వైఎస్‌ జగన్‌: మాట నిలబెట్టుకున్న... | YS Jagan Distributes Cheques for Agri Gold Victims in Guntur - Sakshi
Sakshi News home page

మాట నిలబెట్టుకున్న...

Published Fri, Nov 8 2019 4:02 AM | Last Updated on Fri, Nov 8 2019 11:58 AM

YS Jagan distributes Cheques To AgriGold victims - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో: తన 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి ఊళ్లో అగ్రిగోల్డ్‌ బాధితులు చెప్పిన కష్టాలు విన్నానని, నాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ తొలి అడుగు వేశానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు అన్నగా తోడుంటానని భరోసా ఇచ్చారు. గురువారం గుంటూరులోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో అగ్రిగోల్డ్‌ బాధితులకు డిపాజిట్‌ డబ్బుల చెల్లింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అగ్రిగోల్డ్‌ బాధితుల కష్టాలను విన్నానన్నారు.

న్యాయం చేస్తానని ఆ రోజు ఇచి్చన మాట మేరకు ఇప్పుడు తొలి విడతగా రూ.10 వేల వరకు డిపాజిట్‌ చేసి నష్టపోయిన 3.70 లక్షల మంది కుటుంబాల అకౌంట్లలోకి రూ.264 కోట్ల డబ్బును జమ చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే రూ.20 వేల లోపు వరకు డిపాజిట్‌దారులకు డబ్బులు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..  
 
మంత్రివర్గ తొలి సమావేశంలోనే నిర్ణయం

‘‘చంద్రబాబు హయాంలో అగ్రిగోల్డ్‌ స్కామ్‌ జరిగింది. కానీ అప్పటి ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయలేదు. పైగా గత ప్రభుత్వ పెద్దలు దురాశతో ఆ సంస్థ ఆస్తులు, భూములను కొట్టేయాలని ప్రయతి్నంచారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రిగోల్డ్‌ బాధితుల తరఫున పోరాటం చేశాం. మే 30న మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాధితులకు అండగా నిలుస్తూ జూన్‌ 10న తొలి కేబినెట్‌ సమావేశంలో తీర్మానం చేశాం. జూలై 12న తొలి బడ్జెట్‌లో నిధులు కేటాయించాం.

అధికారం చేపట్టిన కేవలం ఐదు నెలల్లోనే బాధితులను ఆదుకునేందుకు చిత్తశుద్ధితో అడుగులు వేశాం. అక్షరాలా 3.70 లక్షల మందికి రూ.264 కోట్లు ఇవ్వగలుతున్నందుకు ఆనందంగా ఉంది. అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.  ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, సీహెచ్‌.రంగనాథరాజు, మండలిలో చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.   

5 నెలల్లో ఎన్నో చేశాం
ఆటో డ్రైవర్లకు అండగా నిలిచాం
సొంతంగా ఆటోలు, ట్యాక్సీలు, క్యాబ్‌లు నడుపుకునే డ్రైవర్లకు ఇచి్చన హామీ అమలు చేస్తూ 1.75 లక్షల మందికి ఏటా రూ.10 వేలు ఆరి్థక సాయం అందిస్తూ తొలి అడుగులు వేశాం. అర్హత ఉండీ లబ్ధిపొందని వారి కోసం ఈ నెల 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కలి్పస్తున్నాం. ఫలితంగా మరో 50 వేల మందికి లబ్ధి కలుగనుంది. మొత్తం 2.25 లక్షల మంది ఆటో నడుపుతున్న సోదరులకు అండగా నిలవగలిగాం. పాదయాత్రలో రైతన్నలు ఎంతో మంది కష్టాలు చెప్పుకున్నారు.

నేను విన్నాను.. నేను ఉన్నానని ప్రతి రైతన్నకు ఆరోజు మాటిచ్చా. ఆ రోజు నేను చెప్పిన దానికన్నా మిన్నగా నేడు రైతు భరోసా అమలు చేస్తున్నాం. నాలుగేళ్లు ఇస్తామని చెప్పి.. ఈ రోజు ఐదేళ్లు ఇస్తున్నాం. ఆ రోజు రూ.12,500 చెబితే, ఈ రోజు 13,500 ఇస్తున్నాం. 46 లక్షల రైతు కుటుంబాలకు తోడుగా ఉంటూ, దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్సార్‌ రైతు భరోసాను ఐదు నెలల్లోనే అమలు చేయగలిగామని సగర్వంగా చెబుతున్నా.  
 
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యత
దేశ చరిత్రలో ఎప్పుడూ లేని, జరగని విధంగా తొలిసారిగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు నామినేషన్‌పై ఇచ్చే పనుల్లో, నామినేటెడ్‌ పదవుల్లో, దేవాలయాల బోర్డుల్లో (టీటీడీ మినహా) 50 శాతం రిజర్వేషన్‌ కలి్పంచాం. ఈ వర్గాలకు ఇంతగా మేలు చేసిన రాష్ట్రం దేశ చరిత్రలో ఏదీలేదు. ఇలా ఐదు నెలలు తిరగక ముందే అమలు చేసిన ప్రభుత్వం మనదే. వయసు పెరిగిపోయి, ఇబ్బందులు పడుతున్న అవ్వాతాతలకు గత ఐదేళ్లుగా ప్రభుత్వం ముష్టి వేసినట్లుగా పింఛన్‌ ఇచ్చింది.

ఈ పింఛన్‌ సరిపోదని, పెంచండని అవ్వాతాతలు ఎంతగా అడిగినా పట్టించుకున్న పాపాన పోలేదు. గత ఐదేళ్లలో అవ్వతాతలకు గత ప్రభుత్వం సగటున నెలకు రూ.500 కోట్లు ఇస్తే, ఇవాళ ఈ ప్రభుత్వం నెలకు సగటున రూ.1,300 కోట్లు ఇస్తోంది. ఈ విధంగా గత ప్రభుత్వం కంటే దాదాపు 3 రెట్లు ఎక్కువగా అవ్వాతాతల పింఛన్ల బడ్జెట్‌ మొత్తాన్ని మీ బిడ్డ పెంచాడని తెలియజేస్తున్నా.

నిరుద్యోగులు, చదువుకుంటున్న పిల్లలకు అండగా..    
చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రాక అవస్థలు పడుతున్న తీరును స్వయంగా నా కళ్లతో చూశాను. ప్రతి పిల్లవాడికి తోడుగా ఉంటానని మాటిచ్చాను. ఆ ప్రకారం అధికారంలోకి రాగానే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా ప్రైవేటు రంగంలో వారికి మేలు జరగాలన్న విధంగా దేశచరిత్రలో ఎప్పుడూ.. ఏ రాష్ట్రంలో జరగని విధంగా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు ఇచ్చేలా చట్టం చేసిన ప్రభుత్వం మనదే.

కంటి వెలుగు పథకం కింద ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న 65 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాం. వారిలో దాదాపు 4.5 లక్షల మంది విద్యార్థులకు కంటి అద్దాలు పంపిణీ చేయడంతో పాటు, అవసరమైన పిల్లలకు శస్త్ర చికిత్సలు చేయిస్తున్నాం’’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, మోపిదేవి వెంకటరమణ, సీహెచ్‌.రంగనాథరాజు, మండలిలో చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.  
 
ప్రభుత్వ సొమ్ము ఆదా
ఎక్కడా అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ సొమ్ము ఆదా అయ్యేలా గడిచిన ఐదు నెలల్లోనే పలు చర్యలు చేపట్టాం. మొట్టమొదటిసారిగా జ్యుడిíÙయల్‌ కమిషన్‌ను తీసుకొచ్చాం. దేశచరిత్రలో ఎక్కడా జరగని విధంగా రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నాం.

ఈ విధానం ద్వారా ఒక్క పోలవరం ప్రాజెక్టులోనే దాదాపు రూ.830 కోట్లు ప్రభుత్వానికి ఆదా చేశాం. వెలిగొండ ప్రాజెక్టులో దాదాపు రూ.50 కోట్లు మిగిల్చాం. కేవలం ఈ 5 నెలల్లోనే దాదాపు రూ.1,000 కోట్ల పైచిలుకు ప్రజాధనం ఆదా చేయగలిగాం. దీన్ని అమలు చేసేందుకు ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. మీ అందరి ఆశీస్సులతో భవిష్యత్తులో మరింత మంచి పాలన ఇస్తానని చెబుతున్నా.  

►మన ఇంట్లో వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు.. మనందరి సమస్యలు విన్నాడు.. మనకు తోడుగా ఉండేందుకు ఐదు నెలల్లో ముందడుగు వేశాడని చెప్పుకునేట్లుగా ఈ ఐదు నెలల్లో 4 లక్షల పైచిలుకు ఉద్యోగాలు ఇవ్వగలిగాం. ఇందులో 1.30 లక్షలు శాశ్వత ఉద్యోగాలు. ప్రతి 2 వేల జనాభాకు ఒక గ్రామ/వార్డు సచివాలయం ఏర్పాటు చేసి స్థానికంగా 10 మందికి ఉద్యోగాలిచ్చాం.
 
►అర్హులైన అగ్రిగోల్డ్‌ డిపాజిటర్లు ఎవరైనా పేర్లు నమోదు చేసుకోకపోతే కంగారు పడొద్దు. మరో నెల రోజులు సమయం ఇస్తున్నాం.  వారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో నమోదు చేసుకోవచ్చు. ఒకవేళ దానిపై అవగాహన లేకపోతే కలెక్టరేట్‌లు, ఎమ్మార్వో కార్యాలయాలు, గ్రామ సచివాలయాలకు వెళ్లండి. అక్కడ నమోదు చేసే అవకాశం కలి్పస్తాం. 

►నిజానికి ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. సంస్థ ఆస్తులన్నీ కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ఒక్కో ముడి విప్పుతూ కోర్టు అనుమతితో ఇప్పుడు 3.70 లక్షల మంది డిపాజిటర్లకు రూ.264 కోట్లు ఇచ్చి
మేలు చేశాం. రాబోయే రోజుల్లో మిగిలిన వారందరికీ మేలు చేసే దిశగా అడుగులు వేస్తాం.
– సీఎం వైఎస్‌ జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement