ఎగిరే పామును చూశారా..? | Flying Snake Spotted In Paderu, All Locals Were Scared | Sakshi
Sakshi News home page

ఎగిరే పామును చూశారా..?

Published Wed, Oct 9 2024 7:38 AM | Last Updated on Wed, Oct 9 2024 9:24 AM

Flying snake spotted in Paderu

పాడేరులో అరుదైన పాము

సాక్షి, పాడేరు (అల్లూరి సీతా­రామ­రాజు జిల్లా): ఏజెన్సీ ప్రాంత ప్రజలు కూడా ఎన్నడు చూడని అరుదైన పాము పాడేరులో కనిపించింది. స్థానిక చాక­లి­పేటలో ఉపాధ్యాయుడు ఒంపురి కేశవరావు ఇంటి రెండో అంతస్తులోని వంటగదిలో నలు­పు ఎరుపు, గోల్డ్‌ రంగుల మిశ్రమంలో రింగ్‌లుగా ఉన్న ఈ పాము­ను చూసి స్థానికులంతా భయాం­దోళన చెందారు.

 స్థానికుల ఫోన్‌తో వచ్చిన స్నేక్‌ క్యాచర్‌ బండారు వాసు చాకచక్యంగా పామును పట్టుకున్నా­రు. మూ­డు­న్నర అడుగులున్న ఈ పాము ఒరంటే ఫ్లయింగ్‌ స్నేక్‌ అని వాసు తెలి­పారు. ఎగిరే స్వభా­వంగల ఈ పాము అడవుల్లో రాత్రిళ్లు ఎక్కువగా సంచరిస్తుందని చెప్పారు. ఆ పామును ఆయన పాడేరు ఘాట్‌లోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement