
సాక్షి, విశాఖపట్నం: సిటీలో మే 3 వరకు కంటోన్మెంట్ జోన్‌లో నిబంధనలు అమలవుతాయని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల కొనుగోళ్లు అమ్మకాలకి ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.కూరగాయలు అత్యవసరమైతే స్విగ్గీ ద్వారా అందించే సదుపాయం సిటిలో అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...ఇప్పటి వరకు 11,330 మందికి కరోనా పరీక్షలు నిర్వహించడం జరిగిందని వారిలో 22 మందిలో పాజిటివ్ లక్షణాలు ఉన్నాయన్నారు. ఛాతి ఆసుపత్రిలో శాంపిల్స్ పరీక్షిస్తున్నామని పాజిటివ్ వస్తే గీతం మెడికల్ కాలేజీకి వారిని తరలిస్తున్నామని అవంతి పేర్కొన్నారు. ఇప్పటి వరకు 11,265 మెడికల్ కిట్లు వచ్చాయని, అదనంగా ఇంకో 16 వేల ర్యాపిడ్ టెస్ట్ కిట్లు తెప్పిస్తున్నామని చెప్పారు. అత్యవసర సేవలు అందిస్తున్న ప్రతి ఉద్యోగికి ఉచితంగా కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నమన్నారు. రెవిన్యూ, మీడియా ప్రతినిధులు తప్పనిసరిగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని అవంతి సూచించారు. (కరోనా పరీక్షలు చేయించుకున్న విశాఖ ఎంపీ)
Comments
Please login to add a commentAdd a comment