
బీచ్ రోడ్డు (విశాఖ తూర్పు): ‘మూడు రాజధానులు రిఫరెండంగా విశాఖలో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి.. వారిలో ఒక్కరు గెలిచినా పదవికి రాజీనామా చేస్తా’ అని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్.. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు సవాల్ విసిరారు. విశాఖలో మంత్రి శనివారం మీడియాతో ఏమన్నారంటే..
► చంద్రబాబు మాటలకు, చేతలకు పొంతన ఉండదు.
► దమ్ముంటే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి మాటకు కట్టుబడాలి.
► విశాఖకు రాజధాని వద్దు అన్నందుకే చంద్రబాబును అక్కడ కాలుమోపనీయని విషయం గుర్తుంచుకోవాలి.
► అమరావతిని అభివృద్ధి చేస్తే లోకేష్‌ను అక్కడి ప్రజలు ఎందుకు ఓడించారో చెప్పాలి.
► విశాఖ వచ్చిన కంపెనీలన్నింటినీ అమరావతికి తరలించాలని ఆదేశించడంతో అవి వెనక్కుపోయాయి.
► కాగా, లక్ష కోట్లు ఖర్చు చేసి అమరావతిని నిర్మించే కంటే రూ.30 వేల కోట్లతోనే మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయొచ్చని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment