మైక్రోసాఫ్ట్ తన పాపులర్ గేమింగ్ కన్సోల్‌ను మళ్లీ ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ‘ఎక్స్‌బాక్స్ వన్‌ఎక్స్’ పేరుతో దీన్ని కస్టమర్లకు అందుబాటులోకి తెస్తోంది. దీని ధరను రూ. 44,990 గా నిర్ణయించింది. ఆన్‌లైన్ రీటైలర్స్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, క్రోమా, లాండ్‌మార్క్ లతో పాటు, 100 గేమింగ్ స్పెషల్ ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా ఇది లభ్యం కానుందని సంస్థ తెలిపింది. 1300 వందకు పైగా గేమింగ్ టైటిల్స్‌తో వచ్చిన ఈ డివైస్ పీఎస్4 ప్రో గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా.
శక్తివంతమైన గేమింగ్ సదుపాయంకోసం రూపొందించిన మైక్రోసాఫ్ట్ ఈ కొత్త గేమింగ్ కన్సోల్ లో 8కోర్ సీపియూ (2.3గిగాహెడ్జ్) కస్టమ్ సీపియూ(1.172గిగాహెడ్జ్) వాడింది. అలాగే దీని గ్రాఫికల్ ప్రాసెసింగ్ పవర్ విడ్త్ 6 టెర్రా ఫ్లాప్స్. ఇంకా 8 జీబీ ర్యామ్, 12జీబీ జీడీఆర్5 వీడియో ర్యామ్ , 326జీబీ /ఎస్ మొమరీ బ్యాండ్‌విడ్త్, 1టీబీ హెచ్‌డీడీ ఇంటర్నల్ స్టోరేజ్, వైర్లెస్ కంట్రోలర్, హెచ్‌డీఎంఐ కేబుల్ ఈ డివైస్ స్పెషల్ ఫీచర్లుగా ఉండనున్నాయి. మైక్రోసాఫ్ట్ ఇండియా కన్స్యూమర్ అండ్ డివైస్ సేల్స్, జనరల్ మేనేజర్ ప్రియదర్శి మొహాపాత్ర మాట్లాడుతూ ప్రపంచంలో మోస్ట్‌పవర్‌ఫుల్ కన్సోల్ భారత వినియోగదారులకు అందించడం సంతోషంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment