆండ్రాయిడ్‌లోనూ టాప్ యాప్‌గా నిలుస్తోంది. మైన్‌క్రాఫ్ట్ అత్యంత విజయవంత మైన గేమింగ్ ఫ్రాంచైజీ అని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. గేమింగ్ కమ్యూనిటీకి తగిన ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా కొత్త అవకాశాలకు తెరలేపనున్నట్లు చెప్పారు. 2014 చివర్లో డీల్ పూర్తికాగలదని అంచనా. కాగా, 2015కల్లా మైన్‌క్రాఫ్ట్ లాభాలు ఆర్జించే స్థితికి(బ్రేక్ ఈవెన్) చేరుతుందని మైక్రోసాఫ్ట్ అంచనా వేస్తోంది.