
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో అగ్రిగోల్డ్ బాధితులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని హోంమంత్రి మేకతోటి సుచరిత విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయాలని చంద్రబాబు ప్లాన్ చేశారని ధ్వజమెత్తారు. ఇచ్చిన మాట ప్రకారం బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయం చేశారని చెప్పారు
ఆయన మానసిక స్థితి బాగోలేదనిపిస్తోంది..
రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్లు చెల్లించి మేలు చేయడం తో అగ్రిగోల్డ్ బాధితుల కళ్లలో ఆనందం కనిపిస్తోందన్నారు. సీఎం వైఎస్ జగన్‌పై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను హోంమంత్రి ఖండించారు. ఉద్యోగులను బెదిరించేలా చంద్రబాబు మాటలు ఉన్నాయని మండిపడ్డారు. చంద్రబాబు మానసిక స్థితి బాగోలేదనిపిస్తోందని.. కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు చేయించాలని హోంమంత్రి సుచరిత సలహా ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment