సాక్షి, విశాఖపట్నం: ప్రగతి భారత్ ఫౌండేషన్ ద్వారా రాష్ట్రమంతటా పర్యావరణ పరిరక్షణ చర్యలు చేపట్టనున్నట్టు రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ప్రగతి భారత్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా ట్రస్ట్ సభ్యులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విజయసాయి రెడ్డితో పాటు మంత్రి అవంతి శ్రీనివాసరావు, పలువురు పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఏడాది క్రితం విశాఖ కేంద్రంగా సేవా కార్యక్రమాలు ప్రారంభించిన ప్రగతి భారత్ ట్రస్ట్ దశల వారీగా తన సేవలను రాష్ట్రమంతటా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు.
ముఖ్యంగా విశాఖ, భీమిలి బీచ్ అందంగా తయారు చేయడానికి 30 వేల కొబ్బరి మొక్కలు నాటడానికి ప్రణాళికలు రూపొందించినట్లు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. విశాఖ కేంద్రంగా ప్రగతి భారత్ ట్రస్ట్ చేపట్టిన సేవా కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు అధికారులు కొనియాడారు. కరోనా సమయంలో పేద ప్రజలకు ట్రస్ట్ అన్ని రకాలుగా సహాయపడిందని మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment