
సాక్షి, విశాఖపట్నం: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన నాతయ్యపాలెం, డ్రైవర్ కాలనీలలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..విశాఖ భూ కుంభకోణాలపై ఏపీ ప్రభుత్వం మరో సిట్ వేసిందని తెలిపారు. జిల్లాలో ఒక సెంటు భూమి కూడా కబ్జా కానివ్వమన్నారు. ఐదు నెలల కాలంలో సీఎం వైఎస్ జగన్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. ఒకేసారి లక్షల ఉద్యోగాలను కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అవినీతి రహిత రాష్ట్రమే సీఎం వైఎస్ జగన్ ఆశయమని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు.