victims of Agri Gold
-
‘వారి కళ్లలో ఆనందం కనిపిస్తోంది’
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో అగ్రిగోల్డ్ బాధితులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని హోంమంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయాలని చంద్రబాబు ప్లాన్ చేశారని ధ్వజమెత్తారు. ఇచ్చిన మాట ప్రకారం బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి న్యాయం చేశారని చెప్పారు ఆయన మానసిక స్థితి బాగోలేదనిపిస్తోంది.. రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్లు చెల్లించి మేలు చేయడం తో అగ్రిగోల్డ్ బాధితుల కళ్లలో ఆనందం కనిపిస్తోందన్నారు. సీఎం వైఎస్ జగన్‌పై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను హోంమంత్రి ఖండించారు. ఉద్యోగులను బెదిరించేలా చంద్రబాబు మాటలు ఉన్నాయని మండిపడ్డారు. చంద్రబాబు మానసిక స్థితి బాగోలేదనిపిస్తోందని.. కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు చేయించాలని హోంమంత్రి సుచరిత సలహా ఇచ్చారు. -
మాట నిలబెట్టుకున్న...
సాక్షి, అమరావతి బ్యూరో: తన 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి ఊళ్లో అగ్రిగోల్డ్ బాధితులు చెప్పిన కష్టాలు విన్నానని, నాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తొలి అడుగు వేశానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు అన్నగా తోడుంటానని భరోసా ఇచ్చారు. గురువారం గుంటూరులోని పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో అగ్రిగోల్డ్ బాధితులకు డిపాజిట్ డబ్బుల చెల్లింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలను విన్నానన్నారు. న్యాయం చేస్తానని ఆ రోజు ఇచి్చన మాట మేరకు ఇప్పుడు తొలి విడతగా రూ.10 వేల వరకు డిపాజిట్ చేసి నష్టపోయిన 3.70 లక్షల మంది కుటుంబాల అకౌంట్లలోకి రూ.264 కోట్ల డబ్బును జమ చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే రూ.20 వేల లోపు వరకు డిపాజిట్‌దారులకు డబ్బులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏం మాట్లాడారంటే.. మంత్రివర్గ తొలి సమావేశంలోనే నిర్ణయం ‘‘చంద్రబాబు హయాంలో అగ్రిగోల్డ్ స్కామ్ జరిగింది. కానీ అప్పటి ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయలేదు. పైగా గత ప్రభుత్వ పెద్దలు దురాశతో ఆ సంస్థ ఆస్తులు, భూములను కొట్టేయాలని ప్రయతి్నంచారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్ బాధితుల తరఫున పోరాటం చేశాం. మే 30న మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాధితులకు అండగా నిలుస్తూ జూన్ 10న తొలి కేబినెట్ సమావేశంలో తీర్మానం చేశాం. జూలై 12న తొలి బడ్జెట్లో నిధులు కేటాయించాం. అధికారం చేపట్టిన కేవలం ఐదు నెలల్లోనే బాధితులను ఆదుకునేందుకు చిత్తశుద్ధితో అడుగులు వేశాం. అక్షరాలా 3.70 లక్షల మందికి రూ.264 కోట్లు ఇవ్వగలుతున్నందుకు ఆనందంగా ఉంది. అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, సీహెచ్.రంగనాథరాజు, మండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. 5 నెలల్లో ఎన్నో చేశాం ఆటో డ్రైవర్లకు అండగా నిలిచాం సొంతంగా ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్‌లు నడుపుకునే డ్రైవర్లకు ఇచి్చన హామీ అమలు చేస్తూ 1.75 లక్షల మందికి ఏటా రూ.10 వేలు ఆరి్థక సాయం అందిస్తూ తొలి అడుగులు వేశాం. అర్హత ఉండీ లబ్ధిపొందని వారి కోసం ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కలి్పస్తున్నాం. ఫలితంగా మరో 50 వేల మందికి లబ్ధి కలుగనుంది. మొత్తం 2.25 లక్షల మంది ఆటో నడుపుతున్న సోదరులకు అండగా నిలవగలిగాం. పాదయాత్రలో రైతన్నలు ఎంతో మంది కష్టాలు చెప్పుకున్నారు. నేను విన్నాను.. నేను ఉన్నానని ప్రతి రైతన్నకు ఆరోజు మాటిచ్చా. ఆ రోజు నేను చెప్పిన దానికన్నా మిన్నగా నేడు రైతు భరోసా అమలు చేస్తున్నాం. నాలుగేళ్లు ఇస్తామని చెప్పి.. ఈ రోజు ఐదేళ్లు ఇస్తున్నాం. ఆ రోజు రూ.12,500 చెబితే, ఈ రోజు 13,500 ఇస్తున్నాం. 46 లక్షల రైతు కుటుంబాలకు తోడుగా ఉంటూ, దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్సార్ రైతు భరోసాను ఐదు నెలల్లోనే అమలు చేయగలిగామని సగర్వంగా చెబుతున్నా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యత దేశ చరిత్రలో ఎప్పుడూ లేని, జరగని విధంగా తొలిసారిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు నామినేషన్‌పై ఇచ్చే పనుల్లో, నామినేటెడ్ పదవుల్లో, దేవాలయాల బోర్డుల్లో (టీటీడీ మినహా) 50 శాతం రిజర్వేషన్ కలి్పంచాం. ఈ వర్గాలకు ఇంతగా మేలు చేసిన రాష్ట్రం దేశ చరిత్రలో ఏదీలేదు. ఇలా ఐదు నెలలు తిరగక ముందే అమలు చేసిన ప్రభుత్వం మనదే. వయసు పెరిగిపోయి, ఇబ్బందులు పడుతున్న అవ్వాతాతలకు గత ఐదేళ్లుగా ప్రభుత్వం ముష్టి వేసినట్లుగా పింఛన్ ఇచ్చింది. ఈ పింఛన్ సరిపోదని, పెంచండని అవ్వాతాతలు ఎంతగా అడిగినా పట్టించుకున్న పాపాన పోలేదు. గత ఐదేళ్లలో అవ్వతాతలకు గత ప్రభుత్వం సగటున నెలకు రూ.500 కోట్లు ఇస్తే, ఇవాళ ఈ ప్రభుత్వం నెలకు సగటున రూ.1,300 కోట్లు ఇస్తోంది. ఈ విధంగా గత ప్రభుత్వం కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువగా అవ్వాతాతల పింఛన్ల బడ్జెట్ మొత్తాన్ని మీ బిడ్డ పెంచాడని తెలియజేస్తున్నా. నిరుద్యోగులు, చదువుకుంటున్న పిల్లలకు అండగా.. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాక అవస్థలు పడుతున్న తీరును స్వయంగా నా కళ్లతో చూశాను. ప్రతి పిల్లవాడికి తోడుగా ఉంటానని మాటిచ్చాను. ఆ ప్రకారం అధికారంలోకి రాగానే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ప్రైవేటు రంగంలో వారికి మేలు జరగాలన్న విధంగా దేశచరిత్రలో ఎప్పుడూ.. ఏ రాష్ట్రంలో జరగని విధంగా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా చట్టం చేసిన ప్రభుత్వం మనదే. కంటి వెలుగు పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 65 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాం. వారిలో దాదాపు 4.5 లక్షల మంది విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేయడంతో పాటు, అవసరమైన పిల్లలకు శస్త్ర చికిత్సలు చేయిస్తున్నాం’’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, సీహెచ్.రంగనాథరాజు, మండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ సొమ్ము ఆదా ఎక్కడా అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ సొమ్ము ఆదా అయ్యేలా గడిచిన ఐదు నెలల్లోనే పలు చర్యలు చేపట్టాం. మొట్టమొదటిసారిగా జ్యుడిíÙయల్ కమిషన్‌ను తీసుకొచ్చాం. దేశచరిత్రలో ఎక్కడా జరగని విధంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తున్నాం. ఈ విధానం ద్వారా ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే దాదాపు రూ.830 కోట్లు ప్రభుత్వానికి ఆదా చేశాం. వెలిగొండ ప్రాజెక్టులో దాదాపు రూ.50 కోట్లు మిగిల్చాం. కేవలం ఈ 5 నెలల్లోనే దాదాపు రూ.1,000 కోట్ల పైచిలుకు ప్రజాధనం ఆదా చేయగలిగాం. దీన్ని అమలు చేసేందుకు ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. మీ అందరి ఆశీస్సులతో భవిష్యత్తులో మరింత మంచి పాలన ఇస్తానని చెబుతున్నా. ►మన ఇంట్లో వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు.. మనందరి సమస్యలు విన్నాడు.. మనకు తోడుగా ఉండేందుకు ఐదు నెలల్లో ముందడుగు వేశాడని చెప్పుకునేట్లుగా ఈ ఐదు నెలల్లో 4 లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఇవ్వగలిగాం. ఇందులో 1.30 లక్షలు శాశ్వత ఉద్యోగాలు. ప్రతి 2 వేల జనాభాకు ఒక గ్రామ/వార్డు సచివాలయం ఏర్పాటు చేసి స్థానికంగా 10 మందికి ఉద్యోగాలిచ్చాం. ►అర్హులైన అగ్రిగోల్డ్ డిపాజిటర్లు ఎవరైనా పేర్లు నమోదు చేసుకోకపోతే కంగారు పడొద్దు. మరో నెల రోజులు సమయం ఇస్తున్నాం. వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ దానిపై అవగాహన లేకపోతే కలెక్టరేట్లు, ఎమ్మార్వో కార్యాలయాలు, గ్రామ సచివాలయాలకు వెళ్లండి. అక్కడ నమోదు చేసే అవకాశం కలి్పస్తాం. ►నిజానికి ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. సంస్థ ఆస్తులన్నీ కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ఒక్కో ముడి విప్పుతూ కోర్టు అనుమతితో ఇప్పుడు 3.70 లక్షల మంది డిపాజిటర్లకు రూ.264 కోట్లు ఇచ్చి మేలు చేశాం. రాబోయే రోజుల్లో మిగిలిన వారందరికీ మేలు చేసే దిశగా అడుగులు వేస్తాం. – సీఎం వైఎస్ జగన్ -
అగ్రిగోల్డ్ బాధితులకు భారీ ఊరట
-
‘సెంటు భూమి కూడా కబ్జా కానివ్వం’
సాక్షి, విశాఖపట్నం: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం ఆయన నాతయ్యపాలెం, డ్రైవర్ కాలనీలలో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..విశాఖ భూ కుంభకోణాలపై ఏపీ ప్రభుత్వం మరో సిట్ వేసిందని తెలిపారు. జిల్లాలో ఒక సెంటు భూమి కూడా కబ్జా కానివ్వమన్నారు. ఐదు నెలల కాలంలో సీఎం వైఎస్ జగన్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని చెప్పారు. ఒకేసారి లక్షల ఉద్యోగాలను కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అవినీతి రహిత రాష్ట్రమే సీఎం వైఎస్ జగన్ ఆశయమని మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. -
ముందే వచ్చిన దీపావళి..
ఎట్టకేలకు వారి కష్టాలు తీరనున్నాయి. ఎన్నాళ్లుగానో ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. వారి శ్రమ ఫలించింది. నమ్మకమైన నాయకుడి చలువతో వారి డబ్బు తిరిగి సొంతం కానుంది. రూ. పదివేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులకు చెల్లించేనిమిత్తం నిధులు విడుదలయ్యాయి. ఇప్పుడు ఆ కుటుంబాల్లో నిజమైన దీపావళి వచ్చినట్టయింది. విజయనగరం పూల్‌బాగ్: అగ్రిగోల్డ్ బాధితులకు ఎన్నికల ముందు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీని ముఖ్యమంత్రిగా ఇప్పుడు నెరవేరుస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.36,97,96,900లు విడుదల చేస్తూ ప్రభుత్వం శుక్రవారం పరిపాలనా పరమైన అనుమతి ఇచ్చింది. ఈ మొత్తాన్ని జిల్లాలోని 34 మండలాల్లో ఉన్న రూ.10వేలు లోపు డిపాజిట్టు కలిగిన 57,941 మందికి పంపిణీ చేయనున్నారు. రూ.20వేల వరకూ డిపాజిట్ చేసినవారికి రావాల్సిన మొత్తం అందించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయించి అందులో తొలి విడతగా శుక్రవారం రూ.264.99 కోట్లు విడుదల చేశారు. దీనిపై అగ్రిగోల్డ్ బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మోసపోయిన తమను దేవుడిలా జగన్ ఆదుకున్నారని వారంతా సంబరపడుతున్నారు. నాటి ప్రభుత్వ నిర్వాకంతో దాచుకున్న డబ్బులు రావనే భయంలో జిల్లా వ్యాప్తంగా 16 మంది బాధితులు చనిపోయారు. ఐదేళ్లపాటు బాధితులు ఎన్నో పోరాటాలు చేశారు. అప్పటినుంచీ వీరికి వైఎస్సార్సీపీ బాసటగా నిలిచింది. జిల్లా వ్యాప్తంగా 1,08,470 మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. వీరు సుమారుగా రూ.765 కోట్లు డిపాజిట్ చేశారు. అందులో రూ.10వేలు లోపు డిపాజిట్ ఉన్న ఖాతాలకు తొలివిడతగా చెల్లిస్తామని చెప్పడం ద్వారా 57,941 మందికి లబ్ధి చేకూరనుంది. చీపురుపల్లి: అగ్రిగోల్డ్ బాధితులకు తొలి విడతలో రూ.260 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఎంతో రుణపడి ఉంటామని అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులు తెలిపారు. అగ్రిగోల్డ్‌లో రూ.10 వేలు లోపు డిపాజిట్‌దారులకు చెల్లించేలా సీఎం నిధులు విడుదల చేయడాన్ని స్వాగతిస్తూ స్థానిక మేజర్ పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం సాయంత్రం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ నాయకులు ఇప్పిలి అనంతం మాట్లాడుతూ ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం అగ్రిగోల్డ్ బాధితులకు తొలివిడతలో చెల్లించేలా నిధులు విడుదల చేశారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబునాయుడు ఐదేళ్లు అగ్రిగోల్డ్ బాధితులను మోసం చేశారు తప్ప న్యాయం చేయలేదన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, ఇప్పిలి తిరుమల, పతివాడ రాజారావు, మల్లెంపూడి శ్రీను, అప్పికొండ ఆదిబాబు, బి.టి.ఆర్ యాదవ్, కుప్పిలి సురేష్, మహంతి రవి, సతివాడ అప్పారావు, కింతలి మధు తదితరులు పాల్గొన్నారు. ఫలించిన పోరాటం.. రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు రూ.10వేలలోపు డిపాజిట్ చేసిన వారికి చెల్లించేలా తొలివిడతగా రాష్ట్ర ప్రభుత్వం రూ.265 కోట్లు విడుదల చేయడం హర్షణీయం. నాలుగున్నరేళ్లుగా అవిశ్రాంత పోరాట పలితమే ఇది. బాధితులకు న్యాయం చేసేందుకు కృషి చేసిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మిగిలిన బాధితులందరికీ సత్వరమే చెల్లించేలా చూడాలి. – పి కామేశ్వరరావు, అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ అసోసియేషన్ ,ఉత్తరాంధ్ర గౌరవాధ్యక్షుడు. ఆనందంగా ఉంది.. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మేనిఫెస్టోలో పేర్కొన్నట్టే రూ.10వేల లోపు డిపాజిట్‌దారులందరికీ జిల్లా కలక్టర్ ద్వారా పంపిణీ చేయటానికి ఉత్తర్వులు జారీ చేయటం హర్షణీయం. డబ్బులు విడుదల చేసిన ముఖ్యమంత్రికి, మంత్రి బొత్స సత్యనారాయణకు, జిల్లా అగ్రిగోల్డ్ కస్టమర్స్, అండ్ ఏజెంట్స్ అసోసియేషన్, బాధితుల బాసట కమిటీ తరఫున ధన్యవాదాలు. ప్రతి బాధితుడికీ న్యాయం చేయాలని కోరుతున్నాను. – మజ్జి సూరప్పడు, అగ్రిగోల్డ్ బాసట కమిటీ, విజయనగరం పార్లమెంటు నియోజకవర్గం. కనీసం స్పందించని గత ప్రభుత్వం.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఐదేళ్లుగా ఎన్నో పోరాటాలు చేశాం. అయినా గత టీడీపీ ప్రభుత్వం కనీసం స్పందించలేదు. అప్పటికే చాలా మంది బాధితులు చనిపోయారు. ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ముదావహం. – మజ్జి బంగార్రాజు, అగ్రిగోల్డ్ ఏజెంట్, డెంకాడ మండలం, విజయనగరం. -
అగ్రిగోల్డ్ బాధితుల సంబరాలు..
సాక్షి, విశాఖపట్నం: అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసా ఇచ్చారు. తొలి విడతలో రూ.10వేలలోపు డిపాజిట్లు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో బాధితులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అగ్రిబాధితులు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. వైఎస్సార్సీపీ నగర కార్యాలయంలో జరిగిన సంబరాల్లో వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణశ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పదివేల లోపు అగ్రి బాధితులు 52వేల మంది ఉన్నారని చెప్పారు. టీడీపీ ప్రభుత్వం అగ్రి బాధితుల జీవితాలతో చెలగాటం ఆడుకుందన్నారు. అదే సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేసి వారి కళ్లల్లో ఆనందం నింపారన్నారు. వైఎస్సార్సీపీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ జిల్లా అధ్యక్షుడు నడింపల్లి కృష్ణంరాజు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్ నాలుగు నెలల్లోనే అమలు చేశారన్నారు. కార్యక్రమంలో విశాఖ తూర్పు సమన్వయకర్త అక్కరమాని విజయనిర్మల, రాష్ట్ర అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, మొల్లి అప్పారావు, విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ ఎస్సీ విభాగం అధ్యక్షుడు ప్రేమ్‌బాబు, నగర అనుబంధసంఘాల అధ్యక్షులు బోని శివరామకృష్ణ, కాళిదాస్‌రెడ్డి, రామన్నపాత్రుడు, మాజీ కార్పొరేటర్లు రామకృష్ణరెడ్డి, లక్ష్మీరాము, చొక్కరశేఖర్, వార్డు అధ్యక్షులు పీతల గోవింద్, రవికుమార్, గిరిబాబు, గణేష్ రెడ్డి, కనకరాజు పాల్గొన్నారు. -
‘చంద్రబాబు ఇచ్చిన హామీ నేటికీ అమలుకాలేదు’
సాక్షి, విజయవాడ : అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ నేటికీ కార్యరూపం దాల్చకపోవడంపై అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్య వాయిదా పడటమే కానీ పరిస్కారం కావడం లేదని బాధితులు చేపట్టిన బస్సు యాత్ర రామవరప్పాడు సెంటర్ చేరుకుంది. బస్సు యాత్రకు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతలు ఘన స్వాగతం పలికారు. బాధితులు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నా సీఎం చంద్రబాబు సర్కార్ ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడంలేదన్నారు. ఆత్మహత్య చేసుకున్న అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాలను అధికారికంగా లెక్కించడంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, సెప్టెంబర్ 16 లోగా స్పందించకుంటే ప్రత్యక్ష ఆందోళన చేస్తామని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు హెచ్చరించారు. అగ్రిగోల్డ్ బాధితులకు సీపఘై జిల్లా నగర కార్యదర్శులు అక్కినేని వనజ, దోనేపుడి శంకర్, మేధావుల సంఘం నేత చలసాని నివాస్ సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల 16 నుంచి నెల రోజులపాటు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ చైతన్య యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు కొనసాగే ఈ యాత్ర నేటి సాయంత్రానికి రామవరప్పాడు సెంటర్ చేరుకుంది. బాధితులకు ఇప్పటివరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని, రూ. 5 లక్షలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన తరువాత కూడా 35 మందికి పైగా బాధితులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.